ఇవ్వాళ అసలు స్టేషన్ కి రాకూడదనుకున్నాడు విసుగు చెంది. మరలా ఏమనుకున్నాడో వచ్చాడు. అలా రావటం తన అదృష్టంగా భావించుకున్నాడు. ఎంతో చాకచక్యంగా వారిని లోబరుచుకోవటం, వారి మనస్సులో తను ఎంతో మంచి వాడుగా ముద్ర వేసుకోవటం వరకూ ఎంతో జాగ్రత్తగా వుంటాడు. ఆ తరువతః తన అసలు స్వరూపంతో విజ్రుంభించుతాడు. అదొక వ్యాపారంగా భావించుకుంటున్నాడు.
బూట్ల టక టకాలు వినిపిచ్చేసరికి చప్పున కావేరి అతని చాటుకి వచ్చి నిలబడింది. అది గ్రహించిన అతను నవ్వుతూ అటూ వైపుకి చూశాడు. పోలీసులు మెట్లు ఎక్కుతూ కనిపించారు. పరిచయం లేక పోయినా రెండు చేతులూ జోడించి చిరునవ్వుతో నమస్కరించాడు.
మాధవరావు వాలకం చూసి అతనెవరో పెద్దమనిషి అన్నట్లుగా భావించుకుని వారి అలవాటు చొప్పున శాల్యూట్ చేశారు.
అది చూసిన కావేరీ ఆశ్చర్యపోయింది.
పోలీసులే శాల్యూట్ చేశారంటే ఇతను చాలా గొప్పవాడయి వుంటాడు. అవునూ! సినిమాకి అసిస్టెంటు డైరెక్టర్ అంటే పెద్ద హోదాయే మరి! తన అదృష్టం కొలదీ ఇలాంటి వ్యక్తితో పరిచయం అయింది మొదటిసారే! తనకి సినిమాల్లో హీరోయిన్ గా ఎన్నో అవకాశాలు ఇప్పించగలడు!"
"నీ పేరేమిటి?"
"కావేరి!"
"చాలా మంచి పేరు.
టాక్సీని పిలిచి కావేరి చేతిలోని ట్రంకుపెట్టెను తను తీసుకుని లోపల పెట్టి తను కూర్చుని కావేరీ ఎక్కినా తరువాత డోరు మూసి అన్నాడు.
"టీ నగర్ లోని హోటల్" లంబాకి "వెళ్ళనీ!"
మాధవరావు చెప్పగానే టాక్సీని స్టార్టు చేసి బయలు దేరతీశాడు.
15
టాక్సీ హోటల్ "లంబా" మెయిన్ గేటునుంచి లోపలికి దూసుకుని వెళ్ళి ఎంట్రన్సుకి కొంచెం దూరంలో ఆగింది.
డోరు తెరుచుకుని క్రిందకి దిగి అటూ ఇటూ చూసుకుంటూ రిసెప్షన్ దగ్గిరకు వెళ్ళాడు.
"డబుల్ రూం గానీ సింగల్ రూం గానీ వుంటే ఇవ్వండి!" అనడిగాడు ఎంతో వినయంగా.
రిసెప్షనిష్టు కనురెప్పలు ఎత్తి ఓ క్షణం మాధవరావు వైపు చూసి అంతలోనే తలవంచుకుని లెడ్జర్ కీ కౌంటర్ లోని నెంబర్సు చూసి తిరిగి లెడ్జర్ ని మాధవరావు ముందుకి తోసి అంది.
"అక్కడ సంతకం పెట్టండి! అడ్వాన్సు వంద రూపాయలు పే చెయ్యండి!" అంది తన మృధు మధురమయిన కంఠంతో. సంతకం చేసి "ఒన్ మినిట్."
అంటూ తిరిగి టాక్సీ దగ్గరకు వచ్చి లాల్చీ జేబులో చెయ్యిపెట్టుకుని వెతుకుతున్నట్టుగా చేతివేళ్ళు ఆడించుతూ అడిగాడు.
"నీ దగ్గిర వంద రూపాయలు చిల్లర వుందా కావేరీ?"
"ఆఁ వుంది ఎంత కావాలి?" చప్పున అడిగింది.
"వుంటే ఒ రెండు వందలు ఇవ్వు! నా దగ్గిర చిల్లర లేదు. వున్న బాంక్ చెక్కుని డ్రా చేయటం నిన్న వీలు కాలేదు. ఈ రోజునన్నా బాంక్ కి వెళ్ళాలి! హోటల్ కి అడ్వాన్సు కట్టాలి.
మాధవరావు ఇన్ని మాటలు మాట్లాడుతూనే వున్నాడు. కావేరి చేసే పనిని శ్రద్దగా గమనించుతూనే వున్నాడు. కావేరి జాకెట్టులోనుంచి డబ్బుకట్టతీసి అందులో నుంచి నాలుగు యాభై కాగితాలు తీసి ఇచ్చింది. ఆ కట్టలో ఎన్ని వేలు వుంటాయో మనసులోనే అంచనా వేసుకున్నాడు. సహజంగా ఇలా మద్రాసు పారిపోయి వచ్చే అమ్మాయిలు ఇంటిలోనుంచి పెద్ద మొత్తం చేజిక్కించుకునే వచ్చేస్తారు. ఆ డబ్బుని దాచుకోవటం కూడా జాకెట్టులోనే దాచుకుంటారు. ఇలా తన సర్వీసులో ఎంతో మందిని చూశాడు. ఇప్పుడు ఈ కావేరి ఎన్నో అమ్మాయో ఆలోచించి లెక్కవేయటానికి టైం చాలదు. తీరికగా వేసుకోవచ్చని ఆ డబ్బు తీసుకుని రిసెప్షన్ దగ్గిరకు వెళ్ళి వంద రూపాయలు అడ్వాన్సు కత్తి మిగతా వందరూపాయలు తన జేబులో వుంచుకున్నాడు.
బెల్ నొక్కేసరికి వెయిటర్ వచ్చాడు. రూం తాళం చెవిని వేయిటర్ కి ఇచ్చి అతనితో వెళ్ళమన్నట్లుగా సైగ చేసింది.
అక్కడే నిలబడి టాక్సీ వైపు చూపించాడు. వెయిటర్ వెళ్ళేసరికి డోరుతెరిచి నిలబడ్డాడు డ్రైవర్.
"మీకు రూం ఇచ్చారు. సామాను వుంటే యివ్వండి!" అనడిగాడు కావేరి దిగి సీటు వద్ద వున్న ట్రంకు పెట్టె చూపించింది.
టాక్సీవాలాని దగ్గిరకు పిలిచి యాభై రూపాయల నోటు ఇచ్చాడు. మీటర్ చార్జీ తీసుకుని టాక్సీ దగ్గిరకు వెళ్ళిపోయాడు.
ముందు వెయిటర్ ట్రంకు పెట్టె పట్టుకుని నడుస్తుంటే మాధవరావు కావేరీ నడుస్తున్నారు. కాళ్ళ క్రింద తివాసీ-రిసెప్షన్ లోఅందమయిన అమ్మాయి...టెలిఫోన్ దగ్గిర మరొక అమ్మాయి!
"ఫామిలి!"
అని వాశాడు. ఎలా వుంటుందో చూద్దామని ఓరగా కనురెప్పలను అతి తక్కువగా ఎత్తి చూసింది లేడీ రిసెప్షనిస్టు.
కట్టూబొట్టూ చీర కట్టుడుని బట్టి పల్లెటూరి పిల్లలాగా కనిపించింది గాని ఆమెకళ్ళకి కావేరి ఎంతో అందంగా కనిపించింది. కుత్రిమంగా అలంకరణ లేకపోయినా సహజంగానే అందమయినదని చూడగానే ఎవరయినా అనుకున్నట్టుగానే రిసెప్షనిష్టు కూడా అనుకున్నది. "ఫామిలీ" అని వ్రాసినప్పుడు ఆ ఫామిలీ నిజమయినదో? కాదో? వాళ్ళి నడవడికలోనే అర్ధం అయిపోతుంది. అలాంటి ట్రైనింగ్ పొందుతుంది రిసెప్షనిష్టులు. కావేరిని చూడగానే ఎలాంటి భావమూ కలుగలేదు.
వెయిటర్ ఓ రూం ముందు నిలబడి చేతిలోని ట్రంకు పెట్టెను క్రింద పెట్టి రూం తాళం తీసి తలుపులు తెరిచి లోపలికి వెళ్ళాడు.
"ఇంక వెళదామా?" అంతవరకూ కావేరీతో పాటు తనూ ఆగిన మాధవరావు వెళ్ళే వాళ్ళు వచ్చేవాళ్ళు కూడా ఆగి మరీ ఆగి మరీ కావేరిని చూసి వెళ్ళటం గమనించాడు. అందుకే అడిగాడు.
కావేరి తల వూపుతూనే అతని వెనుకనే రూంలోకి ప్రవేశించింది.
