మృదువని ఆయాసంతో రొప్పుతొంది. ఒ హొటల్ లో కార్నర్ టేబుల్ దగ్గర కూచుంది. ఆమెలో అందోళన ఇంకా తగ్గలేదు. పందెం..పరుగు పందెం...ప్రాణాలతో పరుగు పందెం...
దాదాపు నలబై ఎనిమిది గంటలుగా ఈ పరుగు పందెం... ఒక్క క్షణం ఆగినా, తన ప్రాణాలు గాలిలో కలసిపోతాయని తెలిసి... అనుక్షణం గుండెను గుప్పిట్లో పెట్టుకుని మొదలెట్టిన పరుగు పందెం.
రాత్రంతా పార్క్ లో కలత నిద్రే.. ఏ క్షణం ఎప్పుడు ఎటువైపు నుంచి ప్రమాదం ముంచుకు వస్తుందో తెలియదు... పోలీసులు, డిఫెన్స్, షంషేర్ దాదా మనుషులు... నగరమంతా తన గురించే వేట.
అప్పటికే నగరమంతా అనషేఫియాల్ రెడ్ ఎలర్ట్ అమలులో ఉంది. ఏ క్షణం ఎప్పుడు, ఎవరు తనను చుట్టుముడతారో తెలియదు.
తను స్టూడియోలోకి వెళ్ళడం, అక్కడ ఏదో ఒ ప్రోగ్రామ్ తాలుకూ ఘాంటింగ్ జరుపుతూ వుడటం... సదన్ గా తాను అక్కడికి వెళ్లేసరికి, అది వేలంటైన్స్ డే ప్రోగ్రామ్ అని తెలియడం... అంతా గుర్తుంది.
అప్పుడు తనేం చేసింది? మీ బోయ్ ప్రెండ్ ఎవరూ... అంటే ఎవరో ఒకరిని చూపించింది... ఎవరతను? అతను ఎలా ఉంటాడు. అసలు ఆమె స్ప్రుతిపథంలో క్రిందటి క్షణం వరకూ ఆ ఆలోచన లేడి.కేవలం తన ప్రాణం రక్షించుకోవడం కోసం, తనలా చేసింది.
"మెడమ్... ఏం తీసుకుంటారు?" వెయిటర్ వచ్చి అడిగాడు.
ఏం తీసుకోవాలి? ఆకలి దంచేస్తుంది. రాత్రి నుంచీ తను ఏమీ తినలేదు... మెనూ కార్డ్ చూసింది. అక్షరాలు మసక మసకగా కనిపిస్తున్నాయి. అప్పుడు గుర్తొచ్చింది. తన ద..గ్గ..ర..డ..బ్బు..లు..లే..వ..ని!
షంషేర్ దాదా మనుషులు, పావులేసులు, డిఫేన్సూ... తనని వెంటాడుతూంటే, ఆ హడావిడిలో, అ కంగారు లో తన బ్యాగు ఎక్కడో పడిపోయింది. ఒకవేళ భ్యగు వున్నా, అందులో డబ్బు లేదు.
"చెప్పండి మేడమ్... ఏం తీసుకు రమ్మంటారు?" అడిగాడు వెయిటర్.
"ఏమీ వద్దు..." చెప్పి,నాలుగు గ్లాసుల నీళ్ళు గడగడా తాగేసింది. అక్కడ్నుంచి లేచింది... హొటల్ బయటకు వచ్చింది. నడిచే ఓపిక కూడా లేదు.తనలాగైనా ఇక్కడ్నుంచి బయటపడాలి. ఢీల్లీచేరుకోవాలి. శరణ్య గురుంచి తెలుసుకోవాలి. ఈ రాత్రి ఎక్కడ తలదాచుకోవాలి? తనకు సరైన షెల్టర్ ఏది? అప్పుడు గుర్తొచ్చింది... రైల్వేస్టేషన్ లో పనికిరాని ట్రాక్ వున్న పాత బోగీ....
అవును... అక్కడకి ఎవరూ రారు... చీకటి పడక ముందే తను రైల్వేస్టేషన్ చేరుకోవాలి...స్టేషన్ లో తన కోసం కాచుక్కూచొన్నా షంషేర్ దాదా మనుషులు ఏ మార్చి అ పాత బోగీని చేరుకోగలిగితేచాలు.
ఏదో ఓ ట్రేయిన్ ప్లాట్ ప్లామ్ మీదికి రాగానే వాళ్ళ కళ్ళుగప్పి ఎక్కేయాలి. అలాంటి ఆలోచన రావడంతో ఆమె కాస్త రిలేఫ్ గా పీలయింది. తను ఇక్కడనుంచీ స్టేషన్ కు వెళ్ళాలి. బస్సులో వెళ్ళడానికి డబ్బులు కూడా లేవు. పోనీ ఎవరికైనా లిప్ట్ అడిగితె? అమ్మాయి లిప్ట్ అడిగితే లిప్ట్ ఇవ్వని వాళ్ళుంటరా?
తనకు లిప్ట్ ఇచ్చే వాళ్ళ కోసం చూస్తోంది రోడ్డుకు ఓ పక్కగా నిలబడి మృదువని. సరిగ్గా అప్పుడు...
***
బైక్ స్టార్ట్ చేశాడు అంకిత్.
చేతన్, రాహుల్ లను పంపించాడు. రాత్రి పడి వరకూ మృదువని కోసం వెతకాలని డిసైడైపోయాడు. చేతన్,రాహుల్ లు సెకండ్ షో చూసి వస్తానని చెప్పారు.
బైక్ ను స్లో చేస్తూ, మృదువని కోసం అటు, ఇటు చూస్తూ వెళ్తున్నారు. సరిగ్గా అప్పుడు... ఓ అమ్మాయి 'లిప్ట్ ప్లీజ్' అని థమ్స్ఆఫ్ సైన్ ని చూపిస్తూ అడుగుతోంది. అ అమ్మాయి మృదువని.
***
ఒక్క క్షణం భ్రాంతి నుంచి విభ్రాంతికి లోనయ్యాడు అంకిత్. ముందు అది తన భ్రాంతి అనుకున్నాడు. అది నిజమని తెలిసిన మరుష్కనం విభ్రాంతి కి లోనయ్యాడు.
తన ఎదురుగా... నిలబడి లిప్ట్ అడుగుతుంది.
"మృ..దు..వ..నీ.." ఒక్కో అక్షరాన్ని కూడదీసుకుని ఉద్వేగంగా అన్నాడు.
ఒక్కక్షణం గంగారు పడిపోయింది మృదువని. అంతలోనే తేరుకుని... "మృదువనా? అవిడేవరు?" అడిగింది దభాయింపుగా.
"ఒహో... మళ్ళీ ప్రాక్టికల్ జోకా? యూ ఆర్ మృదువని... నిన్న మ స్టూడియోలో మీరు రాలేదూ..." బైక్ స్టాండ్ వేసి అడిగాడు. అతను ఒకరకమైనఉద్వేగానికి లోనయ్యాడు. మాటల్లో చెప్పలేని అనందం అతన్ని ఆవరించిన తనెంత టెన్షన్ పడ్డాడు....
"నన్ను స్టేషన్ వరకూ డ్రాప్ చేయగలరా? ఐ మీన్ స్టేషన్ వరకూ లిప్ట్ యిస్తారా?" అవసరం తనది... అందుకే అనవసరంగా ఆర్గ్యూ చేయకుండా అడిగింది.
నాకు జీవితకాలపు చివరిక్షణం వరకూ లిప్ట్ యిడ్డామనే వుంది... మనసులో అనుకుని పైకి మాత్రం "రండి" అంటూ బైక్ స్ట్రాండ్ తేసి,స్టార్ట్ చేశాడు మృదువని అతని వెనక కూచుంది.
మృదువనితో సంభాషణ ఎలా మొదలు పట్టాలో అర్ధం కాలేదు. ఎన్నో చెప్పాలని వుంది. ఎన్నో అడగాలని వుంది. ఎలా...
ఇంత రాత్రివేళ ఎక్కడికి రమ్మనగలడు?
అలా ఆలోచిస్తూనే అడిగాడు "మీ యిల్లు ఎక్కడ? నన్నిక్కడ డ్రాప్ చేయమంటారు?"
"స్టేషన్ దగ్గర డ్రాప్ చేస్తే చాలు..." ముక్తసరిగా చెప్పింది మృదువని.
"మృదువనిగారూ... మీతో చాలా మాట్లాడాలి... నాకు ఒక్క పడి నిముషాలు టైం ఇవ్వండి" అన్నాడు అంకిత్.
మృదువని మాట్లాడలేదు. ఆమెకు సమాధానం ఏం చెప్పాలో అర్ధం కాలేదు
"నేను...నే..ణం..తే..మీ..కిష్ట...మా..?"
మృదువని ఈ ప్రశ్నకు కూడా బదులివ్వలేదు. అతడ్ని పోల్చుకోవడానికి ఆమెకు చాలా సమయం పట్టింది.
"చెప్పండి... మీ కోసం నిన్నట్నుంఛీ ఒక్కటే ఆలోచన... మీరు నవ్వనంటే చేబుతాను.. ... నాకు అన్నం తినబుద్దికావడంలేదు. మా రాహులే తినిపించాడు ఆఫ్ కోర్స్ రాహుల్ అంటే మీకు తెలియదు కదూ... వాడు న బెస్ట్ ప్రెండ్.."
"బైక్ ఆపండి.." ఒక్కసారిగా అరిచినట్టుగా చెప్పింది మ్రుడువని.
సదన్ బ్రేక్ వేస్తూ బైక్ ఆపాడు.
మృదువని ఎదురుగా చూస్తోంది. టాంక్ బండ్ చివర ఓ డిఫెన్స్ జీపు వుంది. లెప్ట్ సైడ్ క్వశ్చన్ మార్క్ వున్న బ్లాక్ కలర్ జీపు... అంటే డిఫెన్స్ మాఫియా... ఇద్దరూ తనకోసం కాచు క్కూచున్నారా? ఇలా బైక్ మీద వెళ్తే తనని ఖచ్చితంగా గుర్తుపడతారు.
