నిలబడే నిద్రపోతే అలానే ఉంటుంది. ఆ అమ్మాయి ఎప్పుడో చెప్పాతెట్ట కుండా వెళ్ళిపోయింది."
"అదేమిటి... నన్ను వదిలేసి వెళ్ళిందా?" రాహుల్ ఒ సారి అంకిత్ వంక చూసి...
"భయ్యా... నీ వరుస చూస్తోంటే... నువ్వు త్వరలో మమ్మల్ని విడిచి, పైకి వెళ్ళిపోయేలా ఉన్నావు... ఇదేమిటి బాసు భయ్యా.."
అంకిత్ రాహుల్ వైపు చూసి,
"అది కాదురా, అ అమ్మాయి.."
తల పట్టుకున్నాడు రాహుల్.
"అది కాదు భయ్యా... ఆ అమ్మాయి నిన్ను చూపించిందా .... ఆ తర్వాత రెండు,మూడు సెకన్ల పాటు నేనూ, చేతనూ శాకయ్యాం... ఆ తర్వాత చూస్తే ఆ అమ్మాయి అక్కడ లేదు... పరుగో పరుగు... ఆ అమ్మాయి వరస చూస్తావుంటే ఏనిపిస్తుందో తెలుసా..." ఆగి అంకిత్ మొహంలోకి చోసేడు రాహుల్.
"తెలుసు..." ఉత్సాహంగా అన్నాడు అంకిత్.
"ఏం తెలుసు?" అయోమయంగా అడిగాడు రాహుల్.
"నా కోసం దేవలోకం నుంచి దిగి వచ్చి, తిరిగి రాత్రిలోగా దేవలోకానికి వెళ్ళకపోతే, తన తండ్రి అయిన ఇంద్రుడికి కోపం వస్తుందని తెలిసి, రేపు మళ్ళీ నన్ను కలవొచ్చని పరుగు పరుగున వెళ్ళింది..." ట్రాన్స్ లో ఉన్నట్టు చెప్పాడు అంకిత్
"భయ్యా.. నీ చిన్న మెదడు చితికిపోయింది. వెంటనే హాస్పిటల్ కు వెళ్దాం..." కంగారుగా అన్నాడు రాహుల్.
"లేదురా... నా గుండె జారి, నడుచుకుంటూ ఆ అమ్మాయి దగ్గరకి వెళ్ళిపోయింది. నా కోసమే పరుగు పరుగున వచ్చిందిరా... ఎంతో ప్రేమగా న వైపు చూపెట్టింది."
రాహుల్ కు సీన్ అర్దమైంది. అంకిత్ ఫస్ట్ సైట్ లోనే ఆ అమ్మాయి ప్రేమలో పది పోయాడు.
"సర్లెండి సార్... ముందు ఫేసుకు వేదం పదండి."
"మరి ఘాటింగూ?" అడిగాడు అంకిత్.
"హు.. మద్యాహ్నం నువ్వు ఆ అమ్మాయి ఇచ్చిన 'లావ్ షాక్' తో స్టాచ్యూలా అయిపోయేక మిగతా కార్యక్రమం అంతా మేం ఘాట్ చేశామ్లె..." రాహుల్ చెప్పాడు.
"మరి ఆ అమ్మాయి ఏమైందిరా?" రాహుల్ చొక్కాకాలర్ పట్టుకుని అడిగాడు.
"ఆ... నేనే బ్యాంక్ ఆఫ్ పంజాబ్ లో, నా లాకర్ లో పెట్టొచ్చా... ఏమిటి బాసూ! ఇందాకట్నుంచి చూస్తున్నా... ఆ అమ్మాయి గురించి నన్ను ఫ్రయ్చేసుకొని తినకు..." తల పట్టుకుని చెప్పాడు రాహుల్.
"అంటే, అ అమ్మాయి గురించి నీకేమీ తెలియదంటావ్? కం ఫార్మా?" అడిగాడు అంకిత్ రాహుల్ మొహంలోకి చూస్తూ.
అంకిత్ ను బలవంతంగా బయటకు తీసుకువెళ్ళాడు రాహుల్.
***
ముగ్గురూ రూమ్ కువచ్చారు.
రాహుల్, చేతన్ స్పీడుగా అన్నం తింటున్నారు. అంకిత్ మాత్రం అన్నం కేలుకుతూనే ఉన్నాడు.
"భయ్యా.... అన్నాన్ని కోడి కెలికినట్టు కెలక్కు... తిను" చెప్పి, మళ్ళా తన తిండీ ధ్యానంలో పడిపోయాడు.
వాళ్ళిద్దరూ అన్నం తిని, చేతులు కదిగేసుకున్నారు. అంకిత్ మాత్రం ఇంకా అన్నం లేలుకుతూనే ఉన్నాడు.
"సార్... ఇవ్వాళ మీకేమైంది?" అడిగాడు చేతన్.
"ఎంటర్ డి డ్రాగన్ అయింది" కోపంగా అని, రాహుల్ అన్నాన్ని బాగా కలిపి, 'ముద్దాలా చేసి' అంకిత్ నోట్లో కుక్కాడు.
"మింగు...మింగు భయ్యా..."
గతుక్కున మింగాడు అంకిత్. మరో ముద్దా నోట్లో పెట్టాడు. 'ఇది కూడా మింగు భయ్యా... నా జీవితం మంతా... ఇలా చిన్నపిల్లాడికి తినిపించినట్టు ముద్దలు కలిపి తినిపిమ్చాల్సి వస్తుంది... పోనీలే... రేపు పెళ్ళయ్యాక, నా కొడుక్కు తినిపిమ్చాతానికి ప్రాక్తిసుగా ఉంటుంది' తనలో తను అనుకున్నాడు.
అంకిత్ మాత్రం కాం గా రాహుల్ అన్నం కలిపి నైట్లో పెడుతూంటే మింగుతూ వుండిపోయాడు.
"నములు భయ్యా... నమిలి మింగు."
తల అడ్డంగా వూపి అన్నాడు అంకిత్... "నా మృదువని లేకుండా నమలలేను రాహుల్."
"నమలలేవా? పోనీ ఒ పన్జేస్తావా?" అంకిత్ మొహంలోకి చూస్తూ అడిగాడు వాళ్ళు నుండి రాహుల్.
"నా మృదువని కోసం నేనేమైనా చేస్తాను."
"అయితే, నైట్లో వున్న అన్నాన్ని రాహుల్ మొహం మీద ఉమ్మేశాడు అంకిత్.
కెవ్వున కేకవేసి, వెనక్కు విరుచుకు పడ్డాడు రాహుల్.
చేతన్ నోటికి చేతిని అడ్డంగా పెట్టుకుని కిసుక్కున నవ్వాడు. రాహుల్ యమ సీరియస్ గా చూసి "భయ్యా... ఎంత పని చేశావ్! పుసిక్కున 'ఊసేయ్' అంటే ఊ సేయడమేనా..."
"చెప్పానుగా రాహుల్... నా మృదువని కోసం ఏమైనా చేస్తాను. ఐ లైఫ్ ఫర్ మృదువని, ఐ డై ఫర్ మృదువన."
"అచ్చా.." మొహాన్ని పదహారు వంకర్లు తిప్పి తన వైపు చూస్తూ కిసుక్కున నవ్విన చేతన్ వైపు ఉక్రోషంగా చూసి....
"అయితే... వెళ్ళి ఆ చేతన్ గాడిని ఒ నాలుగు పీకులు పీకు... నీ మృదువ ని కోసం..."
అంకిత్ కామ్ గా లేచాడు. చేతన్ భయం భయంగా చూశాడు. అన్నంతపనీ చేశాడు అంకిత్.
చేతన్ ని పట్టుకుని నాలుగు పీకులు పీకాడు. ఈ సారి కిసుక్కున నవ్వడం రాహుల్ వంతయింది.
"బాసూ... ఈ లెక్కన నీకు సజెషన్స్ ఇచ్చి బ్యాంక్ రాబరీ కూడా చేయించోచ్చాన్నమాట.... హ్హహ్హహ్హ" అని నవ్వు నవ్వాడు రాహుల్.
అప్పుడు మరో సారి రియాక్ట్ య్యాడు అంకిత్.
ఈ సారి రాహుల్ ని ఒ నాలుగు పీకులు పీకాడు.
"భయ్యా....కుయ్యో... భయ్యా... బాసో..." అంటూ నాలుగు అరుపులు అర్దరాత్రి పన్నెండు అయింది.
* * *
