Previous Page Next Page 
చాటు పద్యమణి మంజరి పేజి 28

 

    ఎల్లప్పుడును సుకవి సూక్తి రసాస్వాదన తత్పరుఁడుగా నుండు నీ పెద్దిభట్టు స్త్రీ వర్ణనమున మంచి మంచి శ్లోకములను జదువుచుండఁగా వినుచున్నదై యాతని యిల్లా లోకనాఁ డిట్లు వేఁడికొన్నదట. "వారిని వారిని వర్ణించిన శ్లోకములను జదువుడురే గాని నన్నోకనాఁడైన వర్ణింపరైతిరి గదా!" యని. నాఁడిట్లు  వర్ణించినాఁడు పెద్దిభట్టు.
       శ్లో||    మేరుమందర సమానమధ్యమా త్రింత్రిణీదళవిశాలలోచనా
        అర్కశుష్క ఫలకోమలస్తనీ పెద్దిభట్ట గృహిణీ విరాజితే    244

        గ్రంధ వ్యాఖ్యానదీక్షతోఁ గాలమెల్లఁ గడపుచుఁ బెద్దిభ ట్టింటివని నంటీంచుకొనకుండెను. ఇత్యర్దః, ఇతిభావః అనుచు నీయన కూరుచుండుట వలన నిల్లాలికి గృహనిర్వాహము దుష్కర మగుచుండేను. ఒకనాఁ డొక యాప్తవిద్వాంసుఁ డతిధియై యింటికి రాఁగా నేఁడేమి కూరగాయలు వండేదవని పెద్దిభట్టు భార్య నడిగెను. ఆమె యిట్లు బదులు చెప్పెను." "ఇత్యర్ధముల కూర - ఇతిభావముల పులుసు- వండెదను. మీరింటి నిండ నించుచున్న పదార్ధము లివే కదా!"
    ఈతఁడు శ్రీ హర్షనైషధమునకు వార్ధక్యమున వ్యాఖ్య గావింపనారంభించెను. జీవిత సంశయముచేఁ దొందర తొందరగా రచించుట చేత నా వ్యాఖ్య యపర్యాప్తకముగా నుండెను. అది చూచి యొక పండితుఁడింత లఘువుగా రచించుచున్నా రేమని యడుఁగగా "మాఘే మేఘే గతం వయః"
    (మాఘమున , మేఘ సందేశమున వయస్సు కడచెను) అని పెద్ది భట్టు బదులు చెప్పెను. ఇట్టి కధలు మరికొన్ని యున్నవి.

    
                      బాణుఁడు

    ఈతఁడు క్రీ|| 8. వ శతాభ్దినాఁడు హర్షవర్ధనుఁడను రాజునాస్థానమున నుండి కాదంబర్యాది దివ్య గ్రంధముల రచించిన మహా కవి. ఈతఁడు మరణింపఁగా నీతని మిత్రుఁ డింకొక కవీశ్వరుఁడు చెప్పిన శ్లోకము.

    శ్లో||  ధ్వస్తః కావ్యోరుమేరుః కవివిపణిమహారత్న రాశి ద్విశీర్ణః
        శుష్కశ్శబ్దౌఘసిందుః ప్రళయ ముపగతో వాక్యమాణిక్యకోశః
        దివ్యోకీైనాం నిధానం నిధన ముపగతం హా హతా దివ్యవాణి
        బాణే గీర్వాణవాణీ ప్రణయిని విధినా శాయితే దీర్ఘనిద్రామ్.    245
    
    
                        కపర్దిస్వామి

    ఈతడు మల్లినాధుని వంశమునఁ బూర్వుడట

    శ్లో||  అంబా కువ్యతి సమయా
        నస్నుషయా సాపి నాంబయా సమయా
        అహమపి నతయా నతయా
        వద రాజ కస్య దోషోయమ్.        246

    
                  శాకల్య మల్లుభట్టు
        
    ఈతఁడు రామాయణ యుద్దకాండ శేషమును పూరించిన యయ్యలార్యుని బంధువు. విద్యానగరపు హరిహర రాయల సమకాలపువాఁడు.

    శ్లో||    ఏకో భూత్పులినా త్తతస్తు నలినా చ్చాన్య పి నాకోరభూత్
        ప్రాచ్యాస్తే త్రయఏవ దివ్యకవయో దీవ్యస్తు దేవ్యా గిరా
        అర్వాంచొ యది గద్యపద్యరచనా చాతుర్యవాగుద్దతా
        స్తాన్సర్వా నతిశయ్య ఖేల తితరాం శాకల్యమల్లః కవిః    247

        అహో నారద శక్ర కిం క్వను గతో భూలోక మాలోకితుం
        కో రాజా భువి విక్రమీ హరిహరో ధత్తే కియన్మండలమ్
        అపూర్వర్ణవ మాపరార్ణవ     ...    ....

        పూర్ణ స్తత్కవయో గజేంద్రవిజయీ శాకల్యమల్లః కవిః    248

         అభ్యుద్దృతా వసుమతీ దళితోరివర్గః
        క్రోడీకృతా బలవతా బలిరాజలక్ష్మీః
        ఏకత్రజన్మనికృతం యదనేన యూనా
        జన్మత్రయే తదకరోత్ పురుషః పురాణః        249

                             లొల్లవారు

    వీరిలోఁ గడపటి వాఁ డగులక్ష్మీ ధరుఁడు బహు మహా గ్రంధకర్త. గజపతి వ్రతావరుద్రునియు శ్రీకృష్ణ దేవరాయలయు నాస్థానులలో విద్వత్కవిగా మండినవాఁడు.


    శ్లో||    శేషా శేషో క్తిభూషాః కణచరణ చణగ్రంధ సౌగంధ్య జిఘూ
        భట్టోక్తి ప్రౌడిలీఢా గురుగురుతరగీ ర్గుంభశుంభద్విజ్రుంభాః
        నిశ్శంకా శ్శంకరోక్తౌ పశుపతి మతనిర్వాహకా స్సాంఖ్యసఖ్యా
        యస్సశ్రీలొల్లలక్ష్మీ ధర విబుధమణే ర్భాంతి వాచాం నిగుంభాః   250

    శ్లో||    వయమిహ పదవిద్యాం మంత్ర మాన్విక్షకీం వా
        యది వధి విపధే వా వర్తయామ స్సపంధాః
        ఉదయతి దిశి యాస్యాం భానుమా సైవ పూర్వా
        నహి తరణి రుదీతే దిక్ప రాధీనవృత్తిః        251

    శ్లో||    సాయం సంపుల్లమల్లీ సుమసురభి సుధా మాధురీ సాధురీతిః
        ప్రేంఖత్పుంఖాను పుంఖ స్పురదమసరి ద్విచివాలవాచః
        లొల్ల శ్రీలక్ష్మణాభ్యో గుణమణి జలది ర్భాసతే భూసురాళీ
        కేళీనాళీకపాళీ దశశతకిరణో విద్వచగ్రేసరో సౌ.    252

    శ్లో||    యః కర్ణాటవసుంధరాధిప మహాస్థానే సువర్ణాయితో
        యో విద్వన్ని కషాయితో నృపగృహి వేమాఖ్య పృధ్వీశితుః
        శ్రీమల్లోల్లట భట్ట శిష్య యితి యో లోల్లాఖయ్యా శ్రూయతే
        శ్రీశేషాన్వయ శేఖర స్స హి మహాదేవో వివశ్చి న్మహా    253

    శ్లో||    నికషాయితు మీహే వా సువర్ణాయితు మేవ వా
        సువర్ణాయితు మేవే హే నికషో న హ్యలంక్రియా    254

    శ్లో||    తర్కన్యక్కృత వావదూకనిచయం వాదిత్వ మాస్తాం మమ'
        వ్యాఖ్యాతృత్వ ముదారశిష్యనివహ శ్లాష్యం తధా తిష్టతు
        స్వర్లోకాచ్ చవ్యమానసిద్దతటిని కల్లోలసల్లాపినా
        ముల్లాసావచసాం న కస్య మనసాం మత్కా శ్చమత్కారిణః   255

    శ్లో||    గతోయం శంకరాచార్యో వీరమాహేశ్వరో గతః
        షట్చక్రభేదనే కో వా జానీతే మత్పరిశ్రమమ్      256


            జగన్నాధపండిత రాయలు
    
       ఈతఁడు క్రీ. 1650 ప్రాంతము వాఁడు.

    శ్లో||  కవయతి పండితరాజే కవయ న్త్యన్యీ పి విద్వాంసః
        నృత్యతి పినాకపాణౌ నృత్య న్త్యన్యేపి భూతవేతాళాః    257

    శ్లో||  మధుర్త్యే రపి దుర్త్యే ర్ద్రాక్షాక్షి రేక్షుమాక్షి కాదీనామ్
        వన్ద్య్గేవ మాధురీయం పండిత రాజస్య కవితాయాః    258

    శ్లో||  గిరాం దేవీ వీణాగుణరణనహీనాదరకరా
        యదీయానాం వాచా మమృతమయమాచామతి రసమ్
        వచస్తస్యాకర్య్న శ్రవణసుభగం పండితవ తే        
        రాధున్వ స్ముర్ధానం నృపశు రధ వాయం పశుపతిః||    259

    శ్లో||  మధుద్రాక్షా సాక్షాదమృత మధ వామాధరసుధా
        కదాచిత్కేషాంచి త్ఖలు హి విదధీరన్న పి ముదమ్
        ధ్రువం తే జీవన్తో వ్యహాహ మృతకా మస్దమతయో
        న యేషా మానన్ధం జనయతి జగన్నాథ భణితిః||    260

    శ్లో||  డిల్లీశ్వరో వాజగదీశ్వరో వా
        మనోరధా పూరయితుం సమర్ధః
        అన్త్యేర్నృపాలైః పరిదీయమానం
        శాకాయ వా స్యాత్ లవణాయ వా స్యాత్||    261

    శ్లో||  నిర్మాణే యది మార్మికోసి నితరా మత్యంతపాక ద్రవ
        మృద్వీకా మధుమాధురీ మధువరీ హరోద్దురాణాం గిరామ్
        కావ్యం తర్హి సఖే సుఖేన కథయ త్వం సమ్ముఖే మాదృ శాం
        నోచేద్దుష్కృత మాత్మనాకృతమివ స్వాంతాద్బహి ర్మాకృథాః||  262

    శ్లో|| యవనీ నవనీత కోమలాంగీ
        శయనీయం యది యాతి చే త్క దాచిత్
        అవనీతల మేవ సాధు మన్యే
        నవనీ మాఘవనీ వినోద హేతుః ||        263


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS