శ్లో|| పూషవాడా న్వయాబ్దీందో! స్వస్తి నారాయణ ప్రభో!
నేత్రే గాత్రే తదాశ్రోత్రే! వక్త్రే పుష్పేషు శోభతే. 270
9. ఈ శ్లోకమందలి గుట్టును చక్కని సంస్కృత సాహిత్యము గల వారు గుర్తింపఁగల్గుదురు; శ్లోకచాతుర్యమునకు మెచ్చి రాజీయనను మిక్కిలి సమ్మానించెను. ఆ సందర్భమందే "శాస్త్రులుగారూ మీ పాండిత్యమునకునుఁ, జాతుర్యమునకును దగినట్టుగా లేదండీ ఇంటి పేరు, నడిమింటివారు. మొదటింటి వారు గాక నడిమింటివారయితిరి" అనెనట. రాజుకు ఈయన పల్కిన బదులు : "ప్రభూ! ఏ యిల్లయినను బూసపాటి చేయదా?"
10. మంగళేశ్వర శాస్త్రులోకప్పుడు తమయూర నొకరియింట వివాహ ముహూర్తము జరుగుచుండఁగాఁ దాంబూలమునకు వెళ్ళెను. మంగళసూత్రధారణ సమయమునఁ బురోహితుఁ డువరునిచే "మంగల్యాతంతునా నేన మమజీవన హేతునా! కంఠే బధ్నామి సుభగేత్వం జీవ శరదాం శతమ్" అన్న శ్లోకమును బఠింపించుచుండెను. మంగళేశ్వరశాస్త్రులు పెడదిరిగి యక్కడ నున్నవారితో మీ కీశ్లోకమున కర్దము తెలిసినదా యనెను. ఏదో కొంటెతనముండుననుకొని వారు తెలియలేదు సెలవిండని కోరిరి. శాస్త్రులు గారు చేసిన యనర్ధమిది. మాంగల్యతంతు -న ఇది మాంగల్యతంతువు కాదు , నేను ముసలి ముండకొడకను. ఇట్టి నాకింక నెక్కడిమాంగల్యమని భావము . అనేన మమ- జీవనహేతు . న (నా?) దీనిచే నా బ్రతుకుఁదెరువును జేడినది. రెండెకరాలో మూఁడేకరాలో ఉన్న యాస్తి కాస్త తెగ నమ్ముకొన్నాను. జీవనోపాదిపోయినదని భావము. కంఠే- బధ్నామి , నీకుత్తికకు త్రాడు కట్టుచున్నాను. నావల్ల నీకు సౌఖ్యము లేదు సరికదా ఇదొక నిర్భంధము కూడ నీకు కల్గినది అని భావము. సుభగే'
- సుభగులారా! (పరికరాలంకారము) త్వం- నీవు. సుభగురాలవు గనుక, శరదాంశతమ్ = సూఱేండ్లపాటు జీవ = జీవించుము.
11. విజయనగర సంస్దానమున వసంతరావను దుబాసియుండెను. ఏదో పనియుండి మంగళేశ్వరశాస్త్రులు లాయన దగ్గఱ కేఁగేను, కుమార సంభవము చదువుకొన శిష్యుఁడు వెంటనుండెను. అనంతరావుగారు పండితులచేఁ బొగడించుకొనఁ గోరికకలవాఁడని యియన యేఱిఁ'గెను. ప్రాచీన శ్లోకములకు సందర్భానుసారముగా నానార్ధములను జెప్పు చాతుర్యము మంగళేశ్వర శాస్త్రులు గారికిఁగలదని విని యనంతరావుగారును గోరిరి. ఏదేని శ్లోకమునకు వింత యర్ధమును సెలవిండని:- మంగళేశ్వరశాస్త్రులును వెంటనున్న శిష్యుఁడు చదువుచున్న కుమారసంభవశ్లోకము నెత్తుకొని యర్ధము చెప్పెను.
శ్లో || అనంతరత్న ప్రభవస్యయస్య!
హిమన్న సౌభాగ్యవిలోపిజాతమ్
ఏకోహి దోషో గుణసన్ని పాతే
నిమజ్జతీందో! కిరణేష్వివాంక! 271
అర్ధమిది : హి అనంతరత్న = రత్నము వంటి ఒయనంతరాయా ! హి= ఎందువలన , జాతమ్= (నీ యొక్క) పుట్టుక, మన్న సౌభాగ్యవిలోపి = నా (మంగళేశ్వరశాస్త్రుల) యిబ్బందిని తీర్చునది (నఇర్ధక న శబ్దముతో సుప్సుపా, అన్న విధినే సమాసము ) యైనదో , అందువలన , ఆయస్య= శుభకర్మమునకు, ప్రభవసి= తగుచున్నావు (కాని) ఏకః = ఒక్కటి , ఆహిదోషః= సర్పదోశము, (కలదు) అనఁగా సర్పమునకు రెండు నాల్కలుండును. అట్లే , నీవు రెండు భాషలాడుదువు. దుబాసి , దిభాషి) , ఇది , గుణసన్నీపాతే = గుణసమూహమున, నిమజ్జతి = మునుఁగుచున్నది. ఇందోఃకిరణే'షు= చంద్రకిరణములందు , అంక ఇవ, కళంకమువలె:-
12. మంగళేశ్వర శాస్త్రులు గారు జగన్నాధస్వామిని సేవింపఁ గోరి యొకతూరి పూరి (జగన్నాధ క్షేత్రము) కరిగిరట! పాండిత్య ప్రఖ్యాతిని విని యక్కడి యోడ్ర విద్వాంసులు వీరిని దర్శింప నరుగుదెంచిరి. అప్పుడీయన మంచి నిడుపును వెడలుపును గల మఱ్ఱియాకులను కోసి కొనివచ్చి విస్తళ్ళు కుట్టుచుండెను. జగన్నాదక్షేత్రమున కరిగిన వారెవరును మఱ్ఱియాకు విస్తరిలో భుజింపరు. తర్వాతఁ గూడ భుజింప రనఁగా నక్కడ నున్నప్పుడది యత్యం తము నిషిద్దమే యగును గదా! ఈ కారణముచే నా క్షేత్రమున మఱ్ఱిచెట్లు చక్కఁగాఁ బెరిగి మంచి యాకులతో నుండును. విలక్షణప్రతిభ గలవాఁ డగుటచే నీయన యా యాకులను కోసికొనివచ్చి విస్తళ్ళుకుట్ట నారంభించెను. ఆ యోడ్ర పండితు లది చూచి శాస్త్రులు గారి నాక్షేపించిరి. "అయ్యా! మఱ్ఱియాకులో భుజించుట నిషిద్దము. అందును జగన్నాధ క్షేత్రమున భుజించుట యత్యంత నిషిద్దము. అనుకరణీయమగు వర్తనముతో నుండవలసిన మీరిట్లు చేయుట పాడి కాదు" అనశాస్త్రులుగారు మఱ్ఱియాకులో భుజించుట యేల నిషిద్దమయ్యెనని వారి నడిగిరి. "శ్రీనారాయణమూర్తి వటపత్రశాయి. స్వామివారికి శయ్యగా నగుతచే నత్యంత పూజ్యమయిన వటపత్రమున భుజించుట నిషిద్దమగును. ఈ క్షేత్రము స్వామివారి యవతార క్షేత్రము. ఇక్కడ భుజించుట యత్యంత నిషిద్దము" అని వారు బదులు చెప్పిరి. శాస్త్రులు గారు వేడ నవ్వు నవ్వి యిట్లనిరి , "ఇట్టి యవతార క్షేత్రమున శ్రీస్వామి వారి యవతారమూర్తులనే మడ మడాయించి యాహారించుచున్న మీ కాయన శయ్యయైన వటపత్రమున భోజనము నిషిద్దమాయెనా! సెబాసు"! -- ఓడ్రులు మత్స్యభుక్కులు. శ్రీనారాయాణ మూర్తి మత్స్యావతారము నెత్తేను. కావున వారు శ్రీ నారాయణుని యువతారమూర్తులనే యారగించువారగుదురు - శ్రీ శాస్త్రులుగారి బెట్టిదవు సమాధానమునకు వారు నిట్టుర్పు పుచ్చి యూరకుండిరి.
13. మంగళేశ్వరశాస్త్రులుగారి నొకప్పు డధీకార గర్వితుఁడగు నొక యభ్యున్నతుఁడు చేయెత్తక "నమస్కారమండీ' యనేనట. శాస్త్రులు గారి "దీర్ఘామాయురస్తు" అని యాశీర్వదించిరి. దీర్ఘమ్ -ఆయుః - మాయుః అస్తు అనియు నిక్కడ రెండు దేఱఁగుల చేదముకల్గును. మొదటి విధమునకు దీర్ఘాయుష్మంతుఁడ వగుమని యర్ధము. రెండవ విధమునకు నీకు గొప్ప పైత్యము కల్గు గాక యని యర్ధము. శాస్త్రులగారి శబ్దోచ్చారము ద్వితీయార్దస్పోరకము గానే యుండెను.
14. అట్లే మాఱొకప్పు డొకయుద్యోగి యీయన గుమ్మము దాఁటి లోనికిఁ బోవుచుండఁగాఁ బరిహాసపూర్వకముగా "దండాలండీ' అనెనట! మాటాడక శాస్త్రులుగారు లోని కరిగి కొంతసేపటికిఁ దిరిగి వచ్చిరి. ఆ యుద్యోగి యడిగెను : "శాస్త్రులుగారూ! మీరు విశేషజ్ఞులు, నమస్కరించినప్పుడు ప్రత్యభివాదము చేయవలదా" యని. కోపము చిప్పిలఁగా నీతఁ డిట్లు బదులు చెప్పెను. అయ్యా, మీరు గుమ్మమున కావల నొక కాలు, ఈవల నొక కాలు నుండగా నడుమ నమస్కరించితిరి. దానికి నేనేమి ప్రత్యభివాదము చేయుదును! ఇందు జుగుప్సిత మగునర్ద మున్నది . ఇట్టిదే యింకోకటి.
15. మంగళేశ్వరశాస్త్రులుగారు కుమార్తె నత్తవారింటికిఁబంపవలసి యుండెను. ఈ సందర్భము విని బొబ్బిలిరాజుగారు వారిని సత్కరింపవవలసినదిగా రాజపురుషుకాజ్ఞాపించిరి. రాజాజ్ఞానుసార మాతఁ డేడో యీ యవలసినది యిచ్చి పంపక వీరిని వికటముగాఁ బ్రశ్నించెను. 'అయ్యా, మీరు కుమార్తె నత్తవారింటికీఁ బంపునప్పుడేమి పెట్టిపంపేదరండీ!' అని. ఈయన బదులు -- 'చిత్తము! మేము బీద బ్రాహ్మణులము! ఏమున్నది ! ఇంత పసుపు, కుంకుమ, చీర రవిక యిచ్చి పంపేదము. తమవలె మేమేమి రాజాశ్రయసంపన్నులమా వేలు పెట్టి పంపుటకు?"
16. నరసరాజను నాతని మీఁద జెప్పిన శ్లోకము:-
శ్లో|| యాగక్రియార్ధం ఖలు వృక్షరాజో వర్ణక్రియార్ధం ఖలు భృంగరాజః
తులాక్రియార్ధం ఖలు విట్టరాజో న కించిదర్ధం భువి నర్సరాజః 272
17. దక్షిణామూర్తి విగ్రహమును స్వర్ణకారుఁడు హరింపఁగాఁ జెప్పినది :-
శ్లో|| భూత్వా పౌల్కసకాత్ వ్రపద్య రజాకా నాభాష్య పౌరాణికా
గానస్థన ముపేత్య చాశుకరణా నా లింగ్వ నత్వా కవీ,
వేశ్యాసద్మని నంప్రవిశ్యత గతా వైద్యస్య పాణిగ్రహం
భూయో హంత సువర్ణకారసదనే సానంద మాస్తే మృషా|| 273
------------
శ్రీప్రభాకరుల నోట్సు నెం. 20 పుట 95 లో ఈ క్రింది శ్లోకమున్నది . ఇందు పుట 110 లో దీనిని చేర్చి చదువదగును.
"శాకల్య మల్లస్య-
దేవ త్వద్యశ ఏవ కిం సితసితం రామే శశాంకే మరు
ద్వాహే స్వర్గగజే హరే ఫణిపతౌ వాణ్యాం వృషేభేరుచిః
అన్యేషాం'తు తదంబరే తదుదరే తద్వ్యఇజ్ఞానే తన్మదే
తత్కంఠేచ తదీక్షణే తదలకే తత్పోత్రకే తత్పధి!" 274
