Previous Page Next Page 
భస్మనేత్రం పేజి 24

    చివరికి భస్మ ఆచూకీ కానిపెట్టగలిగాడు. తీరా అక్కడకి వెళ్లేసరికి భస్మ ఆ అపార్ట్ మెంట్ ఖాళీ చేసి వెళ్ళాడని తెలిసింది.
    అయితే నాలుగురోజుల ముందు ఓ ఇన్ ఫార్మర్ ద్వారా ఓ ముఖ్యమైన విషయం తెలిసింది. భస్మ హైదరాబాదు వెళ్తున్నాడన్నమెసేజ్ అది.
    వెంటనే తనూ హైదరాబాదు బయల్దేరాడు.కౌశిక్.
    అయితే భస్మను ఎలా ట్రాప్ చేయాలా అనే విషయంలో ఓ నిర్ణయానికి వచ్చాడు కౌశిక్.       
                                             ***
    అదే ట్రెయిన్ మౌన కూడా జర్నీ చేయడం కాకతాలీయమే. ఆమె బెర్త్ నెంబర్ సిక్స్.
    ప్లయిట్ లో వెళ్ళే అవకాశం వున్నా ట్రైన్ నే ప్రిఫర్ చేసింది మౌన. విండో పక్కన కూచుని, ప్రకృతిని చూడాలనే కోరిక మౌనకు. రైలు జర్నీ అంటే ఆమెకు చెప్పలేనంత ఇష్టం. రైలు వెళ్తూంటే దాటి పోయే చెట్లు, కొండలు, ఇల్లు... అదే గమ్మత్తుయిన దృశ్యం.
    కాలేజీ రోజుల్నుంచి మౌన వూహలు, ఆలోచనలు విబిన్నంగా సాగేవి.
    భర్త పక్కనే కూచుని రైలులో ప్రయాణం చేస్తూంటే వుండే" అనుభవం వేరు.
    కిటికీ పక్కన కూచొని భర్త భుజం మీద తలవాల్చి అతను చెప్పే కబుర్లు వింటూ ప్రపంచాన్ని మరచిపోవాలి. అతను తన వెచ్చదనం తాలూకు అనిభూతి అబ్బురంగా వుంటుంది.
    అర్దరాత్రి వేళ...
    కొంగును భూజాల మీదుగా చుట్టుకుని, భర్త ఒడిలో తలపెట్టి దగ్గరగా ఒదిగి పడుకుంటే, భర్త లాలనగా తన నుదురుపై చేయివేసి నేనున్నాను సుమా... అనే భద్రతాభావాన్ని స్పర్శ ద్వారా అందిస్తుంటే ఎంత మధురంగా వుంటుందో...?
    ఓ అర్దరాత్రివేళ...
    మెలుకువ వచ్చి చూస్తే...
    తనమీదికి వంగి, తన నుదురు మీద ముద్దుపెట్టుకునే భర్త రొమాంటిక్ థాట్ ని వీక్షస్తే ఎంతో రోమాంచితంగా వుంటుంది.
    అలా... అలా వూహిస్తూ విండో సీటు దగ్గర కూచుంది.
    ఎసి కంపార్ట్ మెంట్ కావడం వాళ్ళ విండో డోర్ ఓపెన్ అయ్యే అవకాశం లేకుండాపోయింది. డానికి తోడు కేర్టేన్లు...
    టూటైర్ లో బెర్త్ ఖాళీ లేదన్న శాల్తీ మెడ పీకలదాకా కోపం వచ్చింది మౌనకు.
    తన అందమైన వూహల్ని విజువ లిజ్ చేసుకుంటూ బ్లాంక్ ట్ ని గుండెలో దాకా కప్పుకుని నిద్రలోకి జారుకుంది.
                                              ***
    టాయ్ లేట్ కు వెళ్ళడానికి లేచాడు భస్మ.
    చాలామంది లైట్లు ఆఫ్ చేశారు.
    మెల్లిగా టాయ్ లేట్ వైపు నడుస్తున్నాడు.
    అతని దృష్టి సిక్స్ నెంబర్ బెర్త్ మీద వున్న మౌన మీద పడింది. ఒక్కక్షణం ఏదో కదలిక. అతని జ్ఞాపకాల పేటిక పనిచేసే ప్రయత్నం చేసింది. కాఫే అందుకు అతని శరీరం మెదడూ సహాకరించలేదు.
    మౌన బెర్త్ దగ్గరకు వెళ్ళాడు.
    కాళ్ళ ముందు లీలగా ఏదో కన్పిస్తున్నట్టు అనిపించింది.
