నా చైనా ఓ నా చైనా
హిమాలయం నీదీ నాదీ
గంగానది నాదీ నీదీ
యాగ్సినది నీదీ నాదీ
గోదావరి నీదీ నాదీ
పదిచేతులు మొక్కినంతనే
ప్రతిమ దేవుడవుతుందా?
పాలుపోసి కడిగి నంతనే
శిలకు కరుణ పుడుతుందా?
(ప్రమిదలెన్ని వెలుగుతున్నా
శిలకు చూపు వస్తుందా?)
రాలుతున్న ప్రతిక్షణం
రగులుతున్న నిప్పుకణం
మానవస్వభావంలో
మాలిన్య మదేమోకాని
తలపులన్నీ తారలతో
పొరలడమేమో బుగ్గియందు
బతిమాలుకున్నాను దేశభ్రష్టుని లాగ
ఎర్రని తెరలు ఎన్నెన్నో గవాక్షాలమాటున
పెనవేసుకున్న దయాధర్మాల చాటున
(తెలుసు బాగా నాకు వెన్నాడుతున్న వాని వినిర్మల ప్రేమ!
అయినా ఎంతగానో భయపడిపోయాను
అతనుంటే ఇతరమేదీ ఇక నాకుండదని!)
కాని ఒక చిన్న వాతాయణం వెడల్పుగా విచ్చుకుంటే
ఆ దారిన మూసివేస్తుంది అతని ఆగమనపు హోరుగాలి!
భీతికి తప్పించుకోవడం తెలియదు
ప్రేమకు వెన్నాడడం తెలిసినట్టు!
పరుగెత్తాను ప్రపంచం అంచులంటి
శ్రమపెట్టాను నక్షత్రాల బంగారు ద్వారాల
వాటి నినదించే ఇనప కమ్ముల వెనుక ముసిరి
తలకొట్టుకున్నాను ఆశ్రయం కోసం కొసరి;
చంద్రుని పోలిపోయిన రేవుల్లో మధురంగా నిశ్వసించి
వెండి సవ్వడులు వినిపించాను వెర్రిగా విహ్వలించి
ఉషస్సుతో ఉన్నాను హఠాత్తుగా రమ్మని
ఈ ప్రచండ ప్రేమికుడి నుంచి
నన్ను రక్షించి, నా మీద కప్పమన్నాను
నీ నునులేత గగన పుష్పాలను !
దించమన్నాను నీ అవ్యక్తావ కుంధనం నా చుట్టూ
అతడు చూడకుండా నా తట్టు !
ప్రలోభ పరిచాను అతని సేవకులందరినీ,
కాని వారి అకుంఠిత విశ్వాసంలో
కనిపించింది నా విశ్వాస ద్రోహం
వారి అచంచల భక్తిలో
విచలించింది నా చపల చిత్తం
చూశాను వారి విద్రోహపు నిజాయితీ, నమ్మకమైన మోసం
చేశాను వేగవంతమైన వాటి నన్నింటి వేగమీద ఫిర్యాదు
వీచే ప్రతి ఈదరగాలి జూలును పట్టుకుని వేలాడేను
కాని అవి చల్లగా జోరుగా వినీలాకాశపు పచ్చికమైదానాలను
తుడిచిపెట్టుకు పోతూంటే
లేదా ఉరుముల సారథ్యంతో స్వర్గం వైపు అతని రథాన్ని
ఒడిసి పట్టుకు పోతుంటే
వాటి పాదాల హేళన చుట్టూ ఎగసిపడే మెరపుల
భీతకి తప్పించుకోవడం తెలియదు చిత్తడిలో
ప్రేమకు వెన్నాడడం తెలిసినట్టు
అయినప్పటికి ఏ తొందరపాటు లేనివేటలో
అదురుపాటులేని గమనంతో - చంక్రమణంతో
ఉద్దేశించిన వేగంతో
ఉదాత్తమైన వేగిరంపుల సరాగంతో
వచ్చేశాయి వెన్నాడుతున్న పాదాలు
వినవచ్చిందొక గొంతు ముంచెత్తి ఆ పాదాల లయబద్ధ నినాదాలు
ఏదీ లేదు నీకాశ్రయం ఇచ్చేది
నీవు నాకాశ్రయం ఇచ్చేది లేదంటే అని !
మరి వెదకడం మానేశాను. తిరిగాను దారి తప్పినట్టు
ఎదిరించి మనిషి నీ మగువనూ ఏకాంతమే నా చుట్టూ !
అనిపించిందప్పుడు నాకు చిన్న పిల్లల చిలిపి కళ్ళల్లో
కనీసం వాళ్లేనాకాళ్ళు ఔను నాక్కావలసినవాళ్లు
తిరిగి చూశాను. వాళ్ళవైపు ఆశగా ఎంతోసేపు
కాని అకస్మాత్ సౌందర్యముతో వారి పరువపు నేత్రాలు
ప్రత్యుత్తరాల ప్రత్యూషాలు
ప్రసరించేలోగా సరీగా ఆ సమయానికే
లాగేసింది వాళ్లదేవదూత జుత్తుపట్టుకొని
పారేసింది నానుంచి దూరంగా... మహాక్రూరంగా
"అయితే రండి, మరోరకం శిశువుల్లారా!
ప్రకృతి నిసువుల్లారా !
నాలో మీ సుతిమెత్తని సాంగత్యాన్ని సాహిత్యాన్ని
పలుకరించ నియ్యండి మిమ్మల్ని పెదవికి పెదవిగా
చిలకరించ నియ్యండి గిలిగింతల కౌగిలింతల
అల్లికల ఉల్లాసాల నవ్వుల నవ మల్లికలు
చెలగాట లాడనియ్యండి నన్ను - మన మాతృదేవి
తిరుగుబోతు శిరోజాలతో
విందారగించ నియ్యండి ఆమె అందాల గాలి గోడల భవనాలలో
ఆమె వినీల వితర్థిక కింద తాగనియ్యండి నన్ను
మీ అకల్మష పద్ధతిలో ఒక పాన పాత్రిక నుంచి
దివస్సర స్సుందర
సుమధుర మధు కలశిక నుంచి
అంతే జరిగింది అంతా అలాగే
నేనూ వాళ్ల సున్నితపు సాహచర్యంలో
మమైకం పొంది
ప్రకృతి దాచుకున్న అనేకానేక
రహస్యాల గడియలు విడలాగాను
ఆకాశపు పెడసరపు ముఖం మీద
అక్షరాలన్నీ చదివేశాను
ఉదగ్ర సముద్రగర్జనలలోంచి ఉబుకుతూ నురుగులతో లేచే
వినీల వలాహకాల సకాల విజృంభణ విధానాలు తెలుసుకున్నాను
పుట్టేదీ గిట్టేదీ సమస్తము పైకిలేచి పక్కకు వాలిపోతుంటే
నా మనోవిభ్రమలకే ఆకారం రచించమన్నాను
విలపించే దివ్యత్వం వెలిగించే మదీయ విభిన్న చిత్తవృత్తులకు
విలాసంగా వారితో ఆనందించాను
వియోగంతో విభ్రమించాను!
సాయంసంధ్యతో బరువెక్కాను!
పగటి మరణించిన పావిత్ర్యాల చుట్టూ ఆమె
ప్రకాశించే కాగడాలు వెలిగించినప్పుడు
ప్రభాతబాల నేత్రాలతో పకపకమని నవ్వాను
శీతోష్ణాల వాతావరణాలన్నిటితో
విజయగర్వమూ విషాదమూ పొందాను
విలపించాం స్వర్గమూ నేనూ కలిసి
దాని తీయని కన్నీళ్ళు నామర్త్య బాష్పాలతో క్షీరమైనాయి
దాని సూర్యాస్తమయ హృదయాన్ని హత్తి
అచటి ఎర్రని స్పందనకెదురుగా
పరచుకొని నా హృదయాన్ని హత్తి
అచటి ఎర్రని స్పందనకెదురుగా
పరచుకొని నా హృదయాన్ని ప్రతిస్పందించ నిచ్చాను
పంచుకొని కలబోసుకున్న వేడిమిని
కాని అందువల్లకాదు, అందువల్లకాదు
మాననీయ వేదనను వెసలుబాటు
చెమ్మగిల్లాయి నా దుఃఖాశ్రువులు - స్వర్గపు
పొగ చూరిన చెక్కిలి మీద నిష్ప్రయోజనంగా
ఏలనగా ఆహా, నేనూ ఈ వస్తువులూ ఒకరిమాట
లింకొకరు అర్థం చేసుకోలేదు
ధ్వనులతో మాట్లాడేది నేను - వాటి చప్పుడు
వాటి కదలిక మాత్రం
అవి మాట్లాడేది నిశ్శబ్దాలతో
ప్రకృతి, పాపం సవతి తల్లితీర్చలేదు నా దప్పిక
నాకే ఆమె బాకీ వుంటే చూపించుగాక
మన సుకుమార పయోధరాల
తొలగించి ఆ దూరపు వినీలపు ఆకాశపు
విశాల విలాస వక్షోచాదనాన్ని
దాహంగొన్న నా నోటికొక నాటికి ఆమె చనుబాలు
ఆశీర్వదించనే లేదు
ఇంకా యింకా దగ్గర పడుతోంది వేట, ఆ వెంటాట!
