Previous Page Next Page 
రామాయణము పేజి 24

           

                      కబంధుడు   
    రామలక్ష్మణులు రగిల్చిన చితియందు కభంధుడు బూడిద యగుటతోనే ఆ భస్మము నుండి దివ్య పురుషుడోకరు వెలువడి "దశరథాత్మజులారా శాపవిముక్తి కలిగి తిరిగి గంధర్వ రూపమును పొందిన 'దనువు' నామధేయుడను నేను " అని తెలియజేసినాడు.       
    రామలక్ష్మణులు సీతను వెతకుచూ దక్షణ దిశగా పోయినారు. వారికొక తావున భయంకరమైన రాక్షసుడొకడు కనబడినాడు. వానికి 'కబంధుడు' అన్న పేరు వచ్చినది. 'కబంధము' అనగా 'తల తెగిపోయిన మొండెము'. ఆ దైత్యునకు మేడగాని తలగాని లేకుండుటచే వానికా నామధేయమేర్పడినది. కొండంత ఎత్తునూ లావునూ కలిగి పీపా వలె గుండ్రముగా నున్న ఆకరాము వానిది. వాని నోరు ఒక పెద్ద గుహా వలె వాని యదరము (కడుపు) నందున్నది. నోరు పైన ముందుకు పొడుచుకొని వచ్చిన నుదురు ఉన్నది. ఆ నొసట ఒక్క కన్ను మాత్రమె కలదు. ఆ నేత్రముతో వాడు యోజనము దూరము   చూడగలడు. వానికి కాళ్ళులేవు. మొండెమున రెండు వైపులా చేతులున్నవి. ఆ దీర్ఘ బాహువులతో వాడు చుట్టునూ యోజనము వరధిలో లభించిన సింహములనూ వ్యాఘ్రాములనూ, ఎనుగులనూ ఎలుగుబంట్లనూ ఇతర ప్రాణులనూ పట్టుకుని ఉదారమందలి వాదన గహర్వము వద్దకు తెచ్చికొని భక్షించుచుండెను. ఆ రక్కసుని బలవంతయు వాని బహువులందున్నది.    
    విల్లమ్ములను ధరించి కృపాణ పాణులై వచ్చుచున్న రామలక్ష్మణులను కబంధుడు పట్టుకొన్నాడు. రాముడుని కుడి చేతనూ లక్ష్మణుని ఎడమ చేతనూ దొరకపుచ్చుకొని ఉదార భాగమున గల గుహా వంటి తన నోరు దగ్గరకు చేర్చుకొనుచుండగా రాముడు 'లక్ష్మణా వీనినామ హస్తమును మొదలంట నరికివేయుము. నేను దక్షణ హస్తమును ఖండించేదను" అన్నాడు. మరుక్షణమున రాక్షసుని బాహువులు రెండునూ తెగి ధరణిపై పడినవి. కొండపై నుండి పడు జలపాతములు వలె రక్కసుని బహుమూలములు నుండి రక్తధారలు పడినవి.   
    కంబంధుడు బాధను ఓర్చుకొనుచూ"మహనీయులరా, మీరు దశరథాత్మజులా?" అని ప్రశ్నించినాడు.   
    రాముడు : (ఆశ్చర్యముతో) ఔను. నన్ను 'రాముడందురు. ఈతడు ణా తమ్ముడు లక్ష్మణుడు. మేము దశరథ మహారాజ  తనయుళమని నీ కెట్లు తెలిసినది? నీవేవ్వడవు?'   
    కబంధుడు : నేను 'శ్రీ' అనెడి గంధర్వుని కుమారుడను. ణా పేరు 'దనువు' నేను తపస్సును చేసి బ్రహ్మదేవుని ప్రతక్ష్యము చేసికొన్నాను. దీర్ఘాయువునూ, నాకిష్టమైన రూపమును పొందు శక్తినీ వరములుగా ఆర్జించినాను. ఒకనాడు భయంకరమైన రాక్షస రూపమును దాల్చి అరణ్యములలోని మునులను హడలగొట్టి, వారు భయముతో కంపించుచుండగా నేను పకపక నవ్వుచూ వినోదించసాగినాను. వారిలో  'స్థూలశిరుడు' అను మహర్షి తన దివ్యదృష్టితోనేను కామరూపిసగు గంధర్వడనని  తెలిసికొన్నాడు. ఆ తఫోధనుడు కుపితుడై "ధనువూ, నీవు  రాక్షసరూపమును తాల్చి సౌదుజనమును భయకంపితులను కావించి నీ వరమును దుర్వినియోగము చేసినావు! నీవు గంధర్వుడుగా నుండతగవు. రాక్షసుడవై అట్లే ఉండిపొమ్ము" అని     శపించినాడు. నాటి నుండియూ నాకు రూపమునందే కాక స్వభావమునందునూ దనుజత్వము దాపురించినది. గంధర్వుడనన్న స్మృతి పోయినది. అరిషడ్వర్గము (కామ, క్రోధ, లోభ, మోహ, మద, మత్సరములు)లోని మదము నాయందు ప్రబలినది. 'నా యంతటివాడు వేరొకడు లేడ'న్న అహంకారముతో నేనొకనాడు అమరావతికి పోయి ఇంద్రసభను చొరబడి సింహాసనస్తుడై యున్న శచీపతికి నా దక్షిణ హస్తమందలి గదను చూపుచూ 'ఇంద్రా, నాతో ద్వంద్వ యుద్దమునకు రమ్ము!' అని సవాలు చేసినాను అమరేంద్రుడా గ్రహముతో లేచి వచ్చి వజ్రాయుధముతో నా తల పై గట్టిగా కొట్టినాడు. ఆ దెబ్బతో నా శిరము ముండెయు లోనికి దిగబడిపోయినది. నేను  పడిపోయినను. ఇంద్రుడు నా పాదములను కూడ వజ్రాయుధ ఘాతము (దెబ్బ)కు లోనుచేసినాడు. ఆ తాడనము నా కాళ్లను కూడ మొండెములో కూరుకుపోవునట్లు చేసినది. నా  ప్రాణములు పోలేదు. క్షుత్పిపాసలు (ఆకలి దప్పులు) నూ సడలలేదు.  శచీదవుడు చేసిన శాస్తి వలన నాకు బుద్ది వచ్చినది. 'చరణ హీనుడనైన నేనింక అరణ్యములోనికి పోయి ఆహారమును సేకరించుకొనుట యెట్లు అని దుఃఖించుచుండగా ఇంద్రుడు కరుణించి నేనున్నా చోటునుండి కదలక్కర లేకుండగనె  ఆహారమును సంపాదించుటకు వీలుగా  నా బాహువులను యోజనము మేర పోడిగించినాడు పిమ్మట నేను 'సురేశ్వరా తలనూ నోరునూ కోల్పోయిన నేనింక తినుట యెట్లు?' అని అడిగినాను. సురేశ్వరుడు 'నీ ఉదరము ఉపరితలమున గుహ వంటి పెద్ద నోరును సృజించెదను. ఆ గహ్వర ముపైన నుదురునూ, ఆ ఫాలమున ఒక నేత్రమునూ అమర్చెదను' అన్నాడు.. నేను 'నిర్జరాథిపా'  తల లేక కాళ్లు లేక ఉన్న  చోటునుండి కదలజాలక కుక్షింభరత్వమునకు మాత్రమే బ్రతుకుచూ న్నెఉ ఎంత కాలమీ నీకృష్ణ జీవితమును గడుపవలెను?' అని అడిగినాను. శచీపతి 'నీవు దీర్ఘయువును వరముగా కోరుకోంటివి కదా పెక్కేండ్ల అనంతరము దశరథ మహారాజు పుత్రులు రామలక్ష్మణులను వారు నీవున్న చోటునకు వచ్చెదరు. అప్పుడు నీవు నీ దీర్ఘ బాహువులతో వారిని పట్టుకొని  భక్షించుటకు నీ వదన గాహ్వారము వద్దకు తెచ్చుకొనుచుండగా వారు ఆత్మరక్షణార్ధము నీ  బహుద్వయమును ఖండించెదరు. నాడు నీకు శాపము నుండి విముక్తి కలుగును. అంతవరకునూ నీకి నీకృష్ణ జీవితము  తప్పదు' అన్నాడు... పిమ్మట దేవదూత యొకడు నన్నీ  యరణ్యమున నిచట దిగవిడిచి వెళ్లినాడు. నేడు నా బహుఖండనము మీచే జరిగినది  కనుక ఇంద్రుడు చెప్పిన దశరథ నందనులు మీరే అని ఊహించి అడిగినాను.
    పిమ్మట కబంధుడు 'దశథనూనులారా ఒక పెద్ద చితిని రగిల్చి అందు నన్ను దహింపచేసి నాకు శాపవిమోచనమును కలిగించుడు" అని ప్రార్ధించినాడు.
    రామలక్ష్మణులు రగిల్చిన చితియందు కబంధుడు బూడిద యగుటతోనే ఆ భస్మము నుండి దివ్య పురుషుడొకరు వెలువడి "దశరథాత్మజులారా శాపవిముక్తి  కలిగి తిరిగి  గంధర్వ రూపమును  పొందిన 'దనువు'  నామధేయుడను నేను" అని తెలియజేసినాడు.
    దనువు "శ్రీరామచంద్రా, ఇక్కడకు కొంచెము  దూరమున 'బుశ్యమూకము' అను పర్వతము ఉన్నది. ఆ గిరిపై 'సుగ్రీవుడు' అను కపిరాజు 'హనుమంతుడు' మున్నగు నల్వురు మంత్రులతో వసించుచున్నాడు. అతడు నీవలెనే కష్టములోనున్నాడు. అతని కష్టమును తొలగించు సామర్ధ్యము నీకున్నది. నీవు  నీ అనుజునితో బుశ్యమూకమునకు పోయి సుగ్రీవునితో స్నేహము చేసి  నీవలన  కాలగ ఉపకారము  నాతనికొనరించుము. అతడు  కృతజ్ఞాతతో మీకు  అవసరమైన సాహయ్యమం తయూ అందించును; సీతాన్వేషణమునకు సమర్ధులైన తన అనుచరులను అన్ని దిక్కులకును పంపి ఆమె వృత్తాంతమును రాబట్టగలడు. పిమ్మట ఆ సాధ్విని రక్షించి తెచ్చుకొనుట కనేక విధముల మీకు తోడ్పడును.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS