ఇలాంటి పరిష్టితి వూహించే నేనా రోజు ప్రేమను, మమకారాన్ని వాదులుకొన్నాను..." భరద్వాజ గొంతులో విషాదం ప్రతిద్వనించింది.
"సార్... ఎక్సయిట్ అవ్వద్దు. ఇది దేశ భవిషత్తు కు సంభందించిన క్లిష్ట సమస్య. ఈ ప్రపంచం గుర్తించిన మేధావి మీరు. మీలాంటి మేధావులు ఈ ప్రపంచానికి కావలి."
ఓ పేలవమైన నవ్వు భరద్వాజ పెదవుల మీద మెరిసింది.
"నేను మేదావిననే విషయం ఎప్పుడో మరచిపోయాను. నేనిప్పుడు సదా సీదా వ్యక్తిని. నా భార్యని బ్రతికించుకోవడం కోసం ఓ బ్రతుకు ఏర్పాటు చేసుకుని బ్రతుకుతున్నవాడిని...
"మీ లాంటి మేధావులు నిర్లిప్తతవైపు పయనించవద్దు. ఇదిగొండి..." అంటూ ఓ పైల్ భరద్వాజకు ఇచ్చాడు.
"ఇది భస్మకు సంభందించిన పైల్... ఖాన్ అనే పాకిస్తాన్ ఏజెంట్ భస్మ ను ఎలా మార్చాడో ఇందులో డీటైల్డ్ గా వుంది.
అగర్వాల్ అనే సైంసిస్ట్ అతనికి సహకరించాడు. కరంజయకూ ఇందులో పాత్ర వుంది. లల్లూరామ్ అతని కుడిభుజం.వీళ్ళందరి గురించి మేకు తెలుసు.
భస్మను వాళ్ళు గుప్పిట్లో పెట్టుకున్నారు. ఈ పరిస్థితుల్లో భస్మను ళ్ళీ మామూలు మనిషిని చేయాలి. అతనికి వున్న శక్తి లోకకళ్యాణానికి ఉపయోగపడాలంటే అది మీ వల్లే సాధ్యమవుతుంది."
భరద్వాజ లేచాడు.
కౌశిక్ ఆశ్చర్యంగా చూశాడు.
"వస్తాను ఆఫీసర్... భస్మను మీరు అరెస్ట్ చేయగలిగితే, దయచేసి నాకు ఇన్ ఫామ్ చేయండి" అని చెప్పి బయటకు నడవబోయెడు.
"నేను అడిగినదానికి బదిలివ్వకుండానే వెళ్తున్నారు" వెనుకనుంచి కౌశిక్ అన్నాడు.
"ఏం బదులివ్వమంటారు?"
"భస్మను ఎదిరించే శక్తి మీ మేధస్సుకు వుంది..."
"అందుకు నేన్నేంచేయమంటారు?"
"మాకు సహకరించండి."
నవ్వాడు భరద్వాజ.
"బావుండి అఫేసర్... నాచేతుల్తో నా కొడుకునే చంపమని పరోక్షంగా చెబుతున్నారా? వద్దు అఫేసర్ నాకేం చెప్పొద్దు. నా బిడ్డ గురించి మరచిపోయి పాతిక సంవత్సరాలైంది. ఇప్పుడు బ్రతికే వున్నాడన్న నిజం తెలిసింది. ఎప్పుడో చనిపోయాడనుకున్న బిడ్డ, రేపో మాపో చనిపోయినా తట్టుకునే శక్తి ఈ రాతి గుండెకు వుంది.
నా భార్యకు కడుపుకోత మిగాల్చడానికి కారణం, నాలోని దేశభక్తి, నా లోని మేధాస్సే.
దేశం కోసం ఆలోచించి మేధస్సుతో జరగబోయే ఉపద్రవాన్ని వూహించి ఆ రోజు కన్నా తీపిని నా జీవితంలో 'చెడు' గా మార్చుకున్నాను.
ఆ చేదుకే అపవాటుపడిపోయాం.
నేనూ... నా భార్య జీవితాన్ని వేల్లదీస్తున్నాం. ఇలాగే వుండిపోనివ్వండి."
"కానీ... ఈ దేశం కోసం నేనెందుకు ఆలోచించాలి అఫేసర్... వై.. వై.. శుద ఐ? నాకు ఈ దేశం అక్కర్లేదు. నాకు నా భార్యే కావాలి. తన బిడ్డ ఎప్పుడో చనిపోయాడని నా భార్య గుండె దిటవు చేసుకుంది.
ఇప్పుడు, నేను వెళ్ళి 'మన బిడ్డ బ్రతుకే వున్నాడు. వాడ్ని చంపడానికి నేను మళ్ళా నా మేధస్సును ఉపయోగించాలి' అని చెప్పనా? నాకే దేశం అక్కర్లేదు. నాకు నా భార్య చాలు... గుడ్ బై... గుడ్ బై.. అఫీసర్..." అంటూ వడి వడిగా ముందుకు కదిలాడు భరద్వాజ.
***
కసిగా 'డి న్యూస్' పేపర్ ను గిరాటేశాడు ఖాన్.
"ఖాన్ సాబ్... ఏమిటే న్యూస్?" కంగారుగా అడిగాడు కరంజయా.
"ఇదంతా ఆ కోఎశిక్ పనే? ఏదో ప్లాన్ చేశాడు. వాడు కన్నింగ్ జాకాల్... మనం జాగ్రత్తగా వుండాలి..." ఖాన్ అన్నాడు ఆలోచిస్తూ.
"ఇప్పుడు మనమేం చేద్దాం?"
"ఆ కోఎశిక్ మీదికి భస్మను ఉసిగోల్పుదాం..."
"అంటే కౌశిక్ ను చంపమని భస్మ కు సజెషన్స్ ఇస్తే సారి... చెప్పాడు ఖాన్.
"దట్స్ గుడ్ అలాగే ప్రోసేడ్ వుదాం..." అన్నాడు కరంజయా.
ఆ రాత్రే అగర్వాల్ భస్మకు సజెషన్స్ ఇచ్చాడు.
"మనం వ్యాన్ లో భస్మను ఫాలో అవ్వాలి. అప్పుడు మన పని సిలభం అవుతుంది" కరంజయా అన్నాడు.
"అదే తప్పు... భస్మను మనం కౌశిక్ ని చంపడం టార్గెట్ గా నిర్ణయిమ్చు వదిలేస్తే సారి..." అన్నాడు.
***
రాత్రి పదకొండు.
కౌశిక్ టేబుల్ ల్యాంప్ వెలుగులో భస్మకు సంభందించిన ఫైల్ ని తదేకంగా చూస్తున్నాడు.
అతనికి ఏ దారిలో వెళ్ళినా సొల్యూషన్ కనిపించటంలేదు. ఏదో ఒకటి చేయాలి. ప్రపంచ నాయుకుల గెట్ టుగెదర్ ఈ నెలలోనే... ఈ లోగా ఖాన్ ఏదైనా ఎత్తు వేస్తె?
ఆ ఎత్తును చిత్తూ చేయగల వ్యక్తి ఎవరు? భరద్వాజ ఈ విషయంలో తనకు సాయం చేసే అవకాశం లేదు.
రెండు చేతులతో కణతలు నైక్కుకుంట్టున్నాడు కౌశిక్. తలనొప్పిగాఅనిపించి, కిచెన్ లోకి వెళ్ళి ప్లాస్క్ తీసుకోచ్చి ఓ కప్పులోకి కాఫీ ఓంపుకున్నాడు.
వేడి వేడి కాఫీ గోంతులోకి దిగగానే ప్రాణం లేచి వచ్చినట్టుయింది. రెండు సిఫ లు చేశాక, కప్పు పక్కన పెట్టి మళ్ళా ఫైల్ చూడ్డంలో నిమగ్నమైయేడు.
గోడమీద గడియారంలో సెకను ముల్లు తిరుగుతోన్న శబ్దం స్పష్టంగా వినిపిస్తోంది.
కళ్ళు మూతలు పడుతున్నాయి.
నిద్రని ఆపుకున్నాడు.
అప్రయత్నంగా అతని దృష్టి గేటువైపు పడింది.
కిటికీలోనుంచి చూస్తే గేటు దగ్గర ఏం జరుగుతుందో స్పష్టంగా కనిపిస్తుంది.
