Previous Page Next Page 
డేంజర్ డేంజర్ పేజి 30

   
    స్టేషనులో వాళ్ళలా యాక్షన్ చేయనక్కరలేదు. సరాసరి యింటికి వెళ్ళవచ్చు. కాని వాళ్ళు కొత్త పాత్రలలో వున్నారు. ప్రతి నిమిషం వాళ్ళలా సహజంగ నటించటం మంచిది.    
    కీర్తి నోరు తెరుచుకుని స్టేషను చూస్తుంటే యశ్వంత్ భట్టాచార్య పెట్టెని భుజాన పెట్టుకుని సంచిచేత పుచ్చుకున్నాడు."రాణమ్మా!" అని పిలిచాడు.    
    "ఏంటీ?" దీర్ఘం తీస్తూ అడిగింది కీర్తి.    
    "మరచెంబు పుచ్చుకోతల్లీ వెళదాం." అన్నాడు బ్రతిమిలాడే ధోరణిలో.    
    కీర్తి మరచెంబు పుచ్చుకుంది.    
    యశ్వంత్ భట్టాచార్య కీర్తి స్టేషనులోంచి బయటికి వచ్చారు. గీసి గీసి బేరంచేసి గుర్రబ్బండి ఎక్కారు.    
    యశ్వంత్ భట్టాచార్య కీర్తిని ఎక్కించుకుని బండివూళ్ళో కిబయలు దేరింది.    
    అప్పుడు సమయం ఎనిమిది అయింది?
    
                                       21
    
    సోఫాలో సతీదేవి కూర్చుని వుంది.    
    అది పెద్దహాలు ఖరీదైన సోఫాలు అరడజనువున్నాయి. నేలమీద కాశ్మీర్ తివాసి పరచి వుంది. గోడలకి అందమైన చిత్రాలు తగిలించి వున్నాయి. ఇప్పుడు ఆ యింటికి కరెంటు వుందన్న గుర్తుగ పెద్ద పెద్ద లైట్లు పూలపూల డూముల్లో వున్నాయి. పాతకాలం కేండిల్ లైట్స్ గుత్తులుగ వేలాడుతున్నాయి మొత్తం మీద ఆహాలు దర్జాగా గంబీర్యంతో కూడి వుంది.    
    జమిందార్లు అన్నపదం మరుగున పడినా ఆ యిల్లు చూడగానే జమిందారీ ఫాయ గుర్తుకు రాకమానదు.    
    సతీదేవి ఆ యింటి యిల్లాలు. భర్త మాధవ్ గురుదేవ్. ఆయన తండ్రి రాఘవేంద్ర గురుదేవ్ కి తొంభై ఏళ్ళు, ఆయన మంచం దిగలేడు.    
    రాఘవేంద్ర గురుదేవ్ కి మాధవగురు దేవ్ వక్కడే కొడుకు, ఆయన కొడుకు మూడేళ్ళవాడు చంద్రజిత్ గురుదేవ్. ఇంట్లో వుండేది మొత్తం ఈ నలుగురు మిగత పదిమంది నౌకర్లు దాసీలు.    
    ఇప్పుడు ఆ యింటికి వచ్చారు యశ్వంత్ భట్టాచార్య కీర్తి అదైనా చుట్టం పేరుతో వచ్చారు.    
    సతీదేవిది కళ్ళు చెదిరే అందం. వయసు మూడుపదులు, భర్త మాధవ్ గురుదేవ్ నలభై ఎనిమిదేళ్ళవాడు, భార్యాభర్త మధ్య పద్దెనిమిదేళ్ళ వారవుంది.
    యశ్వంత్ భట్టా చార్యని చూస్తూ "అదికాదు బాబాయ్! ఈ వయసులో యాత్రలకి మరీ రెండు నెలలు వంటరిగా అంతదూరం..." అంది సతీదేవి.    
    "తాతయ్యకి తోచదు ఎవరైనా చెపితే వినడు" కీర్తి అంది.    
    "పెద్దవాళ్ళు మాట్లాడుకుంటుంటే మధ్యలో వచ్చి మాట్లాడకూడదు రాణమ్మా!" అన్నాడు యశ్వంత్ భట్టాచార్య విసుగుదలతో.    
    "రాణి పూర్తి పేరు ఏమిటి?" సతీదేవి అడిగింది.    
    "సుమతి కళ్యాణ రూపరాణి" గొప్పగ చెప్పింది కీర్తి.    
    "పేరు బాగుంది" సతీదేవి మెచ్చుకుంటూ అంది.    
    "తాతయ్యకి మాత్రం రాణి అని పిలవటంరాదు. ఎంత సేపు రాణమ్మా! రాణమ్మా! అని పిలవటమే" కీర్తి చెప్పింది.    
    "రాణమ్మా అంటే సిరి తరిగిందా! ఇన్నేళ్ళు వచ్చీ నోట్లో వేలువేసుకోటం మానిందిలేదు అన్నీ చిన్నపిల్లచేష్టలే" యశ్వంత భట్టాచార్య నవ్వుతూ చెప్పాడు.    
    "పో.... తాతయ్యా!" అంది కీర్తి.    
    ఆ తర్వాత ముగ్గురూ కలసి కబుర్లు చెప్పుకుంటూ కూర్చున్నారు. దాసీది మూడుగ్లాసుల నిండా చల్లని డ్రింక్ తీసుకుని వచ్చి వక్కొక్కల్లకి నమ్రతగ అందించింది.    
    "తాతయ్యకి ఆ కాకరకాయ వేపుడు కంద పాఠోళి చాలా యిష్టం. దేవమ్మ (వంటావిడ)తో చెప్పు ఈ పూట భోజనంలోకి ఆ రెండూ తయారు చేయమని" సతీదేవి చెప్పింది.    
    "ఇప్పుడు అవన్నీ దేనికమ్మ! వయసు మీద పడింది. అన్నీతిని హరించుకునే రోజులు తగ్గాయి."    
    "ఫరవాలేదు లేదు తాతయ్య! కొద్దిగా నేతిను." అంది సతీదేవి.    
    "ఆ కాకరకాయ లేమిటీ!" దీర్ఘంతీస్తూ అడిగింది కీర్తి.    
    "ఎప్పుడైనా పనసకాయలు చూశావా!"    
    "ఓ..."    
    "ఆ కాకరకాయలు చూడటానికి పనసకాయల్లా గానే వుంటాయి. కాకపోతే ఆ కాకరకాయలు రెండంగుళాల సైజులో వుంటాయి. వకసారి వకళ్ళు అడిగారు కూడా ఇవి పనస పిందెలా అని, ఇటు వైపు ఆకాకరకాయలకి ప్రసిద్ది." సతీదేవి చెప్పింది.    
    "అక్కా! మరి....మరి..." కీర్తి నాన్చుతు అడిగింది.    
    "అడుగు రాణి!"    
    "ఆ కాకరకాయలు పనసపిందెల్లా వుంటే మరి పనస పిందెలు ఎలా వుంటాయి."    
    కీర్తి అమాయకంగా ముఖం పెట్టి అడగంగానే సతీదేవి ఫక్కున నవ్వింది. అక్కడ వున్న దాసీది కూడా నవ్వాపుకో లేక పోయింది.    
    "అతి తెలివి తేటలకు తక్కువేమి లేదు" యశ్వంతరావు విసుక్కున్నాడు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS