19. "మాల్యవంతమను - నగమున నుండెడు
కేసరి యను నొక - వానరోత్తముడు |
మాల్యవంతమును - వదలివెళ్ళెను
గోకర్ణమను - శిఖరి చేరెను |
అచట ఋషులచే - నియమింపబడి
శంబసాదను డ | ను అసురుని గూల్చె |"
అని హనుమంతుడు - సీతతో పలికె
అంజలి ఘటించి - చెంతన నిలిచె .... ||శ్రీ||
20. "అంజనీదేవి - ఆ కేసరి సతి
వాయుదేవు వర | మున నను గన్నది |
కన్న తల్లి నను - ప్రాణప్రదముగ
పెద్ద చేసినది - ప్రేమ మీరగ |
సుగ్రీవునకు - మంత్రినైతిని
రామదూతనై - ఇటు వచ్చితిని |"
అని హనుమంతుడు - సీతతో పలికె
అంజలి ఘటించి - చెంతన నిలిచె .... ||శ్రీ||
21. పవన కుమారుని - పలుకులను విని
అతడు నిజముగా - వానరుడేనని |
రామదూత యని - నమ్మతగునని |
తెలిపినవన్నీ - సత్యములేనని |
ఆనందాశ్రులు - కన్నులు నిండగ
చిరు నగవులతో - జానకి చూడగ |
జయహనుమంతుడు - సీతతో పలికె
అంజలి ఘటించి - చెంతన నిలిచె .... ||శ్రీ||
22. "ఇకపై నీకు - శుభమగు తల్లీ
ఊరడిల్లుము - శోకము వదలి |
నీ క్షేమము విని - రాముడెంతగా
ఆనందముతో - పొంగునో కదా !
ఇదిగో తల్లీ - ఇది తిలకింపుము
రాముడంపిన - అంగుళీయకము |"
అని హనుమంతుడు - భక్తి మీరగను
అంగుళీయకము | ను సీత కోసగెను ..... ||శ్రీ||
__: 35 వ. స. సంపూర్ణము :__
36 వ. సర్గ
సీత మారుతితో ;
1. రామచంద్రుని - ముద్రిక జేకొని
అశ్రులు నిండిన - కనుల కద్దుకొని |
మధుర స్మృతులు - మదిలో మెదల
సిగ్గుచేత తన - శిరము వంచుకొని |
ఇన్ని రోజులకు - తనకు కలిగిన
శుభ శకునముల వి | శేష మనుకొని |
జానకి పల్కె - హనుమంతునితో
సంపూర్ణమైన - విశ్వాసముతో ..... ||శ్రీ||
2. "ఓ మహాబలా - వాయునందనా
ఓ మహాతేజ - వానరోత్తమా |
శతయోజనముల - వారిధి దాటి
ఒంటిగ నీవు - లంక జేరితివి |
రావణుడాదిగ - రాక్షసవీరుల
లెక్కచేయకే - నను కనుగొంటివి |"
అని పల్కె సీత - హనుమంతునితో
సంపూర్ణమైన - విశ్వాసముతో ..... ||శ్రీ||
.jpg)
రాముని ముద్రిక సీత గైకొని
అశ్రులు నిండిన కనుల కద్దుకొనె|
3. "ఎన్నడు రాముడు - ఇట కేతెంచునో
ఎన్నడు రావణు | ని హతము చేయునో |
లక్ష్మణుండు తన - అగ్ని శరములతో
క్రూర రాక్షసుల - రూపుమాపునో |
సుగ్రీవుడు తన - వానరసేనతో
చుట్టుముట్టి ఈ - లంకను గూల్చెనో |"
అని పల్కె సీత - హనుమంతునితో
సంపూర్ణమైన - విశ్వాసముతో ..... ||శ్రీ||
4. "రామ లక్ష్మణులు - వచ్చుదాకను
బ్రతుకనిత్తురా - అసురులు నన్ను |
రావణుడోసగిన - ఏడాది గడువు
రెండు నెలలలో | ఇక తీరిపోవు |
ప్రాణములను అర | చేత నిల్పుకొని
ఎదురుచూతు నీ - రెండు మాసములు |"
అని పల్కె సీత - హనుమంతునితో
సంపూర్ణమైన - విశ్వాసముతో ..... ||శ్రీ||
