Previous Page Next Page 
అనాథ మహిళా సదన్ పేజి 23


    "అలాంటిదేమీ లేదుగానీ ఆకలిగా లేదు"

 

    "నీలాంటి యువకుడికి ఆకలిగా లేదంటే మనసు మరో దేనిమీదో వుందన్న మాట" అని కళ్ళల్లోకి చూసి కొంటెగా నవ్వింది రమణి.

 

    అలా కొంటెతనాన్నంతా కళ్ళలోకి తెచ్చుకుని నవ్వడం స్త్రీలకు తప్ప పురుషులకి సాధ్యం కాదనిపించింది అతనికి. మరో విషయమంటే దెయ్యం కనపడిన విషయం గుర్తొచ్చింది.

 

    ఆమె కదలడం వల్ల ఊడిందో, హుక్ సరిగా వేసుకోకపోవడం వల్ల ఊడిందో తెలియదుగానీ ఆమె మెళ్ళో నున్న ఒంటిపేట గొలుసు వూడింది.

 

    ఒంటిమీద నుంచి కింద పడిపోతున్న దానిని మధ్యలోనే పట్టుకుని 'హుక్ లూజయిపోయి వూడిపోతోంది' అని మెళ్ళో తగిలించుకుని హుక్ పెట్టుకోవడానికి ప్రయత్నిస్తోంది.

 

    కానీ హుక్ పడలేదు.

 

    అందుకే అతని దగ్గరకొచ్చి వెనక్కి తిరిగి, "ఆనంద్! ఈ కొక్కెం సరిగా వేయవా" అని అడిగింది.

 

    వెనక విశాలంగా నీలంమబ్బు తునకను అక్కడ అతికించినట్లున్న ఆమె వెనుక భాగం అతనిలో వేసి సెగలను రేపుతోంది.

 

    "చిన్నప్పుడు ఇలా వెనక్కి తిరిగి అవతల వ్యక్తి వేళ్ళతో రాసిందాన్ని గెస్ చేసి చెప్పే ఆట ఆడుకునేవాళ్ళం. నీకూ అలాంటి ఊహే వచ్చింది. కాదని బుకాయించకు" అన్నది రమణి.

 

    ఆ మాటలు విని అతను అదిరిపడ్డాడు. అతనికీ ఆ ఆట గుర్తొచ్చింది.

 

    "అయితే రాస్తాను. చెప్పుకో చూద్దాం" అన్నాడు. ఆ మాటలు అనడానికి ఎంతో కష్టపడ్డాడతను.

 

    "సరే రాయి"

 

    అతను మొదట తన పేరు రాద్దామనుకున్నాను. కానీ బావుండదనిపించి ఆమె పేరు రాశాడు.

 

    "నువ్వు రాసిన పదం దెయ్యం"

 

    అతను వులిక్కి పడ్డాడు. ఇప్పుడు తను పట్టుకున్నది రమణీనా? లేక దెయ్యాన్నా? అతనికి అనుమానం వచ్చింది. దెయ్యం పాదాలు వెనక్కి తిరిగి వుంటాయి. అదే గుర్తు అని ఎవరో చెప్పడం గుర్తొచ్చి కళ్ళను కిందకు వాల్చాడు.

 

    సరిగ్గా ఆ సమయానికి కరెంట్ పోయింది.

 

    అతను ఠక్కున ఆమెనుంచి చేతులు లాక్కున్నాడు. ఆమె ముందుకు తిరిగి అతన్ని వాటేసుకుంది.

 

    అటువైపు తిరిగి వున్నప్పుడు విప్పుకుందేమో నగ్నంగా వున్న ఆమె ఎద అతని ఛాతీకి వత్తుకుపోతుంది. గుండెలమీద తన ఎదతో వేడి కోరికనంతా ముద్ర వేస్తున్నట్లు ఆమె మరీ మరీ హత్తుకునేటట్టు అదుముకుంటోంది.

 

    అతను అప్రయత్నంగా చేతులు ఆమె మీద వేశాడు. ఆమెలో అతనికి ఇష్టమైన భాగం నడుం ముడతలు అన్నట్లు అని నడుం మీదకి జారాయి. కాయకష్టం చేసిన చేతులు కావున అవి పడగానే ఆమెలో కోరిక పైకెగసినట్లు జానెడెత్తు లేచి తిరిగి సర్దుకుంది.   

 

    అతని చేతులు మరింత కిందకు దిగి బొడ్డుకీ, చీరకీ మధ్యనున్న స్థలాన్ని కొలిచి, ఇక కదలనంటూ అక్కడ అతుక్కుపోయాయి.

 

    ఆమె అతని రెండు చేతుల్ని పట్టుకుని మరింత కిందకు తోసింది. అతనెప్పుడో ధర్మరాజు తిరుణాళ్ళకి అగ్నిగుండం దాటాడు. ఆ సెగ ఒంటికంతా తగిలినట్లయింది. అప్పుడు అగ్నిగుండంలో కాళ్ళు పెట్టారు. ఇప్పుడు చేతులు పెట్టాడు. తేడా అదే!  

 

    చీర ఎప్పుడు ఊడిపోయిందో - ఎవరు తప్పించారో తెలియదు. లంగా మాత్రమే అతనికి అడ్డంగా వుంది.

 

    అతనిలో కలిసిపోవాలన్న తపనతో ఆమె మరింత ముందుకి కదిలి హత్తుకుంది.

 

    ఆమె స్పర్శ ఎంత మధురంగా వుందంటే లంగా ముడి పూలరేకుల్లాగా అనిపించింది అతనికి.

 

    అతను ఇక తమకం పట్టలేక ఆమెను పొదివి పట్టుకున్నాడు. మరో పది నిముషాల వరకు అక్కడున్న నులకమంచం జావళి ఆలపిస్తూ, అందుకు తగ్గట్టు ఆడింది. అలిసిపోయిన శరీరాలు సేదతీరుతున్నాయి.

 

    "నువ్వు ఇలా వస్తావని అనుకోలేదు. అంతా నా అదృష్టం" అన్నాడు ఆనందరావు తన ఆనందాన్ని మాటల్లో పేర్చుతూ.

 

    "ఎందుకు రాను? బావి దగ్గర నిన్ను చూసినప్పటి నుంచీ మనసు ఆపుకోలేకపోయాను "

 

    "బావి దగ్గరా?" అతను ఆశ్చర్యపోయాడు.

 

    "ఆఁ"   

 

    అతనికి ఒక్కసారిగా ఒళ్ళంతా చల్లగా అయిపోయింది. ఆమె కళ్ళకేసి చూశాడు. అవి మామూలుగానే వున్నాయి. అనవసరంగా భయపడుతున్నందుకు తనను తనే నిందించుకున్నాడు.

 

    "ఎన్నిగంటలకొచ్చావ్ అక్కడికి?" ఇంకా సందేహం పోలేదు అతనికి.

 

    "ఆరూ ఆరున్నర అయి వుంటుంది. మొదట బావి దగ్గర కనిపించావ్. మా మామ ఏదో మందాకు తెమ్మంటే వచ్చాను. మందాకు కోసుకుని మళ్ళీ వచ్చేటప్పటికి నువ్వు లేవు? ఏమైపోయావ్?"

 

    "ఆఁ అదా? బాగా చీకటిపడ్డాక ఓ ఆడదెయ్యం నా దగ్గరికి రాబోయింది. దేవుడి దయవల్ల అప్పుడే కరెంట్ వచ్చింది. ఆ దెయ్యం కళ్ళు లైటు వెలుగుల్లో అచ్చం ఎద్దు కళ్ళలాగా నీలం గోలీల్లా వున్నాయి"

 

    ఆమె అతని మాటలకు అడ్డు తగిలింది.

 

    "నేను వెళ్ళాలి కాస్తంత దీపం వెలిగించవా?" అని మంచం మీద నుంచి కిందకు దిగింది.

 

    ఆమె బట్టలు వేసుకుంటోంది.

 

    అతను కిటికీ గోడమీద వున్న కిరసనాయిల్ దీపాన్ని అగ్గిపుల్ల గీసి వెలిగించాడు.

 

    ఆమె బట్టలు కట్టుకోవడం పూర్తయ్యింది.

 

    అలానే మంచంమీద నున్న దిండుమీద వాలిపోతూ - "ఆ దెయ్యం కళ్ళు ఇంకా మరిచిపోలేక పోతున్నాను" అంటూ ఆమెకేసి చూశాడు.

 

    "ఇలా వున్నాయా? అని ఆమె అడ్డు పడడంతో అతను అనాలోచితంగా ఆమె కళ్ళకేసి చూశాడు.

 

    బావి దగ్గర చూసినట్టు ఆ కళ్ళు ఎద్దు కళ్ళలాగా కిరసనాయిల్ దీపపు వెలుగుల్లో నీలం గోలీల్లా మెరుస్తున్నాయి. అంటే అతను ఇంతసేపు గడిపిందీ దెయ్యంతోనా అన్న ఆలోచన పూర్తికాకుండానే ఆనందరావుకి స్పృహ తప్పింది."   

 

                            *    *    *    *    *

 

    పరమేశదాసు వచ్చి అప్పటికి అరగంటైంది. ఆయన చూపులు టెన్నీస్ బాల్ లా వంటింట్లోని సరితాదేవివైపు, పడకటింట్లోని బెడ్ వైపు తిరుగుతున్నాయి. అసలు ఆకలికంటే మరో ఆకలే ఆయన నరాల్ని కొరికేస్తోంది. ఇదంతా గమనిస్తూనే వుంది సరితాదేవి. అయినా ఇదేమీ గమనించనట్టే ఆమె వంటమనిషికి మరీ మరీ జాగ్రత్తలు చెబుతోంది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS