భస్మంబు శ్రుతులెల్లఁ బాటించు నని కంటి
భస్మంబు యోగసంపద మూల మని కంటి
భస్మంబు సర్వసంవత్కరం బని కంటి
భస్మంబు శివయోగ ఫలవృక్ష మని కంటి
భస్మ మిహవరములకుఁ బట్టుఁ గొమ్మని కంటి
భస్మంబు మాపాలి పరమేశుఁ డని కంటి
భస్మంబు త్రైలోక్య పావనం బని కంటి
భస్మంబు కర్మాబ్దిబాడబం బని కంటి
భస్మంబు ఋషులెల్ల భక్తీఁ దాల్చుటఁ గంటి
భస్మంబు హర్యజులు భక్తిఁదాల్చుటఁ గంటి
రుద్రాక్ష రుద్రనేత్రోద్భావంబని కంటి
రుద్రాక్ష రుద్రస్వరూప మని పొడగంటి
రుద్రాక్ష వేదములు రూపు బల్కుఁట గంటి
రుద్రాక్ష బ్రహ్మది ఋషులు గట్టుటఁ గంటి
రుద్రాక్ష భవగజము ద్రుంచునని పొడగంటి
రుద్రాక్ష పాపములు రోలఁ దోలుటఁ గంటి
రుద్రాక్ష పుణ్యములు రొక్క మిచ్చుటఁ గంటి
రుద్రాక్ష జపమునకు రుద్రుఁ డౌనని కంటి
రుద్రాక్ష ధరుఁడు శ్రీరుద్రుఁ డౌనని కంటి
రుద్రాక్ష ఫలమహిమ రుద్రుఁ డిచ్చుట గంటి
సకల నిష్కళమంత్ర సంబంధ మని కంటి
నకలంక మగుమంత్ర మపవర్గ మని కంటి
పాదతీర్ధముఁ ద్రావఁ బావహర మని కంటిఁ
పాదతీర్ధముఁ ద్రావఁ ప్రాణర క్షని కంటి
పాదతీర్ధముఁ జిల్కఁ బసిడియౌ ననికంటి
పాదతీర్ధము ...... ప్ర మదరస మని కంటి
బాధతీర్ధముఁ ద్రావ ఫల మోక్కుడని కంటిఁ
బాదతీర్ధము వేదభక్తి రస మని కంటిఁ
బాదతీర్ధము తీర్ధ ఫలసార మని కంటిఁ
బాద తీర్ధముఁ ద్రావ భవహరంబని కంటి
ధర ఁ బ్రసాదస్థలము తలఁపలేనని కంటి
సరిఁ బ్రసాదస్థలము చవి యేఱుంగుటఁ గంటి
నెలకొని ప్రసాదంబు నిలువ రాదనీ కంటి
మలసి ప్రసాదంబు మలాహారం బని కంటి
గొనకొని ప్రసాదంబు కుడువవలె నని కంటి
పనిగొని ప్రసాదంబు భవహారంబని కంటిఁ
గుమతి ప్రసాదంబు కడువరా దని కంటి
విమల ప్రసాదంబు విడువరా దని కంటిఁ
దెలియరు ప్రసాదంబు తెఱఁ గజ్జులని కంటి
మలదేహికీఁ బ్రసాద మలవి కాదని కంటి
మునుకొని ప్రసాదంబు ముత్తరా దని కంటిఁ
దనియరు ప్రసాదంబు తత్త్వజ్జులని కంటి
నెనయ రుచు లీశునకు నీవలయు నని కంటి
గోనకొనక నిల్చి మఱి కొనవలయు నని కంటి
ననుదినము నర్పించు నాతఁ డతఁ డని కంటిఁ
బెనఁగి ప్రసాదంబుఁ బెట్టరా దని కంటి
భర్గోపకృతులు సద్భాక్రులని పొడగంటి
స్వర్గాది భోగముల్ సరకుగా వాణి కంటి
గలదు లే దనరాదు కైవల్యమని కంటిఁ
గలదన్న చోటనే కలఁ డీశుఁ డని కంటి
తత్త్వంబు లారుద్రుఁ దడవలె వని కంటి
సత్త్వాది గుణకోటి సంఖ్య కేమని కంటి
నఖిలేశునకు నాది యరయరా దని కంటి
నఖిలైక్యునకు నంత్యమరయ రాదని కంటి
నఖిలేశునకు నెక్కు డరయ లే దని కంటి
నఖిలాండనాయకుం డాదియని పొడగంటి
నఖిలంబుఁ బుట్టించు నభవుఁ డని పొడగంటి
నఖిలంబు హరునందు నణఁగునని పొడగంటి
సంసార హరమైన సర్వేశుఁ బొడగంటి
హింసకులు వడయలె రిహపరము లని కంటి
సచరాచరానేక జగదుద్భవముఁ గంటి
నచరంబున జగమ్ము లన్నియును బొడగంటి
కా దాహంకారమమకారంబుఁ బొడగంటి
లే దితర పరతత్త్వ లేశంబుఁ బొడగంటి
నాత్యద్భుతాకార మాకార మని కంటి
ప్రత్యక్ష మానంద పాకంబుఁబొడగంటిఁ
ఋణ్య పావము లీశుఁ బొందనేరమిఁ గంటిఁ
గణ్యముల్ శ్రుతు లీశుఁ గాననేరమిఁ గంటి
వేదము లుమానాధు వెదకి కానమిఁ గంటి
నాదిదేవుఁడు శంభుఁ డని శ్రుతులఁ బొడగంటిఁ
బంచవింశతి మీఁదఁ బతి రుద్రుఁడని కంటిఁ
బంచాశదక్షర ప్రభవంబుఁ బొడగంటి
నీలోక నిర్వాహ మీశానుఁ డని కంటి
నీలోక సన్నాహ మీశానుఁ డని కంటి
నీలోక నిస్తార మీశానుఁ డని కంటి
నీలోక నిర్వాణ మీశానుఁ డని కంటి
బ్రహ్మాది సురలెల్లఁ బశువు లని పొడగంటి
బ్రహ్మ విష్ణ్వాదులకుఁ బతి రుద్రుఁ డని కంటి
బ్రహ్మ పద మిద్దఱును బడసి కానమిఁ గంటి
నంత లోక ప్రభువు నరచేతిలోఁ గంటి
జింతించు భక్తులకు శివుఁడు లోనని కంటి
శివభక్తి తుదముట్టఁ జేరఁగాదని కంటి
శివభక్తి తుదముట్టఁ జేరాలే నని కంటి
శివభక్తి శ్రుతుల కాశ్రితమగుట పొడగంటి
శివభక్తి నతుల కాశీర్వాదమని కంటి
నాసనన్యాస కరుణాతీతుఁ బొడగంటి
దాసోహ మనుత్రోవ తలనున్న శివుఁ గంటి
ద్రోహు లద్వైతులకుఁ దొలఁగి పోవుటఁ గంటి
దేహదోషాతీత దివ్యభోగముఁ గంటి
సుఖదుఃఖములు శిపుని సోఁకనేరమిఁ గంటి
నఖిలబీజములు సోమాదిత్యులని కంటి
నా రెండు వెలుఁగులే హరుకన్ను లని కంటి
గౌరీశుఁడే సర్వకర్త యనఁగాఁ గంటిఁ
... ... .... ..
గారుణ్యమున శివుఁడు కనుపించె నని కంటి
కఱకుమాటల భక్తి గలుగ నేరమిఁ గంటి
నెఱుఁగరా దెవ్వరికి నీశాను నని కంటి
మనద ధీచుని దక్ష మఖమునను బొడగంటిఁ
బేనుపొంద శ్రుతుల శాపించి విడుచుటఁ గంటిఁ
బరగ శివమంత్రంబు ప్రబలి పొందుటఁ గంటిఁ
బరికింప శివభక్తి పదమెక్కు డని కంటి
శరదిఁ దరువఁగ సద్విషాగ్ని పొంగుటఁ గంటి
సురలెల్ల గఠళంబుఁ జూచి పాఱుటఁ గంటి
గరళ మప్పుడు లోకకర్త మ్రింగుటఁ గంటి
గరకంఠనామంబు గణుతి కెక్కగఁ గంటి
క్షేమదస్పుట సౌఖ్యఖేటంబుఁ బొడగంటి
సోమ ఖండాఖండ జూటంబుఁ బొడగంటి
భరిత నాయనాభీల భాలంబుఁ బొడగంటి
సురచిర స్పుటజైత్ర శూలంబుఁ బొడగంటి
క్రతుహరుని శుద్ధ కంకాళంబుఁ బొడగంటి
జితగజాజిన మహాచేలంబుఁ బొడగంటి
గురుమౌళి సురసరిత్కూకంబుఁ బొడగంటి
గిరిసుతా తనుభాగకీలంబుఁ బొడగంటి
నతి సుందరాకార మాది వృషభునిఁ గంటి
రతి రాగ భాస్మంగరాగంబుఁ బొడగంటి
గురుకుచము కచము ననుకూలంబుఁ బొడగంటి
హరినేత్ర పూజితని నాది మూలముఁ గంటిఁ
బరికింప నాలోని పాపంబు కడ గంటి
నరసిపాపము నన్ను నంటరా దని కంటి
