Previous Page Next Page 
మహావృక్షం పేజి 27

"నీది వేరు శశీ! నువ్వు చదివింది మెట్రిక్. ఆ రోజుల్లో కట్నం తప్పలేదు. కానీ అనూష అలాకాదు. రేపు అది పెద్ద సర్జన్ అయ్యాక బోలెడంత సంపాదిస్తుంది బాగా చదువుతున్న పిల్ల, ఆధునిక యువతి. దాన్ని కూడా కట్నంతో తెచ్చుకోవాలనుకోవడం, పైగా నన్నేదో ఉద్దరిస్తున్నట్లు, ఆరు లక్షలు చాల్లెండి- ఎలాగా మీ తదనంతరం ఆ స్తంతా  అమ్మయిదేగా అంటే నాకు ఇల్లు మండిపోయింది...." ఫణిభూషణరావు స్వరం.
"బాగుందండి! అందులో తప్పేముంది? ఎంత చదువుకున్నా ఆడపిల్లే... మగాడే. రేపు ఆ పిల్లాడు కలెక్టర్ అవుతాడు. ఆరు లక్షలంటే చీప్... ఇద్దరూ ప్రేమించుకున్నారు కాబట్టి, వాళ్ళు ఆరు లక్షలకి ఒప్పుకున్నారు. అదే బయట ఆ అబ్బాయికి పాతిక లక్షలకి తక్కువివ్వరు."
"నా కూతురుకి కూడా మొగుడ్ని కొనుక్కునే దుస్థితి వచ్చిందా అని భాధగా వుంది భువనా! కట్నం యిచ్చి పెళ్ళి చేయడం నాకిష్టం లేదు."
"అయితే అది ప్రేమిచింన పిల్లాడ్ని కాదని ఇంకెవరికో యిస్తారా?" అంది భువన.
"వాళ్ళు మాత్రం కట్నం అడగరా అన్నయ్యా! ఇంకా ఎక్కువడుగుతారు. పిల్లాడు కాబోయే కలెక్టరు. ఈదూ, జోడూ అందంగా విన్నారు. ముఖ్యంగా ఒకరికొకరు ప్రేమించుకున్నారు. ఇంతకన్నా మంచి సంభంధం వస్తుందా చెప్పు...." ఇంకా వినలేని అనూష విసురుగా హాల్లోకి వచ్చింది.
ఆమెను చూసి ముగ్గురూ అవాకైనారు.
"ఏంటి నాన్నా! ఏంటి విషయం, వాళ్ళు కట్నం అడిగిరా?"
ముగ్గురూ ఆ ప్రశ్నలోని సూటిదనానికి బెదిరిపోయారు.
"చెప్పండి.... కట్నం అడిగారా?"
"ఏదోలేమ్మా! పెద్దవాళ్ళ మాటలు. నీ కెందుకు? నువ్వెళ్ళి చదువుకో" భువనేశ్వరీ అంది.
"ప్చ్.... నేనడిగిందానికి సమాధానం చెప్పండి. కట్నం అడిగారా?" ఫణిభూషణరావు బలవంతంగా నవ్వుతూ అన్నాడు- "కట్నం ఎం లేదు లేరా.... ఏదో గిప్ట్...."
అనూష అక్కడ నిలబడలేదు. తన గదిలోకి వెళ్లి, బ్యాగ్ తీసుకుని విసురుగా బయటకి నడిచింది.
"అనూష! ఎక్కడికే- ఇంతరాత్రివేళ...?" ముగ్గురు పిలుపులు గొంతులో  ఉండగానే ఆమె కారు రివ్వున వీధిలోకి దూసుకెళ్ళింది. కారు వేరుగా ప్రశాంత్ ఇంటికి పోనిచ్చింది. అంత రాత్రివేళ వచ్చిన అషని  చూసి ప్రశాంత్, అతని తల్లి, తండ్రి కూడా నిర్ఘాంతపోయారు అదేమ పట్టించుకోలేదు అనూష.
"ప్రశాంత్! నీతో పనుంది. త్వరగా డ్రెస్ చేసుకురా"  అంది నైట్ డ్రెస్ లో వున్న అతడితో.
"ఇప్పుడా? ఎక్కడికి?" అయేమయంగా చూశాడు.
"పనుంది" ముభావంగా అంది.
అతనికేం  అర్దంకాలేదు....
అక్కడ వాదించడం, చర్చించడం ఇష్టంలేక ఐదు నిమిషాల్లో బట్టలు మార్చుకుని, అమేవెంట వెళ్ళాడు.
కారులో అనూష ఏం మాట్లాడలేదు. గంభీరంగా డ్రైవ్ చేస్తూ నేరుగా ట్యాంక్ బండ్ మీదకి పోనిచ్చింది.
అప్పటికే అక్కడ జనసంచారం బాగా తగ్గిపోయింది.అక్కడక్కడా కొన్ని జంటలు మాత్రం చాలా సన్నిహితంగా కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నారు.
ఐస్ క్రీమ్స్ బండ్లవాళ్ళు, చాట్ బండ్లు అక్కడక్కడా వున్నాయి. కొంచెం దూరంగా లైట్ల వెలుగు ప్రతిఫలిస్తున్న హూస్సేన్ సాగర్ లో నీళ్ళు అందంగా కనిపిస్తున్నాయి.
గాలి చల్లాగా వీస్తుంది. అప్పుడప్పుడూ వాహానాలు రోదచేస్తూ వెళ్ళిపోతున్నాయి.
"ఏంటి అనూ! అలా వున్నావేం_?" మృదువుగా అడిగాడు ప్రశాంత్.
అనూష కొన్నిక్షణాలు మాట్లాడకుండా వుండి, సన్నగా నిటూర్చీ అడిగింది. "మా వాళ్ళు మీ ఇంటికి వచ్చినప్పుడు నువ్వెక్కడ వున్నావు?"                              


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS