"యూమీన్"అప్పటిదాకా అతని మాటలు అయోమయంగా వింటోన్న అనూష సందేహంగా చూసింది.
"సమ్ థింక్ స్పెషల్ చేయాలని....ఐ.ఏ.యస్. అవాలనుంది....కలెక్టర్ అంటే ఆ దర్జా వేరుగా."
మొదటసారిగా అతనిలో మరో ప్రశాంత్ ని చూసింది అనూష.... "నువ్వు చదివేది హొదాకోసమా ప్రశాంత్....నీ చదువుపట్ల, నీ వృత్తిపట్లా నీకేం గౌరవంలేదా?"
"గౌరవం.... ఏమో అలాంటి పెద్ద పెద్ద ఆలోచనలు నాకు లేవు. జస్ట్ క్యాజువల్ గా మెడిసన్ లో చేరాను. కానీ దీనివలన ఏం సాధిస్తానని పిస్తోంది."
"ఉహు.... నాకంత ఓపిక లేదు."
"ఐ.ఏ.యస్.అవడం మాత్రం ఈజీనా? దానిక్కూడా చాలా కష్టపడాలిగా."
"అవసరం అయితే పడదాం... కానీ ఆ అవసరం రాకపోవచ్చు."
"అంటే..."
"చేప్పాగా డబ్బుతో సాదించలేనిది ఏం లేదని."హతాశురాలయింది అనూష. "చాలా తప్పుగా ఆలోచిస్స్తున్నావు ప్రశాంత్. విజ్ఞానాన్ని డబ్బుతో కొనద్దు ప్లీజ్."
"నేను విజ్ఞానం కొనడంలేదు. పదవినీ, హొదానీ, అంతస్తునీకొంటాను."
"ప్రశాంత్. నువ్విలా మాట్లాడుతుంటే నాకు చాలా ఇబ్బందిగా వుంది వినడానికి. ఇలాంటి ఆలోచనలు మనలాంటివాళ్లకి వుండడం క్షేమకరం కాదు. సమాజం బాగుపడాలంటే మన జనరేషన్ వాళ్ళన్నా కొన్ని సిద్దాంతాలకి లోబడి వుండాలి."
ప్రశాంత్ గలగలా నవ్వాడు. "సిదాంతాల? పిచ్చి అనూ...సిదాంతాలు, ఆదర్శాలు పెట్టుకుని బతికే సంఘం కాదిది. ఆ కాలం మారింది. ఎవరికీ తోచిన పద్దతిలో వాళ్ళు పైపైకి పాక్కుంటూ వెళ్లాల్సిందే."
"కానీ నువ్వు ఎగిరివేల్లాలనుకుంటున్నావు."
"తప్పదు. ఎగిరేశక్తి నాకున్నాప్పుడు పాకడం దేనికి?"
"కొన్ని శక్తులు అన్నింటికీ వుపయోగించకూడదు."
"ఉపయోగించకపోతే నిర్వీర్యం అయిపోతాయి."
"ప్రశాంత్....నాకెందుకో నీలో కొత్త ప్రశాంత్ కనిపిస్తున్నాడు. నేను ఈ మాటలు జీర్ణించుకోలేకపోతున్నాను."
అలా అన్నడేగానీ, అనూష మాత్రం మర్చిపోలేకపోయింది. పోనీలే అతని ఆశ అతనిది అని ఎంతగా సర్దిచేప్పుకోవాలనుకున్నా సర్దిచెప్పలేకపోయింది. ప్రశాంత్ చాలా అవివేకంగా ఆలోచిస్తున్నాడు అనుకుంది. బొత్తిగా మనస్తత్వం ఎదగలేదు అనుకుంది. ఇతడి దోరణి మార్చగాలనా? అని భాదపడింది.
అయితే ఎలాంటి భాధ వున్నా, దాన్ని సమయానికి మర్చిపోయి తన ఆశయంవైపు అడుగులు వేస్తే శక్తి ఆమెకి వరంగా ఇచ్చాడు భగవంతుడు. ఆ ఆశయం వైపు సాగుతూనే అతడిని తనతోపాటు అడుగులు వేయిస్తూ, మార్గదర్శగా వుండడానికి తాపత్రయపడడింది అనూష. ఆ కార్యంలో తానూ సఫలీకృతురాలినవుతానని గాడంగా విశ్వసించింది. ఆ నమ్మకంలో, ఆ తాపత్రయంలో, వాళ్ళిద్దరి మద్యా స్నేహానికీ, ప్రేమకీ మద్య వున్న సరిహద్దురేఖ చెరిగిపోయి, చాలా సానిహిత్యం ఏర్పడిపోయింది . ఇప్పుడు వాళ్ళు ప్రేమికులు. వాళ్ళ ప్రేమ కాలీజీ మొత్తం అందరికీ తెలిసిపోయింది.
ఒకప్పుడు విడివిడిగా హిరో హిరోయిన్ అని పిలవపడిన వాళ్ళిద్దరూ ఇప్పుడు హిరో హిరావుయిన్స్ అని కలిపి పిలవపడడం మొదలయింది.వాళ్ళ జంట చూసేవాళ్ళకి కన్నులపంటగా వుండేది. వాళ్ళిద్దరూ నడిచివస్తుంటే ఎన్నో కళ్ళు పరిసారాలను మర్చిపోయి వాళ్ళను చూసేవి.
నెమ్మదిగా ఒకళ్ళింటికి మరొకళ్ళు వెళ్లడం, కుటుంబాలతో పరిచయాలు, రాకపోకలు, వాళ్ళిద్దరూ కాబోయే భార్యాభర్తలని రెండు కుటుంబాలకి, మొత్తం మెడికల్ కాలేజీకి తెలిసిపోయింది.
మెడిసిన్ పూర్తీ అయింది. ప్రశాంత్ తో ప్రేమ ఆమె ఆశయాన్ని, చదువుపట్ల శ్రద్ధనీ ఏ మాత్రం తగ్గించలేకపోవడం ఆమెలోని దృఢనిశ్చయ్యాన్ని, పరిపూర్ణమైనా వ్యక్తిత్వాన్ని ఋజువు చేసింది.
హౌస్ సర్జన్సీ మొదలయింది.
అనూష ఓ తపస్వినీలా మారిపోయింది. హరిశ్చంద్రగారు ఆమె పైన శ్రద్ధ చూపించడం ప్రారంభించారు. అప్పటినుంచే సర్జరీలప్పుడు ఆమెని తనకూడా వుండమనేవాడాయన.అనూష ప్రశాంతుని కలపడం ఒక్కోరోజు కష్ట మైపోతుండేది.
ఒక్కోసారి గాందీ హాస్పిటల్ కి,మరోసారి మరో హాస్పిటల్ కీ ఇలా హరిశ్చంద్రగారితో తిరగడం,ఆయన చూపిస్తున్న ఒక్కో కేసు గురించి స్టడీ చేయడం, అనుమానాలు తీర్చుకోడం ఓ పిలో పేషెంట్స్ ని చూడటం,మందులు రాయడం అందరూ తనని డాక్టర్ అంటూ సంబోదిస్తూ గౌరవం ఇస్తుంటే అనూషకి అదంతా కొత్తగా,వింతగా, అద్బుతంగా అనిపించేది. వారానికి రెండురోజులు మాత్రం ప్రశాంత్, అనూష కలుసుకునే వాళ్ళు.
అదే రాత్రి ఏడున్నర, ఎనిమిది ఆ ప్రాతంలో.... ఒక్కోసారి నైట్ డ్యూటీలు పడితే,మద్యాహ్నాలు నిద్రమానుకొని అయినా అతడిని కలిసేది.వారివారి అనుభవాలు చెప్పుకోవడం,ఎదురైనా చిత్రమైన కేసుల గురించి చర్చించుకోడం.
ఓ రోజు ప్రశాంత్ అన్నాడు. "ఆ హరిశ్చంద్రగారిని చూస్తుంటే వళ్ళు మండుతుంది.ఎప్పుడో ఆయన్ని కిడ్ నాప్ చేసేస్తా"
"ఎందుకుట? ఆయనేమన్న జగదీస్ చంద్రబోస్ లా కనిపిస్తూన్నారా?"
"అంత సీన్ లేదుగానీ మనిద్దారీ విడదీస్తున్నాడు."
నవ్వింది. "పాపం పెద్దాయన మీద అభాండాలు వేయకు."
"మరేంటి? ఇలా వారానికోసారి కలుసుకోడం ఏంటి మనం?"
"మన భవిష్యత్ బాగుపడాలంటే తప్పదు."
"ఇంటికెళ్ళి గంధలేపనం చేసుకో."
"నిన్నూ..." హాతాట్టుగా ఆమెని దగ్గరకు లాక్కున్నాడు.
"ఏయ్.... ఏంటిది? వాదులు... ప్రశాంత్... ఇది పబ్లిక్ ప్లేస్... అందరూ చూస్తు..." ఆ తరువాత మాట్లాడనివ్వలేదు.కొన్ని సెకన్లపాటుఆమె పెదాలు రుచి చూస్తు వుండిపోయాడు.
