Previous Page Next Page 
అనాథ మహిళా సదన్ పేజి 24


    కులదైవమైనా కర్పూరం వెలిగించగానే ప్రత్యక్షమై పోకూడదు. అందుకే వంటంతా పూర్తయ్యాక నింపాదిగా హాల్లోకి వచ్చింది. దాసు పేపర్ చదువుతూ వాలుకంట ఆమెను చూస్తున్నాడు.

 

    ఆమె ఆయన కెదురుగ్గా వున్న సోఫాలో కూర్చుంది. ఆమె ఎంత హొయలుగా కూర్చుందంటే పైట సగం జారిపోయి ఎద పైభాగం సగం చక్కెర జీరాలో కూరుకుపోయి, సగం బయటికి కనిపిస్తున్న రసగుల్లాలా వుంది. సెక్సీతనాన్ని మధ్యలోనే పూర్ణంలా పెట్టి కూరేసిన కజ్జికాయల్లా వుండే నడుం మడతల్లో ఆయన చూపు చిక్కుకుపోతోంది.  

 

    బాగా సున్నం పెట్టి తాంబూలం వేసుకున్నాక ఎర్రగా అయిపోయిన నాలుకను సున్నాలా చుట్టి చూపించినట్టు బొడ్డును తడుముతున్న ఆయన కళ్ళను దళసరి చీర కొంగు అడ్డుకుంటోంది.

 

    "వస్తూనే గుడ్ న్యూస్ అన్నారు. అదేమిటో ఊహించుకోలేక సతమతమైపోతున్నాను" అంది సరితాదేవి అదోలా ఆయన్ని చూస్తూ.

 

    "ఇప్పుడే చెప్పను. దక్షిణ యివ్వాల్సిందే" అన్నాడు ఆయన కొంటెగా నవ్వుతూ.

 

    "అయితే పదండి! ముందు భోజనం ముగించండి" అని లేచింది. గుడ్ న్యూస్ ఏమిటో వినాలని కుతూహలంగా వుంది. ఈ మాట కోసమే వున్న పరమేశదాసు ఆమెను అనుసరించాడు.

 

    చికెన్ వేపుడు, చేపల పులుసు, ఎగ్ మసాలాతో సంతృప్తిగా భోజనం ముగించారు యిద్దరూ.

 

    "తాంబూలం కూడా లోపలే" అన్నాడు దాసు చేతులు కడుక్కుంటూ.

 

    సరితాదేవి తాంబూలం పళ్లెంతో బెడ్ రూమ్ లోకి అడుగుపెట్టింది. దాసు ఆమె పైట చెంగు పట్టుకుని లోపలికి వెళ్ళినట్లు వెనకాలే వెళ్ళాడు.

 

    ఓ పిల్లోని నిలువుగా మంచానికి ఆనించి, పూర్తిగా నడుంవాల్చి పడుకున్నాడు దాసు. సరితాదేవి మంచం మధ్యలో పద్మాసనం వేసుకుని కూర్చుని తమలపాకుకు సున్నం రాస్తూ. "మరి ఇప్పుడయినా చెప్పండి ఆ శుభవార్త ఏమిటో?" అని అడిగింది.

 

    దానికి ముసిముసిగా నవ్వుతూ, "మాటంటే మాటే, దక్షిణ ఇచ్చాకే చెబుతా."

 

    ఇక లాభం లేదు. ప్రతి మగవాడూ ఈ విషయంలో ఇంతే. తాయిలం యిస్తేగానీ మారం చేయడం మానరు అనుకుంటూ ఆమె పళ్ళెం పక్కన పెట్టింది.

 

    అతని పక్కన పడుకుని, "ఈరోజు మనం ఓ కొత్త ఆట ఆడుదాం. ఈ మధ్య నేనొక్కదాన్నే పడుకుని వున్నప్పుడు ఈ ఐడియా వచ్చింది" అంది ఆయన కళ్ళల్లోకి చూస్తూ.

 

    ఆ వయసులో ముద్దూ - ముచ్చట లేనిదే దాసులాంటివాడు సుఖపడడని ఆమెకి తెలుసు. అందుకే ఈ ఆట పేరెత్తింది.

 

    దాసుకీ ఇంట్రెస్ట్ ఎక్కువై - "ఏమిటా ఆట?" అని ఆమె మీదికి ముప్పాతిక భాగం వంగాడు.

 

    "నేను మొత్తం బ్లాంకెట్ అంతా కప్పుకుంటాను. మీరు చేతులతో తడుముతూ ఏ భాగం ఎక్కడో చెప్పాలి. ఉదాహరణకు కళ్ళు అని మీరు చెప్పి ఖచ్చితంగా కళ్ళున్న దగ్గరే చేతులు పెట్టాలి. కళ్ళు అని చెప్పి ముక్కు దగ్గర చూపించారనుకోండి - మీరు ఓడిపోయినట్టు లెక్క"  

 

    ఆయనకి ఈ ఆట భలే నచ్చింది. ఒక్కసారిగా ఆయన చిన్నపిల్లాడై పోయాడు.

 

    "మరి మొదలెట్టనా?" అని ఆమె పక్కనున్న దుప్పటిని తీసుకుని పూర్తిగా కప్పుకుంది. తన శరీర భాగాల తాలూకు ఎత్తు పల్లాలు కనబడకుండా అటూ ఇటూ కదిలి సర్దుకుంది.

 

    "మరి చెప్పనా?" అంటూ ఆటలో దిగబడిపోయాడు పరమేశదాసు.

 

    "ఇవి వెంట్రుకలు" అని కుడిచేత్తో రాశాడు. కరక్టే - ఆయన గురి తప్పలేదు.

 

    ఆమె తల వెంట్రుకలను కాసేపు సవరించాక ఆయన కిందకి దిగడం ప్రారంభించాడు.

 

    "నుదురు" అని ఆ భాగంలో చేయి పెట్టాడు.

 

    "కళ్ళు" అంటూ కళ్ళను చేతులతో స్పృశించాడు.

 

    "భలే చెబుతున్నారే" మెచ్చుకుంది ఆమె.

 

    "ముక్కు" అని ముక్కు పట్టుకున్నాడు.

 

    "నెక్ట్స్ పెదవులు" అంది ఆమె మెల్లగా.

 

    ఆమె నోరు కదపడాన్ని బట్టి ఆయన పెదవులున్న చోట చేయి వేశాడు. కానీ ఆమె కాస్తంత కిందకి దిగింది. దాంతో తిరిగి ముక్కే తగిలింది ఆయనకి.

 

    "తప్పు చెప్పారు. మూడు తప్పుల వరకు ఫరవాలేదు. నాలుగో తప్పు చేశారంటే ఫెనాల్టీ కట్టాలి. వేయి రూపాయలు" హెచ్చరించింది.

 

    దాసు మరింత సర్దుకున్నాడు. ఇక పొరపాటు చేయకూడదని నిర్ణయించుకున్నాడు.

 

    కాస్తంత కిందుగా చేతులు పెట్టాడు. ఈసారి పెదవులే అందాయి. వాటిని సుతారంగా రాశాడు.

 

    దుప్పటి లోపలికి చేతులు పెట్టి పెదవుల్ని పట్టుకోవాలన్న కోరికను బలవంతంగా అణుచుకున్నాడు. బ్లాంకెట్ పైనున్నా పెదవులు అంత మెత్తగా తగులుతున్నాయి మరి. ఆయనలో కోరిక కాగడాలా గుప్పుమంటూ ఎగిసింది.

 

    "మరి కానివ్వండి."

 

    అప్పటికి తేరుకున్నాడు దాసు.

 

    "మెడ" అని మెడ దగ్గరే పట్టుకున్నాడు.

 

    ఇక అక్కడ ఎక్కువసేపు వుండక కిందకు దిగాడు. ఆమెకే వినపడేటట్లు మెల్లగా చెవిలో చెప్పి చేయి వేశాడు. ఆమె ఎద నునుపుకి చేయి నిలబడడం లేదు.

 

    "ఇక చేతులు తీయండి చాలు" అంది దాసు చెయ్యి అక్కణ్నించి కదలకపోయేసరికి.

 

    విధిలేక దాసు చెయ్యి తీశాడు. "ఇది నడుం" అని చెయ్యి వేసి నడుం ముడతలను వత్తాడు.

 

    "ఇంకాస్త కిందకు దిగి "ఇది" అని ఆగి మళ్ళీ చెవిలో చెప్పాడు.

 

    ఆమె పింగాణీ పాత్ర కిందపడినట్లు నవ్వింది. "మళ్ళీ తప్పు చెప్పారు. మీరు చెప్పింది కాదది. అది బొడ్డు" అని దుప్పటిని పూర్తిగా లాగేసింది.

 

    నిజమే! ఆయన పెద్ద తప్పే చేశాడు.

 

    తనెందుకు అంత తప్పు చేశాడో చెప్పాలని నోరు తెరవబోయాడు. ఇది తెలిసే ఆయన చెప్పకుండా వుండడానికి మీదకు లాక్కుంది ఆమె.

 

    ఇంతకు ముందు ఒక్కర్నే కప్పిన దుప్పటి ఇప్పుడు యిద్దర్నీ కప్పింది.

 

    మరో పావుగంట వరకు దాసుకు ఊపిరాడలేదు.

 

    ఇద్దరూ వేరయ్యాక "ఇప్పటికయినా చెబుతారా?" అని అడిగింది సరితాదేవి.

 

    "ఆఁ! ఈ శుభవార్త చెప్పడానికే కదా హైదరాబాద్ నుంచి వచ్చింది. మన సంస్థ రైతుల శిక్షణా కేంద్రం ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం నూరెకరాల భూమిని యిచ్చింది" అని ఆగాడు. అది విని ఒక్కసారిగా ఆనందం పొంగు కొచ్చింది సరితాదేవికి.       


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS