Previous Page Next Page 
మ్యూజింగ్స్ -2 పేజి 29


    ఆమెకి భోజనం లేని వాళ్ళుంటారని ఊరికే మనసులో మాత్రమే ఊహించుకోడమే కష్టసాధ్యమైన ఆమెకి! నేను భోజనం!
    తరవాత.....తరవాత.....24 గంటలలో భోజనం - ఓ గంట, తరవాత? ఇంకా........దేహం చాలా విశాలం .....మెదడు -------హృదయం.
    పక్కమీద నించి లేవాలి. మొహం మీది ఎండ. కాని ఆమె .........
    ఎందుకు ఇప్పుడు ఆ సంగతి?
    మొదలు పెట్టింది పని చెయ్యడం యీ ఇన్ జన్
    ఇంతే మళ్ళీ రాత్రి మైమరిచిందాకా ఇంతే, యీ మెదడు factory, ఎవరికి కొరగాని ఆలోచనగా సామగ్రిని తయారు చేస్తో.
    మాటలు వ్రాతలు పుస్తకాలు - విమర్శలు - కాలం వూడ్చేసిందాకా. ఇట్లా కాయితాలని, మనుషుల్ని పట్టుకు వేళ్ళాడతాయి, యీ ఆలోచన goods.
    చిన్నది, తెల్లనిది, యీ మాంసపు ముద్దు. పుర్రెకింద నించి యీ ప్రపంచాన్నే సృష్టించుకుంది.
    భూమ్యాకశాల్ని నీడలతో నించి , దీని కంతా అర్ధమేమంటుంది. తన నీడకి ఉత్పత్తి తనే వెతుక్కుంటుంది.
    తను గీసిన బొమ్మలలో తాను తిరుగుతుంది. వేలకు వేల మైళ్ళు. అనంతకాలం మధ్య హోరుమని ఏడుస్తుంది. కనిపాపలో ఇమిడి కాలి పోతుంది.
    ఏమైతేనేం? ప్రస్తుతం రైలు స్టేషన్ కి చేర్చమంటోంది. 'టీ' తాగడానికి.
    సైరంద్రి వలలుడితో మల్లె, రాత్రంతా గాలి తన అవస్తను మైదానంతో చెప్పుకుని ఏడ్చింది గావును;
    అంతటా తడి. ప్రతి గడ్డి పరకనీ వెతికి దేవకన్యలు అలంకరించిన గులేబుల్లో రంగుల దీపాల్ని వెలిగిస్తున్నాడు సూర్యుడు. ఆ రంగుల మధ్య, గడ్డి కొమ్మ నించి గడ్డి కొమ్మకి దూకి ఆడుకుంటూన్నాయి మిడతలు. ప్రతి మంచు బొట్టులోనూ మెరిసే ప్రతి సూర్యుడూ, ఏఏ లోకాల్నీ వెలిగించుకుంటున్నాడో!
    కాలమూ, దూరమూ -- ఈ భావాల్ని ఏనాటికన్నా అధికమించి పనిచేస్తుందా యీ మనసు !
    మంచు బోట్లలోని solar syastem నీ ఆకాశంలో infinite లో మనుషుడికి తెలీని దేని చుట్టూ యీ నక్షత్ర మండలం తిరుగుతోందో ఆ contre of all systoms నీ ఒక్కసారిగా గ్రహిస్తుందా యీ మనసు ఏనాటికైనా!
    నేను మైదానం దాటతున్నానా మైదానం నన్ను దాటుతోందా?
    మనుషులు కాలంలో విషయాల వేపు నడుస్తున్నారా? విషయాలు మనుషుల మీదికి నడిచి వొస్తున్నాయా? కదిలేది ఏది? స్తిరంగా వుండేది ఏది? రెండూ కదులుతున్నాయా/ ఏదీ కదలందే కదులుతున్నామనుకుంటున్నామా? ఈ సూర్యుణ్ణి వొదిలితే కాలమనేది ఎక్కడవుంది? మనసులో తప్ప! తన యిష్టప్రకారం మారే కొలతలతో నడిచే మనసు, నిలిచే మనసు, పరిగెత్తే మనసు, కాలాన్ని ఏం కొలుస్తుంది?
    నిన్న రాత్రి కళ్ళు మూసుకునేప్పుడు ఎదురుగా బృహస్పతి, కళ్ళు తెరిచేప్పటికి శుక్రుడు.
    నేను తిరిగానా? ఆకాశం తిరిగిందా? గడియారం తిరిగిందా?
    మైదానం మధ్య ఆగాను. నా ఆనందమూ ఆగింది. కదులుతో వుంటేనే గాని అనందం లేదు. ఆగి ఆనందించాలని చూసిన నా అద్భుతశృంగార సమయాలు జ్ఞాపకం వొచ్చాయి.
    ఆగి ఆనందించగల గుణం అబ్బుతుందా యీ మనసుకి ఎన్నటికైనా, భగవాన్.
    నీకు చేతనౌతుందంటావు.
    ఆగితేనే కాని నిజమైన ఆనందం అనుభవంలోకి రాడంటావు.
    ఇట్లా, కదులుతో, వెతుకుతో, మింగుతో వుంటేనే కాని ఈ ఏడుపు తప్పదా? ఈ అశాంతి!
    స్టేషన్ కి ఎదురుగా రోడ్డు మధ్య ఒకామె. కప్పడానికి బట్టలు లేని ఆమె దరిద్రపు రోహ్ముని తలతో తడుముతో పిల్ల. తలెత్తి నన్ను చూడలేదు. ఆమెకి లోకం లేదు. ఆ కళ్ళు ఎక్కడా లేవు. సాయింత్రం నా వరండాలో పిల్లకి పోలిచ్చుకునే మేక శుభ్రమైన నగ్న నిర్లక్ష్యం అమెది. అమెది పొద్దున్నే 'స్పెన్సర్' లో 'టీ' అవసరం లేదు.
    ఆ స్టేషన్ ఊడ్చే మనిషి వొచ్చాడు. అతనికి చాలా లోకువ. దుమ్ములో కూలబడి ఎవరిని చూసీ , కప్పుకోడానికి పమిట లేని ఆడది. కులకక, సిగ్గునటించక , ఏడుపు మొహం పెట్టక, లోకాన్ని మరిచిన ఆడది.
    అతని కంఠంలో జాలి, చూపు రైల్వే పోలీసు కొట్టువేపు.
    "మీవాళ్ళేనా, అక్కడ?"
    అతని వేపు కళ్ళన్నా ఎత్తకుండానే , ఔనని వుయించింది తల!
    "మూటలేనా?"
    మళ్ళీ తల వూయించింది.
    అంటే? అని ప్రశ్నిస్తోంది నా మనసు. తనకేమీ జోక్యం లేని విషయంలో.
    అసలు ఆ వూడ్చే అతనికే జోక్యం లేదు ఆమె వ్యవహారం. అంతకన్నా నాకు లేదు. కాని తెలుసుకోవాలి తెలుసుకోకపోతే టీ తాగినంత సేపూ "మూటలేమిటి" "మూటలేమిటి" అని మొగూతూనే వుంటుంది బుర్రలోపల.
    స్టేషన్ గుమ్మంలో.
    "దొంగతనం జరిగింది. మూటల దొంగతనం." అంటున్నారు. ఘరానావారు, కార్మికులూ , పోర్టర్లూ.
    "దొంగతనం" ఎంత ఉపద్రవం! తమకేమీ సంబంధం లేని దొంగతనం. కాని ఈనాడు -- వాళ్ళకైతే రేపు -- తమకీ! వీల్లేదు దొంగతనం! సంఘానికి గాయమయింది. ఈ ఈగలన్నీ జుయ్యిమంటున్నాయి ఆ పుండు చుట్టూ.
    నా పుస్తకాలూ చేసిన గాయాల చుట్టూ ఇంకా మానలేదు. మూలగడం, పోతుటీగలు, డిగ్రీల యీగలు ముసలి యీగలు , మురికి యీగలు , దుష్పదార్దాలతో కళ్ళు ఊడిన యీగలు.
    మూడు మూటల దొంగతనం! అంటున్నాడు హిగింబాదమ్సు కుర్రాడు. చలం ఆరాధకుడు.
    స్టాలుకి అంటుకు పోయి పోస్టరు',
    "బాంబులు పడి 400 మంది చచ్చిపోయినారు" అని అరుస్తోంది. ప్లాటుఫారం కంకరకి. లోక క్షేమం నడుమున కట్టుకున్న దేశాలకి జరిగిన గాయం మల్లె.     


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS