అర్దరాత్రి పన్నెండు అయింది.
చేతన్ ఎప్పుడో నిద్రలోకి జారుకున్నాడు.
రాహుల్ కు సదన్ గా మెలకువ వచ్చింది. కళ్ళు తెరిచి చూస్తే అంకిత్, ఇంకా నిద్రపోకుండా, తాము ఉదయం ఘాట్ చేసిన క్యాసెట్ చూస్తున్నాడు.
"భయ్యా..." భయం భయంగా దగ్గరకు వెళ్ళి పిలిచాడు.
"చెప్పారా రాహుల్..."
"ఆర్యూ అల్ రైట్... మళ్ళా పిచ్చ కొట్టుడు కొట్టావు కదా..." దూరంగా నిలబడే అడిగాడు.
"కొట్టాను గానే,ఇలా రారా... వచ్చి..."
"నీ ఒళ్ళో కూచోనా బాసూ..." ఉస్తాహంగా అడిగాడు.
"రాహుల్... నా మృదువని నన్ను వెతుక్కుంటూ మళ్ళా వస్తుందంటావా?"
"బాసూ... నువ్వు చాలా సీరియస్ గా వున్నట్టున్నావు."
"ఐ లవ్ మృదువని రా."
"అప్పుడేనా?"
"అవున్రా... లావ ఎట్ ఫస్ట్ సైట్... అంటే ఏమిటో ఇప్పుడు అర్ధంమవుతుంది. ఆ అమ్మాయితో నాకు ఎన్నో జన్మల ఎఫేక్షన్ ఉన్నాట్టు అనిపిస్తుంది."
"ఒక్కసారికే అలాంటి ఫీలింగ్ కలిగిందా భయ్యా..."
"అవున్రా... నా కోసమే స్వర్గం నుంచి దిగి వచ్చిందిరా..."
"ఇంకా నయం... ఏ అంతరిక్ష నుంచో ప్యారాచూట్ లో దిగబడింది అన్లేదు.." మనుసులో అనుకుని పైకి మాత్రం "అది సరే భయ్యా... ఇంతకీ ఆ అమ్మాయి అలా ఎందుకన్నాదంటావు?"
"అదే తెలియదురా... బట్ ఆ అమ్మాయి ఒక్కసారి నా వైపు చూపించి, నేనే తన బోయ్ ప్రెండ్ అని చెప్పిందంటే... శీ లైక్స్ మీ వెరీమచ్, శీ లవ్స్ మీ సోమచ్..."
'దిసీజ్ త్రీమచ్' అని కసిగా అనుకుని....
"ఏమనిపించటమో భయ్యా... నాకు మాత్రం ఆ అమ్మాయి ప్రాక్టికల్ జోక్ వేసిందేమోననిపిస్తుంది" అన్నాడు రాహుల్.
"ప్రాక్టికల్ జోక్ వేయవల్సిన అవసరం ఆ అమ్మాయికి ఏమిటి... ఒరేయ్ రాహుల్... ఈ కేసెట్ లో నుంచి ఈ అమ్మాయి వచ్చిన భాగం మొత్తం తీసి, సేవరేట్ చేద్దాం. అది నా పర్సనల్ కేసెట్ లోకి షిప్ట్ చేద్దాం. రేపు చైర్మెన్ గారిగి ఇచ్చే కేసెట్ లో ఇది వుండకూడదు... ఇట్స్ మై పర్సనల్" అన్నాడు అంకిత్.
"నీ ఇష్టం బాసూ... ముందు పడుకో."
"నేను పడుకావున్రా.... నా మృదువనితో మాట్లాడాలి... నువ్వెళ్ళి పడుకో..." ఒ నిట్టూర్పూ విడిచి, వెళ్ళి పడుకున్నాడు రాహుల్.
***
"బాసూ భయ్యా... తెల్లారింది... కోడి మా సిస్టర్ కొక్కొరొకో అని రెండు గంటలు దాటింది..." అంకిత్ ని తట్టి లేపాడు రాహుల్
అలానే గొడుగు ఇదిగి మృదువని గురించి ఆలోచిస్తూ ఏ తెల్లవారుఝాముకో నిద్రలోకి జారుకున్నాడు అంకిత్.
చేతన్ ప్రెస్ష్ అయి, ఒ కాఫీ కప్పుతో వచ్చి అంకిత్ కి ఇచ్చి, "తీస్కోండి సార్... బెడ్ కాఫీ... రాత్రి నన్ను నాలుగు పీకులు పీకారు గుర్తుందా... అయినా కృతజ్ఞతా సార్... శవాలు ఫోటోలు తీసే నన్ను కెమెరా మెన్ ని చేశారని కృతజ్ఞతా..." అంటూ అంకిత్ ఎదురుగ కూచున్నాడు.
"సారే చేతన్, ఇరు రాహుల్ నీ క్కూడా సారీరా... నిన్న ఎమోషన్ లో టెంప్ట్ షన్ అయి, అలా బిహేవ్ చేశా" అన్నాడు అంకిత్.
"హమయ్య, నీ ఎమోషన్, దాని కజిన్ టెంప్ట్ షన్ ఇవ్వాళ కూడా కంటిన్యూ అవుతుందనికొని హడలి చచ్చాను... గాడ్ ఈజ్ గ్రేట్..." అన్నాడు స్టూడియోకు వెళ్దామా?" అడిగాడు చేతన్.
తల అడ్డంగా ఊపి చెప్పాడు "నేను రాను... అ పనేదో నువ్వు చూస్కో..." బోల్టుసార్లు మీ సెల్ కి ఫోన్ చేశారు. మద్యాహ్నం వరకైనా ఇస్తే, ఇవ్వాళ పని మీద ఉండాలి..." అంకిత్ అన్నాడు.
"కొత్త అస్సాయిన్ మెంట్... ఇవ్వాల్టి నుంచి మనమంతా కలసి మృదువని కోసం వెతకాలి" తాపీగా చెప్పాడు అంకిత్.
***
మృ ..దు ..వ..ని..
ఆ... అక్షరాలు అంకిత్ గుండెల నిండా ఉన్నాయి.... ప్రేమంటే స్విచ్చాన్ చేయగానే, వచ్చే ఎయిర్ కండిషనర్ తాలుకూ చల్లదనం కాదని అతనికి అర్దమైంది. ప్రకృతి నుంచి వచ్చే చల్లగాలి ఎన్ని కోటానుకోట్ల ఎయిర్ కూల్ యంత్రంలో సమానమవుతుంది.
యాద్రుచ్చాకంగా, మొదటి చూపులోనే, మొదటి మాటలోనే, అపరిచితమైన ప్రేమ... చిరపరిచి త మైనట్టు కాళ్ళ ముందు సాక్షత్కారిస్తే... ఆ ఫీలింగ్ అజరామారమే కదా!
అంకిత్ మృదువనిని అన్వేషించే ప్రయత్నాన్ని తీవ్రతరం చేశాడు. దాని కోసం మార్గాలు అన్వేషించసాగాడు. ఏం చేయాలి? ఎలా చేయాలి?
ఉదయమే చేతన్ ని ఒ వైపు మృదువని కోసం వీళ్ళు అన్వేషణ మొదలయితే...
షంషర్ దాదా మనుషులు ఒక వైపు, డిఫెన్స్ ఇంకోవైపు, ఫోలీసులు మరోవైపు మృదువని కోసం వేట మొదలెట్టారు. చాలా విచిత్రంగా అనిపించే విషయం.
***
రాహుల్ సమురాయ్ ని స్లోగా పోనిస్తూన్నాడు. అదెంత స్లోగా వేల్దోందంటే,అటుగా జాగింగ్ చేస్తావున్నా వాళ్ళు కూడా సమురాయ్ ని దాటి వేగంగా వెళ్తున్నారు.
ఇంకా మంచు కురుస్తూనే ఉంది. అంత చలిలో మృదువని కోసం అతను తన అన్వేషణ మొదలెట్టారు. దానికో కారణం కూడా లేకపోలేదు. ఎర్లీ మార్నింగ్ మృదువనిజాగింగ్ కు రావచ్చు. లేదా కంప్యూటర్ క్లాసులకు వెళ్ళొచ్చు. అదీ లేదా, ఇంటి ముందు తెలుగింటి ఆడపడుచులా ముగ్గులు వేస్తూ ఉండొచ్చు.
అలాంటి థాట్ తోనే అంకిత్ ఉదయమే సమురాయ్ మీద బతల్దేరాడు. చేతన్ స్కూటర్ మీద అబిడ్స్ వైపు వెళ్ళాడు. రాహుల్ బైవాక్ వెళ్ళాడు.
ఎవరు మృదువని అచూకి కనిపెట్టినా, వాళ్లకు తను ఒక నెల జీతం మొత్తం ఇచ్చేస్తానని అంకిత్ అనౌన్స్ చేశాడు. దాంతో చేతన్ రాహుల్ లలో ఉస్తాహం రెట్టింపయింది.
***
