Previous Page Next Page 
భస్మనేత్రం పేజి 23

    "అలాగేసర్... ఐ విల్ దూ మై లెవల్ బెస్ట్... ఒక్క విషయం మా ఖచ్చితంగా చెప్పగలనుసార్... ఈ నేరాల వెనకపాకిస్తాన్ కు చెందిన వ్యక్తులు వున్నారని నా అనుమానం.
    అంతేకాక హైదరాబాదు లో పాక్ టెర్రరిస్టులు ఐఎస్ఐఏజంట్లు పట్టుపడ్డారు. డానికి సంభందించిన దిటేయిల్స్ కూడా మనం సంపాదించవలసి వుంది.
    ఏది ఏమైనా సాధమైనంత త్వరలో ఈ కేసును నేను సాల్వ్ చేయగలను అనుకుంటున్నాను..." అంటూ లేచాడు కోశిక్.
    "ఓ...కే యంగ్ మెన్ అల్ దిబెస్ట్..." హొంమినిస్టర్ లేచి కౌశిక్ తో చాలనం చేస్తూ అన్నాడు.
    అందరూ డిస్పర్స్ అయ్యారు.
                                                                  ***
    "ఏయ్... మౌనీ... నీ గ్రేకువీరుడు ఏమంటున్నాడే?" అడిగింది. సుచిత్రాశర్మ.
    ఆ రోజు మద్రాస్ వెళ్ళి వచ్చింది సుచిత్రాశర్మ. ముంబాయ్ నుంచి వచ్చింది మౌనాంజాలి.
    "ప్చ్... గ్రీగువీరుడు మౌనవీరిడిలా వున్నాడే... నేను మౌన అని పేరు పెట్టుకుని, వాగుతూంటే ఆ జీవుడు కనీసం స్మయిల్ అయినా చేయడం లేదు... మానవుడు నవ్వి ఎన్నేళ్లయిందో" అంటూ ఆ మూడ్రోరోజులుజరిగిన విశేషాలు అన్నీ చెప్పింది మౌన.
    "అంటే... ఇక్కడితో ఆ గ్రీగువీరుడు ప్రేమకధకు పుల్ స్టాప్ పెడతానంటావ్ అంతేనా?" అంది సుచిత్రశర్మ.
    "పుల్ స్టాపా...?నో.. నో.. కంటిన్యూ చేస్తాను. ఎలా నా దారిలో రాడో చూస్తాను. అసలు నా డౌట్ ఏమిటంటే అతను కావాలనే నా ముందు అల నటిస్తున్నడేమోనని..."
    "నీ ముందు నటించాల్సిన అవసరం అతనికేంటి? బహూశా అతని మెంటాల్టియే అంతనేమో..."
    "ఛా... వూర్కో... నాకు తెలిసి అలాటి మనుషులు వుంటారని అను కోవడంలేదు."
    "ఏమో.." అంది ఏదో ఆలోచిస్తూ సుచిత్రాశర్మ.
    ఇంతకీ ఏం చేద్దామనుకుంటున్నావు?" మళ్ళీ తనే అడిగింది సుచిత్రాశర్మ.
    "ముందు నేను హైదరాబాదు కు వెళ్ళాలి. బామ్మకు సీరియస్ గా వుందిట... ఓ వారం రోజులైన అక్కడ వుండాలి. డ్యూటీ కూడా అక్కడే వుండొచ్చు..."
    "ఊహా లోకాల్లో విహరిస్తున్నావా? మరి నీ గ్రీకువీరుడి సంగతేమీటి?"
    "అదే ఆలోచిస్తున్నాను. ఓ పనిచేయాలి కూడా అనుకున్నాను..."
    "ఏంటిది?"
    "నా శాలరీ రాగానే ఓ ప్రోపోషనల్ కిడ్నాపర్ ని పట్టుకుని అ భస్మ ని కిడ్నాప్ చేయించి హైదరాబాదు తీసుకెళ్దామని అనుకుంటున్నాను..."
    అంది తాపీగా మౌన.
    అదిరిపడింది సుచిత్రాశర్మ.
    "యిదంటే మౌనీ... మరీ క్రిమినల్ బుర్ర అయిపోతుంది నీది... అన్నంత పని చేసేలా వున్నావు..." అంది సరాదాగా.
    "మరి ఏం చేయమంటావు? ఎన్నిరకాలుగా త్రి చేసినా కనీసం కన్నెత్తి చూడని ఆ జీవుడ్ని ఏం చేస్తే బావుంటుందో నువ్వే చెప్పు..." అంది మౌన.
    "యూ ఆర్ కరెక్ట్... అల్ డ బెస్ట్" అంది సుచిత్రాశర్మ.
                                                                        ***
    రైల్వేష్టేషన్ కోలాహలంగా వుంది.
    హైదరాబాదు వెళ్ళాల్సిన ట్రైన్ ఆరో నెంబర్ ప్లాట్ ఫామ్ మీద  వుంది.
    కూలీలు, కాఫీ, టీలు అమ్మేవాళ్ళు హాదవిడిగా అటూ, ఇటూ తిరిగి అరుస్తున్నారు. రద్దీగా వుండే ఆ రైల్వేష్టేషన్ అయిదారు పెద్ద సైజు చేపలమార్కెటులా వుంది. అది మరో పడి నిమిషాల్లో ట్రైన్ హైదరాబాదు వైపు కదిలింది.
                                                                             ***
    "మనం చాలా జాగ్రత్తగా హేండిల్ చేయాలి. హైదరాబాదు ఫోలీసులు సామాన్యులు కారు. మనం మన గేతప్పులు, పేర్లు ఎక్కడా మిస్సవ్వకూడదు" చెప్పాడు ఖాన్.
    అతనిప్పుడు సిక్కు గెటప్ లో వున్నాడు. తలపాగా పెట్టాడు. కరంజయా మీసాలు తీసివేసి కోటు వేసుకుని బిజినెస్ మాగ్నాట్ లా వున్నాడు.
    అగర్వాల్ యిప్పుడు ఓ రిటైర్డ్  ప్రోపిసర్.
    లల్లూరామ్ సఫారీ సూత లో వున్నాడు.
    అందరూ మారూ పేర్లలో ప్రయాణం చేస్తున్నారు. కిటికీ దగ్గర భస్మ కూచుని వున్నాడు.
    అతని మొహంలో ఏ భావమూ లేదు. వరసుగా బెర్త్లు వచ్చాయి.
    రాత్రి పదకొండు దాటింది. చలికాలం కావడం, అందులోనూ ఏ.సి. కంపార్ట్ మెంటు కావడంతో చలి వణికిస్తోంది. ట్వంటీ నుంచి ట్వంటీ ఫోర్ వరకూ బెర్త్ లు ఎలాట్ అయ్యాయి వాళ్లకు.
    ప్రయాణికులకు ఒక్కొక్కరు నిద్రలోకి జారుకుంటున్నారు.
    లైట్లు ఆఫ్ చేస్తున్నారు.
    భస్మకు లోయర్ బెర్త్ యిచ్చాడు. మిడిల్ బెర్త్ లో పడుకోవాల్సిన అగర్వాల్ లోయర్ బెర్త్ లో పడకేశాడు. బెర్త్ చివర కూచుని వున్నాడు భస్మ.
    అంత చలిలో కనీసం చేతులు కూడా ముడుచుకోలేదు. అలాగే వెనక్కివాలి ఏదో ఆలోచిస్తూ వున్నట్టు వుండిపోయాడు. అదే కంపార్ట్ మెంట్ లో  నలబై అయిదో నెంబర్ బెర్త్ లో సిబిఐ ఆఫీసర్ కౌశిక్, భ్స్మకు సంభందించిన ఫిల్ తిరగేస్తున్నాడు.
    వారం రోజుల వ్యవధిలో జర్నలిస్టు నితీష్ రాయ్ రాసిన వార్త ఆధారంగా కంప్యూటర్ ద్వారా తయారైన భస్మ ఫోటోను రకరకాల యాంగిల్స్ లో ప్రింటవుట్ తీసి పరీశీలించాడు. తర్వాత కిన్నెరా బ్యాంకు పరిసర ప్రాంతాలను రౌండ్ ప్ చేశాడు.
    కొన్ని ఏరియాల్లో సేల్స్ బోయ్ లా, మరికొన్ని ఏరియాల్లో జనాభా సేకరణ అధికారిగా వెళ్ళాడు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS