Previous Page Next Page 
మహావృక్షం పేజి 29

కొంతకాలం తను మూర్ఖంగా ప్రవర్తించిందా అని భాధపడింది. కానీ, చాలా రోజుల తరువాత మరో విషయం తెలుసుకొని రగిలిపోయింది. అది- పెళ్ళికి ముందే అతని  తల్లీ, తండ్రి అనూష పేరన ఆస్తి రాయమని కోరడం. దాంతో ఆమె మనసు విరిగిపోయింది. ఎన్ని ఆశలు పెట్టుకుంది అతనిమీద.... అతని మాటలు, ప్రవర్తన చూసి ఏవేవో ఊహించుకుంది. పెద్ద కార్డియాలజిస్టు కావాలన్న తన ఆశయం నెరవేర్చుకునే ప్రయత్నంలో జీవితాన్ని ఓ ప్రయోగాశాలగా మార్చుకుంది. అ ప్రయోగశాలనిండా గాజుసీసాల్లో ప్రేమామృతం నింపుకుని, తన ఆకాంక్ష కి అతనో ఆలంబన అవుతాడని ఎదురుచూసింది. కానీ, ప్రశాంత్ కుమార్ తనాసించిన స్థాయికి ఎదగలేదు. హొదా, అంతస్తు పెరిగినా, వ్యక్తిగా కుంచించుకు పోయిన అతడికి మర్చిపోవడానికి చాలాకాలం పట్టినా, పూర్తిగా మర్చిపోవడం మాత్రం అసాద్యం కాలేదామేకి. అలా మర్చిపోకపోతే, ఇవాళ అనూష ఈస్థానంలో వుండేది కాదు.
అనూష నిటూర్చింది.....
ఎంతకాలంమైంది? తనని ప్రాణాదికంగా ప్రేమిస్తున్నానంటూనే తన తల్లీతండ్రుల కోరిక మేరకు పెళ్ళికి  ముందే ఆస్తి తనకి రాయలన్నా ప్రశాంత్... అంత డబ్బు మనిషిని, తన ఆస్తికోసం అసపడుతున్నాడనీ తెలుసుకోలేకపోయింది. ఎంతో అన్యోన్యంగా, ప్రాణానికి ప్రాణంగా మెలిగిన వ్యక్తి. ఆస్తి విషయంలో అంత ఖచ్చితంగా వ్యవహరిస్తాడని అనుకోలేదు. తన తల్లీతండ్రులు వారి తదనంతరం ఇచ్చినప్పుడే మనము ఆస్తి తీసుకోవాలని ఎంత చెప్పినా వినలేడతడు. అభిప్రాయభేదాలు మనుషుల్ని విడదీస్తాయేగానీ, ఈ బంధం అంత త్వరగా తెగదని, ప్రశాంత్ మనసు మార్చుకొని తిరిగి వస్తాడని ఎదురుచూడడంలో కాలం బరువుగా గడిచిపోయింది.
అన్నీ ఉన్న కూతురికి పెళ్ళియేగం పట్టలేదని భ్రమారాంభ కుమిలిపోయింది. "ఆస్తి మొత్తం ఇచ్చేద్దాం ఒప్పుకోవే. వెధవ ఆస్తికోసం పెళ్ళెందుకు మానుకుంటావు?" అని గోలచేసింది. దెబ్బతిన్నఅనూష మనసు ఆవిడకి అర్దంకాలేదు. ఆస్తికోసం కాదని, నిజాయతీ లోపించిన, డబ్బుకి విలువ ఇచ్చిన ప్రేమ తనకి వద్దని ఆవిడకి చెప్పేశక్తి అనూష కి లేక పోయింది. గడిచిన కాలం భ్రమరాంభ ని తనతో తీసుకెళ్ళిపోయింది.
ఆవిడపోయిన కొంత కాలానికి తండ్రి చనిపోయాడు.
ఏ ఆస్తి అయితే ప్రశాంత్ కోరుకున్నాడో ఆ ఆస్తి మొత్తానికి అనూషాయే వారసురాలు అయింది.
ఆ రోజు అతనలా వ్యాపార దృష్టి తో మాట్లాడకపోయివుంటే ఈనాడు  ఈ ఆస్తి మొత్తం అతనికి ఇచ్చేది. తనకెమాత్రం ఆనందాన్ని, సంతృప్తినీ ఇవ్వనీ అస్తిమీద ఆమెకి వ్యామోహం లేకపోవడంతో ఆశ్రమానికి ఖర్చు పెట్టింది.
అ రాత్రి ఎంత ప్రయత్నించినా అనూషకి నిద్రపట్టలేదు.

                                     *    *    *    *
భరణి పత్రిక మరో ఇష్యూ రావాల్సి వుంది. గత సంచికలో అనూషతో ఇంటర్వ్యూ చేయడంతో హత హాట్ న్యూస్ వుందని రెండోదల కాఫీలదాకా అమ్ముడు పోయాయి. ఈ సంచికలో కూడా అనూష కి సంబంధించిన న్యూస్ ఐటమ్ వుంటే బాగుండును అనిపించింది అతనికి. ముందు ఆమె చేసిన సాహనానికి ముగ్దుడై కేవలం ఆమె ఇంటర్వ్యూ కోసం ఆమెని కలిసిన్ భరణి, క్రమంగా ఆమెతో స్నేహం కలిపాడు. వారానికోసారో, రెండు సార్లో ఆమెని కలపడం, కబుర్లు చెప్పడం, పాన్ లో మాట్లాడడంతో ఆమె ఆప్యాయత, మెత్తని మాటతీరు, హుందాతనం, ఆమె ఆశయాలు అతన్ని ఆకర్శించసాగాయి. ఇప్పుడు తన పత్రిక ప్రతి సంచికలో అనూషకి సంభందించిన మేటరు తప్పని సరిగా వుండేలా చూసుకుని గానీ, సంచిక బైటకి రానీయదల్చుకోలేదుతను.
అతని కోరిక ప్రకారం ఆ రోజు ఓ చిత్రమైనా సంఘటన జరిగింది.
ఉదయం అరుగంటలవుతొంది. అనూష అప్పటికి వాకింగ్ కి వెళ్ళింది. ఆరున్నరకి ఆమె తిరిగి  వచ్చేటప్పటికి ఓ స్రీ, ఓ పురుషుడు గేటు దగ్గర కూర్చుని వున్నారు. ఆ  స్రీ ఒడిలో ఆరేళ్ళ పాప వుంది. వాచ్ మాన్ గేటు దగ్గర స్టూల్ మీద కూర్చుని వున్నాడు.అనూష రాగానే చెప్పాడు.
"వీళ్ళు మిమ్మల్ని కలుసుకోడానికి వచ్చారమ్మా! దవాఖానల కలవమంటే ఈడనే కలుస్తామని వెయిట్ చేస్తున్రు" అతడి మాటలు పూర్తీ కాకుండానే ఆ స్రీ అనూష  దగ్గరకి పరిగెత్తికొచ్చి కాళ్ళమీద పడిపోయింది. ఏడుస్తూ. ఒక్కక్షణం ఆమెకేం అర్ధంకాలేదు ఏం జరుగుతుందో!
ఆమెని లేవదీసి, లోపలకి తీసుకొచ్చింది. ఆమె వెనకాలే అతను కూడా వచ్చాడు.
'మాబిడ్డను బతికించు తల్లీ! చచ్చి నీ కడుపునా పుడతా" అన్నదా స్రీ మళ్ళీ ఏడుస్తూ.
"ఏం జరిగింది?" అడిగింది అనూష.
"నా బిడ్డకి గుండెలో రంధ్రం ఉందంట. ఆపరేషన్ చేయాల్నంట.నిమ్స్ కు తోల్కపొమ్మన్రు ఉస్మానియాల. ఆడికి పోతే మమ్ములను షరీకు చేస్కోలే. అమ్మా! నువ్వు దయగల తల్లి వని చెప్పిన్రు. నీ చేత్తో ఆపరేషన్ చేస్తే నా భిడ్డ నూరేళ్ళు బతుకుతదని చెప్పిన్రు. నా బిడ్డను బతికించు తల్లీ" అతను కన్నీళ్లు తో చేతులు జోడించాడు.
"అవు తల్లీ ఉస్మానీయాల షరీకు చేస్కోలే,బీదోల్లమని ఇంకో దవాకానలా కూడా షరీకు చేస్కోలే. ఉస్మానీయ నర్సమ్మ చెప్పింది. నిన్ను కలుపుమని. నీ ఇంట్లో పనిచేసి నీ ఋణం తీర్చుకుంట తల్లీ. నా బిడ్దాని బతికించు" బావురుమంది ఆ స్రీ.
"ఈ పిల్లవయసెంతమ్మా?" అడిగింది అనూష ఆ పాపని పరీక్షిస్తూ.
"ఆరు సంవత్సరాలు."
"ఎప్పటినుంచి జబ్బుతో వుంది?"
"గది పుట్టిన సంది బీమారే వుండే .మస్తు దవకానలల్ల  చూపించినం. ఏడకిబోయిన తగ్గలే. గట్లనే ఆరు సంవత్సరాల సంది నడిపిస్తున్నాం. రెండు నెలల సంది ఏం తిన్న పోతలేదు. పండుకునే వుంటుంది. బిడ్డ చూసినవా తల్లీ ఎట్లుందో " పుల్లలా ఎదుగుదల లేకుండా బలహీనంగా వుంది పిల్ల.
"గుండెలో ర్మద్రం వుందని ఎవరు చెప్పారు?"
"ఒక డాక్టరమ్మ ఫోటో తీయమంటే తీసినం. గండ్ల చూసి చెప్పిందామె. ఆపరేషన్ చేయాలే అని, మస్తు పైసలయితయంట. గారీ బొల్లం మాతన గన్ని పైసలేడకే తల్లీ వస్తాయి?"

 


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS