Previous Page Next Page 
డింగ్ డాంగ్ బెల్ పేజి 22

    వెంటనే పక్కకు తప్పుకుంది. స్టేషన్ లోకి వెళదామా! అనుకుంది. రిజర్వషేన్ కౌతర్ దగ్గర ఫోలీసులు ప్రయాణీకులు శల్వ పరీక్షలు చేస్తు కనిపించారు.

    అదే విషయంలో షంషేర్ దాదా మనుషులు మృదువని చూశారు. ఆ విషయం మృదువనీ గమనించింది. అంటే... వెంటనే అక్కడే వున్న ఆటో ఎక్కి 'పోనీయ్' అంది.

    ఆటో ముందుక్కదిలింది. షంషేర్ దాదా మనుషులు ముదుకు కదిలి, అక్కడ వున్న జీపు ఎక్కారు ఆటోని ఫాలో అవ్వడానికి.

   
                                                                           ***

    మృదువని ఆటోని ఓ పక్కగా ఆపమని చెప్పింది. ఆటో దిగి, ఆటోవాలా చేతిలో పది రూపాయల నోటు కుక్కి, పక్కనే ఉన్న సందులోకి వడివడిగా నడుచుకుంటూ వెళ్ళిపోయింది.

    షంషేర్ దాదా మనుషులు జీపులో ఆటో దగ్గరకి వచ్చి, అతావువాలాని అడిగారు. అతను కంగారుగా మృదువని వెళ్ళిన వైపు చూపించాడు.

    చేంజ్ మొదలైంది. మృదువని  పరుగెడుతోంది. ప్రాణాలు బిగాపెట్టుకుని పరుగు పెడుతోంది.

       
                                              ***


    వేల్ కం టు వాలెంటైన్... అన్నా బెనర్ కట్టి ఉంది.

    లోపల తోరణాల అలంకరణ.... ఓ పక్కన కెమెరా యూనిట్... లైట్లు వైర్లు. సరంజామా అంతా...
   
                                                   ***

    అంకిత్ అటూ ఇటూ తిరుగుతూ హడావడి పడిపోతున్నాడు.లైటింగ్ ఆరెంజ్ మెంట్స్ జరుగుతున్నాయి.కెమెరా ఎదురుగా రెడ్ కార్పెట్ పరచి ఉంది. ఓ పక్కకు ప్రోగ్రాం మిక్సింగ్ చేసేందుకు ఆరెంజ్ మెంట్స్.

    బయట సోఫాలువేసి ఉన్నాయి.

    అప్పుడే కారులో వచ్చాడు చైర్మెన్ పరమహంస.

    "ఏమిటోయ్ అంకిత్... ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి?" అడిగాడు పరమహంస.

    "పర్ఫెక్ట్ గా ఉన్నాయి సార్.... సరిగ్గా పది గంటలకు ప్రావుగ్ర్రం స్టార్ట్ అవుతుంది. ఇక్కోక్కరు ఎంట్రన్స్ ద్వారా లోపలకి వస్తారు. కెమెరా స్టార్ట్ 'అన్' లోనే ఉంటుంది.

    ఒక్కో అమ్మాయి లేదా అబ్బాయి వచ్చి 'వాళ్లపేరు చెప్పి... తము ఎవర్నీ ప్రేమిస్తున్నారో చెబుతారు ఆ తర్వాత వాళ్ల అనిభావాలు... అనిభూతులు వివరిస్తారు" అంకత్ చెప్పాడు.
    "వెరీగుడ్...రెస్పాన్స్ ఎలా ఉంది?"
    "ఈ పాటికే చాలా మంది అమ్మాయిలు, అబ్బాయిలు వచ్చారు. చూస్తూ వుండండి... మన చానల్ లో ఈ స్పెషల్ ప్రోగీం దుమ్ము దులుపుతుంది. మీరు ధైర్యంగా అఫీసుకుకు వెళ్ళండి సార్..." చెప్పాడు అంకిత్.

                                                                            ***

    ప్రోగీం స్తార్తాయిమ్ది.

    ఒక్కో అమ్మాయి లేదా అబ్బాయి కెమెరా ముందుకు వచ్చి.... తమ పేరు చెప్పి తమ లవర్ పేరు చెబుతున్నారు. అంకిత్ కెమెరా వెనక నుండి అబ్జర్వ్ చేస్తున్నాడు.

    సరిగ్గా అదే సమయంలో....
   
                                                                            ***
    మృదువని పరుగెడుతోంది. ప్రాణాలతో పందెం కసినట్టు పరుగెడుతో. ఆమె వెనకే షంషేర్ దాదా మనుషులు. జనం చోద్యం చోస్తున్నాట్టు చూస్తున్నారు. ఏ ఒక్కారూ సాహసించి మృదువని కాపాడే ప్రయతనం చేయడం లేదు. ఎవరకి వారు ప్రాణాలతో బిగుసుకుపోయారు.

    కొందరైతే 'ఆ... ఏదో సినిమా ఉంటుంది. డైరెక్టర్ ఉంటాడు  అన్నా ఆలోచన కూడా వాళ్లకు రావడంలేదు.

    జనంలో చైతన్యం పూర్తిగా అడుగంటి పోలేదనటానికి ఓ చిన్న కదలిక కారణంగా కనిపించింది. కొంతమంది దైర్యం చేశారు. ఆ అగంతకలను నిలువరించే  ప్రయత్నం చేశారు. షంషేర్ దాదా మనుషులు సెల్ ద్వారా విషయం  వివరించారు. ఫిలీసులు రంగప్రవేశం చేశారు. దాంతో జనం వెనక్కి తగ్గారు.
 
    మృదువని పరుగెడుతూనే ఆలోచిస్తోంది. తన కిప్పుడు మరో మార్గం లేదు. వోన్లీ వన్ వే.. దొరికిపోవడం... ఎవరికీ దోరికిపోవాలి? షంషేర్ దాదా మనుషులకు తను దొరికిన మరు క్షణమే తనని చంపేస్తారు. ఫోలీసులు... డిఫెన్స్ వాళ్ళల్లో ఎవరైనా తనని తిరిగి డిఫెన్స్ చీఫ్ కు అప్పగిస్తారు.

    తనను టార్బ్ ర్ చేసినా తన గుండెల్లో పదిలంగా దాచుకున్న రహస్యాన్ని కక్కిఅతారు.

    ఎలా..

    ఎలా..

    ఎలా..

    ఆలోచనల కందిరీగల తుట్టె ఆమెను చుట్టుముట్టింది.

    అప్పుడే ఎదురుగా తుట్టె ఆమెను చుట్టుముట్టింది.

    అప్పుడే ఎదురుగా వున్న సినిమా స్టూడియో మీద పడింది. వేల్ కం టు వాలెంటేన్స్... అన్నా బ్యానర్. కింద వి.టి.వి క్క్ష్హానల్ అన్నా అక్షరాలు కనిపించాయి. వెనుక నుంచి షంషేర్ దాదా మనుషులు తురుముతున్నారు. మరో వైపు ఏ క్షణంలో అయినా డిఫెన్స్ ఫోలీసులూ రావచ్చు.

    సెకండ్ థాట్ లేకుండా సినిమా స్టూడియో ఎంట్రన్స్ లోకి పరుగెత్తింది. ఎంట్రన్స్ దగ్గర ఓ అమ్మాయి నిలబడి వుంది. ఆ అమ్మాయి చేతిలో గిలాబీ పువ్వు వుంది. మృదువని రాగానే "వేల్ కమ్ మేడమ్... ఘాటింగ్ రైట్ సైడ్ జరుగుతూంది..." చెప్పింది ఓ గులాబీ పువ్వు మృదువని చేతిలో పెడుతూ.

    దూరంగా ఫోలీసు వెహికల్స్ వస్తావున్నా శబ్దం. మృదువని మరో ఆలోచన లేకుండా రైట్ సైడ్ పరుగెత్తింది.
   
                                                   ***

    ఓ అమ్మాయి కెమెరా ముందుకు వచ్చింది.

    "మీ పేరు?" అడిగాడు కెమెరా వెనుక నుంచి రాహుల్.

    "స్మిత" అందా  అమ్మాయి పేరు?"

    "వినీల్"

    "మీ బాయ్ ప్రెండు ఇక్కాడే ఉన్నాడా?"


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS