
ఆ మాయలేడి వర్ణశాల ప్రాంగణమున చెంగుచెంగున గెంతుచూ సీత కంటబడినది. జానికి ముచ్చట పడుచూ రామునితో "నాథా, ఆ హరిణ కిశోరము ఎంత మనోజ్ఞముగ నున్నదో తిలకించుడు! నాకు దానిని పెంచుకొనవలేనన్న అభిలాష కలిగినది.. పట్టి తేగలరా?" అన్నది.
రాముడు "అదెంత పని? అనుచు లేచినాడు.
లక్ష్మణుడు : అన్నా ఇంత వింత మృగమును ఈ అరణ్యమున మున్నేన్నడును చూడలేదు. మనలను మోసగించుటకేవ్వడో దనుజుడు ఈ అద్భుత రూపమున హఠాత్తుగా ఇచ్చుట ప్రత్యక్షమై యుండునని తోచుచున్నది. నీవు పోవలదు.
రాముడు : లక్ష్మణా మీ వదినెకు కాలక్షేపము అవసరము. ఆమె ఈ చిన్న కోరికను తీర్చేదను. ఏణి (లేడి) ని తెచ్చి జానికికి కానుకగా ఇచ్చెదను. ఇది హరిణము కాకహాని తలపెట్టి వచ్చిన అసురుడు ఐనచో, వానిని హతమార్చేదను.... నేను తిరిగి వచ్చువరకును మీ వదినేను కాపాడుచుండుము.
ఆ కుహానా కురంగము (మాయలేడి) రాముడు సమీపించి వరకునూ ఆగి అతడు పట్టుకొనబోవు చుండగా దిఇరముగా పరుగెత్తిపోయి నిలిచినది. రాముడా చోటును చేరి పట్టుకొనుటకు మరల కొంత దవ్వు ముందునకు పోయి ఆగినది. ఈ విధముగా అనేక పర్యాయములు జరిగి రాముడు వర్ణశాలకు దూరమైనాడు. రాముడు "లక్ష్మణుడూహించినట్లు వీడెవడో దనుజుడే! వీనిని వధించి ఈ వనమందలి ముని జనమునకు మేలోనరించేదను" అనుకొనుచు ఆ మయా మృగముపై తన నిశిత శరమును ప్రయోగించినాడు.
కామరూవులు మరణించునపుడు వారి నిజరూపము బయటపడును. రాముని బాణము దెబ్బ తగులుటతోనే ఆ మాయలేడి మారీచునిగా మారిపోయినది. ఆ భయంకరాకారుడు 'హ లక్ష్మణా!' అని అక్రందనము చేయుచూ నేలకు ఒరిగిపోయిప్రాణములను విడిచినాడు.
ఆ ఆర్తనాదమును మారీచుడు రాముని కంఠస్వరమును అనుకరించుచు చేసినాడు. అది వర్ణశాలలోని సీతకునూ లక్ష్మణనకునూ వినబడినది. సీత అందోళనతో "మఱదీ, మీ అన్న ఆపదలో ఉన్నారు పోయి రక్షించి తీసుకుని రమ్ము" అని తొందర పెట్టినది.
సౌమిత్రి "అమ్మా , నీవు అడలకుము శూరాగ్రేసురుడగు స్రీరామచంద్రునకు ఎట్టి అపదయూ వచ్చియుండుదు. అగ్రజుడు లేడిరూపమున వచ్చిన ఆ రక్కసుడేవ్వడో వాని నిప్పటికి వధించియే యుండును. అన్న తిరిగి వచ్చు వరకును నేను పర్ణశాలను విడిచి పోరాదు" అన్నాడు.
ప్రాణనాథునకు ప్రమాదమును శకించుచు అత్యధికమగు అలజడికి లోనైన వైదేహి వివేకమును కోల్పోయినది, ఆ అరణ్యమున తన్ను మాతృ సమానగా సేవించుచూ కాపాడుచున్న సుమిత్రా నందనుని అనరాని మాటలన్నది :--
మీ అన్న ప్రమాదములో ఉన్నాడు ; పోయి రక్షించి కొనితెమ్ము అని వేడుకొనగా పోక, ఏమేమియో వచించుచూ ఇక్కడనే ఉండిపోయినావు! సవతి తమ్ములను నమ్మరాదు. ఆ దురాత్ముడు భరతుడు శ్రీరామచంద్రుని రాజ్యమును హరించి అడవికి పంపినాడు, నీవు రామభద్రుడేటులైన మరణించునట్లు చూసి అయన పత్నిని పొందదలచిన కలుషాత్ముడవు! అగ్నికి అహూతియై భస్మమై పోవుదును గాని నీకు వశ్యమయ్యేదనను కొనకుము!" అన్నది.
లక్ష్మణుడు "శివ శివా! పరుషాతి పరుషములైన ఈ పలుకులు మహా సాధ్వివగు నీ నోటివెంట ఎటుల వెడలినవి తల్లీ? నీ ఆదేశానుసారము _ అన్న ఆజ్ఞకు భిన్నము ఐనను ఈ క్షనముననే వర్ణశాలను విడిచి అయన నన్వేషించుచు పోయెదను, అగ్రజుడు నన్ను క్షమించు గాక..... వనదేవతలారా, వర్ణశాలకు మేము తిరిగి వచ్చు వరకును మీరీమేను కాపాడేదరు గాక!" అని ప్రార్ధించుచూ అశ్రుపూరిత నయనుడై వెడలినాడు.
వర్ణశాల ప్రాంగణమున వృక్షము మాటున పొంచియున్న రావణునకునూ 'హా లక్ష్మణా!" యన్న అక్రందనము వినిపించింది. మరుసటి నిమిషమున అతడు వర్ణశాలను విడిచిపోవుచున్న లక్ష్మణుని చూచినాడు.... అప్పుడొక యతి రూపమును దాల్చి కుటీర ద్వారము వద్ద నిలిచి "భవతి భిక్షాందేహి" అన్నాడు.
సీత భిక్షను తెచ్చి యిచ్చినది.
ఆమెను ఆ కపట యతి వీక్షించుచు, తనలో "ఈమె సోయగము శూర్పనఖ చెప్పినదానికన్న మిన్నగా ఉన్నది!" అనుకొన్నాడు.
కపట యతి : నీ పేరు సీత అని విన్నాను. నీ మగడు రాముడు రాజ్యమును కోల్పోయి అడవుల పాలయ్యేననియూ తెలిసినది. నీవునూ ఆ అభాగ్యునితో ఈ వనవాస క్లేశమును అనుభవించుట దేనికి?.... భువనైక సుందరివగు నీపైన నాకు వలపు జనించినది. నాతో రమ్ము. నీకు అష్టైశ్వర్యములనూ కలిగించేదను. నిన్ను నా పట్టమహిషిని చేసికొందును.
సీత: (అగ్రహాముతో) ఎవ్వడవు నీవు? కపట సన్నాసినవి తెలియక నీకు భిక్షను వేసినాను! శ్రీరామచంద్రుడు తమ్మునితో వర్ణశాలకు చేరు కొనుటతోనే నీ దౌష్ట్యమును తెలిసికొని నిన్ను శిక్షించెదరు. ప్రాణములపై ఆశయున్నచో వెంటనే వెడలిపొమ్ము.
కపట యతి : నేనేవ్వడనో తెలిపేదను. అప్పుడు నీకు నాపై గౌరవభిమానములు జనించును.... నేను పులస్త్య బ్రహ్మ మనుమడను ; విశ్రవసు కుమారుడను ; లంకేశ్వరుడను. దానవ సామ్రాజ్యధిపతిని...... నీ అతిలోక సౌమ్దర్యమును గూర్చి విని నిన్ను వలచి వచ్చినాను. నిన్ను నా అంతః పురమున చేర్చుకుని మండోదరి అదిగా గల రాణులందరి చేతను నీకు సేవలు చేయించేదను. యక్షేశ్వరుడగు కుబేరుని ఓడించి వాని పుష్పక విమానమును వశము చేసికొన్నాను. మన మిరపురమూ ఆ విమాన రాజములో పోయి పదునాలుగు భువనము లందునూ గల వివిధ మనోహర ప్రాంతములందు విహరించవచ్చును. నావెంట రమ్ము.
సీత : మహనీయుడు పులస్త్యబ్రహ్మకు పౌత్రుడవు; అవినీతికి దిగజారకుము. సూర్య గోళము నుండి వేడిని విడదీయ బూని బూడిదవై పోకుము. కాకుత్సుని (కకుత్సువంశములోని వాడగు శ్రీరాముని ) నిశితాస్ర మహాగ్నికి ఇంధనము కాకుము? పొమ్ము; పొమ్ము!
కపట యతి : (అగ్రహొడగ్రుడై) ఆ మానవమాత్రుని పొగడ్తతో నన్ను అవమానించినావు!...... చతుర్దశ భువనములనూ గడగడలాడించు నా నిజ రూపమును తిలకించుము.
కపటయతి పది తలల రావణుడుగ ప్రత్యక్ష్యమైనాడు. సీత భయముతో మూర్చపోయినది. లంకేశుడామే నేత్తుకుని పోయి రథము నందుంచి, ఆకాశ మార్గమున దక్షణ దిశగా లంకాపురి వైపు పోయినాడు.... జానికి మూర్చ నుండి తేరుకుని "రామ లక్ష్మణులారా, రండు రండు! నన్ను రాక్షసడెత్తుకొని పోవుచున్నాడు. రక్షించుడు, " అనుచూ దిక్కులు మారుమ్రోగునట్లు విలపించినది.
అనూరుని కుమారుడూ రామబంధువూ ఐన జటాయువునకు సీత ఆర్తనాదము వినబడినది. ఆ పక్షింద్రుడు ఆకాశమునకు ఎగిరిపోయి రావణుని అరదమునకు అడ్డుగా నిలిచి ఱేక్కలతో కొట్టి రథచక్రములను ముక్కలు చేసినాడు ; దశకంఠుని ద్వంసము చేసి శరములను నేలపాలు కావించినాడు; రథాశ్వములను తన వాడియైన ముక్కుతో పొడిచి చంపివేసినాడు ; చంచువుతోనూ నఖములతోనూ రావణుని దేహమును గాయపరచినాడు...... జరాభారముచే ఆయాసము జనించి అఖగ్రేంద్రుడోక్క నిమేషమాగినాడు. రావణుడా అదను చిక్కించుకొని, తన ఖడ్గముతో విహంగవతి పక్ష ద్వయమును ఖండించినాడు. పక్షెంద్రుడు పుడమిపై పడిపోయినాడు. రావణుడు. విరథడయ్యెను. భూమిజను భుజముపై పదిలముగా నుంచుకుని అసుర శక్తి సాయముతో ఆకాశ మర్గాముననే పోగలిగినాడు.
