Previous Page Next Page 
మొగుడే కావాలా? పేజి 25


    ఆ ప్రతిజ్ఞతతో ఆ గది మారుమోగిపోయింది.


    అవంతి అందరివంకా వాత్సల్యంగా చూసింది. అందర్నీ ఒక్కసారిగా అక్కున చేర్చుకుంది. అప్పుడామె కళ్ళనించి రెండు కన్నీటిబొట్లు రాలిపడినాయి.

    "నాకిప్పుడు ఎంతో తృప్తిగా వుంది. మరి కుసుమతోపాటు ఎవరో ఒకళ్ళం వెళితే బాగుంటుంది" అంది.


    "నేను వెళతాను" అంది శ్యామల.


    ఆరాత్రి కుసుమని, శ్యామలని బస్సెక్కించి వచ్చారు అవంతి, రమణి.


    రాత్రి పన్నెండు దాటినా అవంతికి తోచని ఆలోచనలతో నిద్రపట్టలేదు. ఆమెకెందుకో దుఃఖం ముంచుకొచ్చింది.


    అవంతి దిండులో మొహాన్ని దాచుకొని వెక్కి వెక్కి ఏడవడం మొదలుపెట్టింది.


                                            17


    లలితాంబ అధికార పార్టీలో చేరింది. అధిష్టాన వర్గాన్ని కలుసుకోడానికి ఢిల్లీ వెళ్ళింది.    


    అంచేత ఆ ఇంట్లో అందరికీ రవంత స్వేచ్ఛ లభించింది. భారతి అప్పటివరకు పాప్ మ్యూజిక్ పెట్టుకొని తన గదిలో ఆడి పాడి అలసిపోయింది.


    "అమ్మా కాఫీ!" అన్నాడు.


    "థాంక్యూ బాలూ" అంది భారతి.


    భారతి ఉషారుగా వున్నప్పుడు బాలయ్యని 'బాలు' అని పిలుస్తుంది అలా పిలిచినప్పుడు బాలయ్య చాలా ఆనందపడిపోతాడు.


    "నా బిడ్డలాంటి దానివమ్మా. నువ్వెట్టా పిలిచినా నా కిష్టమే అంటాడు.


    "కాఫీ వండర్ ఫుల్ గా వుంది బాలూ!" అంది భారతి ఓ గుక్క తాగి.

    
    "కాఫీ రోజూ చేసినట్లే చేశానమ్మా, కాకపోతే మీరానందంగా వున్నారు కనుక ఈ వేళ కాఫీ అంత బాగుందంటున్నారు. వెళ్ళి వేడినీళ్ళు పెట్టమంటారా?" అడిగాడు. "నో.... ఈరోజు నేను చన్నీళ్ళ స్నానం చేస్తాను" అంది.


    "జలుపు చేస్తుందమ్మా, మళ్ళీ అమ్మగారు ఢిల్లీ నుంచి వచ్చాక మీరు చన్నీళ్ళ స్నానం చేశారని తెలిస్తే నా పీక తెగిపోద్ది" అన్నాడు నవ్వుతూ బాలయ్య.


    "నీ పీక తెగకుండా నేను చూస్తాను గానీ నువ్వెళ్ళు?" అంది కాళీ కప్పుని బాలయ్యకి అందిస్తూ భారతి.


    "నా తల్లి బంగారు తల్లి!" అని బాలయ్య గదిలోంచి బయటికి నడిచాడు.


    "పిచ్చి బాలయ్యా!" అని నవ్వుకుంటూ భారతి స్నానాలగదిలోకి నడిచింది.


    స్నానాల గది తలుపుల్ని మూసి ఒక్కసారి ఒళ్ళు విరుచుకొన్నది భారతి.


    ఒంటిమీద నించి మాక్సీని తీసేసింది. లోపల లంగా, బ్రాసరీతో నిలబడి వాష్ బేసిన్ పైన గోడకున్న అద్దంలో చూసుకుని సన్నగా నవ్వుకొంది.


    వెనక్కి చేతులు పెట్టి బ్రాసరీ హుక్ ని తీసింది.


    అప్పటివరకూ బ్రాసరీలోపల బంధించబడి వున్న ఆమె నున్నని గుండ్రని వక్షోజాలు జైల్లో నిర్భంధంలో వుంచబట్ట బందీలు ఒక్కసారిగా విడుదలై బయట పడ్డట్టుగా బయటపడినాయి.


    ఒక్కసారి కాదు - మరోసారి మరోసారి అద్దంలో చూసుకొంది. ఆమె మనసులో ఏదో తెలీని అహం, పెదిమల్ని బిగించి అదోలా నవ్వుకొంది. గర్వంగా చూసుకొంది తననితానే భారతి.


    ఒంటిపైన మిగిలిన ఒకే ఒక ఆచ్ఛాదన లోపల లంగాతో నిలబడింది భారతి.


    ఎడం చేత్తో లంగా బొందుని లాగి లంగాని కిందికి జార్చేసింది.


    ఇంతవరకూ ఏ మగాడు కలలో సైతం కూడా ముట్టుకోని నున్నని బిగువైన శరీరాన్ని మురిపెంగా చూసుకొంది మళ్ళీ ఓసారి.


    తన శరీర సౌష్ఠవాన్ని కళ్ళార్పకుండా మనోహరంగా కొన్ని క్షణాలపాటు చూసుకొంది భారతి.


    తనకే ముద్దొచ్చే తన అందానికి భారతి గర్వపడింది.


    మగాడు ఆడదానికోసం, ఆడదాని చూపుకోసం ఎందుకంతగా చచ్చిపోతాడో అర్థం అయి సన్నగా నవ్వుకొంది.


    నిగనిగలాడుతోన్న ఆమె సన్నని తొడలు, కాలిపిక్కలు బంగారు స్తంభాల్లా ఉన్నాయి. గుప్పెటలో కొచ్చే సన్నని నడుము చుట్టూ లంగా బొందు చారిక పడటంచేత ఆమె నడుము కందిపోయినట్టుగా కనిపిస్తోంది. ఆమె పొట్ట పాల సముద్రపు అంచులా ఉంది. ఆమె గుండెలు బంగారు కొండల్లా ఉన్నాయి.


    సన్నని గుండ్రని భుజాలు ఆమె శరీరాకృతికి వింత అందాలనిస్తున్నాయి.


    లేత తమలపాకుకంటె నాజూకుగా ఉన్న పాదాన్ని కదిపి టబ్ లో అడుగుపెట్టింది. తామర తూడుల్లాంటి కోమలమైన చేతులనెత్తి మృదువైన అరచేత్తో షవరు తిప్పింది.


    కోడె వయసు చిన్నవాడిలో యవ్వనం పొంగినట్టు షవర్ లోంచి నీటి ధారలు వేగంగా ఆమె మీదికి దాడి చేసినాయి.


    అరచేతులతో మొహాన్ని కప్పుకొని కళ్ళపైన పడిన చన్నీళ్ళుని తుడిచేసుకొని జుత్తుని వెనక్కి తోసుకుని టబ్ లో పడుకొంది భారతి.


    చల్లగా ఉంది. హాయిగా ఉంది. పెళ్ళికాని ఆడపిల్ల బాత్ రూంలో స్నానం చేస్తూ కనే కలలు గురించి ఏ మహా కవీ చెప్పలేడు. ఎంత చెప్పినా ఇంకా మిగిలిపోతూనే ఉంటుంది.


    భారతికి టబ్ లోంచి లేవాలనిపించడం లేదు. ఉల్లాసంగా ఉంది. మనోరంజకంగా ఉంది. అలానే టబ్ లో పడుకొని గంటకు పైగా స్నానం చేసింది భారతి.


    ఒంటికి టవల్ చుట్టుకొని మెల్లగా తన గదిలోకి వచ్చింది.


    డ్రస్సింగ్ టేబుల్ ముందు నిలబడి తీరికగా ముస్తాబు చేసుకొంది.


    బంగారు ఛాయ కోల మొహం, నిగనిగలాడుతున్న చెంపలు, నవ్వితే వంకరు తిరుగుతోన్న ఎర్రని పెదిమలు మొనతేలిన గెడ్డం, నల్లని పెద్ద కళ్ళు, కోటేరేసిన ముక్కు, నల్లని నొక్కుల జుత్తు, రెండు జడలు వేసుకొంది.


    సన్నని పొడుగాటి చేతి వేళ్ళు, ఆ వేళ్ల గోళ్ళపైన క్యూటిక్స్ తళ తళమని మెరుస్తోంది.


    భారతి కట్టుకొన్న నీలంరంగు చైనా సిల్క్ చీరకొంగు నేలపైన పడుతోంది. పవిట భుజం పైనించి జారిపోతూ ఉంటే చేత్తో సర్దుకొని బంగారపు పిన్ను పెట్టుకొంది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS