తలుపులు తెరిచే వున్నాయి. గది మధ్య ఓ చెయిర్ కు అలియాకాన్ కట్టి వేయబడి వున్నాడు. అతని పెదవులు చిట్లి రక్తం కారుతోంది. అతనికి చెరోప్రక్క యిద్దరు సాయూదులైన వ్యక్తులు వున్నారు.
భస్మ అ గదిలోకి నడిచాడు.
అడుగుల శబ్దం విన్న ఆ సాయుధులు భస్మను చూసి ఆశ్చర్య పోయారు.
ఆ భవనంలోకి రావతమేమ్త కష్టమో తెలుసు. డాబర్ మెన్ లను దాటి వచ్చాడంటే... వాళ్ళు తుఫాకులు భస్మ వైపు ఎక్కుపెట్టారు.
భస్మ అంతకన్నా వేగంగా ముందుకు కదిలి, వాళ్ల చేతుల్లోని తుఫాకులు లాక్కున్నాడు.
వాళ్ళు ఎదురు తిరగబోయెంతలో...
వాల్లిద్దరీ ఒడిసి పట్టుకుని వాళ్ల గొంతు చూట్టూ తన చేతులు బిగించాడు భస్మ.
దృఢమైన ఆ సాయుధులు, ఎంతో శిక్షణతో రాటుదేలినవాళ్ళు భస్మ చతుల్లో విలవిల్లాడి, కాసేపట్లో తలలు పక్కకు వాల్చారు.
వాళ్ళని నేలమీదకి జారవిడిచాడు.
అలియఖాన్ ఈ శబ్దానికి కళ్ళు విప్పాడు.
నేల మీద ప్రాణాలు కోల్పోయినవాళ్ళను చూసాడు.
అతనికి అర్దమైంది...
తనను రక్షించటానికి ఖాన్ అతడ్ని పంపాడని.
"షుక్రియా దోస్త్... బహుత్ షుక్రియా... అవో.. నా కట్లు విప్పదీయ్..." అన్నాడు అలియాఖాన్ సంతోషంగా.
భస్మ అతని ఎదురుగా నిలబడి తల వంచి తన మూడో కన్ను తెరిచాడు.
అతని శరీరం క్రమక్రమంగా ఎరుపు వర్ణంలోకి వస్తోంది.
"ఏయ్... ఏం చేస్తున్నావు?" అని కంగారుగా అరిచాడు అలియాఖాన్
అప్పటికే తెరిచినా అతని మూడో కన్నులోనుంచి విద్యుత్ కిరణాలు సూటిగా వెళ్ళి అలియాఖాన్ తాకాయి.
ఒక్కసారిగా గిలగిలా కొట్టుకున్నాడు అలియాకాన్ యాసిడ్ పోసినట్టు... అతని శరీరం బాగా భాగమంది.
క్షణాల్లో... అతని శరీరం ముద్దగా మారి బూడిడిగా మారిపోయింది. కుర్చితో సహా... చూస్తుండగానే.
భస్మ తాఫీగా వెనక్కి తిరిగాడు. అతని మూడో నేత్రం మూసుకుని యాదావిదిగా మారింది. అతనిలో అప్పుడు కూడా ఏ భావామూ లేదు.
ఎరుపు రంగులోకి మారిన అతని శరీరం పూర్వపు రంగులోకి మారింది. అ ఘోర దృశ్యానికి ఆ పాడు బడిన భవనం సాక్షీభూతంగా మిగిలింది.
దాంతోపాటు ఆ గది పై కప్పు కు రహస్యంగా అమర్చిన వీడియో కెమెరా కూడా.
***
కమిషనర్, కౌశిక్ మాత్రమె వున్నారా ఛాంబర్ లో. ఎదురుగా టీవీ, వీసిఅర్ వుంది.
పాడుబడిన భవనంలో అలియాఖాన్ వుంచిన గదిలో జరిగిన దారుణ బృస్యం అంతా ఆ విదోయో కెమెరాలో రికార్డ్ యింది.
"మైగాడ్..." అదంతా చూసి అన్నాడు కమిషనర్.
మరుసటి రోజు ఉదయమే ఆ పాడుబడిన భవనానికి వెళ్ళిన కమిషనర్ కు అలియాఖాన్ బూడిద కనిపించింది. డాబర్ మెన్ లు చనిపోయి వుండడం కనిపించింది.
విపరీతమైన కరెంట్ శాక ఆటో కుక్కలు చని పోయినట్టు ఎక్స్ పార్ట్స్ నిర్దారణ చేశారు. అతి రహస్యంగా అలియాఖాన్ ని బందిచినా ప్రయోజనం లేకపోయింది. ఉదయం పడి గంటల ప్రాంతంలో వేదియో కెమేరాతో వచ్చాడు సిబీఐ ఏజంట్ కౌశిక్.
"కమిషనర్ గారూ... నేను చెప్పానుగా, ఖాన్ ని తక్కువగా అంచనా వేయవద్దని. ఆ ఖాన్ భస్మ ను అయూధంగా మార్చి అలియాఖాన్ ని చంపేశాడు. అలియఖాన్ అవసరం ఖాన్ కు లేదు. అందుకే ఫినిష్ చేశాడు.
నాకు మొదట్నుంచీ అనుమానంగానే వుంది. మీకు తెలియకుండా నేను ఆ గదిలో వేదియో కేమేరా అమర్చాను. వేరే ఇంపార్టెంట్ వర్క్ వాళ్ళ నేను ఆ భవనం దగ్గర వుండలేకపోయాను.
మరో విషయం, అలియఖాన్ మీ కేసులో ఉపయోగపడే వ్యక్తి కూడా కాదని దగ్గర అర్దమైంది. ఎనీహో... భస్మ రూపురేఖలే కాదు... సైన్స్ కు అందని మిరాకిల్ మన కాళ్ళ ముందు కనిపిస్తోంది.
కుక్కలు చనిపోవడానికి కారణం కూడా భస్మనే. అతని శరీరమే ఓ విద్యుత్ కేంద్రమైంది. అతని కన్నుల్లోంచి విద్యుత్ కిరణాలు అలియాఖాన్ కి తగలగానే... బూడిదైపోయాడతను.
తల గిర్రున తిరుగుతున్నా ఫీలింగ్ కలుగుతోంది కమిషనర్ కు.
"మీరే చెప్పండి మిస్టర్ కౌశిక్... ఏం చేద్దామంటారు? మా ఫోలీసులు మీ వెనక వుంటారు... మీరే డెసిషన్ తీసుకున్నసరే..."
"మీ నమ్మకాన్ని వమ్ము కానివ్వను కమిషనర్ గారూ... నిన్న రాత్రే చాలమంది సైంసిస్ట్ లను మీటయ్యాను. మరి కోట మందికి ఫోన్ ద్వారా కన్సల్ట్ చేశాను.
వాళ్ళు ఆ కేసును పూర్తిగా స్టడీ చేయాలన్నారు. ఇలాంటి కేసు ఫస్ట్ టైం కాబట్టి వాళ్ళూ ఆలోచిస్తున్నారు. మనిషి శరీరంలోనే విద్యుత్ వుంటుందట.
అయితే కొందరి శరీరాలు విద్యుత్ మయం ఎలా అవుతాయో శాస్రీయంగా నిరూపణ కాకపోయినా వాళ్ళని కరెంట్ మనిషిగా మార్చే పక్రియ సైన్స్ సాధించింది.దురదృష్టంఏమిటంటే, దాన్ని దేశ వినాశాననికి వినియోగిస్తున్నారు.
ఈ పరిస్థితిలో దీనికి మార్గం ఒక్కటే.." అని ఆగాడు కౌశిక్.
"చెప్పండి..." కమిషనర్ ఆతృతగా అన్నాడు.
"మన సైంసిస్ట్ భరద్వాజ ని వెంటనే 'ట్రేస్ అవుత' చేయాలి అదీ వితిన్ ట్వంటీ ఫోర్ అవర్స్ లో..." చెప్పాడు కౌశిక్.
"మీరు చెప్పిన వివరాలప్రకారం ఎంక్వయిరీ చేయించాను. యింకా ప్రోగ్రస్ లేదు." అన్నాడు నిరాశాగా పెదవి విరుస్తూ కమిషనర్.
"అల్ రైట్... మీరు మీ ప్రయత్నాలు చేయండి... నేను నా వైపు నుంచి ప్రయత్నిస్తాను" అంటూ లేచి కమిషనర్ దగ్గరకి వచ్చి_
"బట్... రిమెంబర్ వన్ థింగ్... ఈ విషయం బయటకు పోక్కకూడదు." అన్నాడు కౌశిక్.
"సరే" అన్నట్టు తలూపాడు కమిషనర్.
'ది న్యూస్' పత్రికాఫేసు ముందు తన బైక్ ని ఆపి పక్కనే పార్కింగ్ ప్లేస్ లో వెహికల్ ని పార్క్ చేసి లోపలకి నడిచాడు.
