Previous Page Next Page 
డింగ్ డాంగ్ బెల్ పేజి 29

    "ఏమిటండీ... సదన్ గా బైక్ అపమన్నారు?" కం ప్యూజన్  గా అడిగాడు అంకిత్.

    "నాకు యిక్కడ ఓ చిన్నపని వుంది" అంది బైక్ దిగుతూ.

    "పర్లేదు... మీ పని పూర్తయ్యేవరకూ మీ కూడా వుంటాను. ఇవ్వాళ మీతో మాట్లాడేవరకూ నిద్రపోకూడదని డిసైడయ్యాను."

    మృదువని మాట్లాడలేదు.

    "మాట్లడక్మ్డీ..." అంకిత్ రెట్టించి అడగడంతో ఉలిక్కిపడి... "అర్జెంట్ పని..." అంటూ యిబ్బందిగా మొహం పెట్టింది.

    "ఏమిటంత అర్జంట్... నాకు చెప్పండి." అన్నాడు మొండిగా అంకిత్.

    తల కిందకి వాల్చి చిటికెన వేలు చూపించింది.

    "సారీ..." అన్నాడు ఎంబ్రాసింగ్ అంకిత్. ఆ తర్వాత చూట్టూ చూశాడు. కాస్తా దూరంగా హొటల్.

    "ఆ హొటల్ కు వెళ్దాం పదండి. అందులో బాత్రూం వుంది. మీరు కాస్త రిప్రేష్ కూడా అవ్వొచ్చు. మీతో నేను మాట్లాడినట్టూ వుంటుంది..." అంటూ హొటల్ వైపు తీసుకువెళ్ళాడు బైక్.

    మృదువని ఏం మాట్లాడలేదు. తను షంషేర్ దాదా మనుష్యుల కంటబడకుండా వుంటే చాలు...        
                                              ***

    బైక్ పార్క్ చసి, హొటల్ లోకి వెళ్ళారు. ఎంట్రన్స్ లెప్ట్ సైడ్ బాత్రూం వుంది. చివర్న కూచుమ్దామని చెప్పింది మృదువని.

    ఆమెను అక్కడే వదిలి, ముందుకు వెళ్ళి కూచున్నాడు అంకిత్.
    మృదువని బాత్రూం వైపు కదిలింది.
   
                                                ***
    అంకిత్ కు చాల సంతైషంగా వుంది. అనుకోకుండా యిప్పుడు అవకాశం వచ్చింది. తన మనసులో మాట చెప్పాలి. ఆమె మనసులో మాట తెలుసుకోవాలి.

    ఇంత త్వరగా తన సమస్యకు పరిష్కారం దొరుకుతుందని అనుకోలేదు. ఈ విషయం రాహుల్ కు, చేతన్ కు చెబితే సంతోషిస్తారు..

    రాత్రి కావడంవల్ల.. ఇంకా సేపిట్లో హొటల్ కట్టేసి టైం కావడంవల్ల, రష్ పెద్దగా  లేదు.
   
                                                   ***
    అసహనంగా టైం చూస్కున్నాడు. అప్పటికే తాము హొటల్ కు వచ్చి నిముషాలు అయింది. ఇంకా బాత్రూంలో నుంచి బయటకు రాలేదు.

    మరో అయిదు నుమిశాలు భారంగా గడిచాయి. ప్రతీ సేకనూ అతి భారంగా గడిచినట్టు అనిపించింది. బాత్రూం వైపు చూసాడు... ఊహూ... మృదువని రావట్లేదు....

    ఇరవై...

    ముప్పయి...

    అసహనం స్థానంలో అనుమానం చోటు చేసుకుంది అంకిత్ లో...ఇంతసేపు బాత్రూంలో... మెల్లిగా లేచి బాత్రూంవైపు వెళ్ళాడు. బాత్రూంకు తాళం వేసివుంది. హొటల్ ప్రిప్రయితర్ మీద పీకల్లక కోసం వచ్చింది. వెంటనే కౌంటర్ లో వున్న మేనేజర్ ని నాలుగు దలుపులు దులిపాడు.

    "మీకసలు మెదడుందా? లోపల మనిషిని పెట్టుకుని లాక్ వేస్తారా?" కోపంగా అడిగాడు.
    అ మేనేజర్ కు అంకిత్ ఏమంటున్నాడో అర్ధం కాలేదు.

    "మీరనేది నాకు అర్ధం కావడంలేదు సార్" వినయంగా చెప్పాడు మేనేజర్.. కావడంలేదు ముందు తాళం తీయ్..." కసురుకున్నాడు అంకిత్.

    అతనికి చాలా కోపంగా వుంది. అంకిత్ లోపలకి వెళ్ళిన విషయం గమనించ కుండా, అదీ హొటల్ క్లోజ్ చేయకముందే తాళం వేయడం ఏమిటి?

    "సారీ సర్... బాత్రూం 'కీ' మా ప్రొప్రయిటర్ ఎక్కడున్నాడు? వెరీజ్ హీ?" అడిగాడు.
    "అయన బెంగుళూరు వెళ్ళాలండీ. రేపోస్తారు... ఆయనతో అర్జంటుగా మాట్లాడవలసిన పని ఏమైనా వుందా?" కూల్ గ అడిగాడు మేనేజర్.

    ఈ సారి కోపం నషాళానికి అంటింది.

    "బాత్రూంలో ఎవరున్నారో గమనించకుండా, తాళం వేసి బెంగుళూరు వెల్లడమెంటి, మెదడు లేకుండా... ముండా తాళం పగలగొట్టండి..." కోపంగా అని చుట్టూ చూసాడు తాళం పగలగొట్టే సాధనం ఏదైనా దొరుకుతుందేమోనని.

    "సార్... మీకు బాత్రూంకు వెళ్ళడం అంత అర్జంటు అయితే, అలా... వెళ్ళండి" చెప్పాడు మేనేజర్.

    ఎగాదిగా మేనేజర్ వైపు చూసి చెప్పాడు "నా ప్రెండు..."

    "మీ ప్రేండా? మూడ్రోజులుగా బాత్రూంలోనే వున్నాడా? ఈ పాటికి చచ్చేవుంటాడు. బాత్రూం లోకి వెళ్ళి మూడ్రోజులు అయితే యిప్పుడు తాపీగా చెబుతున్నారంటే సార్?"

    "మూడ్రోజులేంటి.... యిందాకే వెళ్ళారు" చెప్పాడు అంకిత్ మరింత విసుగ్గా, అతనికి చాలా యిరితెషణ్ వచ్చింది.

    "సార్. ఆ బాత్రూంకు తాళం వేసేసి మూడు రోజులైంది... డ్రైనేజి ప్రాబ్లం..." చెప్పాడు మేనేజర్.

    "వ్వా...ట.." అదిరిపడి అడిగాడు అంకిత్.

    "అవున్సార్... అండర్ రిపేర్ లో వుంది. మూడు రోజులుగా తాళంవేసే వుంది..."

    అంకిత్ ఒక్క ఉదుటున బయటకు వచ్చాడు. చూట్టూ చూసాడు.... అతనికి మృదువని ఎస్కేప్ అయిందా?

    తనని ఆటపట్టిస్తూందా? 
   
    షి...ట...

    తల విదిల్చాడు అంకిత్. అతను వూహించని పరిణామం ఇది. బైక్ బయటకు తీసి,ఓ అరగంటపాటు పరిసర  ప్రాంతాల్లో గాలించాడు. తర్వాత నిరాశగా యింటివైపు బయల్దేరాడు.

   
                                               ***


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS