Previous Page Next Page 
లేడీ కమెండో పేజి 25

ఈత కొడుతూ అలా ఎక్కువసేపు నీటిలోనే వుండిపోవడం ఆమెకు అలవాటు కావడం వలన ఎన్ని నిమిషాలు అలా వుంటుందో కౌంట్ చేయసాగాడతను.
వున్నట్టుండి వీరేష్ రోమాలు నిక్కబొడుచుకున్నాయి.
ఆమె నీటి అదుగున ఉన్న తీరు అసహజంగా అనిపించింది.
ఏదో అనుమానం వచ్చి పరిశీలనగా చూశాడు.
తనను ఆట పట్టించడానికి నీటి అడుగుకు పోలేదని.... ఏదో జరగ రానిది జరిగింది అనీ అర్ధం కావడంతో అమాంతం నీటిలోకి దూరాడు.
ఆమెను రెండు చేతులతో భుజానికి ఎత్తుకుని వేగంగా బయటకు తీసుకొచ్చాడు.
కళ్ళు తేలేసిన మృత శరీరంలా పడి వుంది....
వుబ్బిపోయిన పొట్ట చూడగానే నీళ్ళు తాగిందని అర్ధం కావడంతో పొట్టపై రెండు అరచేతులను వుంచి వత్తాడు.
భళ్ళుక్కున నోటి నుండి నీళ్ళు విరజిమ్మాయి....
వీరేష్ అలా వత్తుతూనే వున్నాడు__
తాగిన నీళ్ళు అన్నీ కక్కేసి బాధతో ఆమె మూలిగాక కానీ శాంతించలేదు అతను.
అపస్మారక స్థితిలో విన్న ధీరజను భూజనికి ఎత్తుకుని తన కారులోకి చేర్చాడు.
ఒక నిమషం ఆలోచించి మిత్రుడు అయిన ఒక డాక్టరుకు ఫోన్ చేసి పరిస్థితి చెప్పాడు.
తన ఇంటి ముందు వీరేష్ కారు దిగే సమయానికి ఆ డాక్టర్ కూడా వచ్చి వున్నాడు.
ఇద్దరూ కలసి ఆమెను మోసుకెళ్ళి బెడ్ పై పడుకోబెట్టారు.
ఆమెను పరిక్షించిన తరువాత వీరేష్ భుజం తట్టాడుడాక్టర్.
"పెద్ద ప్రమాదం తప్పిపోయింది వీరూ... ఎవరో ఈమెకు స్లో పాయిజన్ ఇచ్చారు. అది రక్తంలో కలసిపోక ముందే మగత కమ్మి ఈత ఈదటానికి అవయవాలు సహకరించలేదు. అందుకే నీటి అడుక్కి చేరిపోయింది.
అలాంటి స్థితిలో నీటిని తాగడం వలన లోపలకు తీసుకున్న పాయిజన్ నీటిలో కలసి తన ప్రభావాన్ని వెంటనే చూపలేకపోయింది. ఈలోపు నువ్వు ఆ నీటిని బయటకు కక్కించడం వలన స్టమక్ అంతా వాష్ అయినట్టయింది. అందుకే ఆమెకు మగత కమ్మింది తప్ప ఆమె ప్రాణాలకు ఎలాంటి అపాయమూ లేదు_ కాకపోతే ముందు ఒంటి మీద వున్న తడి బట్టలను తొలగించే మార్గం చూడు..."
ముసి ముసి నవ్వులు నవ్వుకుంటూ ఒక ఇంజక్షన్ చేసి వెళ్ళిపోయాడు డాక్టర్.
ఏసిపి వీరేష్ కనుల ముందు కూల్ డ్రింక్స్ మెదిలాయి.
ఎస్... సందేహం లేదు... ఎవరో ధీరజను మట్టుబెట్టడానికి ఆ కూల్ డ్రింక్స్ లోనే ఏదో కలపి ఉండాలి.... క్లబ్ సెక్రటరీ స్వయంగా పంపింది కాబట్టి ఆమె కావాలని చేసింది అనుకోవడానికి వీలులేదు. ఇంకెవరో ఆమెకు తెలియకుండా ఆమె చేత సర్వ్ చేయించి ఉండాలి.
అది ఎవరో తెలుసుకోవాలి...
ఒకవేళ తనను చంపబోయి, వాళ్ళు ఎక్కు పెట్టిన బాణం ధీరజ పైకి పోలేదు కదా... తనకు రావలసిన బాటిల్ ఆమె చేతికి వెళ్ళి వుంటుందా?
తన అనుమానం వృధా కానవసరం లేదు. లేనట్టయితే ఆమెకు శత్రువులు వుంది వుంటారు? తన కోసం పన్నిన ట్రాప్ లో ఆమె చిక్కుపడింది కానీ లేకపోయినట్టయితే ఆ డ్రింక్ తను తాగివుంటే ఈ స్థితిలో తను వుండి వుండేవాడు...
ప్చ్.... ఇంతలో ఎంత గండం గడచిపోయిందో....
గడియారంలోని ముళ్ళు చకచక తిరిగిపోతున్నాయి.
ముందు మనసు సందేహించినా 'తప్పో ఒప్పో డాక్టర్ చెప్పినట్టే వెంటనే ఆమె వంటిమీద ఉన్న తడి బట్టలను తొలగించి వేశాడు.
రాత్రి ఎనిమిది గంటల సమయంలో ధీరజ కనులు విప్పింది.
ఒక్కసారిగా తను ఎక్కడ వుండీ అర్ధం కాలేదు ఆమెకు.
తలంతా దిమ్ముగా వుంది.
ఎదురుగా తన వైపు ఆందోళనగా చూస్తున్న వీరేష్_
అంటే, తను ఎక్కడ వుంది?
పరిశీలనగా చూసిన  మరుక్షణం తను వీరేష్ పడక గదిలో వున్న విషయం అర్ధం కావడంతో జరిగింది లీలగా గుర్తుకు వచ్చింది ఆమెకు.
"ధీరజా... రెస్ట్ తీసుకో... పెద్ద ప్రమాదం నుంచి బయట పడ్డావు"
"వీరూ.... సమయానికి నువ్వు వున్నావు కాబట్టి సరిపోయింది. లేకపోతే నేను ఏమైపోయి ఉండేదానినో కదూ..."
బేలగా వుంది ఆమె గొంతు.
"ధీరజా! ఇప్పుడు ఏమైందని.... ప్రశాంతంగా పడుకో. విశ్రాంతి తీసుకుంటే మనసులో ఉండే టెన్షన్ తగ్గిపోతుంది"
 "నెవ్వర్.... ఒకప్పుడు అయితే అలాంటి ఫీలింగ్స్  ఉండేదికాదు. ఇప్పుడు ఎందుకుంటుంది ఏం జరిగినా చూసుకొనడానికి నువ్వు ఉన్నావు కదా! నువ్వు తోడుగా వుంటే నాకు ఏమీ కాదు అనే నా నమ్మకము. ఇలాంటి అప్పుడే కాసేపు కబుర్లు చెప్పు. హాయిగా వుంటుంది"
మాట్లాడుతూనే ఏదో గుర్తుకు వచ్చినట్టు దుప్పటి లోపలకి చూసుకుంది.
తను పూర్తిగా నగ్నంగా ఉన్న విషయం అప్పుడు అర్దమైంది.
మరుక్షణం ఆశ్చర్యంగా అతనివైపు చూసింది.
ఆమె భావాన్ని గమనించినట్టు మౌనంగా తల ఊపాడు.
"ఒక నిమషం తరువాత_
 ఏయ్ వీరూ.... ఆడదానివి తల్లి తరువాత కట్టుకున్న భర్త మాత్రమే నగ్నంగా చూసే హక్కు ఉంటుంది కదూ"
"అవును..."
"అతితే, నువ్వు న భర్తవు అయినట్టే లెక్క"
"ఏయ్... దానికీ, దీనికీ లింక్ పెట్టి ఏకంగా కాపురం పెట్టేయ్యాలని చూడకు"
"అదిసరే.... తడిసిపోయిన బట్టలన్నీ నిజంగా నువ్వే తీశావా?"
"అవును... ఏం నమ్మకం కలగడం లేదా?"
"అదేకదా నా  డౌట్.. నీకు అంత ధైర్యం ఎక్కడనుంచి వచ్చిందబ్బా అని"
"ముందు సందేహించినా... నిన్ను దక్కించుకోవడం కోసం తడిబట్టలను తీసివేయక తప్పలేదు.తీరా పొడిట్టలు వేద్దామంటే నాలోని పురుష స్వార్దం వద్దంది" అన్నాడు వీరేష్.
"అయితే మొత్తం చూశావు అన్నమాట"
"చూడకుండా బట్టలు ఎలా విప్పాను అనుకుంటున్నావు"
"అదే నిజం అయితే మళ్ళీ ఇంకొకసారి స్విమ్మింగ్ పూల్ లో దూకుతాను"
"ఎందుకు"


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS