Previous Page Next Page 
డింగ్ డాంగ్ బెల్ పేజి 23

    ఆ అమ్మాయి తల వెనక్కి తిప్పి చూసింది. ఓ అబ్బాయి కెమెరా ముందుకు వచ్చి స్మిత భుజం చూట్టూ చేయి వేసి, "హాయ్... ఐయా మ్ వినీల్. లవర్ ఆఫ్ స్మిత" అన్నాడు.

    "వేల్... మీ స్వీట్ మెమోరీస్ చెప్పండి."

    వాళ్ళిద్దరిలో ఆ అమ్మాయి కొద్దిగా సిగ్గుపడ్డా ఆ అబ్బాయి చెప్పుకు పోతున్నాడు. "ఫస్ట్ టైం ఓ బైక్ యాక్సిడెంట్ లో కలుసుకున్నాం తర్వాత యాక్సిడెంట్ ల్ లావ అన్నమాట."

    వెరీగుడ్... మీ పెళ్ళెప్పుడు?"

    "నెక్స్ట్..." అరిచాడు రాహుల్.

    మరో అబ్బాయి వచ్చాడు. అతను ఒంటరిగా వచ్చాడు. తన గర్ల్ ప్రెండ్ పేరు చెప్పాడు. తనిప్పుడు డీల్లీలో వుందని, ఆ అమ్మాయి ఫోటో పర్సులో నుంచి తీసి చూపించాడు. అ ఫోటో ను క్లోజప్ లో ఘాట్ చేశారు.

    ఇలా వరసగా అమ్మాయిలూ, అబ్బాయిలు కెమెరా ముందుకు వస్తూ తామో ప్రేమించిన వాళ్ల పేర్లు చెబుతూ వున్నారు. కొందరు ఒంటరిగా వచ్చారు. మరి కొందరు జంటలుగా వచ్చారు.

    అంకిత్ ఈ ప్రోగ్రాం చాలా అద్బుతంగా అనిపించింది. రకరకాల మనుషులు... ఈ రోజు కెమెరా ముందు ఇలా దైర్యంగా ఒప్పుకున్నా ఈ ప్రేమికుల్లో ఎంతమంది వచ్చే సంవత్సరం వరకూ ప్రేమికులుగా ఉంటారు. ఏమ్తమంది దంపతులు అవుతారు? ఎంత మంది సిన్సియర్ గా ఈ ప్రేమను కంటిన్యూ చేస్తారు.

    ఈ ప్రోగ్రామ్ కు ఇంతటి రెస్పాన్స్ వుంటుందని వూహించలేదు అంకిత్. పెళ్ళి సంభందం కుదిరి, త్వరలో పెళ్ళి చేసుకోబోయే జంటలు కూడా వచ్చారు.
   
                                                                       ***

    హాలులో నిలబడి టెన్స్ ఫీలవుతోంది మృదువని. ఏం చేయాలి? ఇక్కాద్నుమ్చి తప్పించుకుని బయటపడాలి. తను రాత్రే పొరపాటున చేసింది. ఏదో ఓ ట్రెయిన్ లో ఎస్కేస్ అయి, ఆ తర్వాత ఢిల్లీలోవెళ్తే బావుండేది. శరణ్య గురించి వువరాలు తెలిసేవి... తనకీ టెన్షనూ వుండేది కాదు" ఇలా ఆలోచిస్తూ వుంది.

    తను పారిపోవాలి... వెంటనే స్టూడియోలో నుంచి బయటకు వెళ్ళబోయింది. ఎప్పుడు గమనించింది. గేటు దగ్గర ఫోలీసులు జీపు ఆగి ఉంది. అందులో నుంచి ఫోలీసులు దిగి ఎంట్రన్స్ దగ్గర నిలబడ్డా అమ్మాయితో ఏదో మాట్లాడుతున్నారు. వాళ్ళు లోపలకి వస్తారా?

    సరిగ్గా అప్పుడే 'నెక్స్ట్' అన్నా కేక వినపడింది.

    ఈ లోగా షంషేర్ దాదా మనుషులు లోపలకి వస్తూ కనిపించారు. వెంటనే మృదువని లోపలకి పరుగెత్తింది. అక్కడో అమ్మాయి ఘాటింగ్ రూమ్ లోకి వెళ్ళబోతూంది.

    ఆమెను డీకొట్టి, ఆమెను దాటుకుంటూ ఘాటింగ్ రూమ్ లోకి పరిగెత్తింది.

    "ఏమిటో ఈ దూకుడు... క్యూ పాటించారు కదా..." ఆ అమ్మాయి గొణుక్కుంది.

    మృదువని లోపలకి పరుగెత్తింది.

    కెమెరా 'రం' లోనే ఉంది. వగరుస్తూ లోపలకి పరుగెత్తుకొచ్చిన మృదువని అక్కడి వాతావరణం చూసి బిత్తరపోయింది.

    "మేడం మీ పేరు..." వెనక నుంచి రాహుల్ అరుస్తున్నాడు. అంకిత్ ఆ అమ్మాయి వైపు విన్మయంగా చూస్తున్నాడు.

    కేమెరా ముందుకు వచ్చే అమ్మాయిలు నీట్ గా తయారై స్టయిల్ గా వస్తారు. కానీ మృదువని పరుగెత్తుకు రావడం, అలా రావడం వాళ్ళ వగరస్తూ వుండడం, ఆమె మొహమంతా స్వేదం...

    ఆమెలో వింత అందం కనిపించింది అంకిత్ కు.

    "మేడమ్ మిమ్మల్నే మీ పేరు" రాహుల్ మరోసారి అడిగాడు.

    "మృదువని" చెప్పింది గబ్బుక్కున మృదువని.

    "మీరేవర్ని" ప్రమిస్తూన్నారో చెప్పండి..."

    హాలులో బూట్ల శబ్దం... ఏం చేయాలో తోచడంలేదు.

    "కమాన్ టెల్  ... మీరు ప్రేమించే  అబ్బాయి ఎవరు?" రాహుల్ అడిగాడు.

    మృదువని కెమెరా పక్కనే వుంది, ఘాటింగ్ ను అబ్జర్వ్ చేస్తావున్నా అంకిత్ వైపు చూపెట్టింది.

    షా...క్... ఒక్క క్షణం మరో క్షణం ఆశ్చర్యం... ఇంకో క్షణం అబ్బురం.. ఆపై క్షణం అన్ని అనుభూతల సమ్మిళితం...

    రాహుల్ అలానే చూస్తోండిపోయాడు.

    అమికిట్ మృదువని వైపే చూస్తున్నాడు. ఆమె చూపుడు వేలు తన వైపే చూపిస్తూ తన గుండె సవ్వడిని నియంత్రిస్టోన్నట్టు అనిపిస్తూంది.

    ఒక ఊహా... ఒక సందిగ్దం... ఒక విస్మయం... ఒక అద్బుతం... ఒకఅనుభూతి... ఇవన్నీ కలసి, కలగలపి తనను చుట్టుముట్టేశాయా?

    కలలోనైనా వూహించని వుశయం. ప్రేమంటే ఏమిటని ఎవరైనా అడిగితే... ఏమో నాకేం తెలుసు... అనే తను... లావ ఎట్ ఫస్ట్ సైట్ అంటే ఇప్పటీకీ కచ్చితంగా నిర్వహించలేని తను...

    దిగింతాలనుంచి... దిగి వచ్చి, తన కోసమే కదిలి వచ్చిందా? ఏ ఫాంటసీ చిత్రమో... తన కాళ్ళ ముందు కలలా వచ్చిందా?

    అతను అబ్బురమాత్రడై... అనుభూతి పర్యంతంయ్యేడు. 

   
                                                 ***

    "అంకిత్... ఏయ్... అంకిత్.."

    "సార్.."

    "అంకిత్.."

    ఉలిక్కిపడి కళ్ళు తెరిచాడు.

    అంతా చీకటిగా ఉంది. ఎదురుగా అ అమ్మాయి లేదు. అదేమిటి? ఆ అమ్మాయి లేని తన బ్రతుకు చీకటేనని ప్రకృతి సింబాలిక్ గా చెప్పింది?

    తనతోపాటే, వేలుతురునీ అ అమ్మాయి తీసుకువెళ్లిందా?

    "అంకిత్... ఏమైంది..." రాహుల్ కుదిపి అడిగాడు.

    "సార్... మిమ్మల్నే... ఏమైంది సార్" చేతన్ అరిచినంత పని చేశాడు.

    "ఒరే  రాహుల్... ఆ అమ్మాయి ఎక్కడరా?" అడిగాడు.

    అలా అడుగుతున్నప్పుడు అంకిత్ మనసు ఉద్వేగానికి లోనైంది.

    "ఏ అమ్మాయి బాసూ?"

    "ఇందాక... నన్ను ప్రేమిస్తూన్నానని చెప్పిన అమ్మాయి."

    "ఇందాక కాదు... మార్నింగ్ ...మార్నింగ్ చెప్పింది."

    "ఇందాకే చెప్పింది కదరా."


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS