3. "తల్లీ | నీవిటు - శోకింపకుము
చూతువుగా రా | వణు పాపఫలము |
శ్రీరఘురాముని - అగ్నిబాణముల
చూతువుగా రా | వణు దుర్మరణము |
మును ముందుగ నీ - జాడ తెలియగ
వచ్చినాడను - రాముని బంటుగ | "
అని హనుమంతుడు - సీతతో పలికె
అంజలి ఘటించి | చెంతన నిలిచె .... ||శ్రీ||
4. "వానర రాజు సు | గ్రీవుని మంత్రిని
నన్ను బిలుతురు - హనుమంతుడని |
రామ సుగ్రీవులు - మిత్రులైనారు
నీ జాడ తెలియ - వేచియున్నారు |
రామలక్ష్మణులు - వానర రాజుతో
లంక చేరెదరు - వానర కోటితో |"
అని హనుమంతుడు - సీతతో పలికె
అంజలి ఘటించి | చెంతన నిలిచె .... ||శ్రీ||
__: 34 వ. స. సంపూర్ణము :__
35 వ. సర్గ
సీత మారుతితో :-
1. "ఓ హనుమంతా - హాయి బొందితిని
నీ పలికిన శ్రీ | రామకధ విని |
రామలక్ష్మణుల - ఎట్లేరిగితివి
రూపు రేఖలను - ఎట్లు గాంచితివి ?
వారి మాటలను - ఎట్లు వింటిని
వారి గుణములను - ఎట్లు తెలిసితివి ?"
అని పల్కె సీత - హనుమంతునితో
రామకధను కీ | ర్తించిన వానితో .... ||శ్రీ||
మారుతి సీతతో :-
2. "సర్వ జీవన సం | ప్రీతి పాత్రుడు
కమల నేత్రుడు - దయాసాంద్రుడు |
బుద్ధియందు బృ | హస్పతి సముడు
కీర్తియందు దే | వేంద్రుని సముడు
క్షమా గుణమున - పృధివీ సముడు
సూర్యతేజుడు - శ్రీరఘురాముడు |"
అని హనుమంతుడు - సీతతో పలికె
అంజలి ఘటించి | చెంతన నిలిచె .... ||శ్రీ||
3. "వేదసారముల - గ్రోలినవాడు
ధనుర్ధరులలో - అగ్రగణ్యుడు |
ఎనిమిది అడుగుల దీర్ఘకాయుడు
అరి భయంకరుడు - ఆశ్రిత పాలుడు
చతుర్వర్ణ సం | రక్షణ దక్షుడు
సదాచార సం | పన్నుడు రాముడు |"
అని హనుమంతుడు - సీతతో పలికె
అంజలి ఘటించి - చెంతన నిలిచె .... ||శ్రీ||
4. "చతుర్వేదములు - తెలిసినవాడని
అంగుష్ఠమూల - రేఖలు దెల్పెడు |
దీర్ఘాయుష్యము - కలిగినవాడని
ముఖపాద హస్త | రేఖలు దెల్పెడు |
పురుషోత్తముడని - మహాత్ముడని
శ్రీరాముని రూపు - రేఖలు దెల్పెడు |"
అని హనుమంతుడు - సీతతో పలికె
అంజలి ఘటించి - చెంతన నిలిచె .... ||శ్రీ||
5. "కరచరణాది - ద్వందాంగములు
పదునాల్గు జతలు - సమములుగా గల |
నాసికాకర్ణ - నయనాదులు
అష్టాంగములు దీ | ర్ఘ ములుగా గల |
శ్రీవత్సాంకిత | విశాల వక్షుడు
శ్యామసుందరుడు - శ్రీరఘురాముడు |"
అని హనుమంతుడు - సీతతో పలికె
అంజలి ఘటించి - చెంతన నిలిచె .... ||శ్రీ||
6. "సమదీర్ఘములగు - కేశములు గల
శిరోభాగమున - మూడు సుడులుగల |
సింహ శార్దూల - వృషభేంద్రులవలె
హొయలు మీర వెడ | లు నడకలుగల |
అలకలాడు అం | దాల మోముగల
అరవిందాక్షుడు - శ్రీరఘురాముడు |"
అని హనుమంతుడు - సీతతో పలికె
అంజలి ఘటించి - చెంతన నిలిచె .... ||శ్రీ||
7. "కను కొలకులలో - ఎరుపు జీరగల
విశాలమైన - కనుదోయిగల |
శంఖమువంటి - కంఠసీమగల
గంభీరమైన - కంఠధ్వని గల |
సురచిర కర్ణ క | పోలములుగల
ఆజానుబాహుడు - శ్రీరఘురాముడు |"
అని హనుమంతుడు - సీతతో పలికె
అంజలి ఘటించి - చెంతన నిలిచె .... ||శ్రీ||
8. "సత్యధర్మముల - సంరక్షకుడు
సర్వలోకముల - శ్రేయస్కాముడు |
ధర్మనిరతి వ | ర్దిల్లు శ్రీలుడు
ధర్మమరసి వ | ర్తిల్లు శీలుడు
కీర్తిప్రతాప సం | పన్న సద్గుణుడు
పురుషోత్తముడు - శ్రీరఘురాముడు |"
అని హనుమంతుడు - సీతతో పలికె
అంజలి ఘటించి | చెంతన నిలిచె .... ||శ్రీ||
