ఆ కట్టలను యాబై సూట్ కేసులలో సర్ధించి వారికి అందించాడు.
అవిశ్వాస తీర్మానం ప్రకటిస్తున్నట్టు వాళ్ళా చేత సంతకాలు తీసుకోవడం ముగిసేసరికి చాలా సమయం గడిచిపోయింది.
జయచంద్ర ఒక్కొక్కరినీ గేటు వరకూ సాగనంపాడు.
'అందరినీ తను కోనేసినట్టే.... ఇప్పుడు వాళ్ళు తన మనుషులే' అనుకుని తృప్తిగా, గర్వంగా జయచంద్ర నవ్వుకున్నాడు.
మాట్లాడుతూ కిటికీ వద్దకు వచ్చిన సత్యమోహన్ భృకుటి ముడిపడింది.
సరిగ్గా అదే సమయంలో తనను ఎవరూ గమనించక ముందే తప్పించుకోవాలి అన్న ఆతురతతో ఒక యువతి గోడ దూకి వెళుతుంది.
ఆ దృశ్యం సత్యమోహన్ కంట పడింది.
ఆమెను గమనించిన సత్యమోహన్ అందోళన పడడానికి కారణము.... ఆమె చేతిలో వున్న కెమేరా!
పార్టీ ఎప్పుడో అయిపోవడంతో జయచంద్ర ఆ అమ్మాయిలందరినీ పంపించివేశాడు.
అయినా, ఆమె ఇంత వరకూ లోపలే వున్నది అనే నిజం తెలియడం వలనూ.. కెమేరాతో పరుగుదీస్తున్న సత్యం అర్ధం కావడం వలనూ లాయర్ ప్రమాదాన్ని శంకించాడు.
ఆమెను తను ఎప్పుడూ చూసినట్టు గుర్తులేదు.
వెంటనే తన మనుషులను పిలిచి ఏం చేయాలో క్లుప్తంగా చెప్పాడు.
మరుక్షణం యమదూతల్లా ఆ భవంతిలో నుంచి బయటకు దూసుకుపోయారు వాళ్ళు.
వాళ్ళ కంటికి దూరంగా పరుగుపెడుతున్న రూపం స్పష్టంగా కనిపిస్తుంది.
* * * *
ఇంటలిజెన్స్ విభాగం.... ఘోరంగా విఫలం అయింది.
కారణం...
నేటి రాజకీయ అస్త వ్యస్త పరిస్థితిని, రాజకీయపు ఎత్తులు, జిత్తులను, ముందుగా గ్రహించలేకపోవడం....
ఫలితంగా తెరవెనుక ఏం జరుగుతుందో ముందుగా కనీసం సూచన ప్రాయంగా అయినా రాష్ట్ర ముఖ్యమంత్రికి తెలియపరచలేక పోవడం...
రాష్ట్ర ముఖ్యమంత్రిపై అసమ్మతి వర్గం ధ్వజం ఎత్తింది.
రాష్ట్రం అంతా వ్యతిరేక ప్రదర్శనలు... ఆందోళనలు ఆరంభం అయ్యాయి.
అసమ్మతి వర్గం వాళ్ళు నగరంలో బ్రహ్మాండమయిన ర్యాలీ నిర్వహించారు.
డౌన్ డౌన్... ముఖ్యమంత్రి డౌన్ డౌన్... అసమర్దపు ముఖ్యమంత్రి వెంటనే రాజీనామా చేయాలి" అందోళనకారుల గొంతులు నినాదాలతో పిక్కటిల్లాయి.
అందోళన అంతటితో ఆగలేదు.
నగరంలో నుంచి మిగిలిన సిటీలకు పాకింది.
రాస్తారోకోలు... రైల్ రోకోలు.
ఉద్యమం తీవ్రరూపాన్ని దాల్చింది.
రోజు రోజుకూ అసమ్మతి వాదులు చేపడుతున్న కార్యక్రమాలకు అటు అధికారులు, అనధికారులు అల్లాడిపోతున్నారు. పాలనా వ్యవస్థ స్తంభించినట్టుంది వాతావరణం.
అణిచివేత కార్యాక్రమం మొదలైంది.
బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్, పారామిలిటరీ దిగింది.
లాఠీ చార్జీలు...భాష్పవాయువులు...
అందోళనా కారులు పోలీసులపై తిరగబడ్డారు.
రాళ్ళు రువ్వారు...
యాసిడ్ బల్బులు విసిరారు...
షోడా బుడ్లు ప్రయోగించారు-
ఆత్మరక్షణ కోసం పోలీసులు కాల్పులు జరపక తప్పేలేదు.
ఫలితంగా కొందరు వ్యక్తులు గాయాలతో హాస్పిటల్ పాలు అయ్యారు.
ఉద్యమం ఆగలేదు సరికదా... ఉద్యమంలో కొత్త ఎత్తుగడలు ఆరంభం అయ్యాయి.
పాత బస్తీలో మాట కలహాల చిచ్చు రగిలింది.
దానికి తోడు... నిపురు గప్పిన నిప్పులా అణగి మణికి వున్న మరో ఆరని చిచ్చు రిజర్వేషన్ల ప్రహసనం జీవం పోసుకుంది.
కళాశాలల్లో రిజర్వేషన్ బాంబు పేలింది.
విద్యార్దులు వీధిన పడ్డారు.
కళాశాలలు మూతలు పడ్డాయి....
ఉద్యమాల పేరిట నగరం అట్టుడికిపోతుంది.
దుకాణాలపై దాడులు ఆగడం లేదు.
దమనకాండ మొదలైంది...
అందోళనకారులు ప్రభుత్వ వాహనానలను ధ్వంస్యం చేస్తున్నారు.
ఉద్యమం రాష్ట్రం అంతా బలంగా వ్యాపించింది.
అందోళన చేస్తున్న వారి వెనుక వున్న శక్తుల గురించి ఆరా తీయవలసిన ఇంటలి జెన్స్ డిపార్ట్ మెంట్ ది.
అప్పటికే ఘోరంగా విఫలం అయినా ఇంటలిజెన్స్ వర్గాలపై సి.ఏం అసమ్మితిని వ్యక్తం చేయలేదు.
వాళ్ళ భాద్యతలను మరి ఒకసారి గుర్తుచేశాడు. వాళ్ళ ధర్మాన్ని మరింత ఆత్మవిశ్వాసంతో నెరవేర్చడానికి వాళ్ళు అందరినీ హుషారు చేయడం జరిగింది. రాయితీలు ప్రకటించటంతో వాళ్ళలో నూతనోత్సాహం పెరిగింది.
అసమ్మితి ప్రజ్వరిల్లడానికి అసలు కారణం ఏమిటో కూపీ తీయడానికి తమ శాయశక్తులా ప్రయత్నించాలని కృతనిశ్చయంతో వుంది ఇంటలిజెన్స్ విభాగం.
* * * *
"నాకు ఆకలి వేస్తుంది..."
ధీరజ గారాలుపోతూ అంది.
ఏమనుకున్నాడో ఏమో కారుని ఒక పక్కగా ఆపి దూరంగా కనిపిస్తున్న రెస్టారెంట్ వైపు అడుగులు వేశాడు ఏసిపి వీరేష్.
అంత వరకూ ఆ ఇద్దరీని ఫాలో చేస్తూ వస్తున్న ఇద్దరు అగంతకులు కూడా స్కూటర్ ను పార్క్ చేసి హడావిడిగా రెస్టారెంట్ లో జొరపడ్డారు.
లోనికి వస్తున్న వాళ్ళను చూడగానే ధీరజ నొసలు ముడిపడ్డాయి.
వాళ్ళను ఎక్కడో చూసిన ఫీలింగ్.
అంతలో బేరర్ రావడంతో తాత్కాలికంగా విషయం మరచిపోయి మెనూకార్డ్ ని చేతిలోకి తీసుకున్నది ధీరజ.
