బలవంతంగా అతడినుంచి విడిపించుకొని " ఏంటిది? బుద్దుందా నీకు? నువ్వు డాక్టర్ వి... మర్చిపోకు...." చిరుకోపంతో మందలించింది.
"ఏం డాక్టర్స్ కి రోమాన్స్ పనికిరాద?"
"పబ్లిక్ ప్లేస్ లో పనికిరాదు?"
"పబ్లిక్ ప్లేసులో పనికిరాదు."
"అయితే పద మీ ఇంటికో, మా ఇంటికో వెడదాం."
"సిగ్గులేకపోతే సరి ఇప్పటినించే ఈ ఉద్యోగం మొదలుపెడితే, ఇంక మన ఆశయాలు తీరినట్టే."
"పోనిద్దూ.... ఆశయం లేదు... గడిదగుడ్డు లేదు... ఎంచక్కా పెళ్ళి చేసుకొని, ముద్దొచ్చే కవలల్ని కందా.మొన్న పీడియాట్రిక్ వార్డులో చూశాను. అబ్బ ఎంత బాగున్నారో పిల్లలు."
చిత్రంగా చూసింది."నీకు పిల్లలంటే అంతిష్టమా?"
"చాలా.... నాకు చెల్లెళ్ళు, తమ్ముళ్ళు లేరు.ఒక్కణ్నే అమ్మా నాన్నలకి అవడంతో మ కజిన్స్ చాలా ప్రేమిస్తాను.... పెళ్ళిచేసుకొని, అరడజనుమంది పిలల్ల్ని కంటానని చెప్పాను."
"అయితే నువ్వు ముగ్గుర్ని చేసుకోవాలి."
"ఎందుకు?"
"ఈచ్ టు.... ఒక్కళ్ళకి ఇద్దర్ని మాత్రమే కనే అనిమతినిచ్చింది గవర్నమెంటు."
"నాకేం అభ్యంతరంలేదు" అతని కళ్ళలో కనిపించిన కొంటేతానానికి ఉక్రోషం వచ్చింది. " అయితే రెడిగా వున్నావా ముగ్గుర్ని చేసుకోవాడానికి... అంటే ఏకకాలంలో ముగ్గుర్ని ప్రేమించగలవన్నమాట.... నీ హృదయం అంత విసాలామా?"
"బావులుడంత... వందేకరాలయింది."
"అయితే నేను కార్డియాలజీ తప్పకుండా చేయాలి."
"అదేంటీ?"
"నేను కార్డియోథొరాసిక్ సర్జన్ కాగానే ముందుచేసే ప్తఎగం హృదయం తీసి వేయడం."
"ఓ గాడ్.... నేను నీ లాబ్ లాగా వుపయేగపడతానన్నమాట." భయం నటించిన అతని ముక్కు పట్టుకొని వూపుతూ "ఇంకోసారి పిచ్చి మాటలు మాట్లాడితే జాగ్రత్త..." తర్జని చూపించింది.
అలా రసవత్తరంగా సాగి పోతున్నా వల్ల ప్రేమ కావ్యం ఆఖరి భాగానికి వచ్చింది.
అనికొన్న ప్రకారం అనూష పి.జీ ఎంట్రన్స్ రాసింది. ప్రాసామ్ట్ సివిల్స్ ప్రిపేర్ అవుతున్నాడు.
ఆ రోజు పి.జి ఎంట్రన్స్ లో అనూషకి నాలుగో ర్యాంక్ వచ్చింది. తల్లీ తండ్రి గర్వంతో పొంగిపోయారు.
హరిశ్చంద్రగారు అభినందిస్తూ..." ఇ యాం ప్రౌడ్ అఫ్ యూ అనూషా... నువ్వు ఎప్పటికైనా ఆంద్రప్రదేశ్ కేకా, మొత్తం అల్ ఇండియాకి మొట్టమొదటి ఉమెన్ కార్డియా దావురాసిక్ సర్జెన్ కావాలి... ఓపెన్ హార్ట్ సర్జరీ లాంటి అనేక ప్రఎగాలు చేయాలి. ఇక ముందు ఎవరూ కూడా గుండెనొప్పితో మరణించకూడదు. అందుకు తాగిన ప్రఎగాలు నువ్వు చేయాలి. గొప్ప సాంకేతక ప్రగతి సాధించాలి..." అని దీవించాడు. "తప్పకుండా సర్..." మనస్పూర్తీగా ఆయనకి నమస్కరించింది
ప్రశాంత్ ఆఘమేఘాల మీద వచ్చాడు... మనసారా అభినందించాడు... భువనేశ్వరీ అతనికి ఇష్టపడి అరిసెలు చేసింది... అరిసెలు టిని, అనూష గదిలోకి వెళ్ళారు. "మొత్తానికి అనుకొన్నది సాదించవురా అనూ" అన్నాడు ఆమె భుజాలు పట్టుకొని గిరగిరా తిప్పుతూ.
"అనుకోన్నాక సాదించకుండా వుందే ప్రసక్తే లేదు" అంది అతన్నుంచి విడిపించుకుని, దివాన్ మీద వాలుతూ.
"భాగుందికానీ, తమరు అకాసాలికి ఎదుగుతున్నారు. అక్కడ్నించి మేము కన్పిస్తామా?" ఆమె పక్కనే కూర్చునీ, దిగులుగా ఆమె కళ్ళలోకి చూశాడు.
అతని జుట్టు చెరిపేసి నవ్వింది అల్లరిగా. "ఉహూ...."
"నాకు తెలుసులే" కినుకగా అన్నాడు.
కిలా కిల నవ్వింది. "పిచ్చివాడా... ఎంత ఎత్తుకి ఎదిగినా మాత్రం నేలమీదే ఉండాలి... గాల్లో వెళ్ళాడ లేనుగా."
"సరే- నీకో మంచి బహుమతి ఇస్తాను."
"థాంక్స్- అవసరంలేదు."
"అదేంటి? బహుమతి ఇస్తానంటే వద్డంటావేం?"
"నాకు బహుమతి ఎంటో.... అది తీసుకొనే టైం నాకు లేదు."
ప్రశాంత్ చటుక్కున ఆమెని ఒళ్ళోకి లాక్కున్నాడు. "నువ్వు వాడడాన్న ఇచ్చే హక్కు, అధికారం నాకున్నాయి" అంటూ పెదాలు అందుకున్నాడు. ఈసారి అనూష ప్రతి ఘటించలేదు.
కొన్ని క్షణాలు ఆ మాధుర్యాన్ని చవిచూస్తూ వుండిపోయిన అనూష, గది బైట నుంచి భువనేశ్వరీ పిలుపు విని ఉల్లిక్కిపడింది.
సర్దుకుంటూ లేచి బైటకి వచ్చింది.
"అబాయికి కాఫీ ఇవ్వమ్మా" అంటూ ఆవిడ రెందు కప్పులున్న ట్రే కూతురుకిస్తూ ఆమె కళ్ళలో కనిపిస్తున్న సిగ్గు గమనించింది.
ప్రశాంత్ వెళ్ళిపోయాక, ఆ రాత్రి డిన్నర్ సమయంలో డైనింగ్ టేబుల్ దగ్గర ఆవిడ అనూష పెళ్ళి ప్రసక్తి తీసుకొచ్చింది.
"అనూ! నీ.పి.జి. పూర్తీ అయ్యేటప్పటికి పెళ్ళి వయసు దాటిపోతుంది. అందుకే...."
అనూషకి అర్ధమైంది ఆవిడ ఆ ప్రసక్తి ఎందుకు తీసుకొచ్చిందో. కొన్ని క్షణాలు సిగ్గుతో వణికింది. ఛ.... అమ్మకంత పడ్డాను. ఎంత పొరపాటు చేశాను? కొంచెం శరీరాన్ని కంట్రోల్ తప్పనిచ్చినందుకు అనుకుంది. తలవంచుకొని ఆవిడ చెప్పేది వినసాగింది.
"నా మాటవిని అబ్బాయితో రేపు మాట్లాడు. నేనూ, నాన్నగారు వెళ్ళి, వాళ్ళ వాళ్ళతో మాట్లాడతాం. మీరిద్దరికీ ఎంత ఇష్టమైన కొన్ని పద్దతులు పాటించాలిగా.... ఏమంటారు?" భర్తని రెట్టించింది ఆవిడ.
"నీఇష్టం, అనూష ఇష్టం భువనా... పెళ్ళితో తన భవిషత్తు పాడవకుండా వుంటే చాలు నాకు. మంచి ఉజ్వలమైన భవిషత్తు వుందని అన్నారు హరిశ్చంద్రగారు...."
"అనూష సంగతి నాకు తెలుసు. డానికి ఆశయం అంటూ వుండాలే గానీ, ర్వరూ దాన్ని మార్చలేరు. ర్తువంతి పరిస్థితుల్లో కూడా అది తోణకదు.. బెదరదు..."
