వనములను, నగములను నదులను నదములను, నగరములను జనపదములను దాటుచూ శరవేగమున పోవుచుండగా జానికికి మెఱపు వలె ఒక ఆలోచన వచ్చింది. ఆమె తన మేనిపై గల నగలను తీసి చీర కొంగును చింపి ఆభరణములను అందుమూటకట్టినది. నేలవైపు వీక్షించి 'ఋశ్యమూకము' అను పర్వతము మీదుగా పోవుచున్నట్లు తెలుసుకొన్నది. ఆ పర్వత శిఖరము మీద ఐదుగురు మహా వానరులు ఆసీసులై యున్నారు. వారిలో ఒకడు సుగ్రీవుడు. తక్కిన నల్వురును అతని మంత్రులు. మైథలి తన ఆభరణములు మూటను వారి నడుమ పడునట్లు క్రిందికి జారవిడిచినది. ఆమె వనవాసమునకు వచ్చునాడు మామగారిచ్చిన ఆభరణములవి. వనరులా మూట, వచ్చినవైపు తలలేత్తి చూచినారు. 'ఎవరా ఆబాల? ఆమె నేత్తుకుని పోవుచున్న వాడు రావణునివలె నున్నాడు' అని అనుకోనుచూ వారు నగల మూటను భద్రపరచినారు.
లంకాపురి చేరుకున్న పిమ్మట రావణుడు తన సుందర మందిరములలో మిక్కిలి రమ్యమగు హర్మ్యమున సీతను ఉంచినాడు. తన ఐశ్వర్యమామేను ఆకర్షించగలదన్న భ్రమతో "సీతా, ఇవిగో నా దివ్యాబంరములు చూడుము. ఇవిగో నా వరభూషణములు వీక్షింపుము . ఇవన్నీయు నాధనరాశులు, దర్శించుము. అదిగో నా పుష్పక విమానమచ్చట నున్నది, తిలకించుము. నీకేమి కావలసినను రప్పించేదను, నాతో సుఖముగా నుండుము " అన్నాడు.
వైదేహి ఒక గడ్డిపరకను తన ముందుంచుకుని రావణునితో చెప్పదలచినది ఆ తృణముతో చెప్పినది.
"రవాణా, నీకు వినాశ కాలము దాపురించినది కనుకనే ఇట్టి విపరీత బుద్ధీ పుట్టినది! అవక్ర పరాక్రముడైన శ్రీరామచంద్రుడు తనను చుట్టుముట్టిన ఖరిదూ షణులనూ పదునాలుగువేల రాక్షస వీరులనూ ఎవరిసాయము లేకుండా నిశ్శేషముగ సంహరించినాడు! రామ లక్ష్మణులు లేని సమయమున పర్ణశాల నుండి నన్ను అపహరించి తెచ్చిన పిరికిపందవు నీవు! ఆ అన్నదమ్ములు నన్ను అంతమొ౦దించి, లంకాపురికి వైధవ్యమును కలిగించేదరు."
రావణునకు కోపము పొంగివచ్చింది. 'త్రిజట' అను రాక్షసాంగనము పిలిచి "త్రిజటా ఈ సీతకు మొండితనము తక్క వేరొండులేదు. ఈమెను ఈ దివ్య భవనము నుండి తీసుకొని పోయి అశోక వనమున మీ నడుమ నిర్భంధములో నుంచుడు. నయమునచో భయమునచో పన్నెండు నెలలలోగా ఈమె నాకు రాణియగునట్లు మీరు చూడవలెను. ఈమె నా పొందునకు ఆ గడువు లోపల అంగీకారమును తెలుపకున్నచో కావలివారు మీరీమేను నిస్సంకోచముగా భక్షించుడు" అన్నాడా మనుజాశనుడు.... త్రిజట అవనిజను అశోక వనమునకు తీసికొనిపోయినది.
అచ్చట పంచవటిలో మారీచుని మడియించి వర్ణశాలకు తిరిగివచ్చుచున్న రామునకు లక్ష్మణుడు ఎదురైనాడు.
రాముడు : తమ్ముడా 'హా లక్ష్మణా!" అన్న కంఠస్వరము నాదే అనుకొని వర్ణశాలలో వైదేహిని ఒంటరిగా వదిలి ఇటు వచ్చుచున్నావా?
లక్ష్మణుడు : ఆ స్వరము నీది అని నేను పొరబడలేదు. కాని వైదేహి నేనెంత చెప్పినను వినక నీకేదియో కీడు మూడినదని భావించి నన్ను నీవద్దకు 'పొమ్ము పొమ్ము' అని త్వరపెట్టినది. ఆమెను వదలి పోరాదని నేను కదలలేదు. ఆమె అపోహకు లోనై అనరాని మాటలని న హృదయమును గాయపరచినది. నేను దుఃఖంచుచూ ఇంకా అక్కడ ఉండలేక నిన్నామే వద్దకు శీఘ్రముగా తీసికిని పోవుటకు ఇటు వచ్చినాను.
రాముడు అడుగగా లక్ష్మణుడు సందేహించుచునే మైథలి అన్న మాటలనూ తెలిపినాడు.
రాముడు : తన అలజడిలో భూమిజ యుక్తాయుక్త విచక్షణను కోల్పోయి అట్లు ప్రవర్తించిననూ నీవు సహనముతో ఆమె రక్షణ నిమిత్తము వర్ణశాల యందే ఉండిపోవలసినది. .... నేను తిరిగి వచ్చుచుండగా దుర్నిమిత్తములు (అపశకునములు) పోడచూపినవి. కాంచన మృగరూపమున ప్రత్యక్షమై నన్ను వర్ణశాలకు దూరము చేసిన రాక్షసుడు మారీచుడు. న బాణము వలన వాడిప్పుడు గత ప్రాణుడైననూ ఆ దనుజుడు మనకు తల పేట్టి వచ్చిన హానియేదియూ అది జరిగిపోయి యుండవచ్చును. ఒంటరిగా ఉన్న భూపుత్రికి ఏమి ప్రమాదము వాటిల్లినదో కదా!
రాముండా౦దోళనతో వర్ణశాల వైపు వడివడిగా అడుగులు వేసినాడు సౌమిత్ర అగ్రజుని వెంట పరుగెత్తువలసి వచ్చినది.
వారు పర్ణశాల యందంతయూ గాలించినారు. సీత కనబడక పోవుటతో రాముని మనసు వికలమై పోయినది. అతడు పామరుని వలె విలపించుచుండగా లక్ష్మణుడు "అగ్రజా , ధైర్యమును కోల్పోకుము. సీతాన్వేషణము మన ప్రస్తుత కర్తవ్యము. లెమ్ము పోవుదము, ఆలస్యము తగదు" అనుచూ రామునకు విల్లమ్ములను అదించినాడు.... పర్ణశాలకు ఆనతి దూరముననె ఆ యన్నదమ్ములను ఱేక్కలు తెగి ధరణిపై బడి బాధతో మూలుగుచూ ప్రాణావశిష్టుడై యున్న జటాయువు కనబడెను. ఆ విహంగవతి వారితో "దశరథాత్మజులారా ధరణిజను రావణుడెత్తుకొనిపోయినాడు. ఆమె అర్ననాదమును విని నేను పోయి వాని నడ్డగించి పోరి, వానిని విరథుని కావించినాను; వానిని వధించి వైదేహిని తెచ్చి మీ కప్పగించ ప్రయత్నించినాను కాని కృతార్ధుడను కాలేకపోయినాను; వాడు నా పక్షములను ఖండించి పడగొట్టి తప్పించుకుని పొగలిగినాడు" అని చెప్పి ప్రాణమును విడిచినాడు.
రామలక్ష్మణుల నయనముల నుండి అశ్రువులు రాలినవి. రాముడు "తమ్ముడా ఈ ఖోగోత్తముడు దశరథ మహారాజునకు మిత్రుడు. మనకు పితృతుల్యుడు. ఈ మహానీయునకు మనము దహన సంస్కారమును జేసి పుణ్యలోకములను కలిగించవలెను" అన్నాడు..... లక్ష్మణుడు చితిని పెర్చినాడు. వారు జటాయువు దేహమును దహింపజేసి అంత్యక్రియులను యథావిధిగ జరిపినారు.
* * *
