Previous Page Next Page 
భస్మనేత్రం పేజి 22

    అంతేకాదు, కొంతమంది ఐ ఎస్ ఐ ఏ జెంట్లను అక్కడ కలుసుకోవాలి. సో... మనం రేపే భస్మతో సహా హైదారాబాద్ వెళ్తున్నాం..." డిక్లేర్ చేశాడు ఖాన్.
                                                 ***
    సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్.
    అరంతస్థుల ఆ భవనంలో... నాలుగో అంతస్థులో వున్న సిబిఐ ఆఫీసులో... సిబిఐ చీప్ మార్తండ, హొంమినిష్టర్, బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ఇన్స్ పెక్టర్, జనరల్ షెకవత్ మరికొందరు ముఖ్యమైన ధికారులు ఉన్నారు. ఢిల్లీ కమిషనర్ మాలవ్య అప్పుడే వచ్చాడు.
    వారంతా ఓ వ్యక్తి వైపు చూస్తున్నారు.
    "వాటిజ్ డిస్ మిస్టర్ మార్తండ... మీ డిపార్ట్ మెంట్ లో అఫీసర్లకు టైం పంక్చువాల్టీ గురించి చెప్పలేదా మీరు?" కాసింత విసుగూ, కోపమూ మిక్స్ చేసి అన్నాడు హొంమినిష్టర్.
    "సారీ సర్... బట్ వన్ థింగ్ ఈజ్ ష్యూర్... మా ఆఫీసర్ వచ్చాకే కరెక్ట్ టైంను మనం సెట చేసుకోవాలి. ఎగ్జాక్ట్ లీ టెన్ కు వచ్చేయమన్నాను."
    "ఇప్పుడు పదయింది" హొంమినిష్టర్ అన్నాడు.
    సరిగ్గా అప్పుడే విశాలమైన ఆ సెంట్రల్ ఎయిర్ కండిషన్డ్ డోర్స్ తెరుచుకున్నాయి.
    "అదిగో... మాటల్లో వచ్చాడు..." అన్నాడు సిబిఐ చీఫ్ ఆనందంగా.
    "గుడ్మార్నింగ్ ఎవ్రీబడి..." అందరికీ విష్ చేసాడు సిబిఐ ఆఫీసర్ కౌశిక్.
    ముప్పుయేళ్ళు కౌశిక్ ఐదు అడుగుల పదకొండు అంగుళాల పొడవుతో, దృడంగా వుంటాడు. పెదవుల మీద చెదరని చిర్నవ్వు, ఎత్తుకు తగ్గ లావు. హుందాగా వుంటాడు.
    "ఓ సిబిఐ ఆఫీసర్ కోసం ఇంతమంది ఉన్నతాధికారులు ఎదురుచూడ్డం ఇదేప్రధమం అనుకుంటాను" అన్నాడు హొంమినిష్టర్.
    "అదంతా కౌశిక్ గ్రేట్ నేస్. అతి చిన్నవయసులోనే ఎన్నో విజయాలు సాధించటం కౌశిక్కే చేతనైంది. ఇఅరవైమంది ఐఎస్ఐ ఆఫీసర్లను పట్టుకొన్న ఘనత కూడా కౌశిక్ దే..." సిబిఐ చీఫ్ అన్నాడు కౌశిక్ వైపు అబినందన పూర్వకంగా చూస్తూ.
    "వేల్ డన్... మిస్టర్ మార్తాండ్... బిది బై అసలు విషయానికి వద్దాం..." అన్నాడు హొంమినిష్టర్.
    సిబీఐ చీఫ్ బియాస్ ఎఫ్ ఇన్స్ ఫేక్టర్. జనరల్ వైపు చూసాడు.
    ఐ.జి షెకావత్ గొంతు సవరించుకున్నాడు.
    "మైడియర్ ఆఫీసర్... ఈ మధ్య పాకిస్తాన్ రేంజర్స్ తో చర్చించేందుకు నా ఆద్వర్యంలో ఓ బృదం లాహోర్ వెళ్ళిన విషయం తెలిసేవుంటుంది..." అని ఆగాడు.
    వెంటనే కౌశిక్ "ఎక్స్ క్యూజ్ మీ సర్... అప్పుడు మీ బృందాలు ఓ సొరంగా మార్గాన్ని కనుక్కున్నాయి.అయూధాలను, మత్తుపదార్దాలను భారత్ లోకి చేరవేసేందుకు సారి హద్దు ప్రాంతంలో ఓ సొరంగా మార్గం తవ్వి వుండడాన్ని మీరు కనుక్కున్నారు.ఆ సొరంగ మార్గం తవ్వడానికి కనీసం రెండు నెలలైనా పట్టింవుంటుంది. ఎవరి సహాకారం లేకుండా ముఖ్యంగా పాకిస్తాన్ సహకారం లేకుండా ఈ సొరంగా మార్గాన్ని తవ్వడం అసాద్యం... అనే విషయం మీ నోటిసుకు వచ్చింది.
    ఈ విషయంలో పాకిస్తాన్ కూడా కప్పదాటు సమాధానం చెప్పింది... యమి కరెక్ట్..." ఆగాడు కోఎశిక్.
    విభ్రంగా చూశాడు బియస్ ఎఫ్ ఇన్స్ పెక్టర్ జనరల్ షెకావత్.
    "మీకు ఈ విషయాలన్నీ..."
    "ఓ కేసు నా దగ్గరకి రాబోతుంది. అనుకున్నప్పుడు ఆ మాత్రం వివరాలు తెలుసుకోకపోతే ఎలా?" కోఎశిక్ అన్నాడు చిర్నవ్వుతో.
    వెరీగుడ్ మిస్టర్ కౌశిక్... మీలో వున్న ఈ షార్ప్ నేస్ మాకు చాల నచ్చింది..." హొంమినిష్టర్ అంటూ కమిషనర్ వైపు చూసాడు.
    కమిషనర్ తన ముందున్న పైల్ కౌశిక్ అందించి చెప్పసాగాడు .
    "గత రెండు వారాలుగా విచిత్రమైన నేరాలు జరుగుతున్నాయి.కిన్నెరా బ్యాంకులో జరిగిన నేరం మొదటిది, అక్కడ్నుంచి మిస్తిరియాస్ గా జరిగుతున్న ఈ నేరాల్లో మాకు 'స్కూప్' దొరకడంలేదు. శివారు ప్రాంతాల్లో గస్తీ అధికం చేస్తాం. అన్ని ఫోలీసు స్టేషన్ ఎలర్ట్ చేసాం... అయినా.. నేరస్థులు దొరకడంలేదు.
    ఈ నేరాలు చేస్తున్నది ఒక వ్యక్తా? లేక మూఠనా? అనేది అర్ధంకావడం లేదు. వేలిముద్రలు దొరకడంలేదు.            
    కొంతమంది కాలి బూడిదయ్యారు. కొందరు  నల్లగా కేరేమ్టు షాక్ కొట్టినట్టు మాడిపోయారు. కరెంట్ షాక్ యిచ్చి చంపిన దాఖలాలు లేవు.కొన్ని బాడీలు పెట్రోలు, కిరోసిన్ లాంటి ద్రవాలు ఉపయోగించకుండానే కాలిపోయాయి. న్యూఢిల్లీ న్యూస్ రిపోర్టర్ నితీష్ రాయ్ ఓ వ్యక్తిని అనుమానిస్తూ వివరాలు పత్రికలో ప్రచురించాడు. ఆ వార్త వచ్చిన మరుసటి రోజే నితీష్ రాయ్ ఘోరమైన చావు చచ్చాడు. నితీష్ రాయ్ పబ్లిష్ చేసిన అ వివరాల ఆధారంతో కంప్యూటర్ గ్రాఫిక్స్ సాయంతో ఆ వ్యక్తి రూపురేఖలు తీసాం కంప్యుటర్ ప్రింటవుట్ ఇదిగో" అంటూ ఓ కవర్ కౌశిక్ ముందుకు తోసాడు.
    కోఎశిక్ ఆ కవర్ ఓపెన్ చేసి అందులోని ఫోటో చూసాడు.
    "అలాంటి వ్యక్తి అచూకే కోసం మేమూ ప్రయత్నించినా పట్టుకోలేక పోయాం... ఈ విషయంలో మా మీద వత్తిడి ఎక్కువ అవుతుందే తప్ప మేమూ సొంసియర్ గా... టు.. బి.. ప్రాంక్ గా చెప్పాలంటే ప్రోగ్రస్ సాధించిన లేకపోయాం.
    నిజం చెప్పాలంటే మాకున్న బలగం తక్కువ. ఎన్నో నేరాలతో వాటి దర్యాప్తులతో మాకున్న వసతులతో మేమూ ఇన్వెస్టిగేట్ చేస్తున్నాం. ఈ పరిస్థితుల్లో హొం మినిస్టర్ ఈ కేసు మాకు అప్పగిస్తామన్నారు.మీ గురించి, అందుకే మేమూ కూడా సంతోషంగా ఫీలవుతున్నాం. ఈ కేసు వెంటనే మీరు సైవ్ చేస్తారన్న నమ్మకం వుంది" అంటూ ముగించాడు కమిషనర్.
    "థాంక్యూ సార్... నా మీద మీ అందరకీ వున్న నమ్మకానికి కృతఙ్ఞతలు... ముందుగా ఈ కేసుకు సంభందించిన పూర్వాపరాలు మనం సేకరించకలగాలి..."
    "మిస్టర్ కౌశిక్... మీరేం చేస్తారో.... ఎలా చేస్తారో మీ ఇష్టం. ఫోలీసు యంత్రాంగం మీకెప్పుడూ అందుబాటులో వుంటుంది. మీకు స్పెషల్ పవర్స్ కూడా ఇవ్వబడతాయి. మీరు ఈ కేసును అతి త్వరలోనే క్లోజ్ చేయాలి. త్వరలోప్రపంచ దేశాల నాయుకల సమావేశాలు మన ఇండియాలో ప్రతిష్టాత్మకంగా ప్రారంభం కాబోతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో మనం ఎలాంటి ఉపద్రవాన్ని అయినా ఎదుర్కోవడానికి సిద్దంగా వుండాలి..."హొం మినిష్టర్ అన్నాడు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS