Previous Page Next Page 
చాటు పద్యమణి మంజరి పేజి 31

 

                                       తెలుగు కవులు

                               వేముల వాడ భీమకవి

    ఈ కవీశ్వరుఁడు పండ్రెండవ శతాబ్ది పూర్వార్ధమున నున్నవాఁడగును. 'వేములవాడ భీమకవి' యను పేరు కొన్ని పద్యముల యతి స్థానస్థాపితమై కలదు. అతఁడు నీతఁడును వేఱో! ఒక్కరో! ఈతఁ డాంధ్ర కర్ణాట భాషలలో గొప్ప కవి.

    సీ.    గడియ లోపలఁ దాడి కడిగి ముత్తునియగాఁ
            దిట్టిన మేధావిభట్టు కంటే
        రెండుగడేల బ్రహ్మదండిముం డ్లన్నియు
            డుల్లఁ దిట్టిన కవిమల్లుకంటే
        మూఁడు గడేలకుఁ దా మొనసి యత్తిన గండి
            వగులఁ దిట్టిన కవి భాను కంటే
        అఱజాము లోపలఁ జేఱువునీ ళ్ళీంకంగం
            దిట్టిన బడబాగ్ని భట్టు కంటె

    అ.వె.    ఉగ్రకోపి నేను నోపుదు శపియింపఁ
        గ్రమ్మఱింప శక్తి గలదు నాకు
        వట్టిమానఁ జిగురు పుట్టింప గిట్టింప
        బిరుదులేము లాడ భీమకవిని.        275

    ఈతఁడు శైవుఁడు . పాల్కురికి సోమనాధుఁ డాంధ్రమున రచియించిన బసవపురాణము నీతఁడు కన్నడించెను. "సోమగురు వాక్యములు సొన్పి భీమసు కవి , గరిమ బసవపురాణంబు కన్నడించె"- తెలుఁగున నృ'సింహపురాణమును రచియించేనట! కవి జనాశ్రయము కూడా నీతనిదే యందురు. ఈతని నివాసము దాక్షారమముగాక నైజాం రాష్ట్రమందలి వేములవాడ గ్రామమని కొందఱందురు. అది చింత్యము. నృసింహపురాణమండలి దని యీ పద్యము లక్షణ గ్రంధములం దుదాహరింపఁబడెను.

    క.    ఈ క్షితికి వచ్చి ముందుగ
        దాక్షారామమున వారతరుణుల నృత్యం
        బీక్షించి యంతకంటెను
        దతణమున నేర్చి రంభ తగ వేర్పడఁగన్    276

         నృసింహపురాణమున-

       క.    కెంజిగురునకుం గఠినత
        వంజకుఁబాల్ పిచ్చు గుంటువానికిఁ బరువు
        నంజుడుకుఁ గమ్మ ఁ దావియు
        లంజేకు మే లెందు లేదురా విటరాయా?    277
    
                 కోమట్ల నీతఁడు తిట్టేను

    చ.    గొనకొని మర్త్యలోకమునఁ గోమటి పుట్టఁగఁ బుట్టెఁ దోన బొం
        కును గపటంబు లాలనయుఁ గుచ్చిత బుద్దియు రిత్తభక్తీయు
        ననువరిమాటలు బరధనంబును గ్రక్కున మోక్కఁ జూచుటల్
        కొనుటలు నమ్ముటల్ మిగులఁ గొంటు ఁధనంబును మూర్ఖవాదమున్.278
    
    ఉ.    కోమటి కొక్క టిచ్చి పది గొన్నను దోసము లేద; యింటికి
        సెమ మెఱింగి చిచ్చిడినఁ జెందద పాపము; వాని నెప్పుడే
        నెమరుపాటున న్మఱియు నేమి యొనర్చిన లేద దోస మా
        భీముని లింగమానః కవి భీముని పల్కులు నమ్మి యుండుఁడీ!  279

    ఉ.    వేములవాడ భీమ! భళిరే! కవి శేఖర సార్వభౌమ! నీ
        వేమని యానతిచ్చితివి యిమ్ములఁ గోమటిపక్షపాతివై
        కోమటి కొక్క టిచ్చి పదిగొన్నను దోసములే దటంటివా
        కోమటి కొక్క టీక పది గొన్నను ధర్మము ధర్మపద్ధతిన్.    280

    బీమకవి యేకప్పుడు గుడిమేట్టయను గ్రామమున కరిగెనట! సాగిపోతురా జనురా జాతని గుఱ్ఱము నక్కడఁ దనసాహిణమునఁ గట్టి పెట్టించి యాతఁడు వేఁడినను విడిపింపఁ డయ్యెనట; దాని పైఁగోపించి భీమకవి చెప్పిన పద్యము -

    చ.    హయ మది సీత, పోతవసుధాధిపుఁ డారయ రావణుండు, ని
        శ్చయముగ నేను రాఘవుఁడ, సహ్యజ వారిది, మారుఁ డంజనా
        ప్రియతనయుండు, లచ్చనవిభీషణుఁ, డాగుడి మెట్ట లంక, నా
        జయమును బొతరక్కసుని చావును నేడవ నాఁడు చూడుఁడీ!   281

    సాహిణి మారుఁ డనుదండనాధుఁడు చాళుక్యచొక్క భూపతి నెదిరించేనట! భీమకవి యామారుని శపించి చొక్క భూపతికే జయము చేకూర్చేనట.

    ఉ.    చక్కఁదనంబుదీవి యగు సాహిణిమారుఁడు మారుకై వడి
        బొక్కి పడంగలండు చలము బలము గల యాచళుక్యపుం
        జొక్కనృపాలుఁ డుగ్రుఁడయి చూడ్కులమంటలు రాలఁ జూచిన
        మిక్కిలి రాజశేఖరుని మీఁదికి వచ్చిన రిత్తవోవునే!    282

    చాళుక్యచొక్క భూపాలుఁ డొకప్పుడు భీమకవి మహత్మ్యమును బ్రత్యక్షముగా నెఱుఁగఁ గోరి "స్వామీ! మీరాడినది యాట పాడినది పాట యగునందురు. వినోదార్ధము కొండొకటి ప్రదర్శింప వేఁడేదను" అనఁగా భీమకవి నీయభీష్ట మేమని యడిగి తెలిసికొని యచ్చటి మల్లెసాలనున్న స్తంభము చివుళ్ళతో జోంపములతో వృక్ష మగువ ట్లీ క్రింది పద్యము చెప్పెను

    శా.    అనీతాభ్యుపదానశృంఖళకరాభ్యాలంబిత స్తంభమ!
        నేనే వేములవాడ భీమకవినేని జిత్ర కూటంబులో
        భూనవ్యావృతవల్లవోవలతి కాపుష్పోవగుచ్చంబుల
        నానా పుష్పఫలప్రదాయివగుమా నాకల్ప వృక్షాకృతి    283

        అట్లే యా స్తంభము పుష్ప ఫలభరితమగువృక్ష మయ్యేనట! మరల దాని నీ కింది పద్యముఁ జెప్పి తొంటిరీతికిఁ దేచ్చెనట!
 

    ఉ.    శంభువరప్రసాది కవిజాలవరేణ్యూఁడ నైననావచో
        గుంభన మాలకించి యనుకూలత నొంది తనూనభావన
        గుంభినిఁ జోక్కనామనృపకుంజరు పంది మల్లెసాలకు
        స్తంభము రీతి నీతనువు దాలిచి యెప్పటియట్ల యుండుమా!   284

    భీమకవి తెలుంగాధీశునిఁ (కళింగాదీశుఁ డని కొన్ని ప్రతులు,) గస్తూరి యాచించుచుఁ జెప్పిన పద్యము.....

    మ.    ఘనుఁడ వేములవాడవంశ జూఁడ దాక్షారామ బీమేశనం
        దనుఁడ దివ్యవిషామృతప్రకటనానా కావ్యధుర్యుండ భీ
        మన నా పేరు వినంగఁ జెప్పితిఁ దెలుం (గళిం) గాదీశః కస్తూరికా
        ఘనసారాదిసుగంధవస్తువులు వేగం దెచ్చి లాలింపురా?       285

           చోడగంగు పైఁ జెప్పిన పద్యములు.......

    చ.    అనిమొనఁ జోడగంగఁడు మురారి ఐకారి నరుండు మాద్రిజుం
        డన ఘన చక్రతో మరశ రాసనకుంతము లల్కఁ బూని వ్రే
        యను వడి డాయ నేయఁ బోడువ గళమ సకవత్సమర్మముల్
        తునియవే నుగ్గుగావె యెదఁదూఱవె నాటవే వైరి వీరుల      286

    ఉ.    భోజుఁడు మంకు ధర్మజుఁడు బొంకు శచీపతి రంకు కల్వవూ
        రాజు కళంకు దైవతధరాజము డొంకు వయోది యింకు నం
        భోజభవుండు పంకు వణిభూషణదేవుఁడు సంకు పద్మినీ
        రాజహితుండు క్రుంకు సరి రారు గుణంబుల నీకు ధారుణిన్    287

    భీమకవి మైలమాభీమని మీఁదఁ జెప్పిన పద్యములు.....
    
    చ.    గరళపు ముద్ద లోహ మావగాడ మహాశని కోట్లు సమ్మెటల్
        హరునాయనాగ్ని కొల్మి యురగాదిపు కోఱలు పట్టుకార్లు ది
        క్కరటిశిరంబు దాయ లయకాలుఁడు కమ్మరి వైరివీరసం
        హరణగుణాభిరాముఁ డగు మైలమభీముని ఖడ్గ సృష్టి కి.       288


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS