నరసురాసురు లుమానాథుఁ గొల్చుటఁ గంటి
హరివిదీంద్రాదు లట నభవుఁ గొల్చుటఁ గంటి
రుద్రుఁ గొల్పిన పెక్కు రుద్రులను బొడగంటి
రుద్ర గణముల వివిధ రూపధారులఁ గంటి
రూడి తపములు సేయు ఋషులనేఁ బొడగంటి
కూడి మ్రోసేడు వేద ఘోషంబుఁ బొడగంటి
సుర దుందుభుల మ్రోఁత సొంపారఁ బొడగంటి
సురసతులు నాట్యంబు సొరిది నాడుటఁ గంటి
నాంగికమ్ముగ నాడు బృంగీశుఁ బొడగంటి
సంగీతనాదములు సకలదిక్కులఁ గంటిఁ
బరగ శ్రీశైలంబు భావమునఁ బొడగంటి
దురితంబు లన్నియును దొలఁగి పోవుటఁ గంటి
శ్రీపర్వతెంద్రంబు శిఖరంబుఁ బొడగంటి
శ్రీపార్వతీనాధుఁ జేరికొల్చుటఁ గంటి
నా దివ్యలింగంబు నర్చింపఁ బొడగంటి
మోదమున సాయుజ్య ముక్తి నీయఁగఁ గంటిఁ
బర్వతలింగంబుఁ బ్రాణేశుఁ డని కంటిఁ
బర్వతేశ్వరుహృదయ పద్మనిలయునిఁ గంటి
శ్రీకంకు శ్రుతివచ శ్శితికంఠుఁ బొడగంటి
లేకేశు నిజభక్త లోకేశుఁ బొడగంటి
నజు నజరు నమరు నవ్యయు నీశుఁ బొడగంటి
గజ కృత్తిధరు దయాకరు జగద్గురుఁ గంటిఁ
గ్రతువైరిఁ బురవైరిఁ గామారిఁ బొడగంటిఁ
బతి నుమావతి నాదిపతి లోకపతిఁ గంటిఁ
బతి సర్వపతి దేవపతి యీశుఁ డని కంటిఁ
బతి భక్తులకు నాదివతి శంభుఁడని కంటి
నతికాముఁ బ్రతికాము ననిలోముఁ బొడగంటి
నతిశుద్ధు నతిబుద్దు నతిభౌద్దుఁ బొడగంటి
శివకథామర్మములు శివధర్మములు గంటి
శివమూల మంత్రములు శివతంత్రములు గంటి
తారకబ్రహ్మంబు తత్త్వంబుఁ బొడగంటి
హారకర్పూర నీహారాద్రి నిభుఁ గంటి
నిర్వాణ నిస్సీమ నిష్పాపరచిఁ గంటి
దుర్వార దుస్సార దుర్భేధహరుఁ గంటి
ప్రణవాది మంత్రప్రపంచంబుఁ బొడగంటి
నణిమాది గుణదూర మగువీధిఁ బొడగంటి
షట్టర్క షట్కర్మ షట్చక్ర గతిఁ గంటి
షట్రింశ దుస్తర స్థల లక్షణముఁ గంటి
అక్షరత్రయరూప మగునబ్ధిఁ బొడగంటి
నక్షరాంబుధిలోన నమృతంబుఁ బొడగంటి
నక్షర గ్రామంబు లందైదు పొడగంటి
నక్షరపు లక్షణము లన్నియును బొడగంటి
నమిత శబ్దబ్రహ్మమంతయును బొడగంటి
విమలశబ్దబ్రహ్మ విభవ మేర్పడఁ గంటి
చొర నవసరము లేక శ్రుతు లున్కిఁ బోడగంటి
హరతత్త్వ నిరతులై యతు లున్కి ఁ బొడగంటి
గర్మంబు లందు డగ్గ ఱరామిఁ బొడగంటి'
ధర్మముల్ తమత్రోవ తలపింపఁ బొడగంటి
శివభక్తీ సంసార సీమదాఁటుటఁ గంటి
నావివేకులకు భక్తీ యలవికా దని కంటి
నొగి నభవులో లోక ముదయింపఁ బొడగంటి
నగణిత క్రమ శైవ మది దైవమని కంటి
నిరవొప్ప హరతత్త్వమే యంద మని కంటి
హరతత్త్వ మక్షీణ మానంద మని కంటి
రుసులెల్ల శైవస్వరూపూలని పొడగంటి
విస మమృతమును జేయు విమలచిత్తులఁ గంటి
బసవన్న మాపాలివరమేశుఁ డని కంటి
బస వాక్షత్రయము పావనం బని కంటి
బసవన్న భక్తులకుఁ బరునవే దని కంటి
బసవా యనినఁ బాయుఁ బావంబు లని కంటి
బసవా యనిన మోక్షపద మబ్బునని కంటి
కడఁగి కన్నపఁ డీశుఁ గాలఁ దన్నుటఁ గంటి
జడలతో గండూష జలము లుమియుటఁ గంటి
మిఱుమిండఁ డెంటయును మేటి యని పొడగంటి
గఱకంఠు పైఁ గినిసి గంటివేయుట గంటి
ధరణి వేశ్యయు నంబి తర్కింపఁ బొడగంటి
నిరువురకుఁ బరమేశుఁ డెదుర నిల్చుటఁ గంటి
గొడుకుఁ జంపినఁ గాని కుడువ నను పతిఁ గంటిఁ
గొడుకుఁ జంపించియును కుడువ నను పతి గంటిఁ
నెడరు దిరిగిన కంచి యేడు వాడలు గంటిఁ
గొడుకు తోడనై కూడి కొని పోవఁ బొడగంటి
భల్లాణుపత్నిఁ దాపసుఁడు వేఁడుటఁ గంటి
నిల్లాలి భల్గాణుఁ డిచ్చి మ్రొక్కుటఁ గంటి
గఱకంఠునకు నక్కగారు దక్కుటఁ గంటి
నెఱుకమై శ్రీశైల మెక్కుడిగ్గమిఁ గంటి
మతిమంతు మడివాలు మాచదీమణిఁ గంటిఁ
జతురుఁడై యేనుఁగును జావ నుదుకుటఁ గంటి
భక్తుల ప్రతిహత ప్రధిత మతులని కంటి
భక్తులకుఁ బ్రత్యర్దిపరులు లేరని కంటి
భక్తులకు నెందు నాపదలు లేవని కంటి
భక్తు లాపదలదేఁ బట్టువడ రని కంటి
భక్తు లహి కేయూర పద బద్దు లని కంటి
భక్తు లతి నిర్వాణ పద సిద్దులని కంటి
భక్తులు జగత్ర్పాణ పదలోలు రని కంటి
భక్తులు సదానంద పదశీలు రని కంటి
భక్తు లేపదవులును బడయ నొల్లమిఁ గంటి
భక్తులకు నేరచుల్ భక్తీఁ బోలమిఁ గంటి
భక్తు లద్భుతకర్మ పారీణు లని కంటి
భక్తు లద్భుత పుణ్యఫలభాగులని కంటి
భక్తుల కుమాభర్త ప్రాణంబులని కంటి
భక్తు లుద్భుట దోషభవ ముక్తు లని కంటి
భక్తు లసదృశభోగ భాగ్యైకు లని కంటి
శివభక్తు లక్షర శ్రీ కరము లని కంటి
శివభక్తు లాచార శేఖరము లని కంటి
శివభక్తి దూషకులు చిరపావు లని కంటి
శివభక్తి దూషకులు చెడిపోదు రని కంటి
శివభక్తి కళ్యాణసీమ దాఁటుట గంటి
శివభక్తి యభిమత స్థితి కర్త యని కంటి
శివభక్తి శత్రులకు శివము లేదని కంటి
నిశ్చలము భక్తులకు నేఱయఁ జేకుఱఁ గంటి
దుశ్చరిత భక్తులకుఁ దొలఁగించు నని కంటి
త్రిభువనము భక్తులకు జయవాద మని కంటి
సభలందు భక్తులకు జయవాద మని కంటి
భక్తీ యేవేదములు వడయలె వని కంటి
భక్తీ యెవాదముల్ వడయలె వని కంటి
భక్తీ యింద్రాదులును బడయలేరని కంటి
భక్తీ సూర్యాదులును బడయలేరని కంటి
భక్తీ బ్రహ్మాదులును బడయలేరని కంటి
భక్తీ విష్ణ్వాదులును బడయ లేరని కంటి
భక్తీ సత్యము చేతఁ బ్రభవించు నని కంటి
భక్తీ రుచి సద్ గుణప్రారంభమని కంటి
భక్తీ గురుకారుణ్య ఫలమూల మని కంటి
భక్తీ చాతుర్వర్గ ఫలదాయి యని కంటి
భస్మ దారికిఁ గాని భక్తీ లేదని కంటి
భస్మంబు భక్తీ యును బావనం బని కంటి
భస్మ ముత్తమలోక పాధేయ మని కంటి
భస్మ త్రిపుండ్రంబు పరమార్ధ మని కంటి
