"నాకు వెంటనే ఫోన్ చేయాల్సింది.." చెప్పాడు అంకిత్.
"వెంటనే పహోన్ చేద్దామనుకున్నాను భయ్యా... కానీ ఈలోగానలుగురు దున్నపోతుల్లాంటి మనుషులు నన్ను ఢీకొట్టడమే కాకుండా, న శాలువా కిందపడేలా చేశారు. చచ్చినోళ్ళు... కనీసం శాలువా అయినా తీసిచ్చి 'సారీ' చెప్పచ్చుగా... హు చెప్పిఉ చస్తేనా కంత్రీవాళ్ళు... అందుకే పది నిమిషాలు శాపనార్ధాలు పెట్టా, నీకు తెలియదు భయ్యా... మేటిమలు కూడా విరిచా... ఇలా... అంటూ తనెలా మెటికలు విరిచాడో విరిచి చూపించాడు.
"అంటే, అందుకే లేటయిందా?"
"అవును భయ్యా... లేకపోతే ఎప్పుడో ఫోన్..." రాహుల్ మాటలు పూరేటి కాలేదు. అంకిత్ రాహుల్ శాలువాని తీసి, రోడ్డు మీద వేసి కసి కొద్దీ కాళ్ళతో తొక్కి...
"వెధవ శాలువాకు కక్కుర్తిపడి, నాకు లేట్ గా ఇన్ఫర్మేషన్ అందిస్తావా? నీకు మేటిమలు విరవడం, శాపానార్దాలు పెట్టడం ఇంపార్టెంటా?" తిట్టిపోశాడు అంకిత్.
"భ...య్యా..." పెద్ద గావు కేక పెట్టి, రోడ్డు మీద పడి వున్న తన శాలువా తీసుకుని, "నా శాలువాతో ఎన్ని ఆటలు ఆడుకుంటున్నారు భయ్యా... ఛఛ...ఇవ్వాళ పొద్దునే ఎవరి మొహం చూశావో... ఉదయం నుంచీ నా శాలువ నా భజం మీద కాకుండా రోడ్డు మీదే ఉంటోంది."
"చాల్లే.... వెధవ శాలువా నువ్వునూ... అయినా నువ్వు ఒక్క ఎపిసోడ్ అయినా అసిస్టెంట్ డైరెక్టర్ గా నైనా చేశావా, కనీసం క్లాస్ అయినా కొట్టావా? గొళ్ళెం సన్మానసంస్థకు అయిదొందలు తగలేసి, కప్పిమ్చుకున్న శాలువనే కదా... మరో గొట్టంగాడితో ఇంకో శాలువా కప్పిస్తాన్లె" విసుగ్గా అన్నాడు అంకిత్.
"శాలువా అచ్చిరాలేదు భయ్యా... గోగాలి కప్పిమ్చు... దురద సన్మానసంస్థ వాళ్ళతో మాట్లాడితే సారి" ఉస్తాహంగా అన్నాడు రాహుల్ సిట్యుయేషన్ ని అర్ధం చేస్కోక.
అప్పటికే అంకిత్ మొహంలో సీరియస్ నేస్ ని చూసి నోర్ముసుకున్నాడు రాహుల్.
***
చేతన్ స్కూటర్ ఒ పక్కన ఆపి, పుట పాత కు ఒ పక్కగా నిలబడ్డాడు. కెమెరా చేతిలోకి తెసుకున్నాడు. కెమెరా 'యూ' లో నుంచి చూడసాగాడు.
అప్పుడప్పుడే జన సంచారం మొదలైంది. చేతన్ అమ్మాయిలను జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తున్నాడు. సరిగ్గా అప్పుడు ఒ అమ్మాయి పరుగెత్తుకు వస్తోంది.
జాగింగా? రన్నింగ్ రేసా? ఒక్క క్షణం అర్దంకాలేదు చేతన్ కు. జాగ్రత్తగా పరిశీలించి ఉల్లిక్కిపడ్డాడు. ఆ అమ్మాయిని ఎక్కడో చూశాడు. ఎక్కడ చూశాడు.
వాలెంటైన్ డే... స్టూడియో... ఘాంటింగ్... యస్... అ అమ్మాయి... మృదువని... వెంటనే ఎగరిగంతెయాలని అనిపించింది చేతన్ కు.
కెమెరా ను భాజనికి తగిలించుకుని, మృదువని దగ్గరకు వెళ్ళబోయాడు. అప్పటికే అతన్ని రాసుకుంటూ ముందుకు పరుగెత్తింది మృదువని.
"హాలో... మేడమ్... మృదువని గారూ..." అంటూ ఆమె వెనగ్గా పరుగెత్తబోయాడు. అప్పుడే అతణ్ని ఒ పక్కకి నెట్టి, ముందుకు కదిలారు షంషేర్ దాదా మనుషులు.
***
టాంక్ బండ్ దగ్గర నిలబడ్డారు ఆ ముగ్గురూ.
"సార్... ఆ అమ్మాయి స్పీడుగా పరుగెత్తింది. ఐ థింక్... ఆ అమ్మాయి పరుగు పందెంలో పాల్గొంటుందేమో... ఎలాగైనా గెలవాలని స్పీడుగా పరుగెత్తినట్టు ఉంది. ఆమె వెనగ్గా కూడా చాలా మంది పరుగెత్తాడు."
"పరుగు పందెం కాదు, బహుఉశా స్పీడుగా జాగింగ్ చేస్తుందేమో..." రాహుల్ అన్నాడు.
అంకిత్ మాట్లాడలేదు. ఆలోచిస్తున్నాడు. మృదువని ఎందుకు పరుగెత్తింది. రాహుల్ కు, చేతన్ కూ పరుగేడ్తూనే కనిపించింది.
మృదువని కావాలనే ఇదంతా చేస్తోందా? ప్రాక్టికల్ జోక్ కాదు కదా... ఎంత ఆలోచించినా, అతనికి మృదువని ఒక మిస్టరీలానే అనిపిస్తుంది.
మృదువని నిజంగానే ఒక మిస్టరీ... అని అ క్షణం అంకిత్ కు గానీ, అతని ప్రెండ్స్ కు గానీ తెలిసే అవకాశం లేదు.
