తన ఐడెంటిటీ కార్డ్ చూపించి ఎడిటర్ ఛాంబర్ లోకి వెళ్ళాడు.
"వేల్ కమ్.. మాస్టర్ కౌశిక్. మీ గురించి విన్నాం. పత్రికల్లో చదివాం... మీ ఇంటర్వ్యూ కోసం కూడా అప్పట్లో ప్రయత్నించాం... పబ్లిసిటీకి మీరు దూరం అని తెలిసి, మంచి ఇంటర్వ్యూ మిస్సయినందుకు ఫీలయ్యాం. నౌ వుయ్ ఆర్ వెరీ హేపీ..." అన్నాడు ఎడిటర్.
"మీ అభిమానానికి థాంక్స్... మీరు నాకో ఫేపర్ చేయాలి?"
"చెప్పండి సార్... మేమూ పాఠకుల కోసం ఈ పత్రిక నడిపిస్తున్నాం మీరు 'ఫేపర్' చేయమని అడిగారంటే అది ఖచ్చితంగా దేశానికి ఉపయోగపడేదే అయి వుంటుంది. మీకేం కావాలో నిర్మొహమాటంగా అడగండి. "వాట్ కేం ఐ దు ఫర్ యూ" మనస్పూర్తిగా అడిగాడు ఎడిటర్.
తనక్కవసింది ఏమిటో చెప్పాడు కౌశిక్.
***
'ది న్యూస్' లో పడ్డ ఆ వార్త నగరాన్ని సంచలనంలో ముంచెత్తింది.
భస్మనేత్ర ఎన్ కౌంటర్..
సైన్స్ ను సవాలు చేస్తూ విదీశీయులు చేతిలో కీలుబొమ్మ అయినా భస్మ నేత్ర నిన్న రాత్రి ఫోలీసులకు, అతనికి మధ్య జరిగిన ఎన్ కౌంటర్ లో మరణించాడు.
భస్మ నేత్రంలో సూపర్ పవర్స్ వున్నాయి. అతని శరీరం విద్యుత్ మయం. అతని తలలో వున్న మూడో నేత్రం విద్యుత్ కిరణాలను ప్రసారం చేయగల విద్యుత్ కేంద్రం.
అతని మృతదేహాన్ని అర్బర్వేషన్ సెంటర్ లో వుంచారు. ఈ విషయాన్ని ఫోలీసులు ఇంకా దృవీకరించలేదు. ప్రముఖ సైంసిస్ట్ లు భస్మ మృతదేహాన్ని ఫోస్ట్ మార్టం చేసి అతని బాడీని పరిశోధించాలనే నిర్ణయానికి వచ్చారు.
మాకు అందిన అత్యంత విశ్వసనీయ సమాచారం మేరకు ఈ కేసును.సిబిఐ ఏజెంట్ కౌశిక్ డీల్ చేస్తున్నాడు.
ప్రస్తుతం కౌశిక్ హొటల్ లావెన్ లో వుంటుంనట్టుతెలిసింది. అతని నుంచి వివరాలు సేకరించాలని ప్రయత్నించినా వీలుపడలేదు... అన్నా వార్తా అది.
ఆ పత్రిక వాళ్ళు తమకు 'సోర్స్' ద్వారా ఆ వార్త రాసినట్టు వుంది.
ఆ రోజు 'దిన్యూస్' చూసిన భరద్వాజ్ షాక్ తిన్నాడు.
అతని కళ్ళు అప్రయత్నంగా చెమర్చాయి.
***
హొటలు లావెన్.
రిసెప్షన్ దగ్గర రిపోర్టర్లు గుమికూడారు.
ఆ రోజు 'ది న్యూస్' లో పడ్డ వార్త చూసి మిగతా దిటేయిల్స్ తెలుసుకోవాలని వివిధ పత్రికలకు చెందిన జర్నలిస్టులు అక్కడకి వచ్చి చేరారు.
కౌశిక్ క్రితంరోజే రూమ్ ఖాళీచేసి ఢిల్లీవెళ్లారని రిసెప్షన్ నిస్తూ చెప్పింది. కౌశిక్ ఆదేశాల మేరకు.
ఢిల్లీ కాంటాక్ట్ నెంబర్ తీసుకుని వాళ్ళు వెనదిరిగారు. ఇది జరిగిన అర గంట తర్వాత ఆ హొటల్ ముందు ఓ ఆటో ఆగింది.
అందులోంచి భరద్వాజ దిగాడు.
రిసెప్షన్ దగ్గరకి వెళ్ళి కౌశిక్ గురించి ఎంక్వయిరీ చేసాడు. భరద్వాజ పేరు తెలుసుకున్న తర్వాత... రిసెప్షనిస్ట్ చెప్పింది_
"రూమ్ నెంబర్ వన్ ట్రీ వన్ సార్..."
"థాంక్యూ" అని ఫస్ట్ ప్లోర్ వైపు నడిచాడు భరద్వాజ.
***
రూమ్ నెంబర్ వన్ ట్రీ వన్ లోకి అడుగు పెట్టాడు భరద్వాజ. కౌశిక్ అతన్ని చూసి అతనికీ ఎదురెళ్ళాడు.
"గుడ్ మార్నింగ్ సర్.. అయాం కౌశిక్..." అన్నాడు రెండు చేతులు జోడించి నమస్కారం చేస్తూ.
"గాడ్ బ్లెస్ యూ మై సన్" అతని భుజం తత్తీ అన్నాడు భరద్వాజ.
"రండిసార్... కూచొండి..." అంటూ సోఫా చూపించాడు.
"పేపర్లో నేను చదివినది..."
"నిజమే..." గంబీరంగా అన్నాడు కౌశిక్.
"అంటే భ..స్మ.." భరద్వాజ కంఠం వణుకుతోంది.
"ఎన్ కౌంటర్ లో చనిపోయాడు"
"నో..." గట్టిగా అరిచాడు భరద్వాజ.
"నిజం...డెడ్ బాడీ మార్చురీలో వుంది..." ఒక్కక్షణం తనని తను సంభాళించుకుని.
"భస్మను మీరు ఎన్ కౌంటర్ లో చంపలేదు. చంపలేరు కూడా... అతడ్ని చంపడానికి అతి శక్తివంతమైన బంబునో, అంతకన్నా శక్తివంతమైన దాన్నో ఉపయోగించాలి. అతనికి ఎదురు నిలిచి మీరు అతడ్ని ఏమీ చేయలేరు" తాపీగా అన్నాడు భరద్వాజ.
"అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలరు?" సూటిగా భరద్వాజ కళ్ళలోకి చూస్తూ అన్నాడు కౌశిక్.
"ఎందుకంటే... వాడి కన్నా తమ్ద్రీని కాబట్టి..." అలా అంటున్నప్పుడు భరద్వాజ గొంతు వణికింది.
"సారీ సర్... మీ నుంచి ఈ నిజం రాబట్టడంకోసం కాదు. ఈ వార్త చదివి మీరు మీ అబ్బాయిని వెతుక్కుంటూ వస్తారని కాదు, ఏదేశం కోసం మీ బిడ్డను కూడా చంపాలని నిర్ణయించుకున్నారో...
ఇప్పుడా దేశం ఆ బిద్దవల్లె సర్వనాశనం కాబోతుంది. ఈ వార్త చదిచ్వి మీరు వస్తారనే మా ఆశ వమ్ము కాలేదు.
పాతికేళ్ళ క్రితం సీటీ హాస్పిటల్ లో మీకు 'మూడో కన్ను' తో ఓ బిడ్డ పుట్టడం, ఆ బిడ్డను మీరు పాతిపెట్టాలని నిర్ణయించుకోవడం, మీకూ మీ ఆవిడకూ ఈ విషయంలో వాగ్వివాదం జరగడం... ఓ రాత్రివేళ మీబాబును మీరు పాతిపెట్టడం....
ఇవన్నీ మీ భార్యకు పురుడుపోసిన వ్యక్తికీ తెలిసి మీ సంభాషణ అంతావింది. అతి కష్టంమ్మీద పదేళ్ళ క్రితమే రిటైరైన ఆ వ్యక్తిని కలుసుకుంటే ఈ వివరాలు అన్నీ చెప్పింది.
మీ గురించి ఎంక్వయిరీ చేశాను. మిమ్ముల్ని కనిపెట్టడానికి, తద్వారా దేశాన్ని రక్షించుకోవడానికి నాకు కనిపించిన మార్గం యిదేననిపించింది. తప్పుయితే మన్నించండి" సిన్సియర్ గా అన్నాడు కౌశిక్.
భరద్వాజలో ఏ భావమూ లేదు.
"మీ బిడ్డ బ్రతికే వున్నాడన్న విషయం తెలిసి షాకయ్యారా?"
ఎప్పుడో చనిపోయాడనుకున్న బిడ్డ ఇప్పుడు బ్రతికే వున్నడని సంతోషపడాలో, ఆ బిడ్డ ఈ దేశ భవిషత్తు ను కాలారాయడానికి శత్రువు చేతిలో అయూధంగా మారాడని బాధపడాలో అర్ధం కావడంలేదు.