    మౌన తన చేతిలో చేయివేసి, తన చేయి అటూ ఇటూ వూపుతూ హలో అన్నా దృశ్యాన్ని అతను విజులైజ్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నాడు.
    ఒక్కక్షణం తర్వాత... తల విదిల్చి కామ్ గా టాయ్ లేట్ వైపు వెళ్ళాడు.
    ట్రయిన్ ఏదో స్టేషన్ లో ఆగింది.
    అర్దరాత్రి దాటి పావువడంవల్లా అందరూ మంచి నిద్రలో వున్నారు.
    కొద్దీ నిముషాల తర్వాత ట్రెయిన్ కదిలింది.
                                                                        ***
    కమిషనర్ కార్యాలయం...
    సిబీఐ ఏజెంట్ కౌశిక్ కమిషనర్ తో సమావేశమయ్యాడు. కమిషనర్ కౌశిక్ సాదరంగా ఆహ్వానించాడు.
    "మిష్టర్ కౌశిక్ మ్వ్వ్కు మా నుంచి ఏ సహాయ సహకారాలు కావాలన్నా అబ్యామ్తరంగా అడుగవచ్చు. దేశంలో అతి క్లిష్టమైన కేసులను ఎన్నింటినో పరిష్కరించుకుని మీరు అంధ్రప్రదేశ్ చెందినవారు కావడం మాకు గర్వకారణంగా వుంది" కౌశిక్ తో కరచాలనం చేస్తూ అన్నాడు కమిషనర్.
    "థాంక్యూ సార్... కాకపోతే ఈ ఆంద్రప్రదేశ్ కు చెందిన వ్యక్తే భస్మ కావడం నాకు బాధాకరంగా వుంది" ఓ నిట్టూర్పు విడుస్తూ అన్నాడు కౌశిక్.
    "వాట్... భస్మ అంధ్రప్రదేశ్ కు చెందిన వ్యక్తా?"
    "అవును.భస్మ  గురించి పూర్తిగా ఎంక్వయిరీ చేశాను. పాతికేళ్ళ క్రితం సిటీ హాస్పటల్ లో భరద్వాజ అనే సైంసిస్ట్ కు పుట్టిన బిడ్డే భస్మ...
    ఖాన్ అనే పాకిస్తాన్ ఏజెంట్, కరంజయా, లల్లోరామ్ ళ సాయంతో అతడ్ని తీసుకెళ్ళారు. అగర్వాల్ అనే సైంసిస్ట్ వీళ్ళతో చేతులు కలిపాడు.
    భ్స్మకు అతీత శక్తులున్నాయని వాళ్ళ నమ్మకం. ఇక్కడ అతీత శక్తులు అంటే సూపర్స్ పవర్స్... సైన్స్ ద్వారా లభించిన శక్తులు కావచ్చు. డాన్ని తన తెలివితేటలతో పెంచి పోషించి వక్రమార్గంలో భస్మకు తాయారుచేసాడు అగర్వాల్.
    ఖాన్ భారతదేశంలో ముప్పయ్యేళ్ళుగా తిష్ట వేశాడు.
    "మైగాడ్..."  
    "అందులో ఆశ్చర్యపోవల్సిందేమీ లేదు కమిషనర్ గారూ.... రష్యా గిఇదచారి అమెరికాలో యాభయ్యేళ్ళు పనిచేశారు.అమెరికా గూడాచారి రశ్యలిఒ అరవయ్యేళ్ళు పనిచేశాడు. ఏనాభయ్యేల్లు వయసులో కూడా గిఇధచర్యం నడుపుతున్న వ్యక్తిని ఆలస్యంగా రష్యా వాళ్ళు గుర్తించారు.
    ఈ విషయాలన్నీ మీకు తెలియవని కాదు. మరో విషయం..." అని ఆగి చుట్టూ చూశాడు కౌశిక్.
    "చెప్పండి పర్లేదు... ఇక్కడ మీరు మాట్లాడే ప్రతీమాట... ఈ గది గోడలు దాటి వెళ్ళాడు."
    "ఆఫ్ కోర్స్... నా జాగ్రత్తలో నేను ఉండాలిగా... నాలుగు రోజుల క్రితం అరెస్ట్ చేసిన ఉగ్రవాది అలియాఖాన్ ని చంపటానికి ఖాన్ ప్రయత్నిస్తున్నాడు" చాలా తాపీగా చెప్పి కమిషనర్ మొహంలోని రియాక్షన్ చూసాడు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS