Previous Page Next Page 
లేడీ కమెండో పేజి 28

"ఏమీలేదు! రాత్రి ఎవరో గూండాలు వచ్చి వెళితేనూ... ఇంత తెల్లారినా తలుపు తెరుచుకోకపోతేనూ....అనుమానం వచ్చి తలుపు తట్టాం అంతే"
ఆ వెనకే ధీరజ ఆవులిస్తూ వచ్చింది.
"మీరు ఎవరూ రాకపోయినా ఫరవాలేదు.... నా వీరూ వచ్చాడు. వాళ్ళభరతం పట్టాడు. చాలా ఇంకేమైనా చెప్పాలా?" కోపంగా అన్నది ఆమె.
చిన్నబుచ్చుకున్న ముఖాలతో తమలో తామే గొణుక్కుంటూ వెళ్ళిపోయారు.
రాత్రి బేలగా వున్న ధీరజకు... ఇప్పుడు ఎంతో ధీమాగా మాట్లాడ్తున్న ధీరజకు ఎంత తేడా వుందో నెమరువేసుకుంటూ బాత్ రూమ్ వేపు అడుగులేశాడు వీరేష్.
పదిగంటల ప్రాంతంలో...
కాఫీ, టీలు ధీరజ చేతులమీదుగా అందుకుని కారులో అఫేసుకు వెళ్ళిపోయాడు.
అప్పటివరకూ అతని కోసమే నిఘా వేసి వున్న గుబురు మీసాల వ్యక్తి పబ్లిక్ టెలిఫోన్ బూత్ లోకి ప్రవేశించాడు.
   
                      *    *    *    *
నూతన ప్రభుత్వం ఏర్పాటు అయింది.
కానీ జయచంద్రకు మంత్రివర్గంలో స్థానం లభించలేదు.
మంత్రి పదవులు ఆశించి భంగపడిన వాళ్ళందరూ ఆరోజు రాత్రినుంచే అసమ్మతికి ఆజ్యం పోశారు.
పదవులు రాని అనుమాయులు అందరూ అసమ్మతి వర్గంగా ఏర్పడ్డారు.
పరిస్థితి అర్దమయిన జయచంద్ర సీక్రెట్ గా మంత్రివర్గంలో వున్న కొందరు అసమ్మతి నేతలను కలసి తన అభిప్రాయాన్ని కూడా చెప్పి వారితో చేతులు కలిపాడు.
మంత్రిమండలి ప్రారభమయిన వారంరోజులకే జయచంద్ర ఇంటిలో రహస్య సమాలోచన జరిపి తమ భవిష్యత్ కర్యాక్రామానికి శ్రీకారం చుట్టారు.
"ఛీర్స్..."
ఒకేసారి కొన్ని గొంతులు పలికాయి.
ఆ గొంతులు అన్నీ అధికారం, హోదా,డబ్బు పలికబడి ప్రోగుచేసుకున్న పెద్ద మనుషులవి.
అతని అనుమాయులు. అసమ్మతి వాదులు సహకార మిత్రులు అందరూ ఫారిస్ లిక్కర్స్ తో నిండిన గ్లాసులన్నీ ఒక్కసారిగా పైకిలేచాయి.
పాశ్చాత్య నాగరికతలో అర్ధనగ్నంగా కనిపిస్తున్న నలుగురు యువతులు వారికి మత్తు కలిగిస్తూ, మృదువుగా సర్వ్ చేస్తున్నారు.
ఆత్మీయులులా వారి చెంతన చేరి, రొమాంటిక్ జోక్ లతో ఊరిస్తూ రెచ్చగొడుతున్నారు.
నలుగురూ ఒకర్ని మించిన అందగత్తెలు ఒకళ్ళు...
అలాంటి ఆనందమే అక్కడ వున్నవాళ్ళకు ఆ క్షణంలో కావాలి అన్న విషయం జయచంద్రకు తెలుసు. కీలక నిర్ణయాలు గట్రా అప్పుడే తీసుకునే వీలవుతుంది.
అందుకోసమే జయచంద్ర నగరంలోని అందగత్తెలను ఏరికోరి పిలిపించాడు.
ఇద్దరు అందగత్తెలు డిషెస్  సిద్ధంచేస్తున్నారు.
మరో సుందరి జయచంద్ర చెంత వుండగా, మిగిలిన యువతులు ఆహుతుల గ్లాసులను నింపుతున్నారు.
అసలు ఆ రహస్య సమావేశంలో....
అత్యంత అంతరంగికులు అన్నవారు తప్ప... చవరకి అటెండెంట్స్ సయితం బయటకు పంపాడు జయచంద్ర.
పడుపు వృత్తికి అలవాటు పడిన ఆ అందగత్తెలు వాళ్ళను సంతోషపెట్టడంలో ఏమాత్రం సంశయించడంలేదు.
ఇప్పుడు అక్కడున్న వాళ్ళందరూ జయచంద్రకు మద్దతు పలుకుతున్నవాళ్ళే!
"సి. యమ్. అయ్యే అర్హత జయచంద్రగారికే వుంది" అన్నాడు ఒకడు.
"అవును! కాబోయే ముఖ్యమంత్రి జయచంద్రగారు వర్దిల్లాలి" మరో వ్యక్తి గంతు గట్టిగా పలికింది.
వాళ్ళకు అప్పటికే స్కాచ్ మత్తు తలకెక్కింది.
జయచంద్ర దగ్గర నిలబడి వున్న అమ్మాయి మీద కొందరి కళ్ళు పడ్డాయి.
కానీ ఆమె మాత్రం అతనినే అంటిపెట్టుకుని వుండడంతో నిరాశగా పెదవులు చప్పరించుకుంటూ వుండిపోయారు.
అందరితో విడివిడిగా మాట్లాడి ఒప్పిస్తున్నాడు సత్యమోహన్.
మొత్తం యాభయ్ మంది వరకూ  ఉంటారు.
తన మాటల చాకచక్యంతో కూల్ గా, ఓర్పుగా అందర్నీ తన దారిలోకి రప్పించుకొనడంలో సత్యమోహన్ విజయం సాధించాడు.
"సక్సెస్ బావగారూ.... మన రేటుకి అందరూ ఒప్పుకున్నారు. నలుగురు మాత్రం మంత్రి పదవులతో ముడిపెడుతున్నారు"
అలాగే ఇస్తామని చెప్పు..." జయచంద్ర అన్నాడు.
క్రిమినల్ లాయర్ సత్యమోహన్ చూపులు జయచంద్ర గ్లాసు ను నింపుతున్న యువతిపై నిలిచాయి.
అతను చూస్తుండగానే జయచంద్ర బుగ్గపై ముద్దుపెట్టుకుని గ్లాసును అందించటం గమనించి బలవంతముగా తలను పక్కకు తిప్పుకున్నాడు సత్యమోహన్.
బహుశా తన బావగారి పర్సనల్ కేసు అయి వుంటుందని సరిపెట్టుకున్నాడతను.
అందరూ మత్తులో మునుగి తేలుతున్నారు.
కొందరు తెగించి అర్ధనగ్న సుందరీమణులను ఒడిలోకి లాక్కుని ముద్దులతో ముంచెత్తుతున్నారు.
"ఎలాగయితేనేం... జయచంద్ర సి.ఎమ్.అవుతున్నారు.ఆదృష్టవంతులు" అన్నాడు మరొక మద్దతుదారుడు.
"ఇందులో నా అదృష్టంకంటే మీ అందరి సహకారం ఎక్కువగా వుంది. మీ అందరకూ నా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను" అన్నాడు జయచంద్ర గట్టిగా.
ఆ క్లాంప్లిమెంట్ కు అందరూ పొంగిపోయారు.
అప్పటికే అర్దరాత్రి అయింది.
వాళ్ళను అందర్నీ తీసుకుని జయచంద్ర, సత్యమోహన్ లు పక్క గదిలోకి నడిచారు.
పార్టీ ముగియడంతో అప్పటివరకూ తమ అందాలతో, వాలు చూపులతో మత్తు ఎక్కించిన యువతులు నిష్క్రమించారు.
మిగిలిన వ్యవహారం అంతా  సీక్రెట్ గా జరుగుతుంది.
లాయర్ సత్యమోహన్ నమ్మకస్థులతో బ్లాక్ మనీని లెక్కించి పాతిక లక్షలు చొప్పున కట్టలు కట్టించాడు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS