కీర్తి అందరిలాంటి మనిషే ఇలాంటి చిత్రాలు చూస్తే పొందేది విచారం తప్ప ఆనందంకాదు. బలవంతాన నవ్వుదామని చక్కలి గింతలు పెట్టుకున్నా నవ్వురాలేదే అనుకుంది.
నాలుగురోజులు అయేసరికి మళ్ళీ పిక్చరు చూద్దామని పించింది. ఈ తఫా గొప్ప సస్పెన్స్ స్టంట్ త్రిల్లింగ్ చిత్రానికి వెళదామని బైలు దేరింది.
"మాయలమారి పులి" చిత్రం పేరు.
హాలులో జనం పల్చగ వున్నారు. సెవెన్ రుపీస్ టిక్కట్టుకి అయితే సరీగ పదిమంది వున్నారు. పిక్చర్ కి కీర్తి వక్కతే రావటం వల్ల బోర్ ఫీలవుతూ వక్కతి కూర్చుంది దానికి తోడు పిక్చర్ కూడా మహానందంగవుంది.
హీరో వక్కడూ చేతులో ఆయుధం లేకుండా ఆయుధాలతో మీద పడ్డ పది మందిని పదినిమిషాలలో చిత్తుచిత్తుగా తన్ని తగలేశాడు. నిమిషానికో మారువేషం సరేసరి. మారువేషం అనంగానే పిల్లిగడ్డం, కళ్ళజోడు, బుగ్గన పులిపిరికాయ అంతే. లేకపోతే లాంగు కోటు, నెత్తిన హ్యాటు, నల్లకళ్ళద్దాలు. దొంగలస్థావరంలోకి దూరి నేనే మాయలదారి పులిని అంటూ వకేవక గావుకేక పెడతాడు. అంతే స్థావరంలో రకరకాల ఆయుధాలు చేత బుచ్చుకుని నుంచున్న వాళ్ళలోచాలా మంది మూర్ఛ పోవటం గజగజవణకటం మరికొందరు తిరిగి చూడకుండా పారిపోవటం చేస్తారు.
విలన్ తో సహా ఓ అయిదుగురు హీరోమీద కత్తులు విసరటం రివాల్వర్ పేల్చటం చేస్తారు. హీరోమీద కత్తులు విసరటం రివాల్వర్ పేల్చటం చేస్తారు. హీరోకితగులుతూ నేఖణిల్ ఖణిల్ శబ్దాలు చేస్తూ కింద పడతాయిగాని అతన్ని గాయం చేయవు. హీరో పెద్ద పెట్టున నవ్వి మాయలమారి పులికి చావు లేదురా బచ్చాల్లారా! అంటాడు. ఆ తర్వాత రివాల్వర్ తీసి వెనక్కి వంగి కాళ్ళసందులోంచి విద్రోహుల్ని చూస్తూకాలుస్తాడు. రివాల్వర్ గాలిలోకి ఎగరేసి పట్టుకుంటూనే కాల్చి చటుక్కున వెనక్కి తిరిగి వాళ్ళని చూడకుండానే కళ్ళుకూడా మూసుకుని భుజం మీద రివాల్వర్ పెట్టుకుని వెనక్కి కాలుస్తాడు, చాలా మంది చస్తారు. విలన్ పారిపోతాడు. విలన్ పారిపోకపోతే ఎలా యింకా గంటంబావు ఆటవుంది.
హీరో అలా గురీ పాడూ లేకుండా ఎడా పెడాకాల్చినా తమాషాగా కాల్చటం వల్ల నేల బెంచీ క్లాసువాళ్ళు తమ ఆనందం ఈలలతో తెలియజేశారు.
"అభూత కల్పనకి ప్రజలెంతగ దాసోహం అయారు!" అనుకుంది కీర్తి.
మరోఅరగంట కుప్పిగంతులతోను వెర్రి వేషాలతోను అర్ధం పర్ధం లేని స్టంట్స్ తోను ఆట జరిగింది.
కీర్తి అలాగే చూస్తూ కూర్చుంది.
బీమ్....బీమ్....బీమ్....బీమ్...
కీర్తి చేతికున్న వాచీలోంచి వినవచ్చింది శబ్దం. కీర్తి తన సీటులోంచి చటుక్కున లేచింది.
అర్జంట్ కాల్ అయితేనే అలాంటి శబ్దాలు కీర్తి ధరించిన వాచీలోంచి వెలువడతాయి.
కీర్తి ఎప్పుడూ ఇంట్లో ఫోను దగ్గరేవుండదు కదా! సమయానికి యింట్లో లేకుండా ఎవరింటికైనా వెళ్ళి వుండవచ్చు. పార్టీలో వుండవచ్చు. షాపింగ్ చేస్తూనైనా వుండొచ్చు. ఇలా సినిమాహాల్లో కూడా వుండొచ్చు. అర్జంట్ గ పిలవాలంటే ఎలా!
ఇంటల్ జెంట్ డిపార్ట్ మెంటులో ఇలాంటివి ముఖ్యం. పదిరోజులపాటు శెలవు పెట్టి ఎక్కడి కన్నా వెళ్ళ దలిస్తే హాయిగ వెళ్ళవచ్చు. అయితే ఎక్కడికి వెళుతున్నా మన్నది చెప్పి వెళ్ళాలి. సాధారణంగా శలవులోవున్న వాళ్ళని పిలవరు. అర్జంట్ ని మించిన అర్జంట్ అయితే శలవులోవున్న వాళ్ళని పిలవరు. అర్జంట్ ని మించిన అర్జంట్ అయితే సలవులో వున్న వ్యక్తిని కల్సుకోటానికి మరోవ్యక్తి బైలు దేరి వెళతాడు.
పైనుంచి రమ్మన్న ఆదేశం యిలా వాచీ ద్వారా బీమ్ బీమ్ అనే శబ్దం గుర్తుతో వస్తాయి. అలాకాల్ రాగానే చేస్తున్నపని వదిలేసి రహస్య సి.ఐ.డి. ఆఫీసుకి బైలుదేరి వెళ్ళాలి.
అందుకే కీర్తి ఏమాత్రం ఆలస్యం చేయకుండ వెంటనే సినిమా హాలులోంచి బైటికి వచ్చేసింది.
19
కీర్తి పబ్లిక్ టెలిఫోన్ బూత్ దగ్గరకు వచ్చి అటూ యిటూ చూసింది. దరిదాపుల్లో ఎవరూ లేరు.
కీర్తి టెలిఫోన్ బూత్ లో దూరి తలుపు దగ్గరకు వేసుకుంది.
పై వాళ్ళనుంచి బీమ్...బీమ్...శబ్దం ద్వారా పిలుపు రాంగానే క్విక్ గ బైలుదేరి అక్కడికి వెళ్ళాలి. ఈ లోపల వీలయి అందు బాటులో ఫోనులో తను బైలుదేరి వస్తున్నట్లు చెప్పి వెళితే వాళ్ళకి తెలుస్తుంది. తమపిలుపు అందుకుని వాళ్ళు బైలు దేరారు అని.
సినిమా హాలుకి యింటికి మధ్యదోవలో పబ్లిక్ టెలిఫోను బూత్ వుండటం వల్ల కీర్తి వెంటనే ఫోను చేయటానికి బూత్ లోకి వెళ్ళింది.
కీర్తి పై వాళ్ళకి ఫోను చేసి "త్రీటైమ్స్ బీమ్ బీమ్." అంది. అది కోడు.
"నో...నో.... ఫోర్ టైమ్స్." అవతలినుంచి వినవచ్చింది.
"మరో పావు గంటలో మీ ముందు వుంటాను." కీర్తి చెప్పింది.
"ఎదురు చూస్తూ వుంటాము,"
