అనూషకి తల్లీ మాటలతో పోయిన ధైర్యం వచ్చింది.
"ఏమ్మా... నువ్వేమంటావ్?" అడిగాడు భూషణరావు.
నెమ్మదిగా అంది అనూష. "కనీసం పి.జి. అన్న పూర్తియితే బాగుంటుందిగా నాన్నా...."
"ఏ వయసులో అనుభవించాల్సింది ఆ వయసులో అనుభవించాలి అనూషా. పెళ్ళి పి.జి.కి ఆటంకం అనుకుంటే ఎలా?"
అనూష మాట్లాడలేదు.
"మౌనం అంగీకారం అనుకోవాలా?" అడిగిందావిడ.
"తనని అలోచిమ్చుకోనీ.... బలవంత పెట్టకు" అన్నాడాయన.
అన్నట్టుగానే, రెండు రోజులు ఆలోచించుకోడానికి టైం ఇచ్చి మళ్ళీ అడిగింది భువనేశ్వరీ.
"ప్రశాంత్ తో మాట్లాడి చెప్తానమ్మా" అంది..." అమ్మా నా పెళ్ళికి తొడర పడుతోంది ప్రశాంత్!"
"అదేంటీ? నువ్వు తొందరపడాలిగానీ, మీ అమ్మా..."
"జోక్ లొద్దు... సీరియస్ మాటర్. మొన్న మనిద్దరి ముద్దు శ్ర్ర్న్ చూసింది... ఆవిడకి భయం పట్టుకుంది."
"ఏం, నీకు వాంతులు మొదలవుతాయోమోననా?"
"ఏయ్ కమాన్! బి సీరియస. నీ అభిప్రాయం ఏంటి? పెళ్ళి అయ్యాక మన చదువులు కంటెన్యూ చేద్దామా?" ప్రశాంత్ చట్టుక్కున ఆమెని దగ్గరకు లాక్కుని... "త్వరగా ముహుత్రం పెట్టించమని చెప్పు. నేను ఇంక ఆగలేక పోతున్నాను."
"ఛ.... ఎప్పుడూ ఒకటే గొడవ. సరే అయితే నువ్వు కూడా అమ్మావాళ్ళ తో మాట్లాడు."
"నేను కాదు. మీ అమ్మగార్ని, నాన్నగార్ని మాఇంటికి వచ్చి,ఆడపిల్ల తల్లీతండ్రులుగా వాళ్ళని సప్రదించమని చెప్పు.... అదీ ఆచారం."
అనూష చిత్రంగా చూసింది. "ఈ ఆచారంపట్ల ఎవరికీ ఇంత గౌరవం? నీకా? మీ వాళ్ళకా?"
"వాళ్ళకే. నేను చెప్పకపోతే చెప్పలేదంటావని చెప్తున్నా.... కొన్ని పద్దతి ప్రకారం పోతేనే మంచిది... మన పరమ పెళ్ళికి బ్రేక్ పడకుండా వుంటుంది."
సన్నని ముల్లులా గుచ్చుకున్న మాటకి, ఈ మాట ముళ్ళు తీసినట్లు అనిపించింది...
"ఓ.కే... అమ్మకూడా అదే అంది. మంచిరోజు చూసి వస్తార్లె."
"షటప్...పద వెడదాం. నీకు ఎగ్జామ్స్ దగ్గరికోస్తున్నాయి. చదువుకోవా?"
"చెప్పాగా మనం చదువుకోంటాం. ఓ సారీ..." నాలిక కొరుక్కుని అన్నాడు. "అదే... చదువుకుంటాను అని..."
అనూష సీరియస్ గా చూసింది.
"అబ్బా! అలా చూడకు... భస్మమైపోతాను."
తల పంకీస్తూ అంది. జాగ్రత్త... పిచ్చి వేషాలేసవంటే... నా సంగతి తెలుసుగా?"
నవ్వాడు ప్రశాంత్.
రెండు రోజుల తరువాత, దశమి, గురువారం, వర్జం లేకుండా చూసి, భువనేశ్వరీ, పణిభూషణరావులు, ఆయన చెల్లెలు శశిరేఖను పిలిపించి, ముగ్గురూ కలిసి ప్రశాంత్ ఇంటికి వెళ్ళారు.... లాంఛనంగా తమ కూతుర్ని వాళ్ళబ్బాయి ప్రశాంత్ కిచ్చి పెళ్ళిచేయమని అడగడానికి.
అనూష గుండెల్లో అలజడి మొదలైంది. ఉన్నతమైన వ్యక్తిత్వం, దైర్యం ఆభరణాలుగా కలిగిన డాక్టరు అనూష, ఆశలు సిసలైన ఆడపిల్లా కలవరపడసాగింది. ఎందుకో తలియని కలవరం, ఏదో తెలియని భయం, తొట్రుపాటు... కాళ్ళూ, చేతులూ కంపిమ్స్తుమ్తే తన గదిలో కదలకుండా కూర్చుంది. పెల్లికోడుకింటికి వెళ్ళినవాళ్ళు తిరిగివచ్చిందాకా... ఎప్పుడూ పాటలు వినని అనూష ఆరోజు రేడియో పెట్టుకుంది తనలోని కలవరపాటు అణుచుకోవాడానికి. 'ఏమో, ఏమో అయినది... నాకేమొ ఏమోఅయినది...ఈ వేళలో, నాగుండెల్లో... ఎందుకు గుబులవుతుంది.... అంటూ పాత పాత వినిపించింది. ఆమెకా సమయంలో తన కోసమే. రేడియోవాళ్ళు ఆ రికార్డు పెట్టారు కాబోలనిపించింది.
సరిగ్గా తొమ్మిదింటికి కారు చప్పుడైంది. ఆరున్నరకి వెళ్ళినవాళ్ళు ఇంత సేపు ఏం చేశారో... అనుకుంది టైము చూసి.
హాల్లోకి వెళ్ళి, టి.వి. అన్ చేసి కూర్చుంది. వాళ్ళ నోటినుంచి వచ్చే మాటలు వినడానికి మానసికంగా తనని తను సిద్దపరచుకుంటూ....
భువనేశ్వరీ చిరునవ్వుతో అనూష పక్కనే కూర్చుని... "నాకు తెలుసు తల్లీ నువ్వు అదృష్టవంతురాలివి అవుతావని తల్చుకుంటే గొప్పవాళ్ళనుకోలేదు. ఆ ఇంటికి నువ్వు కోడలిగా వెళతావని తల్చుకుంటే నా గుండె గర్వంతో పొంగుతోందిరా" అంది.
అనూష ఆవిడవైపు చూసింది. ఆమె కళ్ళల్లో మెరుపు చూపిన మేనత్త శశిరేఖ అంది... "చూశావా వదినా! అప్పుడే నీ కుతూరి మొహంలో పెళ్ళికళ వచ్చేసింది."
అనూష సిగ్గుతో కనురెప్పలు వాల్చుకుంది.
ఫణిభూషణరావు మాత్రం మాట్లాడక మౌనంగా కూర్చున్నాడు. తల్లీ, మేనత్తల కబుర్లలో ప్రశాంత్ తల్లి, తండ్రులు పెళ్ళికి అంగీకరించినట్లు, చక్కగా నీళ్ళకి మర్యాదలు చేసినట్లు అర్ధమైంది. మేనత్త పరాచికాలతో అనూష గదిలోకి పారిపోయింది.
ఆమెకి చాలా సంతోషంగా ఉందిప్పుడు.... అప్పటిదాకా పెళ్ళి గురించి ఆలోచనే లేని అనూషకి హఠాత్తుగా పెళ్ళిగురించి ఆలోచన మొదలైంది. చెవుల్లో సన్నాయి వాయిద్యం వినిపిస్తున్నట్టు నర నరంలో తీయని పులకింతలు... ప్రశాంత్... ప్రశాంత్...ప్రశాంత్ అంటూ తన అంగాంగం పలకరిస్తున్నప్పుడు అనిపించింది.
మంచంమీద పడుకొని, కలల ప్రపంచంలో మునిగిపోయినఅనూష హఠాత్తుగా ఉలిక్కిపడింది.
బయట హాల్లోంచి వినిపిస్తోంది శశిరేఖ స్వరం-"పోనీలే అన్నయ్యా! వాళ్ళన్నదాంట్లో తప్పేం వుంది? కట్నం లేకుండా ఎలా చేసుకొంటారు చెప్పు? నాకు ఇవ్వాలేదూ మీరు పాతిక వేల కట్నం."
