Previous Page Next Page 
మహావృక్షం పేజి 28

"నేనా? బయటకి వెళ్ళాను. ఏం? ఏం జరిగింది?"
"వాళ్ళేం మాట్లాడకున్నారో నీకు చెప్పరా మీ వాళ్ళు?"
"ఆ! యస్ అన్నాం అని చెప్పారు. ఐ ఫెల్ట్ వేరే హాపీ, రేపు ఉద నీ దగ్గరకు వచ్చి, నీతో ఈ సంతోషం పంచుకోవాలనుకున్నాను. వాటీజ్ ద రాంగ్."
అనూష అతనిక,ఐ అభిముఖంగా తిరిగి సూటిగా చూస్తూ అడిగింది. "మీ వాళ్ళు కట్నం అడిగారు. నీకు తెలుసా?"
"ఓ అదా?" అతను తేలిగ్గా నవ్వుతూ- "అందుకా నువ్వు ఇంత సీరియస్ గా వున్నది? పిచ్చిదానా..." అన్ప్రశాంత్ ఆమె చేతులు తన చేతుల్లోకి  తీసుకొని, " చూడు అనూ! పెద్దవాళ్ళకేవో చాదస్తాలు, నమ్మకాలు వుంటాయి.వాటిని మనం చూసీ, చూడనట్టు వదిలేస్తే మనక్కావాల్సింది లభిస్తుంది. మనకేం కావాలి? అయినా అడిగింది కట్నం అడిగితె ఏం? లాంఛనాలు అడిగితె మనకేం? అయినా అడిగింది కట్నంకాదు, జస్ట్ గిప్ట్... అంతే."
"గిఫ్తా? ఆరు లక్షలు గిప్ట్ అడుగుతారా?"
"తప్పేముంది? కాబోయే కలెక్టర్ అల్లుడు అవుతుంటే ఆరు లక్షలు పెట్టి నాకు కారు కొనిస్తే ఏమవుతుంది ? నేనసలు పాతికా లక్షలు పెట్టి కోనుక్కోగలను. నీకు తెలుసుగా నాకు కార్లుపిచ్చి _ కానీ ఎందుకులే వాళ్ళని ఇబ్బంది పెట్టడం అని ఆరు లక్షలు చాలన్నాను అమ్మావాళ్ళ తో."
అనూష దిగ్బాంతిగా చూసింది. "అంటే.... నీకు తెలుసన్నమాట నువ్వే అడిగించావా?"
నేను అడిగిమ్చటం ఏమిటి? వాళ్ళు అడుగుతామాన్నారు. సరే అన్నాను. దీనికి అంత సీరియస్ అవడం ఎందుకు?"
"కాబోయే కలెక్టర్ అల్లుడికి ఆరులక్షల గిప్ట్ కావాలని అడిగిన వాళ్ళు కాబోయే కార్డియోలజిస్టు కోడలకి ఏం  చేస్తారో?"
"ష్యూర్! వైనాట్. మంచి నే క్లేస్ పెడతాను. ఓ. కేనా? ఇంకా నువ్వు బాబూ, నీ సీరియస్ నేస్ చూడలేకపోతున్నాను."
అనూష నవ్వలేదు.
"ప్రశాంత్! నేను ఈ కట్నాలకి చాలా వ్యతిరేకి. నాకు కొన్ని సిద్దాంతాలు వున్నాయి. మన పెళ్ళి పెళ్ళిలా అవాలి. వ్యాపారంలా కాకూడదు.ఈ బిజినెస్ అగ్రిమెంట్లు నాకిష్టంలేదు. వెంటనే మీవాళ్ళ ని కట్నం ప్రపోజల్ విత్  డ్రా చేసుకోమని చెప్పు."
"ఎలా కుదురుతుంది అనూ! సిల్లీగా మాట్లాడకు. అయినా మీ వాళ్ళు ఇవ్వలేని స్థితిలో ఉ న్నారా చెప్పు? అంత ఆస్తి వుందిగా_ ఏం చేసుకుంటారు?"
"ఆ ఆస్తంతా మా నాన్నగారు కష్టపడి సంపాదించారు. తాని, తన భార్యాపిల్లలు సుఖంగా బతకాలని, తన కూతురు చక్కగా చుదువుకోవాలని, కంఫర్టుబుల్గా బతకాలని _ అంతేగానీ, ఇలా అపాత్రదానం చేయాలని సంపాదించలేదు."
"అనూషా! యూ ఆర్ టాకింగ్ నాన్సెన్స్! అరె కట్నం కాదంటే వినవేం? రేపు నేను కలెక్టర్ ని అయాక, నికు ఎంత హొదా, ఎంత అంతస్తు వుంటాయో ఊహించావా? అడుగడుగునా నౌకర్లు,కార్లు బంగాళా... కలెక్టర్ భార్యగా నీ స్టేటస్...."
"నీకూ వస్తుంది స్టేటస్. ఓ పెద్ద కార్డియాలిజిస్టు భర్తగా ....కార్లు, బంగాలాలు, నౌకర్లు నేను సంపాదించి ఏర్పాటుచేసుకునే సక్తి నాకుంది. మంచి డాక్టరుగా , స్పెషలిస్టుగా నా హొదా, నా అంతస్తు నాకుంటాయి.నాక్కావలసింది హొదాని, అంతస్తునీ పెంచే భర్త  కాదు. నాకు చేదోడు వాదోడు గా వుంటూ, నా అభిప్రాయలను, ఆశయాలను అర్ధంచేసుకుంటూ నాతో సహకరించే నేస్తం కావాలి.... ప్రశాంత్! మళ్ళీ చెబుతున్నాను. నాకీ కట్నాలు, లాంఛనాలు అంటూ వేధించే అత్తమామలంటే ఇష్టంలేదు. ఈ ఆచారాలు, పద్దతులూ నాకు నచ్చావు. చక్కగా అ రోగ్యకరమైనా, ఆహ్లాదభరితమైనా వాతావరణంలో మనం ఒకటి కావాలి.... దయచేసి మీ వాళ్ళకి నచ్చ చెప్పు"
ప్రశాంత్ నిక్కచ్చుగా అన్నాడు. "చెప్పలేను అనూ! మా అమ్మకి మాత్రం నేను ఎదురు చెప్పలేను. ఆవిడంటే నాకు చాలా గౌరవం."
"నేనంటే?"
"తెలియదా... నా  ప్రాణం"
"అయితే నా మాటమీద గౌరవం లేదా?"
"ఉంది. కానీ, అది మనకి సంబంధించిన విషయాల్లో.... అయినా చిన్న విషయానికి ఎందుకింత  
రభస చేస్తున్నావు? ఇవన్నీ మన ఇళ్ళల్లో చాలా కామన్."
ప్రశాంత్! ప్లీజ్..." అనూష చేయి అడ్డం పెట్టి అతడి మాటలు మధ్యలో ఆపుతూ అంది. " ఒక డాక్టర్ గా, కాబోయే కలెక్టర్ గా ఇలా చీప గా మాట్లాడకు. ఉన్నతంగా ఆలోచించటం నేర్చుకో."
 "అంటే_ కట్నం అడిగితె నీచమా?"
"కాదా?"
అరే! మీరేం దరిద్రులా? మిమ్మల్ని పీడిస్తున్నామా? అంత ఆస్తి ఉంచుకొని, ఆరు లక్షలకి ఏడుస్తావెం?"అసహనంగా అన్నాడు.
"షటప్!" అరిచింది అనూష. "హౌల్డు యువర్ టంగ్.... మాకు డబ్బుంది. చాలా వుంది. కానీ నీకు ఇవ్వము. ఇవ్వనివ్వను.... పెళ్ళి వ్యాపారం కాదు.... కాకూడదు. అర్ధం మైందా? మళ్ళీ చెప్పానా? నీకు ఈ రాత్రి టైం ఇస్తున్నాను. నేను కావాలా? డబ్బు కావాల?  తేల్చుకో. ఆరు లక్షల కోసం ఆరేళ్ళ మన అనుభందాన్ని తెంపు కోవాలంటే నీ ఇష్టం. నేను మాత్రం ఆరు రూపాయలు కూడా ఇవ్వను. దట్సాల్! గుడ్ నైట్.... పద నిన్ను డ్రాప్ చేస్తాను."
"అనూషా!" ఏదో చెప్పబోతున్న ప్రశాంత్ కి అవకాసం ఇవ్వకుండా లేచి, చకచకా కారు దగ్గర నడిచింది.
అనూష కళ్ళనిండా నీళ్ళు పొంగి, చెవుల పక్క నుంచి తలగడమీద పడ్డాయి. తలగడ చల్లగా తలగడం తో ఆలోచనలనుంచి తెప్పరిల్లింది.
ప్రశాంత్ డబ్బు మనిషి, అతను తను కోరిన సమాధానం చెప్పక కోవడంతో ఆ పెళ్ళే రద్దుచేసుకుంది. తల్లీ, తండ్రి ఎంత చెప్పినా వినలేదు.ఉన్నంత విద్యావంతురాలైన తను ఓ మాగాడికి భార్యగా అనురాగంతో కావాలనుకుంది కానీ, భర్తని కొనుక్కోవాలనుకోలేదు. అమ్ముడు పోవాడానికి అతనికి ఆత్మాభిమానం లేకపోయినా, కొనడానికి తనకి చాలా అభిమానం అడ్డొచ్చింది.

 


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS