Previous Page Next Page 
తప్పు పేజి 23

 

    మరో నెల గడిచేసరికి అతను కోర్టుకు వెళ్ళడం మానేసిన క్రమాన్ని తప్పించుకుని శాశ్వతంగా నే కోర్టు పని మానుకున్నాడు.
    శ్రీకాంత్ ఆవేళ తండ్రి యెదుటికి వచ్చి నిలుచున్నాడు. సూర్యుడు పశ్చిమ దిక్కుకి మళ్ళి పోయాడు. ఆకాశం వింత వింత రంగుల్ని పులుముకుంది. ఆ సమయంలో చటర్జీ ప్రకృతి వైపు, అస్తమించుతున్న సూర్యుడి వైపు చూస్తూ విరాగి లా నవ్వాడు. కొడుకు రావడం అతను గమనించే స్థితిలో లేడు. ఈ మధ్య అతను =త్రాగుడు పూర్తిగా మానేశాడు. చెట్టంత కొడుకు యెదుట అతనికి జరిగిన అవమానమే గుణ పాఠం నేర్పింది. కారుని గారేజీ లో పెట్టాక అతనితో వచ్చిన స్నేహితుడు వెళ్ళిపోయాడు. పైకి వస్తానంటే కూడా చటర్జీ వారించాడు. అతను ఆంగ్లేయుడు. చటర్జీ అడుగులో అడుగు వేసుకుంటూ మెట్లెక్కుతుంటే శ్రీకాంత్ అంతవరకూ తండ్రి కోసం యెదురు చూస్తున్న వాడల్లా తండ్రి తొట్రుపాటుగా నడవడం గమనించి యెదురు వచ్చాడు. కానీ అతను తండ్రిని ఆ సమయంలో పట్టుకోలేక పోయాడు. మెట్లు సగం వరకూ యెక్కిన చటర్జీ క్రిందికి జారిపోయాడు. అతనికి తగిలిన దెబ్బ నుంచి త్వరలోనే కోలుకున్నా కొడుకు యెదుట తగిలిన అవమానావు గాయం మాత్రం మాసిపోలేదు. అంతే. అతను మళ్లీ అటువంటి ప్రదేశాలకి వెళ్లి త్రాగి రావడం చేయలేదు.
    శ్రీకాంత్ కి బాగా తెలుసు. తండ్రి పిరికితనం కొన్నిసార్లు అతని మంచికే జరిగుతున్నదని . శూన్యం లోకి చూస్తున్న తండ్రి వైపు చూసి 'నాన్నగారూ యిద్దరం కలిసి అలా వెళ్లి వద్దాం అంటారా?' అని అడిగాడు.
    చటర్జీ తలెత్తాడు. 'ప్రొద్దు పడమర కి వాలిపోయింది శ్రీకాంత్. కానీ యీ జీవితపు ప్రొద్దు యెప్పటికి వాలుతుందో.   చాలా బేజారై పోయాను. నేనింక ప[పోరాడలేని బ్రతుకుతో.'
    'నాన్నగారూ!' ఖంగారుగా అన్నాడు శ్రీకాంత్.
    'ఖంగారు దేనికి? అధైర్యవంతులు బ్రతికే లోకం కాదిది.'
    చటర్జీ యిప్పుడు పూర్తిగా వేదాంత ధోరణి లో మాట్లాడుతున్నాడు. ఉమేష్ ని అతను పిరికి తనం వల్లనే గోవింద యెదుట శ్రీకాంత్ కన్నా ఎక్కువగా ప్రేమించి  నట్లు కనబరచలేక పోయేవాడు. ఉమేష్ ని ప్రేమగా, హృదయ పూర్వకంగా దగ్గరికి తీసుకోవాలని అనిపించే మనసుని 'గోవింద యేదైనా అనుకుంటుందేమోనని మనసు నెత్తిన ఒకటి మొట్టి నోరు మూసేసే వాడు. ఉమేష్ దగ్గరికి వచ్చి చిన్ని చిన్ని చేతుల్తో తల వొళ్ళో వాలిపోయి మెడ చుట్టూ చేతులు వేసినప్పుడు రెండు చేతులూ అప్రయత్నంగా చాపెవాడు. వాడిని గుండెల్లో కి దూర్చేసుకోవాలని దురాశ గా దగ్గిరికి తీసుకోవాలనుకుంటుండగా యెక్కడి నుంచి వచ్చేవాడో శ్రీకాంత్ పరుగు పరుగున వచ్చేసి తమ్ముడినే దూరంగా జరిపి తనే తండ్రి వొడిలో చేటు చేసుకుని సంతోషంతో చప్పట్లు కొట్టేవాడు. చిన్నవాడు కాళ్ళు నేల మీద తటతట లాడిస్తూ దొర్లి దొర్లి ఏడుస్తుంటే నిస్సహాయుడి లా చటర్జీ కళ్ళు అప్పగించి చూడడం తప్ప యేమీ చేయలేకపోయే వాడు. గోవింద మనసు యే సమయంలో నూ కూడా నొప్పి కలిగి బాధతో చితికి   పోకూడదని కన్న కొడుకుని అడుగు దూరం లోనే వుంచేవాడు. ఉమేష్ ఎదుగుతూ తండ్రి అనురాగం కోసం బిక్క మొహం వేసి చూస్తుంటే స్వంత కొడుకు పట్ల కనికరాన్ని చూపించలేని తన అసమర్ధత కి తనలో తనే తిట్టుకునే వాడు. ఉమేష్ పైని చటర్జీ కి గల అంతులేని ఆపేక్షా ను రాగాలు ఆవిధంగా అతను కళ్ళ యెదుట వున్నన్నాళ్ళూ సజీవ సమాధిని పొందాయి. ఆ పిల్లాడు దూరం అయిపోగానే ఆ సమాధి రాళ్ళని బ్రద్దలు చేసుకుంటూ వచ్చేసి స్వేచ్చగా అతడిని ఊపిరి పీల్చుకొనివ్వ కుండా చేయసాగాయి. కొడుకుని పిలుద్దాం అనిపించినా అతన్ని దుయ్య బట్టే ప్రపంచానికి ఝడుసుకుని రోజురోజుకి పిరికి వాడై పోసాగాడు. అతనిలో చెలరేగే భావ వీచికలు అంతర్గతంగా అణగారి పోయినా యెంతో ఆనందించే వాడు. కానీ అవి వికటాట్టహాసం చేస్తూ అతడిని సవాల్ చేస్తున్నాయి.
    'కన్నకొడుకుని ఒక్క నాడైనా చేరదీశానా?' అని యెత్తి పొడుస్తున్నాయి. మానసికంగా జరిగే ఈ సంఘర్షణ లో క్రమంగా శ్రీకాంత్ చోటు చేసుకున్నాడు. ఉమేష్ పైన పితృప్రేమ శ్రీకాంత్ పైన మళ్లక;పోగా పగా, ద్వేషం మాదిరిగా మార్పు చెందాయి.
    శ్రీకాంత్ కి యెప్పుడో గానీ అతడు సమాధానం యివ్వడు --- గోవింద గమనించి కూడా అతన్ని ప్రశ్నించలేదు. అర్ధరాత్రి మగత నిద్రలో 'నాయనా ఉమా' అంటూ కలవరిస్తాడు చటర్జీ. గోవింద ఉలిక్కిపడి లేస్తుంది. లైటు వేసి భర్త వైపు చూస్తుంది. అతని బుగ్గల మీద వెచ్చని కన్నీరు సన్నగా కాలువ కట్టి ఆరిపోయిన చారికలు కనిపించ గానే బాధతో విలవిల్లాడి పోతుంది.
    శ్రీకాంత్ తండ్రిని షికారుగా రమ్మనగానే చటర్జీ నవ్వుతూనే తిరస్కరించి కొడుకుని యెదుటి నుంచి పంపేశాడు.
    శ్రీకాంత్ వెళ్ళిపోయాడు.
    తల్లి తన గదిలో కూర్చుని నిశ్శబ్దంగా యేడుస్తూ వుండడం శ్రీకాంత్ గమనించి తల్లి యెదుటి కి వచ్చి ఆవిడ మంచం మీద తనూ కూర్చున్నాడు. కొడుకు రాగానే గోవింద ఖంగారుగా కళ్ళు తుడుచుకుని లేవబోయింది. శ్రీకాంత్ ఆవిడ ని కదలనివ్వ కుండా వొళ్లో తలపెట్టుకుని 'నువ్వు ఏడవద్దు అమ్మా . యిప్పుడు ఏమైందని. అత్త వుత్తరం రాసింది కదమ్మా తమ్ముడూ కృష్ణా హాయిగా తమ యింటికి దగ్గరే వున్నారని. వాడిని చూడాలని వుందా? నాన్నగారు యివాళ యిలా వున్నా రేపు తమ్ముడికి కబురు చేయకుండా వుంటారా? నువ్విలా ప్రోద్దస్తమానూ తమ్ముడి కోసం యేడవడం బాగులేదమ్మా. అది వాడికి జయం కూడా కాదు' అన్నాడు.
    గోవింద పేలవంగా నవ్వింది. అంత దుఃఖం లోనూ. 'నేను ఏడవ కూడదు నిజమేరా శ్రీ. యేడ్చే అర్హత కూడా అదృష్ట వంతులదే. మీ నాన్న పోయిన రోజున గుండెలు అవిసిపోయి యేడుద్దాం అనుకున్నా పాపిష్టి యేడుపు అప్పుడు రాలేదు. అందరూ మాటలంటూన్నా ఎడ్చేందుకు సాహసం లేకపోయింది. యిప్పుడు వాడు వెళ్ళి పోయినందుకు మీ నాన్న కఠినంగా ఏడవద్దని శాసించడం మరీ అదృష్టం అనుకో' నాది అన్నది.
    శ్రీకాంత్ యేమీ అనలేక పోయాడు. తమ్ముడు పెళ్ళి చేసుకుని వెళ్ళిపోయి అప్పుడే యెనిమిది నెలలు దాటిపోయాయి.  
    ఒకసారి హైదరాబాదు వెళ్లాలని గంగ ని చూడాలనీ అతని మనసు పెనుగు లాడుతుంటే , తండ్రిని ఆవరించిన పిరికి తనమే యిప్పుడు తననీ అవరిస్తోందా యేవిటి? అని ఖంగారు పడేవాడు ఆ క్షణం లోనే.
    వారం రోజులు అయ్యేసరికి శ్రీకాంత్ కి డిల్లీ లో పేరున్న కంపెనీ నుంచి యింటర్వ్యూ కి కాల్ వచ్చింది. అతను సంతోషంగా తండ్రికి యీ విషయం చెప్పాడు. చటర్జీ శ్రీకాంత్ ని యిప్పుడు శత్రువు కన్నా హీనంగా చూస్తున్నాడు. అయినా అతను మనసులోనే దాచుకుని యిటు తల్లి గానీ, అటు కొడుకు గానీ గమనించకుండా జాగ్రత్త పడుతున్నాడు. శ్రీకాంత్ వచ్చి అడగగానే అతను రెట్టించిన సంతోషాన్ని అభినయిస్తూ కొడుకు భుజం మీద చేయి వేసి, ' అలాగే వెళ్ళి రా. బాంక్ లోంచి ఇవాళే నీకు కావలసినంత డబ్బు తీసుకో.' అన్నాడు.
    శ్రీకాంత్ ప్రయాణం విషయం విని గోవింద మొదట బాధపడ్డది. యిప్పుడు తన యెదుట వున్న ఒక్కడూ కూడా వెళ్ళి పోవడం ఆవిడ మాతృహృదయానికి గొడ్డలి పెట్టులాగే వుంది.
    'నన్ను రష్యా కూడా పంపుతారమ్మా వాళ్ళు ముందు ముందు ముఖ్యంగా సెలక్టు కావాలి కద. నువ్వు నవ్వుతూ పంపాలి నన్ను.' అన్నాడు.
    గోవింద యీసారి కొడుకుని  దగ్గరికి తీసుకుని తల మీద చేయి వేసి ' వెళ్లిరా బాబూ. నీకు శుభం కలగాలని ప్రార్ధిస్తాను దేవుణ్ణి.' అన్నది.
    శ్రీకాంత్ చెప్పిన విషయం విన్నాక అతన్ని తిన్నగా తన స్నేహితుడు చౌదరి యింటికి పంపాలని తోచింది చటర్జీ కి. కోడుకుని పిలిచి 'యిక్కడా అక్కడా బస చేయడం దేనికి? నా ఫ్రెండ్ అక్కడే సుప్రీం కోర్టు లో పని చేస్తున్నాడు. రామ చంద్ర చౌదరి కి నేను వుత్తరం రాసి యిస్తాను. నీకు యే విధమైన కష్టమూ కలగకుండా చూసుకుంటాడు.' అన్నాడు.
    తండ్రి యిచ్చిన అడ్రసు తీసుకుని అతను మంచిరోజు చూసుకుని తల్లీ తండ్రికి నమస్కరించి ప్రయాణం అయాడు. చటర్జీ భార్యతో సహా స్టేషను వరకూ వెళ్ళి సాగనంపాడు.
    అతనికి యిప్పుడు అంతులేని ఆనందంగా వుంది. తన కొడుకుని దూరం చేసిన శ్రీకాంత్ యిప్పుడు చాలా దూరం వెళ్ళి పోతున్నాడు. మనశ్శాంతి అంటూ లేకుండా చేసిన ఆ పిల్లాడికి మాత్రం శాంతిని దేనికివ్వాలి? రామచంద్ర చౌదరి యిటువంటి స్పుర ద్రూపి ని తిరిగి రానిస్తాడా? అతనికి వున్న పలుకుబడి , అందాల బరినే వంటి కూతురూ శ్రీకాంత్ కాళ్ళకి సంకెళ్ళు వేయవూ. రాధిక కూతుర్ని చేసుకుని అతడెందుకు సుఖపడాలి? చటర్జీ ఎన్నేళ్లు గా పడిన మానసిక సంక్షోభం లో శ్రీకాంత్ అగ్ని శిఖలో పడిన మిడత మాదిరి అయిపోవడం ఒక విధంగా దురదృష్టం కాక మరేమిటి?
    చటర్జీ ఆరాత్రి గోవింద పక్కన నిశ్చింతగా నిద్రపోయాడు.
    శ్రీకాంత్ డిల్లీ చేరుకునే సరికి చటర్జీ యిచ్చిన టెలిగ్రాం అందుకున్న రామచంద్ర చౌదరి పిల్లలిద్దరి తోటీ కారులో స్టేషన్ కి వచ్చాడు. అతను ఫస్టు క్లాసు కంపార్టు మెంటు దగ్గరనిలుచుని దిగుతున్న ఒక్కొక్కరినే పరిశీలనగా చూస్తూ శ్రీకాంత్ ని ఆనవాలు పట్టిన వాడి మాదిరిగా 'చటర్జీ కొడుకువి నువ్వే కాదు బాబూ.' అని ప్రశ్నించాడు. సూట్ కేస్ క్రింద పెట్టి నమస్కరించి 'అవునండి.' అన్నాడు శ్రీకాంత్ వినయంగా.
    'ఈతనే నమ్మా చటర్జీ కొడుకు శ్రీకాంత్.'అని కూతురికి పరిచయం చేసి పక్కనే నిలుచున్న కొడుకుని చూపించి 'వీడు మా పెద్ద వాడు ఎమ్. యి. మెకానికల్ ఇంజనీరింగ్ పాసయ్యాడు. పద్మనాభ చౌదరి. చౌదరి అంటే చాలు.' అన్నాడు.
    పరిచయాలు అయ్యాక కార్లో కూర్చుంటూ 'మరిచిపోయాను అమ్మాయి పేరు చెప్పడం . హేమ నళిని ' అన్నాడు.
    శ్రీకాంత్ కిటికీ లోంచి రోడ్లని చూస్తున్నాడు. పక్కనే కూర్చున్న చౌదరి మాటల్లోకి దిగాక అతనూ కబుర్ల లో పడిపోయాడు. హేమ నళిని ఎమ్. ఎస్.సి చదువుతున్నది. ఈ ఫైనలియర్ అయిపోయాక రిసెర్చి చేయాలనుకుంటున్నట్లు చెప్పింది.
    రామచంద్ర చౌదరి పిల్లల్ని ఆధునాతనంగా పెంచినా తను మాత్రం ఖద్దరు లాల్చి పైజమా వేసుకున్నాడు. లావుగా, ఎత్తుగా బలంగా వున్న అతను మధ్య మధ్య తెలంగాణా భాష యాసగా దోర్లిస్తున్నాడు. హేమనళిని , చౌదరీ మాత్రం స్వచ్చమైన తెలుగులో మాట్లాడుతున్నారు.
    'ఇంటర్వ్యూ టైముకి రేపు నేను అక్కడికి వస్తాను. నువ్వు సెలక్టు కాకపోవడం యేమిటి? నీకు రికమెండేషన్ అనవసరం ' అన్నారు యింటికి వచ్చాక అయన సర్టిఫికెట్లు చూస్తూ.
    అతని భార్య చాలా పాతకాలపు మనిషి మాదిరి గా ' ఆవిడ వొంటి మీద దాదాపు లక్ష రూపాయల నగలు వున్నాయేమో ' అనుకున్నాడు శ్రీకాంత్. కూతురికి, తల్లీకి ఒకేసారి విధాత ముద్ర వేసినట్లు పోలికలు వున్నాయి. కళ మాత్రం తండ్రివి. హేమనళిని మేలిమి బంగారం ఛాయా లో పంజాబీ డ్రెస్సు వేసుకుని పెద్ద డాలరు వున్న గొలుసు మాత్రం వేసుకుంది. నుదుట యెర్ర రంగు పెన్సిల్ తో పొడుగ్గా బొట్టు పెట్టుకుంది. కాటుక తీర్చి దిద్దుకుంది.' కుడి చేతిని చిన్న డయల్ వున్న వాచీ మాత్రం పెట్టుకుంది. యెడమ చేతికి గాజులు లేవు. ఎత్తు మడమలున్న జోళ్ళు వేసుకుంది. ఆ పిల్ల మొహాన్ని పరీశిలించి చూస్తె అప్పుడే అరవిచ్చిన గులాబీ పువ్వులా కనిపించింది. ' శ్రీకాంత్ యింతసేపూ ఆ పిల్లని నఖ శిఖ పర్యంతం చూసి యిదేమిటి యిలా చేశాను. అనుకుని బుర్ర వొంచేసుకున్నాడు. తప్పుచేసిన వాడి మాదిరిగా.
    ఆరోజు ప్రయాణపు బడలిక వల్ల అతను మధ్యాహ్నం పూర్తిగా నిద్రపోయాడు. చౌదరి వచ్చి సినిమా కి లేవదీశాడు. కానీ అతను మన్నించమని సున్నితంగానే తిరస్కరించాడు.
    మర్నాడు యింటర్వ్యూ కి రామచంద్ర చౌదరి కారులో  స్వయంగా దింపి వచ్చాడు. యింటికి వచ్చేక భోజనాల సమయంలో కూతుర్ని కొడుకునీ వుద్దేశించి 'యింక మీరు డిల్లీ ఆగ్రా చూపించ వచ్చు యితనికి. చూడు పద్మా యితను వస్తున్నాడని కారు యిస్తున్నాను కాని మొన్నటి లా దీనికి ఏ యాక్సిడెంటో యిచ్చి రిపేర్ కి తీసుకు రాకు. కొంచెం స్లోగా నడిపించు. ఫరవాలేదు రాత్రి కొంచెం ఆలశ్యం అయినా' అన్నాడు.
    శ్రీకాంత్ నవ్వి వూరుకున్నాడు. ఆయనకి తండ్రి వయసు కన్నా కొంత ఎక్కువే వుంటుంది. వ్రుద్దుడే అయినా ఛలోక్తి గా మాట్లాడడం అయన సోత్తులా వుంది.
    ఆవేల్టి నుంచే ప్రారంభించారు ముగ్గురూ డిల్లీ లో ఎర్రకోట , యిండియా గేటు, మొదలైన వన్నీ చూడడం , అన్ని ప్రదేశాలూ చూడడం యింటికి రాగానే చౌదరి గారి భార్య పెట్టినవి తినేసి నిద్రలోకి జారిపోవడం శ్రీకాంత్ కి హాయిగా వుంది. 


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS