Previous Page Next Page 
మిస్టర్ 'యూ' పేజి 28

 

    చటుక్కున వెనక్కి తిరిగాడు రాజు.
    సృష్టి వున్న టెంటు వైపు పరిగెత్తడం మొదలెట్టాడు.
    

                          *    *    *

    అలికిడి విని వెనక్కి తిరిగి చూశాడు బాబూ సేట్.
    అతని వెనక హీరోయిన్ నగ్మ నిలబడి వుంది.
    "నగ్మా!" అన్నాడు బాబూ సేట్ , దొరికిపోయిన దొంగలాగా చూస్తూ.
    "అంతా చూస్తూనే ఉన్నాను " అంది నగ్మ. ఆమె చూపులు మంచు కత్తుల్లాగా వున్నాయి.
    "చూడు చూడు! ఇట్లాంటి అందం మూడు లోకాలు గాలించినా దొరుకుతుందేమో!" అన్నాడు తేరుకున్న బాబూ సేట్ , చులకనగా నవ్వుతూ.
    "నిన్న  రాత్రి మీరు నాతో చెప్పింది ఏమిటి ?
    నాకన్న అందమైన అమ్మాయి ఈ ముల్లోకాల్లోనూ ఉండదని కాదూ?" అంది నగ్మ ఆగ్రహంతో వణికిపోతూ.
    "కల్ కీ రాత్ గయీ - కల్ కీ బాత్ గయీ -- నిన్నటి రాత్రి గడిచిపోయింది -- నిన్నటి మాటలూ మరిచిపోయాను . వదిలేయ్!"
    "నా పొజిషన్ ఏమిటి ?"
    "కధ మార్చేస్తున్నాం - నువ్వు సెకండ్ హీరోయిన్ కావచ్చును. లేదా సిస్టర్ కేరక్టరూ కావచ్చును.
    "సిస్టర్ కరెక్టరు అంత సెక్సీగా వుంటుందా?"
    విరగబడి నవ్వాడు బాబూసేట్.
    "హీరో కి సిస్టరయినంత మాత్రాన లోకానికంతా సిస్టరా ఏం?"
    "సిస్టర్ కారెక్టర్లు వేయడానికెనా నేను మెడిసన్ చదువు మానేసి సినిమాల్లోకి వచ్చింది "
    "డాక్టరు కాబోయి యక్టరు అయ్యానని చెప్పడం అందరికీ వాడుక. నువ్వు వెరైటీ కోసం, హీరోయిన్ని కాబోయి సిస్టర్ కారెక్టర్లు వేస్తున్నానని ప్రెస్సు వాళ్ళకి ఇంటర్యూ లలో చెప్పుకోవచ్చును " అన్నాడు బాబూ సేట్ , లోకంలోని దుర్మార్గం అంతా తనలోనే గూడు కట్టుకున్నట్లుగా.
    స్థిరంగా అంది నగ్మ "నేను మెడిసిన్ లో బ్రిలియంటు స్టూడెంట్ ని మిస్టర్ బాబూ సేట్! మెడిసన్ పూర్తి చేసి ఉండకపోవచ్చును గానీ సగం డాక్టర్ ని . నా టాలెంటు అంతా ఈ అమ్మాయి కోసం ఉపయోగిస్తాను. చెప్పు ఏం చేశావ్ . తనకి ఫెదిడిన్ ఇంజక్షన్ ఇచ్చావు కదూ.
    "కనిపెట్టేశావే !"
    "ఒక్క ఇంజక్షనే ఇచ్చావా?"
    "అడోసు చాలు "
    "నేను ఇంకో అరడజను అవే ఇంజక్షన్లు ఇస్తాను .
    "ఎందుకు ?"
    "ఎందుకంటే -- ఐ వాంట్ టు కిల్ హర్!"
    "సృష్టిని చంపుతావా?"
    "యా! నీ గ్రిప్పులో చిక్కుకుని , నాలాగా అన్యాయమైపోయేదాని కంటే చనిపోవడం వెయ్యి రెట్లు బెటరు"
    కోపం ఆపుకోలేక , ఈడ్చి నగ్మ మొహం మీద కొట్టాడు బాబూ సేట్.
    ఆ దెబ్బకు ఆమె విరుచుకుపడిపోయింది. స్పృహ తప్పింది.
    రొప్పుతూ ఒకసారి ఆమె వైపుకు చూసి, తర్వాత తను షూట్ చేసిన సృష్టి అందాలను వీడియోలో చూడడం మొదలెట్టాడు బాబూ సేట్.
    ఆశ్చర్యం !
    వీడియో బ్లాంక్ గా ఉంది.
    అతను షూట్ చేసిన దాన్లో ఒక్క సీను కూడా అందులో కనబడటం లేదు.
    అప్పుడు హటాత్తుగా తల మీద ఒక్కసారిగా ఎవరో సుత్తితో కొట్టినంత బాధ కలిగింది బాబూ సేట్ కి.
    ఒక్కసారి తల విదిలించాడు బాబూ సేట్.
    తక్షణం -
    తలలో ఒక అగ్నిపర్వతం ఫేటేలున పేలినట్లు -
    మరుక్షణంలో -- గుండెల్లో గునపాలు దిగేస్తున్నట్లు పాదాలు భూమిలోకి కూరుకుపోతున్నట్లు , నరనరాలనీ నల్లులు కుడుతున్నట్లు చెప్పలేని బాధ ........
    అంత బాధలోనూ --
    వెనుక నిలబడిన ఎవరో నిర్ధాక్షిణ్యంగా నవ్వుతున్నట్లుగా తెలుస్తోంది.
    అతికష్టం మీద తల వెనక్కి తిప్పి చూశాడు బాబూ సేట్.
    వెంటనే --
    అతను భయ భ్రాంతుడయ్యాడు.
    "ఎవరు నువ్వు ....ఏమిటి ?" అన్నాడు హీనస్వరంతో .
    "ఇది మీ సినిమా ట్రిక్ ఫోటో గ్రఫీ కాదు -- ఇది రాక్షస మాయ!" అన్నది అస్వరం .
    అది మనిషి గొంతులా లేదు.

        
                         *    *    *

    "నువ్వు చేసినపని హీరోయిజమా! వెర్రితనమా?" అంది సృష్టి చిరుకోపంగా .
    "ఏం చేశాను ?"
    "ఒక అమ్మాయి ప్రాణం రక్షించడం కోసం నీ జీవితాన్ని పణంగా పెట్టేస్తావా?"
    "అది ఒక మనిషిగా నా బాధ్యత " అన్నాడు రాజు.
    చురుగ్గా చూసింది సృష్టి.
    "నీకు బాధ్యతలు తప్ప భావాలు లేవా?"
    "అంటే?" అన్నాడు రాజు.
    దీనికి సమాధానం చెప్పకుండా.
    "నీ కేనేళ్ళూ?" అని అడిగింది సృష్టి.
    "ఇరవై అయిదు . ఏం?"
    "ఏమీ తోచక వూరికే ఆడిగాలే !" అంది సృష్టి నవ్వుతూ.
    "మరి నీ డేట్ ఆఫ్ బర్త్ ఎప్పుడూ ?" అన్నాడు రాజు.
    "ఏం ! గ్రీటింగ్స్ పంపిస్తావా?"
    ఆడపిల్లని గనక పుట్టిన సంవత్సరం చెప్పను గానీ నెలా, రోజూ చెప్తాలే.
    జనవరి ఫస్టు .
    ఒక్క క్షణం అలోచించి "అయితే నీకు న్యూఇయర్ గ్రీటింగ్స్, బర్త్ డే గ్రీటింగ్స్ ఒకేసారి పంపవచ్చు " అన్నాడు రాజు. 


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS