అంకిత్ చాలా ఎక్స్యిట్ మెంట్ గా ఉంది. నవలల్లో, సినిమాల్లో తప్ప ఇలాంటి అన్వేషణ వుంటుందా? అసలు మృదువని నిజంగా తనను ప్రేమిస్తుందా? లేక పోతే వేలెంటైన్స్ డేనాడు తననే ఎందుకు చూపిస్తుంది.
జాగింగ్ చేస్తావున్నా అమ్మాయిలను పరీశీలనగా చూస్తున్నాడు.అతనికి మృదువని రూపం గుర్తుండిపోయింది. లక్ష మందిలో వున్నా తను మృదువనిని గుర్తించగలడు. కానీ చిత్రంగా ఇప్పుడు ఏ అమ్మాయిని చూసిన ఆ అమ్మాయిలో మృదువని పోలికలే కనిపిస్తున్నాయి.
ఒ అమ్మాయి జాగింగ్ చేస్తోంటే మృదువనిలానే అనిపించింది. 'మృదువనీ...' అని పిలిచి మరీ భంగపడ్డాడు. నేనలా కనిపిస్తున్నానని దబాయించింది. వెంటనే ప్లేట్ ఫిరాయించేసి, నాలిక్కర్చుకొని, 'యూ ఆర్ జస్ట్ లైక్ మై కజిన్' అనేశాడు. దాంతో ఆ గండం గట్టెక్కింది. చేతన్ పరిస్థితి ఇంచుమించు అలానే ఆగి, స్కూటారాపి, కెమెరా తేసి, కెమెరా 'యూ' లో నుంచి చూస్తాడు. లేకపోతే తనను చితకబాదుతారని భయం.
వీతేవీ ఛానల్ కెమెరా వున్న ఐడెంటిటీ కార్డు ఆ విధంగా అతన్ని రక్షించటానికి ఉపయోగపడుతుంది.
***
రాహుల్ పళ్ళు టపటప లాడిస్తున్నాడు. దానిక్కారణం చలి... స్వెట్టర్ వేసుకున్నాడు తలకు మంకీ చేతులకు గ్లౌజ్... అయినా వనుకుతూనే ఉన్నాడు. ఇవన్నీ చాలనట్టు శాలువా కూడా కప్పుకున్నాడు.
'దేవుడా... నాకు మృదువని కనిపించేలా చూడు. మా భయ్యా బాసు ఇచ్చే డబ్బులో,సగం డబ్బు నీ హుండీలో వేస్తాను. ఈ చలిలో నేను వేతకలేను, నాకు అ మృదువ ని కనిపించేలా చూడు గాడ్" అని వేడుకున్నాడు. తర్వాత రోడ్డుకు ఒ పక్కగా వున్న టీ దగ్గరకు వెళ్ళాడు.
"ఒక వేడివేడి పొగలు కక్కే ఛాయ్ ఇవ్వవోయ్..." అన్నాడు దర్బంగా.
ఆ టీ బడ్డీవాడు రాహుల్ వైపు ఒ సారి చూసి, అతని అవతారాన్ని ఎగాదిగా పరిక్షించి, గాజు గ్లాసులో టీ ఇచ్చాడు ఆ ఛాయ్ వంక చూస్తూ....
"అదేమిటోయ్... ఛాయ్ ఒ ఇమ్చుడు తక్కువ ఉంది..." అడిగాడు.
"ఛాయ్ నిండా వుంటే మూతి కాలుతుంది సార్" కోపాన్ని అణిచి పెట్టుకుని చెప్పాడు అతను.
"ఫర్లేదోయ్... రోడ్డు స్పీడుగా వెళ్తే యాక్సిడెంట్స్ అవుతాయని వెళ్ళకుండా వుంటాయా? ఇదే అంటే... నోరు చుర్రుమంటుందని కప్పు చ్చే కు డబ్బు ఇచ్చి, తక్కువ తాగుతావా?" గొప్ప నగ్న సత్యం చెప్పినట్టు చెప్పాడు రాహుల్.
"ఆది కాదు సార్..."
"ఏది కాదు... నాకు తెలియకడుగుతా...నారా చంద్రబాబు నాయుడు గొప్పా? వాజ్ పేయి గొప్పా?"
ఆ ప్రశ్న సడన్ గా ఎందుకుఅడిగాడో తీ బడ్డీవాడికిఅర్ధం కాలేదు. కాసేపు బుర్ర గోక్కుని, తమ డెయిలీ పేపర్ చదివే అలవాటును గుర్తు చేసుకుని చెప్పాడు.
"స్టేటులో నారా చంద్రబాబు నాయుడు,సెంట్రల్ లో వాజ్ పేయ్ గొప్ప."
ఈ సారి బుర్ర గోక్కోవడం రాహుల్ వంతయింది. తనూ అంకిత్ టైపు లో అడగుదామనుకుంటే ఇలా రివర్స్ అయిందేమిటి?
"పోనీ పవన్ కళ్యాణ్ గ్రేటా? హృత్రిక్ రోషన్ గ్రేటా?" ఈ సారి టీ బడ్డీవాడు గుర్రుగా చూసి "తెలుగులో పవన్ కళ్యాణ్, హిందీలో హృత్రిక్ లు గ్రేట్..." అన్నాడు తన సినీ పరిజ్ఞానాన్ని కొద్దికొద్దిగా బయటకు తీస్తూ.
ఆ తర్వాత రాహుల్ ఇంకా ఏదో మాట్లాడబోతే టీ బడ్డీవాడు వెంటనే గాజు గ్లాసు నిండా... ఒక్క చుక్క తక్కువ కాకుండా పోసి ఇచ్చాడు.
టీ వేడివేడిగా ఉంది. ముందు గ్లాసు పట్టుకోగానే చుర్రుమంది. ప్రెస్టేజ్ ఇష్యూ కాబట్టి, చేతులకు గ్లౌజ్ స్ వున్నాయి కాబట్టి, జాగ్రత్తాగా టీ కప్పును పట్టుకుని నోటి దగ్గర పెట్టుకున్నాడు.
చుర్రుమంది... టీ వేడి పెదవుల మీద హాట్ హాట్ స్టాంప్ పెసింది. మింగలేక, కక్కలేక అలానే వుండిపోయాడు. టీ బడ్డీవాడు వినోదం చూస్తున్నాడు.
"ఇంకాస్త టీ పోయామంటారా సార్?" అడిగాడు తాపీగా.
"అక్కర్లేదు.." గుర్రుగా అని చూట్టూ చూశాడు.
ఇద్దరు ముగ్గురు టీ తాగుతున్నారు. టీ బడ్డీవాడు కసిగా, కచ్చగా రాహుల్ వంకే చూస్తూన్నాడు. దానికి తోడు అతడి భార్యా కూడా చూస్తోంది.
"అబ్బీ... కాస్త వాటరందుకో" చెప్పాడు. ఓ గ్లాసు లో వాటర్ ఇచ్చాడు. ఈ విపత్కర పరిస్థితి ఎలా ఎదుర్కోవాలో అర్ధం కాలేదు. టీ గ్లాసు బండి మీదపెట్టాడు. తనిప్పుడు టీ బడ్డీవాడు, తాలిబన్ సైనికులను, అమెరికా సైనికులు చూసినంత హీనంగా చూస్తాడు. అలా అని వేడివేడి టీ నోట్లో పెట్టుకుని, మరోసారి తను సాహసం చేయలేడు.
ఒక్కక్షణం కళ్ళు మూసుకున్నాడు. చిన్న ప్లాష్ క్లాష్ అయింది మెదడులో వెంటనే జేబులో నుంచి రెండ్రూపాయలు తీసి 'ఓ బన్' అన్నాడు.
బన్ కాస్త తుంచి, టీలో ముంచాడు. మెల్లిగా టీని లాక్కుంది బన్... నోటితో వూదుకుంటూ బన్ ముక్క నోట్లో పెట్టుకున్నాడు.
బన్ మొత్తం తినేసరికి టీ అడుక్కు వచ్చేసింది. అప్పుడు స్టయిల్ గా మిగిలిన ఆ టీని తాగి, టీ బడ్డీవాడి వైపు చూస్తూ...
"దేనికైనా బుర్ర ఉండాలోయ్..." అంటూ ముందుకు నడిచాడు. సరిగ్గా అప్పుడే...
***
మృదువనిపరుగెడుతోంది. వెనకే షంషేర్ దాదా మనుషులు. వాళ్ళు చాలా దూరంలో ఉన్నారు. అయినా వాళ్ళ స్పీడును చూస్తోంటే ఏ క్షణమైనా ఆమెను చేరుకోవచ్చు...
రాత్రంతా పార్కలో గడిపింది. ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకుని మృదువని... ఉదయమే ట్యాప్ దగ్గర మోహం కడుక్కుంటూ వుంటే, చూశారు షంషేర్ దాదా మనుషులు అప్పుడే... ఇంకా తెల్లవారకముందే... లక్కీగా అప్పుడే స్టార్ట్ యిన ఓ పాలవ్యానులో ఎక్కింది.
షంషేర్ దాదా మనుషులు తమ జీపు దగ్గరకి వెళ్ళి, జీపును తీసుకువచ్చేసరికి పాలవ్యాను చాలాదూరం వెళ్ళి ఓ కాలనీలో ఆగింది.
వెంటనే పల వ్యానులో నుంచి దిగి, మళ్ళా పరుగు మొదలుపెట్టింది. అక్కడే షంషేర్ దాదామనుషులు తక్కువుగా అంచనా వేసింది మృదువని... ఎప్పుడైతే మృదువని పాలవ్యాన్ లో ఎస్కేప్ అయ్యిందో, వెంటనే తాము జీపులో పాల వ్యాన్ లో అనుసరిస్తూనే మిగతా వాళ్ళకు ఉప్పందించారు సెల్ ద్వారా...
మృదువని స్పీడుగా పరుగెడుతూ, అప్పుడే రోడ్డు మీదికి వచ్చిన రాహుల్ ని గుద్దేసింది. రాహుల్ శాలువా ఆ విసురుకు కింద పడింది మృదువని వెంటనే ఆగి కిందికి వంగి శాలువా అతని చేతికి ఇస్తూ- "సారీ.." అని చెప్పి, మళ్ళా పరుగు మొదలెట్టింది.
ఏదో గొణుక్కుంటూ శాలువా తీసుకున్న రాహుల్ కు వెంటనే స్ట్రయికయింది. ఆ అమ్మాయి మృదువని అని... వెంటనే "ఏయ్ మృదువనీ.." అని పిలిచాడు. అప్పటికే ఆమె కనుచూపు మేర దాటింది. ఈ విషయం అంకిత్ కు చెప్పాలని ముందుకు కదిలాడు. అప్పుడే ఆమె కనుచూపు మేర దాటింది. ఈ విషయం అంకిత్ కు చెప్పాలని ముందుకు కదిలాడు. అప్పుడే షంషేర్ దాదా మనుషులు స్పీడుగా పరుగెడుతూ,రాహుల్ ని ఢీకొట్టారు. తహుల్ కింద పడబోయి, నిలదొక్కుకున్నాడు.
అతని భుజం మీద వున్నా శాలువ కింద పడిపోయింది. షంషేర్ దాదా మనుషులు అదేమీ గమనించకుండా ముందుకు పరుగెత్తారు.
"ఒరేయ్.. దున్నపోతూ కోడుకుల్లారా... నన్ను ఢీకొట్టి పారిపోతారేమిట్రా... ణా శాలువా తీసిచ్చి పొండిరా" గట్టిగా అరిచాడు ఉక్రోషంగా.
కానీ వాళ్ళు రాహుల్ మాటలు వినిపించుకోలేదు.వినిపించుకుని వుంటే రాహుల్ ఒంట్లోని పార్ట్స్ రక్తం బయటకు రాకుండా హొల్ సెల్ గా పనికిరాకుండా పోయివుండేవి.
"థూ... మీ యబ్బ... పౌరషం లేని దొంగ సచ్చినోళ్ళు..." అంటూ మెటికలు విరుస్తూ..."మీరు మట్టి కొట్టుకు పోతారు... నా శాలువా మట్టి పోయింది కదురా.." అంటూ రోడ్డు మీద దుమ్ములోపడ్డ శాలువా ను తీసుకున్నాడు.
అయినా అతనికి ఉక్రోషం తగ్గలేదు.
నోటికొచ్చిన బూతులు తిట్టాడు. అప్పటిగ్గానీ అతని కోపం చల్లారలేదు. చాల్లరేక, అప్పుడు గుర్తొచ్చింది మృదువని విషయం. వెంటనే టెలిఫోన్ బూత్ దగ్గరకి వెళ్ళి అంకిత్ కు ఫోన్ చేశాడు.
***
"జస్ట్ లో మిస్సయింది భయ్యా..." చితికే వేస్తూ చెప్పాడు రాహుల్.
అంకిత్ డిస్సపాయింట్ అయ్యాడు. రాహుల్ ఫోన్ చేసి అర్జంటుగా పెరేడ్ గ్రౌండ్ దగ్గరకి రమ్మంటే, మృదువని ట్రేస్ చేశాడేమోనని వచ్చాడు.
"ట్రేస్ చేయడమే కాదు భయ్యా... పిలిచాను కూడా... కానీ, పరుగు పందెంలో పార్టిసిపేట్ చేయడానికి హైదరాబాదు నుంచి ఢిల్లీ వరకూ పరుగుపెడ్తూన్నట్టు వెళ్ళిపోయింది."
