ఓ మామూలు గుమస్తాగా పనిచేయడం, అతి సాదాగా బ్రతకడం... చివరకి తన ఒడిలో పసి పాపాయిలా... భర్త ఆ పరిస్థితుల్లో చూసిన విశాలీ మనసు అర్దమైంది.
"నన్ను క్షమించండి.... ఏవో పాత జ్ఞాపాకలు గిర్తొచ్చి..." అంది కిందికి వంగి భర్త నుదురు మీద చేయేసి మెల్లిగా తన పెదవులతో ముద్దు పెట్టుకుని.
భరద్వాజ కళ్ళలో నుంచి రెండు కన్నీటి చుక్కలు చెంపల పైకి జారాయి.
మన బిడ్డ...
యిప్పుడు ఎక్కడ వున్నడో...
ఎలా వున్నాడో...
భరద్వాజ మనసు కొడుకు కోసం తపిస్తోంది.
సరిగ్గా అదే సమయంలో...
ఆ గదిలో సైంసిస్ట్ అగర్వాల్, ఖాన్, కరంజయా, లల్లూరామ్ లు వున్నారు.
రివాల్వింగ్ చెయిర్ లో భస్మ కూచుని వున్నాడు. అతని మొహంలో ఏ భావామూ లేదు. రివాల్వింగ్ చెయిర్ ని తన వైపు తిప్పుకున్నాడు అగర్వాల్.
ఆ చెయిర్ ముందు ఓ టేబుల్ లాంటిది వుంది.
"భస్మా... లుక్ ఎట్ డిస్ మ్యాప్ తప్ప మరేమీ కనిపించడంలేదు.
అతనికి అగర్వాల్ మాటలే వినిపిస్తున్నాయి. రెండు చెవులకు హియరింగ్ బగ్స్ అమర్చారు.
"భస్మా.. నువ్వు నా మాటలను కాం సంత్రేషణ్ తో విమ్తున్నావు. ఇక్కడి నుంచి నువ్వు కారులో హైఫిల్ టవర్ దగ్గరకు వెళ్తావు. అక్కడ కారులో నుంచి దిగి నడుచుకుంటూ రెండు కిలోమీటర్లు ఎడమవైపు నడిస్తే, ఓ పాడుబడిన ఫామ్ హౌస్ వుంటుంది. లోపల డాబర్ మెన్ లు ఉంటాయి. అవి నీ మెడ పడిన మరుక్షణం నువ్వు రియాక్తవ్వాలి. నీ మూడో కన్ను తెరిచీ... బలవంతా ఉపయోగించు... విద్యుత్ తరంగాలతో ఆ కుక్కలను కాల్చి పారీ... లోపల అలియాఖాన్ వుంటాడు. అతన్ని కాపాలా కాస్తూ యిద్దరు సాయుధలైన ఫోలీసులున్నారు.
అవసరమైతే... కిల్డెం... అలియాఖాన్ ని నువ్వు చంపేయాలి మామూలుగా కాదు. ఎలక్రసిటీరేస్ తో... అతని శారేరం యాసిడ్ పడ్డట్టుకాలి బూడిదైపోవాలి.
సాక్షాలు కూడా మిగాలవద్దు..."
భస్మ మొహంలో మళ్ళీ ఏ భావామూ కనిపించలేదు.
"అలియాఖాన్ ని చంపడంమేందుకు? అక్కడ్నుంచి ఎస్కేప్ చేసి తీసుకువస్తే?" కరంజయా అడిగాడు.
"అదే తప్పు మిస్టర్ కరంజయా... అలియాఖాన్ ఆల్రెడీ మన గురించి ఏం చెప్పాడో తెలియదు. ఆంద్రా ఫోలీసులను తక్కువగా అంచనా వేయకూడదు. అతను అ టార్చార్ భరించలేక నిజం చెప్పేస్తే... రేపతని సాక్ష్యం కోర్టులో రికార్డ్ చేస్తే... మనమే అలియాఖాన్ ని అరెస్ట్ చేసినట్టు ఎఫ్ ఐ ఆర్ ఫిల్ చేయలేదు కనుక... కామ్ గా తేలుకుట్టిన దొంగల్లా వుండిపోతారు.
మరో విషయం_
అలియాఖాన్ ఇప్పటివరకూ మన గురించి ఏమీ చెప్పలేదనే అనుకుందాం... అయినా అతని కదలికలు ఫోలీసులకు తెలిసిపోయాయి. అతడ్ని ఆంద్రా ఫోలీసులు వెంటాడి పట్టుకుంటారు. దట్స్ వై... అలియాఖాన్ ని చంపడమే బెటర్.
అంతేకాదు... అలియాఖాన్ నుంచి మనకు కావలసిన పని జరిగిపోయింది. ఆతనిక మనకు ఏ విధంగానూ ఉపయోగపడడు.." ఖాన్ నవ్వుతూ చెప్పాడు.
కరంజయా వణికిపోయాడు.
"అవసరం తీరితే రేపు తన పరిస్థితీ యిమ్తేనా!?" అన్నా అనుమానం కలిగింది.
***
కారు హైఫిల్ టవర్ దగ్గర ఆగింది.
కారులో నుంచి భస్మ దిగాడు. భస్మ దిగగానే కారు ముందుకు కదిలింది. బ్లూజీన్, అదే కలర్ జేంస్ షర్ట్ తక్చేశాడు భస్మ.
రాత్రి పదకొండు దాటింది.
హైఫిల్ తవర్దిగి లెఫ్ట్ వైపుకు టర్న్ అయి నడవసాగాడు. క్షానాలు, నిమిషాలు గడుస్తున్నాయి... చాల వేగంగా నడుస్తున్నాడు భస్మ.
అయిదు.. పడి.. ఇరవై.. ముప్పయి నిమిషాల్లో పాడుబడిన భవనం దగరకి చేరుకున్నాడు. ఇనుపగేటు తుప్పుపట్టి వుంది. లోపల పిచ్చి మొక్కలు వున్నాయి. చూట్టూ ఎత్తయిన ప్రహారి... మద్యలో పాడుబడిన భవనం.
భస్మ గేటును పట్టుకుని బలవంతా ఉపయోగించి గ్రిల్స్ వంచాడు. అతని ఇరాన్ బాడీ పావుగుతూ వుంది. కండరాలు ఉబ్బెత్తున పైకి ఎగిసాయి. పంటి బిగువున వాటిని వంచాడు.
అయిదు నిమిషాల్లో మనిషి దూరే స్థలం ఏర్పడింది. అందులో నుంచి దూరి లోపలకి అడుగువేసాడు.
ఒక్కసారిగా డాబర్ మెన్ లు దూసుకోచ్చాయి నాలుగు వైపులా నుంచే. భస్మ ఏ మాత్రం కంగారుపడలేదు. అవి భస్మ ను ఎటాక్ చేసాయి. వాడియైన పళ్ళతో భస్మ మీద దాడిచేసాయి. భస్మ శరీరంలో కి వాటి పళ్ళు దిగబడ్డంలేదు. కనీసం చిన్నపాటి గాయం కూడా కాలేదు. భస్మ మెల్లగా తెరుచుకుంటోంది.
అతని శారేరం విద్యుత్ మాయమై పో.. తోంది.. అతని మీద పడిన డాబర్ మెన్ లు... ఒక్కసారి వెనక్కి విరుచుకుపడిపోయాయి. భస్మకు తన బడీ వేడి నీళ్ళలో మరిగి పోతున్న ఫీలింగ్ కలిగింది. అతని తల మద్యలో వున్న మూడో కన్ను మెల్లగా మూసుకుపోతోంది.
అతను మెయిన్ ఎంట్రన్స్ వైపు అడుగులు వేశాడు.
తలుపులు దగ్గరకి వెళ్ళి తోసాడు.
అక్కడ ఎవరూ కపలాలేరు.
తలుపులు తెరచి ఒక్కో గది దగ్గరకి వెళ్ళి లోపలకి చూస్తున్నాడు.
కుడివైపు తిరిగాడు.
ఓ గది దగ్గర ఆగాడు.
