Previous Page
చైనా యానం పేజి 24


    అచంచలపు అడుగులు వేస్తూ
    ఉద్దిష్టవేగంతో ఉదాత్తపు వేగిరింపుతో
    అధిగమించి ఆ విని ధ్వనత్వాదాల వేగాల
    వినవస్తుందొక కంఠధ్వని మరింత క్షిప్తంగా
    "నిన్నేదీ సంతృప్తి పరచబోదు నన్ను నీవు
    సంతృప్తి పరచకపోతే" అని
    దిగంబరంగా నిలుచున్నాను ఎత్తిన నీ ప్రేమ ప్రహారానికి వేచుకుని
    పడింది దెబ్బ ముక్క ముక్కలుగా చీల్చావు నా కవలాన్ని
    మోకాళ్ళ మీద పడిపోయాను వేసిన నీ వ్రేటుకి
    అయిపోయానసహాయుణ్ణి - పిసరంతైన రక్షణ లేనివాణ్ణి
    అనుకున్నా నిద్రించానని అంతలో మేల్కొన్నాను
    నిద్రలో దిగంబరుణ్ణయానని తెలుసుకున్నాను
    నింపాదిగా తేరిచూస్తూ
    అంతలో కుదిపివేశాను స్థంబాల్లా నిలబడ్డ ఘడియల్ని
    పొంగే నా యవ్వన శక్తుల పొగరుబోతుదనాల దూకుడుతో
    లాక్కున్నాను నాలో నేనే
    బురదల మరకలతో నిండి నిలబడ్డాను
    నాచు పట్టిన సంవత్సరాల పెనుధూళి మధ్య
    ఆ కుప్పకింద పడిపోయింది మరణించిన నా యవ్వనం
    వంకరటింకర్లుగా కొంకర్లు పోయి
    బీటలు వారి నా రోజులు పొగలో ఎగసిపడి
    సెలయేటిమీద సూర్యకాంతి లాగ బ్రద్దలయినాయి
    పొంగి పొంగి బుసకొడుతూ
    ఔను స్వప్నం దగాచేసిందిప్పుడు
    స్వాప్నికుణ్ణి వీణ వైణికుణ్ణి వలె,
    ఏ గొలుసు గొలుసుల భ్రమల గుత్తులు గుత్తులు మడతలో
    భూమిని నాముంజేతి కంకణం చేసి తిప్పుకున్నానో
    అవికూడా లొంగిపోయాయి వాటి బలహీనపు త్రాళ్ళు
    ధాత్రికి సంజాయిషీ చెప్పుకున్నాయి
    అశేష విషాదభారంతో
    ఆహా! అయితే నీ ప్రేమ పెళుసైన
    కలుపుమొక్క లాంటిదేనా
    ఏమో అది అమరలోక పారిజాతమో ఏమో?
    తన పువ్వుల్ని తప్ప ఇరు పంచలకైనా
    ఇతర సుమాలను రానీయనిది
    ఆహా! అనంత సృష్టికర్మా! కర్రను కాలిస్తేనేగాని దానితో
    గాలిలో చిత్రించలేవా!
    ధూళిలోనా నవ్యత్వం వ్యయం చేసింది తన చంచల వర్షాన్ని
    ఇప్పుడు మరి నా హృదయం ఒక విరిగిన కేళాకూళి
    అందులో కన్నీటి బొట్లు కరడు కడతాయి
    ధారాపాతంగా స్రవించి
    నా కొమ్ములున్న కన్నుల మనస్సు మీద
    గజగజ వనికే తడిసిన భావాల నుంచి
    అంతే అది యింకా ఏం కావాలి
    గుజ్జులే అంత చేదయితే - పైతొక్కకేవీ మంచిరుచి?
    పొగమంచులో కాలం పొందే తడబాట్లను
    చూచాయగా పసిగడతాను
    అయినా అవ్యాహతంగా ధ్వనిస్తోందొక తూర్యరావం
    అనంత కాలపు దాగిన బురుజుల నుంచి;
    కుదుపులతో కుమిలె అవిషాద తుషారాల
    స్థలాలను పరాస్తం చేసి
    తర్వాత మళ్ళీ కడుగుతాను
    వ్యక్తావ్యక్త ప్రాకారాలను చుడుతూ !
    కాని నన్ను రమ్మని పిలిపించిన నాకు తొలిసారి కనిపించిన
    మెరిసే ఊదారంగు దుకూలాల
    చీకటిలో ఆకుపచ్చని
    శరవణదళ కిరీటం ధరించిన అతనికన్నా ముందుకాదు
    మానవుని హృదయమో జీవితమో
    ఫలసాయం నీ కందిస్తే
    అప్పుడు నీ పంట పొలాలు పెంటపోగులు
    కావలసిందేనా - కుళ్ళిన మృత్యువుతో?
    ఇంతలో చేతికందుతుందిప్పుడు
    నన్నింతగా వింతగా వెంట దరమడం గురించిన గాలికబురు
    చుట్టు ముడుతుంది నన్ను గొంతుకచప్పుడు
    తిరగబడి పగిలి పగిలి విరుచుకుపడే సముద్రంలాగ
    అంత చెడిపోయిందా నీ భూమి పెంకులు
    పెంకులుగా ముక్క చెక్కలయి?
    చూడు అన్ని వస్తువులూ నీనుంచి ఎగిరిపోయాయి!
    నానుంచి నువ్వెగిరి పోతున్నావు కావున !
    విచిత్ర విషాదకర విఫల వస్తువా !
    ఎందుకు ఎవరైనా నీ కోసం కేటాయించాలి ప్రేమను
    శూన్యం నుంచి అంత ఎక్కువ
    నేను తప్ప మరెవ్వరూ
    చెయ్యకపోవడం చూస్తున్నప్పుడు (అన్నాడతను)
    "కావాలి మానవ ప్రేమకు మానవీయమైన అర్హత"
    మానవుని మట్టిపెళ్ల లన్నింటికన్నా
    మసకబారిన మట్టిపెళ్ళవు నువ్వు
    ఏదీ కంటికి అర్హత?
    అయ్యో, నాకు తెలియనే తెలియదు
    నీ ప్రేమకయినా నువ్వెంత అనర్హుడివో!
    నీలాంటి నికృష్ణుని ప్రేమించేవాణ్ని
    వినరా క్షుద్రనరా! ఎవణ్ణి చూడగలవురా
    నన్ను తప్ప నన్ను మాత్రం తప్ప?
    నీకు మాని కలిగించడానికి కాదు
    నీ వద్ద నుంచి నేను తీసుకున్నదంతా
    దాన్ని నువ్వు కనుక్కోవాలని
    నా బాహు పరిష్వంగంలో !
    దేన్ని నీ పసిపాపడి పొరపాటు
    భావించిందో పోగొట్టుక్నుట్టు
    ఏ తత్సమస్తమూ నేనే
    ఇంట్లో పదిలపరిచాను నీ కోసం
    కనరా హీన నరాలే!
    కరం గాకరంతో గీకించు ఇటురా !
    ఆగుతుంది నా చెంతనే అసదనిపాతం
    ఇంతా చేస్తే నాధ్వాంతమంతా
    అనునయిస్తూ చాచిన అతని చేతుల నీడేనా?
    "ఆహా! అత్యంత నీ మమత
    అనన్యం నీ అంధత్వం
    అద్వితీయం నీ దౌర్బల్యం
    ఎవణ్ణి వెతుక్కుంటున్నావో వాణ్ణే నేను !
    ప్రేమనే తరిమివేశావు నీ నుండి
    నన్ను తరిమి వేశావు నువ్వు."

                            (ముద్రణ : 19-06-1987 'స్వాతి' వారపత్రిక
                                         రచన 02-02-1981)

                                       * సమాప్తం *


 Previous Page

WRITERS
PUBLICATIONS