Previous Page Next Page 
మహావృక్షం పేజి 23

"కాదు -శ్రద్ద తక్కువ" అంటూ నవ్వింది అనూష.
"అఫ్ కోర్స్.... వేయిరూపాయల నోటుమీద పడుకున్న నాకు కష్టపడడం ఎలా వస్తుంది చెప్పండి?"
"వేయిరూపాయల నోటుమీద పడుకోవడం ఏంటి?మీ ఇంట్లో మంచాలు, పరుపులు లేవా?" పెదాలు బిగపెట్టి చిలిపితనం కళ్ళల్లోకి ప్రవహిస్తుంటే అడిగింది.
నవ్వడతాను...."పిల్లలు పుట్టగానే జల్లెడలో పడుకోబెడ్తారుటకదా?కానీ,బహుశా  నన్ను మా అమ్మగారు వేయిరూపాయల నోటుమీదపడుకోబెట్టారేమో అనుకుంటూ..."
"పుట్టాగానే జేల్లెడలో పడుకోబెట్టరు....పదకొండోరోజు స్నానం చేయించి, జల్లెడలో పడుకోబెడతారు....అది సంప్రదాయంగా ఆచరిస్తున్నారంతే."
"ఓ...చూశారా....నాదంతా హఫ్ నాలెడ్జి....అందుకే అన్నాను గిల్టీగా ఫిలవుతున్నానని..."
"ఇకముందు ఆ ఫీలింగ్ రాకుండా  జాగ్రత్త పడండి."
ఆమె మాటల్లోని చిలిపిదనానికి నవ్వేశాడు ప్రశాంత్. అతనితో శృతి కలిపింది అనూష.
ఆ రోజు వాళ్లిద్దరిమద్యా మంచి స్నేహం ఏర్పడింది. అనూష అతనికి స్నేహితురాలేకాక,గురువుగా మారింది. తనతో పాటు కూర్చో బెట్టి చదివిస్తుండడం ప్రారంబించింది.
"ఎంత డబ్బుంటే మాత్రం చదువుకోవాలికానీ, చదువు కొనకూడదు కదా?" అంది ఓరోజు చదవడానికి బద్దకించి,లక్షలిస్తే అక్షరాలోస్తాయి అన్న ప్రశాంత్ తో.
"డబ్బు ఇంక దేనికి పనికొస్తుంది"అన్నాడు.
"ఎందుకూ పనికిరాని డబ్బు దేనికి?"
"డబ్బుమీద కోపంగా వున్నావు...అడిగానని అనుకోకు, నీరూ బాగా డబ్బున్నవాళ్ళేగా...."
"కావచ్చు... కానీ, ఆ భావనకి ణా మనసులో ఎప్పుడూ చోటుండదు. డబ్బుందని నేను నీలాగా రోజుకో కారులో రావడంలేదుగా? చీరలు కట్టడంలేదుగా?"
"అవునూ! చాలాసార్లు అడగాలనుకున్నాను....కాటన్ చీరలు మాత్రమె కడతామేం? పైగ డ్రెస్  లు నేసుకోవెం ?"వేసుకునేదాన్ని కానీ,ఇప్పుడు నేను మేడికోని....హుందాగా వుండాలి....కాటన్ మాత్రమె హుందాతనాన్నిస్తుంది....పైగా లాబ్ లో వున్నప్పుడు కాటన్ కట్టాలి....సింథటిక్ కట్టకూడదని రూల్ ఉందిగా."
"ఏమో! నాకు చిన్నప్పటినుంచీ అడంబరంగావుండడం అలవాటు చేశారు మా అమ్మా, నాన్న...ఇప్పుడు నీలా నిరాడంబరంగా వుండాలంటే ఎలా వస్తుంది సడన్ గా.
"నిన్ను సడన్ గా మానమనలేదే....స్లోగా మారడానికి ట్రై చేయి...."
"ఓ.కె. మేడమ్...."తలవంచి అభివాదం చేసి నవ్వాడు.
"అదిసరే... ఏం.బి.బి.యస్.అయ్యాక నేను కార్డియాలజీ చేస్తాను.నువ్వు ఏం చేస్తావు?" అడిగింది.
"నువ్వు కార్డియాలజీ చేయడం ఏంటి? ఆడవాళ్ళు గైనకాకజీ చేయాలి."
"ఎవరు రాశారీ శాసనం?"
"శాసనం ఏంటి? రివాజు....
"గాడిదగుడ్డుకాదూ.... ఆడవాళ్ళనగానే గైనాకాలజీ చేయాలన్నది మీ మగవాళ్ళ భావన. అసలు మొదట్నించి ఇంతేగా...ఆడవాళ్ళు చదువుకుని, ఉద్యోగాలు చేయడం మొదలుపెట్టగానే, టెలిపోన్ ఆపరేటర్లు, రిసెప్షనిస్టులు,స్టెనోలు,టైపిస్టులు,టీచర్లు, ఎయిర్ హౌస్టేస్ లు యిలా కొన్ని ఉద్యోగాలు కేటాయించారు. చదువు అనగానే హౌం సైన్స్, టీచర్ ట్రైయినింగ్, నర్స్ ట్రెయినింగ్. ఎందుకీ కేటాయింపులు, వేరే ఉద్యోగాలకు ఆడవాళ్ళు పనికిరారనా? చేయలేరనా? నాకర్ధంకాదు....ఆఖరికి ఈ రోజుల్లో కూడా, కల్పనాచావ్లా,కిరణ్ బేడీలాంటి వాళ్ళాని చూసి కూడా ఇలా మాట్లాడడం, అందులోనూ ఈ జనరేషన్ కి సబంధించిన యువకుడని....వేరిబాడ్
"అమ్మ తల్లీ....బుద్దితక్కువై అన్నాను క్షమించు"అంటూ చెంప వేసుకుంటా,వేసుకుంటా,చెంపలు వేసుకుంటా."
"గట్టిగా వేసుకో.... జీవితాంతం గుర్తుండేలా"అంది.
ఆమె చేతులు లాక్కుని తన చెంపలమీద మృదువుగా కొట్టుకున్నడు. రేడు చేతుల్తో. అతని మొహం దగ్గారగా తీసుకుని నుదిటిమీద ముద్దు పెట్టుకుంది.
"అబ్బ....ఎంతదృష్టం" పరవశిస్తూ అన్నాడు.
"చాల్లే పరవశం...ముందు నేనడిగిండానికి సమాధానం చెప్పు."
"ఏంటది?"
"నువ్వు ఎందులో స్పెషలైజేషన్ చేస్తావు?"
"రోమాన్స్ లో...."
"షటప్."
"ఎందుకు? వాత్సాయనుడొక్కడే అయ్యాడు రోమాన్స్ కి పితామహుడు. నేనెందుకు సెకండ్ వాత్సాయనుడు కాకూడదు?"
"ప్రశాంత్....నువ్విలా సబ్జెక్ట్ డైవర్ట్ చేస్తే చెంపపగలకోడతాను. చెప్పు. ఏం చేస్తావు?"
"నేనేం అనుకోలేదింకా."
"ఏంటి? హౌస్ సర్జన్సీ అవుతోంటే ఇంకా భవిష్యత్తు నిర్ణయించుకోలేదా?"
"ఏమో!" భుజాలేగారేసాడు. అసలీ వైద్యవృత్తి నుంచి డైవర్ట్ అవలనుకుంటున్నాను."
"అంటే....మెడిసన్ చేసి, ఏం చేద్దామని?"
ప్రశాంత్ పచ్చికలో వెల్లకిలా వాలి, అనూష ఒళ్ళో చేతులు పెట్టుకుని అన్నాడు -"కోటీశ్వరుడి కొడుకు, కాస్త పెద్ద చేదువు చదవాలని మా నాన్ననన్ను మెడిసన్ లో చేర్పించారు. సరే బుర్ర వుందికదా అని చదివాన్...కానీ ఇప్పుడనిపిస్తుంది. వీధికిద్దరు డాక్టర్లు, అడుగుకో సూపర్ స్పెషాలిటి హాస్పిటల్ వున్న ఈ రోజుల్లో నేను డాక్టర్ ని అయి ఏం ప్రయోజనం? పైగా బోలెడన్ని ప్రైవేట్ కాలేజీలు వచ్చేసాయి. ఇంక ఎక్కడ చూసినా ఇంజనీర్లు, డాక్టర్లే వుంటారు. ఏం విలువ వుంటుంది? అందుకే నేను సివిల్స్ కి ప్రిపేర్ ఆవాలనుకుంటున్నాను."


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS