Previous Page Next Page 
కోటి యాభై లక్షలు పేజి 30


    "ఏం చెప్పావ్ గురూ! ఈ సినిమాకి ఏ ఆడదయినా వెళ్ళాలంటే రిక్షా అబ్బిని పిలిచి, నా మొగుడే మగవాడైతే...రిక్షాకి ఎంత తీసుకుంటావ్ అని ఎలా అడుగుతుంది! చెప్పినా అర్థం వుండాలి భాయ్!"


    రామ్ సింగ్ అనంగానే, చిద్విలాసంగా ఒక నవ్వు నవ్వి_" ఈ కాలం ఆడవాళ్ళు చాలా తెలివి మీరారు బ్రదర్! ఫలానా హాలుకి వెళ్ళాలి అని రిక్షా అబ్బిని అడుగుతారు. అంతేకాని సినిమా పేరు అడగడు. ఇలాంటి విషయాలు ఇక్కడి నుంచీ నేను బయటపడ్డాక చూసుకుంటాను కదా! డోంట్ వర్రీ!" అని అభయం ఇచ్చాను.


    రామ్ సింగ్ నా దగ్గరగా జరిగాడు.


    "ఈ మాటలు చాలా బోరుగా వున్నాయి. వీళ్ళు పెట్టిన ఈ సంకటి కూడు తినటం, తోచీ తోచక ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడుకోవటం, పూర్తిగా పిచ్చెక్కి పోతున్నది. కోటీ యాభయ్ లక్షల గురించి ఎన్ని కలలు కన్నాను. వజ్రాలేమో చేతులు మారాయి. మనమేమో ఇక్కడ తేలాము ఇన్ స్పెక్టర్ గారి మాటల వల్ల. బాస్ గాడు నిక్షేపంగా వున్నట్లు పారిపోయినట్లు తెలుసుకోగలిగాము. మనం ఇక్కడి నుంచి బయటపడాలి. ఆ వెంటనే వేట ప్రారంభించాలి. అప్పుడు కానీ మజా వుండదు. తిరిగి నా ప్రాణం పుంజుకోదు. తేలిగ్గా సంపాయించుకోటానికి ఒకటా, రెండా, ఒక కోటీ యాభయ్ లక్షలు. బాప్ రే! అంత ధనం ఒక వ్యక్తి సంపాయించాలంటే..."


    "అరా నిముషం చాలు...." రామ్ సింగ్ మాటలకి అడ్డుతగిలి అన్నాను.


    "అర నిముషం!" ఆశ్చర్యంగా అన్నాడు రామ్ సింగ్.


    "ఎస్! వాన రాకడ, ప్రాణం పోకడ ఎలా తెలియదో, డబ్బు రావటం కానీ, పోవటం కానీ అంతే. ఉదాహరణకి మన విషయమే చూడు నీ చేతికి కోటీ యాభై లక్షలు విలువగల వజ్రాలు దొరికాయి. అవి అంతలోనే చేయిజారి పోయాయి. నా విషయానికి వస్తే నాకూ అలానే జరిగింది. ప్రస్తుతం అవి బాస్ దగ్గర వున్నాయి. వాడి దగ్గర మటుకు వుంటాయనేమిటి? మనం బయటపడిన తరువాత వాడిని పట్టకుండా వుంటామా! వాడి అంతు తేల్చమా!" ఆ మాట అనేసి ఆవేశం ఆపుకోటానికి, నన్ను నేను కంట్రోల్ చేసుకోటానికి కళ్ళు మూసుకుని వుండిపోయాను.


    రామ్ సింగ్ కూడా ఆలోచనలో పడినట్లున్నాడు. ఆ తరువాత నాకు అడ్డు రాలేదు.


    అలా మౌనంగా ఎంతసేపు వున్నామో తెలియదు.


    సెల్ యొక్క తాళం తీసిన చప్పుడు కావటంతో కళ్ళు తెరిచి చూశాను.


    సెల్ తాళం తీసుకుని హెడ్ కానిస్టేబుల్ అహోబిలం, ఏడు కొండలూ లోపలికి వచ్చారు.


    వాళ్ళిద్దరి ముఖాలూ వెలిసిపోయిన ఎర్రగుడ్డల్లాగా వున్నాయి.


    "ఇనస్పెక్టర్ గారు మిమ్మల్నిద్దరినీ తీసుకురమ్మన్నారు. పదండి." ఇద్దరూ ఏకకంఠంతో అన్నారు.


    "మమ్మల్ని విడుదల చేస్తున్నారా...?" ఆత్రుతగా అడిగాడు రాంసింగ్.


    "అందుకో, ఎందుకో పదబే!" అన్నాడు అహోబిలం.


    "తినబోతూ రుచుకు అడగకూడదు బ్రదర్!" వాళ్ళ వెనుకనే బయలుదేరుతూ ముక్తసరిగా అన్నాను.


    కానిస్టేబుల్స్ రుచులు అడగకూడదు బ్రదర్!" వాళ్ళ వెనుకనే బయలుదేరుతూ ముక్తసరిగా అన్నాను.


    కానిస్టేబుల్స్ ముఖం చూడంగానే జరగానిది ఏమైనా జరగబోతున్నదేమో అని నా మనస్సు కీడుని శంకించింది.


    మేమిరువురం వారి వెనుకనే మౌనంగా బయలుదేరాము.


                                             15


    ఇన్ స్పెక్టర్ వర్ధనరావు ముఖం ఎప్పటిలాగా లేదు.


    మీసాలు క్రిందకి వ్రేలాడేసుకున్న బుడ్డ పుంజు ముఖంలాగా మోహం పెట్టి కూర్చుని వున్నాడు. ఆ ముఖంలో ఆందోలనో, సీరియస్ నెస్సో, ఫలానాది అని తెలియని విధంగా రంగులు మారుతూ వుంది.


    "ఊ...అలా నిలబడండి!" మమ్మల్ని గ్రుచ్చి గ్రుచ్చి చూస్తూ అరిచినట్లే అన్నాడు.


    "పాపం! ఈయనకేదో వచ్చింది. ఈ క్షణాన వున్నట్లు మరో క్షణాన వుండడు కదా!" అనుకున్నాను.


    మనిషికి కాకపోయినా, ఇన్ స్పెక్టర్ హోదాకైనా గౌరవం ఇవ్వాలి కాబట్టి, సలాం లాంటిది ఆయన ముఖాన పారేశాడు రాంసింగ్.


    బాగుండదు కదా...! అని నేను కూడా ఓ నమస్కార బాణం వదిలాను.


    ఒక మెచ్చుకోలు మాటకీ, ఒక చిన్న నమస్కారానికి ఐసయిపోయే మహానుభావుడు, ఆ క్షణాన ఐసు కాదు కదా, అలాంటిది మరేదీ కూడా కాలేదు! కోపంగా ఒక చూపు చూశాడు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS