Previous Page Next Page 
భస్మనేత్రం పేజి 25

    కమిషనర్ మొహంలో నెత్తురు చుక్కలేదు.
    "అతడ్ని... అతడ్ని మేమూ అరెస్ట్ చేశామని..."
    "నాకు అంతా తెలుసు కమిషనర్ గారూ... ఓ ప్రత్యెక బృందం అతడ్ని అరెస్ట్ చేసింది. ఆ వుశాయంలో ఎఫ్ ఐ ఆర్ కూడా ఫిల్ చేయలేదు. అసలు అతడ్ని అరెస్ట్ చేసిన విషయం ఏ కొద్దిమందో ఉన్నతాధికారులకు, సిఎంకు తప్ప మరేవరకి తెలియదని తెలుసు.
    కానీ, మీకు తెలియని విషయమేమిటంటే అతడ్ని మీరు అరెస్ట్ చేసిన విషయం ఖాన్ తెలిసింది. అలియాఖాన్ నోరువిప్పితే తమ కహానీ బయట పడతాయని అనుమానం వచ్చింది ఖాన్ కు.
    అలియకన్ ప్రాణాలు పోయినా నోరు విప్పాడు. అయినా వాళ్ళ భయం వాళ్ళది.
    ఇలాంటి విషయాల్లో నిర్దాక్షిణ్యంగా వ్యవహరించటం ఖాన్ పద్దతి అందుకే మీ కస్టడీలో వున్న అలియాకాన్ ని చం... పే.. యా.. లని ఖాన్ నిర్ణయించుకున్నాడు.
    ఎసి ఛాంబర్ లో వున్నా కమిషనర్ మొహమంతా స్వేదం అలుముకుంది.
    "మీరు వెంటనే మరో ప్రాంతానికి అలియాకాన్ ని షిప్ట్ చేయటం మంచిది."
    "అలాగే..." కమిషనర్ అంగీకారం సూచికంగా తలూపాడు.
    ఓ.కే.. సార్ నాకో చిన్న యిన్మర్మేషన్ కావాలి. సైంసిస్ట్ భరద్వాజా చిరునామా కనుక్కావుగాలిగితే కృతజ్ఞుణ్ణి..." అన్నాడు.
    "తప్పకుండా..." అన్నాడు కమిషనర్.
    "బిది బై మరో విషయం... నా గురించి మీరు ఎవరికీ చెప్పొద్దు.... అధికారులకు కూడా."
    "అలాకే నన్ను మీరు డైరెక్టర్ గా కాంటాక్ట్ చేయవచ్చు..." అన్నారు కమిషనర్.
    కౌశిక్ కమిషనర్ షేక్ హ్యందిచ్చి బయటకు నడిచాడు. అతని నేక్సేట్ టార్గెట్ భరద్వాజ ఆడ్రస్ కనుక్కోవడం.
    ప్రపంచం గుర్తించని ఓ మేధావి....
    దేశం కోసం కన్నా బిడ్డని సైతం వాదులు కోవడానికి సిద్ధపడ్డ ఆ గొప్ప వ్యక్తి యిప్పుడేక్కడ వున్నాడో..?
                                               ***
    "అకౌంట్స్ అన్నీ పూర్తయ్యయా?" అడిగాడు ప్రొప్రయిటర్ తన ఎదురుగా నిలబడ్డా వ్యక్తిని.
    "పూర్తయ్యాయి సర్... స్టాక్ లిస్టు, సరకు తెప్పిమ్చాల్సిన లిస్టు... యిదిగొండి..." అంటూ తన చేతిలో వున్న ఫిల్ ని ఆ ప్రోప్రయిటర్  కు యిచ్చాడు.
    "సేల్స్ విషయంలో దళ గా వుంది. మిగతా బ్రాంచీలు బాగానే వున్నాయి. మీరు ఈ విషయంలో 'కేర్' తెసుకుమ్తున్నట్టు కనిపించటం లేదు..." నిష్టూరంగా అన్నాడు ప్రోప్రయిటర్.
    "అలా ఏమీ లేదుసార్... యిప్పుదిప్పేదే జనం మన సూపర్ మార్కెట కు అలవాటుపడుతున్నారు." వినయంగా చెప్పడావ్యక్తి.
    "నాక్కావలసింది మీ వివరణలు, సంజాయ్తిశీలు కాదు. వర్క్... దిసిప్లిండ్ గా చేయాలి. టాలెంట్ వుంటే పని సక్సెస్ పోల్ గా పూర్తవుతుంది. మీరు వయసు పై బద్దవారు. కొత్త కొత్త ఆలోచనలు ఎలా వస్తాయి. అదే మాట అంటే'అలా ఏమీ లేదుసార్' అంటారు. పాతికేళ్ళు గా పనిచేసారని, మా నాన్న దగ్గర గుమస్తాగా ఇన్నేళ్ళు వున్నారని, మా నానపావుయినా మిమ్మల్ని పనిలోనుంచి తెసేయలేదు. పైగా ఈ భ్రాంచి ని జాగ్రత్తగా చిఇసుకునే అవకాశామిచ్చాను" అన్నాడు.
    "ఆ వ్యక్తి "నామెడ మీకున్న నమ్మకానికి కృతఙ్ఞతలు సార్... మీ నమ్మకం నమ్ముకానివ్వను" అన్నాడు.
    "అలాగే బహుశా ప్యూజ్ పోయి వుంటుంది." అన్నాడు ఆ వ్యక్తి.
    "ఏమో... అయినా ఇలాంటి విషయాలు మీకేం తెలుస్తాయి చెప్పండి... వెళ్ళండేళ్ళండి" అన్నాడు.
    ఆ వ్యక్తి వెళ్ళిపోయాడు.
    ఆ వెళ్లిపోతున్న వ్యక్తి ఓ మేధావి అని... సహస్ర ప్రపంచమే అబ్బురపడే  ఎన్నో అద్బుతాలను ఆవిష్కరించిన వ్యక్తి అని ఆ ప్రోప్రేయటర్ కు తెలియదు.
    విజ్ఞాన ప్రపంచం విస్మరించిన ఓ విజ్ఞానిఖని అతను.
    అతనే భరద్వాజ.
    సైంసిస్ట్ భరద్వాజ.
                                               ***
    వీశాలీ...వీశాలీ... ఏంటీ ఇల్లంతా చీకటిగా వుంది" అంటూ లోపలకి అడుగుపెట్టి తడుముకుంటూ స్విచ్ దగ్గరకి వెళ్ళి స్విచాన్ చేశాడు భరద్వాజ.
    ఆ గది వెలుతురుతో నిండిపోయింది.
    "అదేంటి విశాలీ...లైటు అయినా వేసుకోకుండా చీకట్లో వుండిపోయావు. నెలమీద గోడకు అనుకుని కూచుని వున్న విశాలిని అడిగాడు భరద్వాజ.
    "ఏం లేదండీ... తల నొప్పిగా వుంటే..."
    "తల నొప్పా..." అంటూ భార్య నుదురు మీద చేయేసి చూసాడు.
    విశాలి కల్లకిమ్డ నల్లటి చారికలు. వయసు పై బడిందని గుర్తు చేస్తూ తెల్లటి వేమ్త్రుకులు అక్కడక్కడా కనిపిస్తున్నాయి.
    "వీశాలీ... నీకు వచ్చింది తలనొప్పికాదు. మనసునొప్పి... కదూ"
    తనూ భార్య పక్కనే నెల మీద కూచుని అన్నాడు.
    భర్త మొహంలోకి చూడలేకపోయింది.
    "అవునండీ... యివ్వల్తికి మనబ్బాయి పుట్టి పాతికేళ్ళు..." అంది మెల్లగా.
    "విశాలీ... నేను... నేను నీ బిడ్డని కాన? ఆక్లా అంటున్నప్పుడు అతని గొంతు వణికింది.
    అలాగే భార్య ఒడిలో తలపెట్టి పడుకున్నాడు.
    బట్టతలా, కళ్ళజోడు... మామూలు పాంటూ, షార్ట్... విశాలి మనసు చివుక్కుమంది.
    ల్యాబులో బీజీగా పరిశోధనలు చేస్తూ వుండాల్సిన తన భర్త...


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS