Previous Page Next Page 
మిస్టర్ 'యూ' పేజి 26

 

    కబంధుడి కాల్చివేయడమూ, విరాధుడిని పాతి పెట్టడమూ చూస్తె, వాళ్ళు మాంసాహార వృక్షాలనీ , ఆ వృక్షజాతినీ సమూలంగా నాశనం చేయడానికి రామలక్ష్మణులు ప్రయత్నం చేసి ఉంటారనీ అనిపిస్తుంది" అంది సృష్టి.
    "కానీ -- అక్కడక్కడ ఇంకా అట్లాంటి వృక్ష జాతులు మిగిలి ఉండవచ్చుననేనా నీ వూహ అన్నాడు రాజు.
    "దీనికి నా సమాధానం -- యస్ అండ్ నో అయి ఉండవచ్చు. కాకపోవచ్చును కూడా అంది సృష్టి.
    "బ్యాక్ టూ స్క్వేర్ ఏ. మళ్ళీ మొదటికి వచ్చాం" అన్నాడు రాజు.
    ఈ ప్రాంతంలో అంతా రాక్షసుడి భయం ఉంది. అంచేత ఏం జరిగినా కూడా రాక్షసుడి విహయంగానే అన్వయించుకునే మానసిక స్థితి ఇక్కడి జనాలకి వచ్చేసింది. అదీ అసలు విషయం! అంది సృష్టి.


                         *    *    *

    అవునన్నట్లుగా తల పంకించాడు రాజు.
    "అంతా రెడీనా!" అన్నాడు సైంటిస్టు జ్ఞాని తన అసిస్టెంటు అనుచర్ తో.
    "యస్సర్!" అన్నాడు అనుచర్.
    "అనుచర్! మైక్రో మినీ రోబోలనబడే మేషిన్లతో మనుషులని మారణ హోమం చేసే పవర్ సంపాదించాం. కానీ మన ప్రాజెక్టు ప్రాక్టికల్ గా సక్సెస్ అవుతుందో లేదో ఇంకా సరిగా తెలీదు కదా -- అందుకని టెస్ట్ కేస్ గా -- ఒకళ్లిద్దరూ మనుషుల మీదికి ఈ మైక్రో మినీ రోబోలని ప్రయోగిస్తాం. అవి వాళ్ళ శరీరాల్లోకి ప్రవేశించాక తమలాంటి రోబోలను తామే తయారుచేసుకుంటూ , కేన్సర్ కణాలలాగా కోటాను కోట సంఖ్యలో పెరిగిపోతాయి. ఈ మెకానికల్ కేన్సర్ కి మందు లేకపోవడం సరే అసలు ఐడెమ్ జబ్బో కూడా ఎవరికీ అంతుబట్టదు.
    జెనెటిక్ ఇంజనీరింగ్ ద్వారా దీర్ఘా ప్రయోజనాలను సాధించవచ్చునుకుంటున్న శాస్త్రజ్ఞులకు చాలెంజ్ గా నిలుస్తాను నేను. యస్! ఐ యామ్ ది గ్రేటెస్ట్! అన్నాడు జ్ఞాని అక్షరం అక్షరంలోనూ తన అహంభావాన్ని, అజ్ఞానాన్ని ప్రదర్శిస్తూ.
    కరుడు గట్టిన కాటిన్యం లాగా ఉన్న తన బాస్ వైపు కళ్ళార్పకుండా చాలా సేపు చూసి "యస్ బాస్ !" అన్నాడు అనుచర్.

        
                           *    *    *

    ఉన్నట్లుండి ఒక్కసారిగా "అమ్మా" అంది సృష్టి.
    "సృష్టి ! ఏమయింది ?" అన్నాడు రాజు కంగారుగా.
    అబ్బే ! ఏం లేదు !" అని సర్ది చెప్పింది సృష్టి అనునయంగా.
    ఆమె మాట పూర్తీ కాకుండానే, మళ్ళీ ఒక్కసారి తెరలాగా నొప్పి వచ్చింది.
    "అబ్బా! స్ స్ స్ ......' అంది సృష్టి.
    "సృష్టి ......సృష్టి .......ఏమయింది ?"
    "కొద్దిగా కళ్ళు తిరుగుతున్నాయ్! అంతే ......" అని అంతలోనే దెయ్యం ఆవహించిన దానిలాగా "అమ్మో!" అని అడవి చుట్టూ వినబడేలా కేక పెట్టింది సృష్టి.
    "సృష్టి ఏమయింది చెప్పు !"
    జవాబు చెప్పకుండా రోప్పుతోంది సృష్టి , తెల కళ్ళు పడ్డాయి.
    చటుక్కున ఆమెని భుజం మీద ఎత్తుకుని షూటింగు స్పాట్ వైపు పరిగెత్తడం  మొదలెట్టాడు రాజు.
    ఆ సినిమా యూనిట్ తో బాటు ఎవరైనా డాక్టర్ కూడా వచ్చి ఉంటారా ? కనీసం వైద్యం తెలిసిన వాళ్ళెవరైనా అక్కడ ఉండి వుండవచ్చును.
    సృష్టిని చేతుల్లో ఎత్తుకుని పరుగులాంటి నడకతో వస్తున్న రాజుని కళ్ళు చిట్లించి చూశాడు నిర్మాత బాబూ సేట్.
    "ఏమయింది ?" అన్నాడు రాజు తన దగ్గరికి రాగానే.
    "తెలియడం లేదు. హటాత్తుగా సిక్ అయిపొయింది తను. మీ యూనిట్ తో బాటుగా డాక్టర్ ఎవరైనా వున్నారా?" అన్నాడు రాజు త్వరత్వరగా.
    "దాక్టరా?" అన్నాడు బాబూ సేట్ నిదానంగా.
    "అవును! డాక్టరే ! ఉంటే అర్జెంటుగా పిలిపించండి ప్లీజ్!" అన్నాడు రాజు.
    చెప్పల్నా వద్దా అన్నట్టుగా కాసేపు ఆలోచించాడు బాబూ సేట్ .
    "ప్లీజ్!" అన్నాడు రాజు అసహనంగా.
    ఒక నిశ్చయానికి వచ్చినట్టుగా అన్నాడు ప్రొడ్యూసర్ బాబూ సేట్.
    "నేనూ డాక్టర్ నే -- కానీ సినిమా ప్రొడక్షన్ లో ఉన్నాను కదా -- అందుకని ప్రాక్టీసు చెయ్యను . బట్ ......" అని సగంలో ఆగాడు.
    ఇంతలో సృష్టి "అమ్మా!" అంటూ పేద్దగా మూలిగింది.
    "మీరే డాక్టరయి వుండడం అదృష్టం -- ప్లీజ్! ఈ అమ్మాయిని త్వరగా అటెండ్ అవ్వండి" అన్నాడు రాజు.
    చులకనగా నవ్వాడు ప్రొడ్యూసర్ బాబూ సేట్.
    "కొద్ది సేపటి క్రితం నా అవసరాన్ని మీరు లెక్క చెయ్యలేదు. ఇప్పుడు మీ అవసరాన్ని  నేను ఎందుకు లెక్క చెయ్యాలి? మీ వూరికి మా వూరెంత దూరమో, మా వూరికి మీ వూరు అంతే దూరం కదా! అన్నాడు.
    "అది సినిమా విషయం -- ఇది మనిషి ప్రాణం- అదీ ఇదీ ఒకటేనా?" అన్నాడు రాజు అసహనంగా.
    "నాకు సినిమాలే ప్రాణం!' అన్నాడు నిర్మాత బాబూ సేట్ క్లుప్తంగా.
    ఇంకో నొప్పి తెర వచ్చినట్లుగా విలవిలలాడిపోయింది సృష్టి.
    "ప్లీజ్ ట్రీట్ హర్!" అన్నాడు రాజు ప్రాధేయపూర్వకంగా.
    "ట్రీట్ చేస్తాను గానీ ఒక్క షరతు మీద " అన్నాడు బాబూ సేట్.
    "ఏమిటది ?"
    "మీరు నాతొ అగ్రిమెంటు చెయ్యాలి. మూడేళ్ళ కాంట్రాక్టు అన్నాడు బాబూ సేట్!, కలియుగ భీముడిలాగానూ, మరో మన్మధుడిలాగానూ కనబడుతున్న రాజుని చూస్తూ.
    మిస్టర్ యూనివర్స్ గా సలెక్ట్ అయి కూడా టైటిల్ ని ఎడం కాలితో తన్నేసి వచ్చిన ఈ యాంగ్ మాన్ తో టార్జాన్ వేషం వేయించి, అతిలోక సుందరిలాగా ఈ అమ్మాయితో హీరోయిన్ వేషం వేయిస్తే సినిమా దుమ్ము దులిపెస్తుందనీ అతని సిక్స్ సెక్త్స్ సెన్సు చెపుతోంది. అతని కండలూ, ఆ అమ్మాయీ గుండెలూ కనబడుతూ ఉంటె చాలు  - జనం సీట్లలో కూర్చోలేరు. ఇట్లాంటి యాక్షన్ సినిమాలకి యాక్టింగ్ తెలియకపోయినా నష్టం లేదు.
    "ఏవంటారు ?" అన్నాడు బాబూ సేట్.
    నీళ్ళల్లో నుంచి బయటపడ్డ చేపపిల్లలా తుళ్ళి తుళ్ళి పడుతోంది సృష్టి. ఆమెని జారిపోకుండా పట్టుకోవడం అసాధ్యమయిపోతోంది రాజుకి.
    అతను ఇంకొక్క క్షణం కూడా ఆలోచించలేదు . "సరే!" అన్నాడు . తక్షణం "ముందు ఈ అమ్మాయి సంగతి చూడండి ."
    బాబూ సేట్ ముఖం వికసించింది. "రండి -- నా టెంటు లోకి వెళ్దాం " అని దారితీశాడు.
    అవుట్ డోర్ యూనిట్ కోసం అక్కడ కొన్ని టెంట్లు వేసి ఉన్నాయి. వాటిలో ఒకటి మరీ పెద్దదిగా, ఫ్యాన్సీగా , కలర్ పుల్ గా ఉంది. అది బాబూ సేట్ ది.
    ఆ టెంటులో రెండు ఫోల్దింగ్ కాట్స్ వున్నాయి.   


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS