Previous Page Next Page 
యుద్దక్షేత్రం పేజి 24


    "పద ప్రశాంత్! మన లెక్చరర్స్ అక్కడ వున్నారు. మనం అర్జంటుగా అటువెళ్లాలి. ఆ గుంపులో కలిసిపోవాలి!" అన్నాడు సూరిబాబు.

     "ఎందుకు? నేనేం తప్పు చెయ్యలేదే!"

    "నాకంతా తెలుసు. కానీ ముందు నేను చెప్పినట్లు చెయ్యి. నీకు తెలీదు. నువ్వెంత ప్రమాదంలో చిక్కుకోబోతున్నావో! ముందు నడువ్!" అన్నాడు సూరిబాబు.

     ప్రశాంత్ మౌనంగా అతన్ని అనుసరించాడు.

     సైన్స్ ఎగ్జిబిషన్ కోసం వచ్చిన కొంతమంది స్టూడెంట్స్ తోపాటూ, సైన్స్ లెక్చరర్ శ్యామలరావు, వైస్ ప్రిన్స్ పాల్ బాబుల్ రెడ్డి వున్నారు.

     స్టూడెంట్స్ చెల్లాచెదురుగా పరుచుకొని వున్నారు. అక్కడ గ్లాస్ చేంబర్స్ లో ఎగ్జిబిట్ చేసిన "జువలాజికల్ ప్రిజర్వేషన్స్ ని" చూస్తున్నారు.

     ప్రశాంత్, సూరిబాబు అక్కడికి నడిచారు.

     "చాలా బావుంది కదూ?" అన్నాడు  ప్రశాంత్.

     మరో స్టూడెంట్ కిరణ్ నవ్వి...

     "ఢిల్లీలో జరిగిన సైన్స్ ఎగ్జిబిషన్ లో ఇంతకన్నా వండ్రఫుల్ గా డిస్ ప్లే చెయ్యబడింది" అన్నాడు.
     మరో ముగ్గురు మిత్రులు వాళ్ల దగ్గరకొచ్చారు.

     "డిటైల్స్ అన్నీ బోర్డు మీద రాసి పెట్టి వుంటే బావుండేది. ఆ బోర్డుమీద అక్షరాలు సరిగ్గా కన్పించటం లేదు కదూ?" అని అన్నాడు ఒకడు.

    అంతలో సైన్స్ లెక్చరర్ వాళ్లవంక చూస్తూ...

     "కమాన్! ఇటురండి!" అనిపిలిచాడు.

     అదే క్షణంలో ఒక స్టూడెంట్ పరుగున వచ్చి.......

    "సార్! గెస్ట్ హౌస్ లో మాధురిని ఎవరో రేప్ చెయ్యబోయారట! అన్నాడు గట్టిగా.

     "వ్వాట్?" ఆశ్చర్యపోయాడు సైన్స్  లెక్చరర్.

     అంతే!

    మరుక్షణం స్టూడెంట్స్ అందరూ గెస్ట్ హౌస్ వైపు పరుగు తీసారు.

                      13

    ఎవరో గెస్ట్ హౌస్ మెయిన్ స్విచ్ ఆపేశారని తెలిసి, వాచ్ మెన్ అటు పరుగు దీసాడు. మళ్లీ స్విచ్ వేసేసరికి పది నిమిషాలు పట్టింది.

     ఈలోగా గెస్ట్ హౌస్ తలుపులు తెరిచేసారు స్టూడెంట్స్ కొందరు. మరికొంతమంది విజిటర్స్ కూడా అక్కడ గుమిగూడారు. అందరూ ఒక్కసారిగా హాల్లోకి వెళ్లగానే, జిగేల్ మని కరెంట్ వచ్చింది!

    చిక్కటి కాంతి!

    ఒక మూలగా దీనంగా రోదిస్తూ మాధురి!

    ఆమె జాకెట్టు చిరిగిపోయి వుంది. ఆరోగ్యంగా, సౌష్టవంగా, బింకంగా, పొందికగా... నిగనిగలాడుతున్న ఆమె ఒంపుసొంపుల్ని దాచుకోవడానికి ఆమె తెగ ఇబ్బంది పడిపోతోంది.  జుత్తంతా చెదిరి పోయి, చీర కుప్పగా కాళ్ల దగ్గర పడివుంది. సిగ్గుతో ఆమెముఖం కందిపోయింది.

     వెంటనే ఆమె చీర అందుకుని ఒంటిమీద కప్పుకుంది.
 
     "వ్వాట్ హ్యాపెండ్?" ఇంగ్లీషు లెక్చరర్ అడిగాడు.

     "సర్!" బోరుమంది ఆమె.

     "యస్.... చెప్పు... ఏం జరిగింది......?"

    "సర్!ప్రశాంత్.... నన్ను... నన్ను... బలవంతం చెయ్యబోయాడు...." అంటూ ఒక్కసారిగా ఏడుపు లంకించుకుంది మాధురి.

     ఈలోగా వైస్ ప్రిన్స్ పాల్ బాబుల్ రెడ్డి, సైన్స్ లెక్చరర్ శ్యామలారావుతోపాటు మరికొందరు స్టూడెంట్స్ కూడా వచ్చారక్కడికి.

    "మిస్టర్ ప్రశాంత్?" వెనుతిరిగాడు ఇంగ్లీష్  లెక్చరర్.

     "యస్ సర్..." వెనుకనుంచి వినిపించింది.
 
    "వాటీజ్ దిస్ న్యూసెన్స్....?" అరిచాడతను.

    "ఏమయ్యింది సార్? అడిగాడు ప్రశాంత్ అమాయకంగా.

     "డోంటాక్ నాన్సెన్స్.... మాధురి ఏం చేబ్తోందో వింటున్నావా?"

    "లేదుసర్....."

    "ఇంతసేపూ నువ్వెక్కడున్నావ్?" అడిగాడు  గంభీరంగా.

    వైస్ ప్రిన్స్ పాల్ బాబుల్ రెడ్డి జవాబిచ్చాడు.

     "మాతోపాటూ వున్నాడు. ఏమయ్యింది మాధురికీ?"అన్నాడు.

     వెంటనే మాధురి అందుకుంది.

     "లేదు సార్! ...నన్ను ప్రశాంత్ రేప్ చెయ్యడానికి ప్రయత్నించాడు. ఇంతవరకూ ఇక్కడే వున్నాడు...."

    "నాన్సెన్స్!"అరిచాడు ప్రశాంత్.

    "ఇంతవరకూ చాలాసార్లు ఇలా  నామీద చెయ్యని నేరాలు మోపి నన్ను అవమానించాలని ప్రయత్నించింది ఆమె. ఐ డోంట్ అండర్ స్టాండ్ వాట్ హెర్ ఇంటెన్షన్ ఈజ్!" అన్నాడతను ఆవేశంగా.

     అంతే! ఒక్కసారిగా స్టూడెంట్స్ లోంచి అరుపులు, కేకలు వినిపించాయి. కలకలం రేగింది హఠాత్తుగా!

    "ఇంతమంది వుండగా అతనే కావలసొచ్చాడా బేబీ!" అన్నారెవరో. గొల్లుమని నవ్వులు.

     "లేడీ సాడిస్ట్ ని చూడదల్చుకున్న వాళ్లు రండయ్యా రండి!!" మరెవరో అరిచారు హేళనగా.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS